Tuesday, September 18, 2018

సందేహాలు - సమాధానాలు; PART-1




సందేహాలు - సమాధానాలు PART-1




1. ప్రశ్న:
ఐటీ లో వికలాంగ ఉద్యోగికి ప్రత్యేక తగ్గింపు ఉందా??

*🌼జవాబు:*
*80U కింద డాక్టర్ ఇచ్చిన ధ్రువ పత్రం ను బట్టి 40% వైకల్యం గల వారికి 75000రూ, 80% కన్నా ఎక్కువ వైకల్యం కలవారికి 1,25,000రూ వరకు మినహాయింపు లభిస్తుంది.*
____

2. ప్రశ్న:
నేను తెలుగు పండిట్ గా పనిచేస్తున్నాను.నేను BA సంస్కృతం మరియు శిక్షా శాస్త్రి పాస్ అయ్యాను.నేను SA సంస్కృతం పోస్టుకి అర్హుడనేనా??

*🌼జవాబు:*
*అర్హులే.*
____

3. ప్రశ్న:
ఒక టీచర్ ప్రసూతి సెలవు లో ఉంది.బదిలీల లో పాల్గొని మరో స్కూల్ కోరుకుంది.ఆమె నూతన స్కూల్లో ఎప్పుడు చేరాలి??

*🌼జవాబు:*
*ఆమె అందరితో పాటు relieve కావాలి.ప్రసూతి సెలవు పూర్తి ఐన పిమ్మట స్కూల్లో జాయిన్ అవుతానని కొత్త స్కూల్ HM కి, MEO కి తెలియజేయాలి.ప్రసూతి సెలవు పూర్తి ఐన పిమ్మట కొత్త స్కూల్లో జాయిన్ అవ్వాలి.*
____

4.ప్రశ్న:
పదోన్నతి కల్పిస్తే, ప్రస్తుతం మనకి ఎన్ని జూనియర్ లెక్చరర్ పోస్టులు వస్తాయి??

*🌼జవాబు:*
*4385 లో 45% అనగా 1973 జూనియర్ లెక్చరర్ పోస్టులు పదోన్నతి పై టీచర్ల కి ఇవ్వాలి.*
____

5. ప్రశ్న:
ఒక టీచర్ 2014 ఆగస్టు లో సస్పెండ్ అయి, 2016 నవంబర్ లో విధులలో చేరాడు.అతనికి fixation ఎప్పటి నుంచి చేయాలి??

*🌼జవాబు:*
*జీఓ.46 తేదీ:30.4.15 ప్రకారం కేవలం 1.7.13 నాడు సస్పెండ్ లో ఉన్న వారికి మాత్రమే తిరిగి నియామకం పొందిన తేదీ నుండి fixation చేస్తారు.మీరు 1.7.13 న విధులలో ఉన్నారు కాబట్టి మీకు 1.7.13 నుండే fixation చేయాలి.*
_________________________

6. ప్రశ్న:
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఐటీ లో మినహాయింపు ఏమైనా ఉందా??

*🍁జవాబు:*
*తీవ్ర రోగాల చికిత్స కై చేసిన వాస్తవ ఖర్చు లో 40,000రూ వరకు 80DDB కింద మినహాయింపు కలదు.దీని కోసం డాక్టర్ ధ్రువ పత్రం సమర్పించాలి.*
____
7.ప్రశ్న:
ఏ ఏ టీచర్లు కామన్ సర్వీసు రూల్స్ పరిధిలోకి వస్తారు??

*🍁జవాబు:*
*ప్రస్తుతం పంచాయతీ రాజ్ టీచర్లు మరియు ప్రభుత్వ పాఠశాలల టీచర్లు మాత్రమే వస్తారు.*
____

8. ప్రశ్న:
నేను అంతర. జిల్లా బదిలీల లో వచ్చాను.నా సీనియారిటీ కి రక్షణ ఉంటుందా??

*🍁జవాబు:*
*మీరు 610జీఓ ద్వారా వస్తే రక్షణ ఉంటుంది. సాధారణ అంతర్ జిల్లా బదిలీల లో వస్తే మాత్రం కొత్త జిల్లాలో చేరిన తేదీ నుంచి మాత్రమే సీనియారిటీ లెక్కించబడుతుంది.*
____

9. ప్రశ్న:
నేను,మరొక టీచర్ ఇద్దర0 ఒకే DSC లో సెలెక్ట్ అయ్యాము.ఒకే స్కూల్లో చేరాము.ఎవరు HM భాద్యతలు తీసుకోవాలి??

*🍁జవాబు:*
*మెరిట్ కమ్ రోస్టర్ లో ఎవరు ముందుంటే వారే సీనియర్. సీనియర్ ఐన టీచర్ HM గా చేయాలి.*
____

10. ప్రశ్న:
17 ఇయర్స్ సర్వీస్ గల టీచర్ వైద్య కారణం పై PF లోను తీసుకున్నాడు.6 నెలలు గడిచింది.గృహ నిర్మాణం నిమిత్తం పార్ట్ ఫైనల్ తీసుకోవటానికి వీలుందా??

*🍁జవాబు:*
*మీ మొత్తాన్ని పార్ట్ ఫైనల్ కింద మార్చుకొని మాత్రమే 6 నెలల తరువాత పార్ట్ ఫైనల్ పొందే అవకాశం ఉంది.*


11. ప్రశ్న:
స్కూల్ అసిస్టెంట్ తెలుగు పదోన్నతి కి ఏ ఏ అర్హతలు కావాలి??

*💧జవాబు:*
*జీఓ.15&16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో తెలుగు ఒక సబ్జెక్టు గా మరియు తెలుగు methodology గా బి.ఈ. డి,పండిట్ ట్రైనింగ్ అర్హతలు కలిగి ఉండాలి.అంతే కానీ పి జీ లో తెలుగు ఉన్నంత మాత్రాన పదోన్నతి ఇవ్వరు.జీఓ.28&29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హతతో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి అర్హులే.*
____

12. ప్రశ్న:
సస్పెన్షన్ పీరియడ్ ను అర్హత గల సెలవుగా మంజూరు చేశారు.అంటే ఏమిటి??

*💧జవాబు:*
*సెలవు నిబంధనలు 1933 ప్రకారం అర్హత గల సెలవు అంటే అర్ధ జీతపు సెలవు లేదా సంపాదిత సెలవు లేదా జీత నష్టపు సెలవు.*
____

13. ప్రశ్న:
ఇంటర్మీడియట్ లో సెకండ్ language గా తెలుగు చదివిన ఒక టీచర్ డిపార్ట్మెంట్ టెస్ట్ లలో తెలుగు పేపర్ రాయాలా??

*జవాబు:*
*💧అవసరం లేదు.*
____

14. ప్రశ్న:
మా గ్రామ పంచాయతీ ని కొత్త గా మున్సిపాలిటీ లో కలిపారు.నేను cca పొందాలంటే ప్రత్యేకంగా గజిట్ నోటిఫికేషన్ రావాలా??

*💧జవాబు:*
*అవసరం లేదు. విలీన ఉత్తర్వులు ద్వారా సిసిఏ పొందవచ్చు.*
____

15. ప్రశ్న:
నేను 10వ తరగతి తర్వాత ఇంటర్ చదవకుండా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేశాను. తదుపరి బి.ఎడ్ చేసి ప్రస్తుతం Sgt గా పనిచేస్తున్నాను.నాకు పదోన్నతి ఇస్తారా??ఇవ్వరా??

*💧జవాబు:*
*స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కి మీకు ఈ అర్హతలు సరిపోతాయి.*
_______________________________

16. ప్రశ్న:
నేను 31.7.17న రిటైర్డ్ అవుతాను.నా ఇంక్రిమెంట్ నెల ఆగస్టు. నాకు ఇంక్రిమెంట్ ఇస్తారా??

*🌼జవాబు:*
*జీఓ.235 తేదీ:27.10.1998 ప్రకారం ఉద్యోగి రిటైర్ అయిన మరుసటి రోజు గల ఇంక్రిమెంట్ పెన్షన్ కి లెక్కించబడుతుంది.*
____

17. ప్రశ్న:
నేను Sgt నుండి SA గా పదోన్నతి పొందాను.నా కన్నా జూనియర్ sgt నుంచి lfl hm గా పదోన్నతి పొంది , నా కన్నా ఎక్కువ వేతనం పొందుతున్నాడు.ఇపుడు నేను స్టెప్ అప్ చేఇ0చు కోవచ్చా??

*🌼జవాబు:*
*వీలు లేదు. ఒకే కేటగిరీ లో ఒకే సబ్జెక్టులో పదోన్నతి పొందిన వారితో మాత్రమే స్టెప్ అప్ కు అవకాశం ఉంది.*
____

18. ప్రశ్న:
వేసవి సెలవుల్లో ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలకి invegilator గా వెళ్లాను. ఏ జీఓ ప్రకారం ELs జమ చేస్తారు.??

*🌼జవాబు:*
*ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వవలసిన అవసరం లేదు. Rc. No.362 తేదీ:16.11.2013 CSE, AP ప్రకారం ELs జమ చేయవచ్చు.*
____

19. ప్రశ్న:
నేను sgt గా చేస్తున్నాను.AU లో అడిషనల్ సబ్జెక్టు గా తెలుగు చేశాను. నాకు SA తెలుగు కి అవకాశం ఉంటుందా??

*🌼జవాబు:*
*తెలుగు అదనపు సబ్జెక్టు గా చేస్తే అర్హత ఉంటుంది. సింగిల్ సబ్జెక్టు గా చేస్తే అర్హత వుండదు.*
____

21.ప్రశ్న:
ఒక ఉపాధ్యాయుడు సస్పెన్షన్ ఐతే,అతనికి PRC వర్తించదా??

*🌼జవాబు:*
*అతను సస్పెన్షన్ కి ముందు రోజు ఉన్న బేసిక్ పే ఆధారంగా PRC చేఇ0చుకోవచ్చు.*

22. చైల్డ్ కేర్ లీవ్ మంజూరు విషయంలో  ఉపాధ్యాయినిల వేతనంలో కోత విధిస్తారా ?

*✅G.O.Ms.No.209 Fin తేది:21-11-2016 ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ సెలవును ముందుగా డి.డి.వో తో మంజూరు చేయించుకున్న తరువాత వాడుకోవాలి.మంజూరు ఉత్తర్వులిచ్చి,ఎస్.ఆర్ నందు నమోదుచేసి ఆ నెల పూర్తి వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాల్సిన బాధ్యత డి.డి.ఓ లకే ఉంటుంది.*

23. స్కూల్ ఇంచార్జ్ బాధ్యతలు హెచ్.ఏం ఎవ్వరికైనా ఇవ్వవచ్చునా ? లేక సీనియారిటీ ప్రకారమే ఇవ్వాలా ?

*✅డి.ఎస్.సి ఉత్తర్వుల సంఖ్య Rc.2409/C3-1/2004 తేది :27.01.2005 ప్రకారం ప్రధానోపాధ్యాయుని అర్హతలు కలిగిన వారిలో సీనియరు ఉపాధ్యాయుడిని మాత్రమే ఇంచార్జ్ గా లేదా ఎఫ్.ఏ.సి.గా నియమించాలి.*

24. ఎస్.జి.టి ఉపాధ్యాయుడు 24 సం॥ స్కేలు పొందుటకు డిపార్ట్మెంటల్ పరీక్షల ఉత్తీర్ణత సాధించాలా ?

*✅G.O.Ms.No.38 Fin తేది:15.04.2015 ప్రకారం 24 సం॥ స్కేలు పొందుటకు ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ పరీక్షలు (GOT&EOT) ఉత్తీర్ణత సాధించాలి*

25. వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటే ఎంత సర్వీస్ పూర్తిచేసి ఉండాలి? పూర్తి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయా?

 *✅ఏ.పి.రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 లోని రూల్ 43 ప్రకారంగా 20 సం॥ సర్వీసు (అసాధారణ సెలవు కాకుండా) పూర్తిచేసిన వారికి వాలంటరి రిటైర్మెంట్ అర్హత లభిస్తుంది.రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ వర్తిస్తాయి.*

26. ముగ్గురు సంతానం ఉన్న ఉపాధ్యాయిని హిస్టరక్టమి ఆపరేషన్ చేయించుకుంటే 45 రోజుల సెలవుకు అర్హత ఉన్నదా ?

*✅G.O.Ms.No.52 Fin తేది:1.4.2011 లో సంతానం ఇంతే మంది ఉండాలన్న షరతు ఏమీలేదు.అందుచేత సంతానం సంఖ్యతో నిమిత్తం లేకుండా 45 రోజుల సెలవు పొందవచ్చును.*


27. ప్రశ్న:
నేను SA గా పదోన్నతి పొందాను.నాకు ప్రస్తుతం 56 ఇయర్స్.GOT పాస్ అయ్యాను.నాకు 12 ఇయర్స్ స్కేల్ వస్తుందా??

🌻జవాబు:
మెమో.21073 తేదీ:21.2.2009 ప్రకారం మీకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటం సాధ్యపడదు.


28. ప్రశ్న:
నేను 19 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను.వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి అవకాశం ఉందా??

🌻జవాబు:
వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి 20 ఇయర్స్ సర్వీసు తప్పక ఉండాలి.ఐతే 20 ఇయర్స్ సర్వీసు లేకుండానే ఒక టీచర్ కి జీఓ.51  తేదీ:24.8.13 ప్రకారం వాలంటరి రిటైర్మెంట్ కి అవకాశం కల్పించారు. మీరు కూడా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు పొందవలసి ఉంటుంది.

29. ప్రశ్న:
11 రోజులను కూడా సరెండర్  చేసుకోవచ్చా??

🌻జవాబు:
జీఓ.334 తేదీ:28.9.1977 ప్రకారం 11 రోజులు కూడా సరెండర్ చేసుకొని నగదు పొందవచ్చు.


30. ప్రశ్న:
సరెండర్ కాలానికి ఏవేవి చెల్లించబడతాయి??

🌻జవాబు:
జీఓ.172 తేదీ:1.7.74 ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్, అడిషనల్ ఇంక్రిమెంట్ లు,స్పెషల్ పే చెల్లించబడతాయి.ఐతే IR మాత్రం చెల్లించబడదు.
_____________________________

31.ప్రశ్న:
పెన్షనర్
మరణించినపుడు కుటుంబ సభ్యులు ఏమి చెయ్యాలి??

*🌼జవాబు:*
*పెన్షనర్ మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు ట్రెజరీ లో తెలియపరచాలి.తెలియ పరచకుంటే మరల లైఫ్ సెర్టిఫికెట్(ప్రస్తుతం డిజిటల్ బయోమెట్రిక్/ఐరిష్)ఇచ్చే వరకు నెల నెలా పెన్షన్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. ఎటిఎం తో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ భాద్యత గల పౌరులుగా అలా చేయడం తప్పు.రెండవది ప్రభుత్వంనకు ఈ విషయం తెలిసినా లేదా ఎవరైనా కంప్లైంట్ చేసినా క్రిమినల్ కేసులు పెడతారు. అందువల్ల వెంటనే ట్రెజరీలో తెలియపరచాలి.చనిపోయిన రోజు వరకు పెన్షన్ లెక్కకట్టి అకౌంట్ లో వేస్తారు.*
____

32.ప్రశ్న:
PRC లో ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చా??

*🌼జవాబు:*
*వెనుకటి తేదీ నుంచి వేతనం మారిన సందర్భంలో తప్ప,సాధారణంగా ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మార్చుకొనే అవకాశం లేదు.*
____

33. ప్రశ్న:
స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఎవరికి ఇస్తారు??

*🌼జవాబు:*
*ఒక ఉద్యోగి తాను పొందుతున్న వేతన స్కేలు గరిష్టం చేరిన తరువాత ఇంకా సర్వీసు లో ఉంచి ఇంక్రిమెంట్లు మంజూరు చేయవలసి ఉన్నప్పుడు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తారు.2015 PRC లో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు కి అవకాశం కల్పించారు.*
____

34.ప్రశ్న:
వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన ప్రసూతి సెలవు ఎలా మంజూరు చేస్తారు??

*🌼జవాబు:*
*వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన, ప్రసవించిన రోజు నుండి 180 రోజుల వేసవి సెలవులు పోను మిగిలిన రోజులకు ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు.*
____

35.ప్రశ్న:
ఐటీ రిటర్న్ అందరూ సమర్పించాలా??

*🌼జవాబు:*
*2,50,000రూ ఆదాయం దాటిన వారందరూ ఆగస్టు 31లోగా రిటర్న్ దాఖలు చెయ్యాలి. వేతన ఆదాయం మాత్రమే ఉన్నవారు ITR--1 ఫారంలో ఈ--ఫైలింగ్ చేయవచ్చు.*
____

36. ప్రశ్న:
నాకు ఈ నెలలో ఇంక్రిమెంట్ ఉంది.కానీ మెడికల్ లీవు పెట్టాను.నాకు ఈ నెలలో ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారా??చెయ్యరా??

*🌼జవాబు:*
*జీఓ.192 తేదీ:1.7.74 ప్రకారం మీరు ML లో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్ ఇవ్వటం కుదరదు.మీరు ఎపుడు జాయిన్ ఐతే అప్పుడు నుండి మాత్రమే ఇంక్రిమెంట్ ఇవ్వటం జరుగుతుంది.అప్పటి వరకు పాత జీతమే వస్తుంది.*

37.ప్రశ్న:★*
నాకు ఉద్యోగం రాకముందు పాప ఉంది. ఉద్యోగం లో చేరిన తరువాత ఒకసారి ప్రసూతి సెలవు వాడుకున్నాను.మరొక పర్యాయం ప్రసూతి సెలవు వాడుకోవచ్చునా??

*జవాబు:*
*ఇద్దరు జీవించి ఉన్న పెద్ద పిల్లలు వరకు మాత్రమే ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది.బిడ్డ పుట్టినది ఉద్యోగం రాక పూర్వమా?వచ్చిన తరువాతా?అనే దానితో నిమిత్తం లేదు.కావున మూడవ బిడ్డకి ప్రసూతి సెలవు కి మీకు అవకాశం లేదు.*

38.ప్రశ్న:★*
SSC డూప్లికేట్ సర్టిఫికేట్ పొందటానికి ఏమి చెయ్యాలి??

*జవాబు:*
*అభ్యర్థి దరఖాస్తు,250రూ ల చలానా,నోటరీ చే దృవీకరించిన 50రూ,ల అఫిడవిట్, అభ్యర్థి డిక్లరేషన్, ssc రికార్డు నకలు జతపరచి ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారికి పంపుకోవాలి.*

 39.ప్రశ్న:★*
ఉద్యోగి మరణించిన సందర్భంలో CPS డబ్బులు ఎలా తీసుకోవాలి??

*జవాబు:*
*103-జీడీ ఫారం లో సంబంధిత పత్రాలు జాతపరచాలి. చివరి నెల చందా చెల్లించిన ddo ద్వారా ట్రెజరీ అధికారులు ద్వారా పి ఆర్ ఏ ముంబై కి పంపుకుంటే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయి.*

40.ప్రశ్న:★*
ఉపాధ్యాయులకు ఒక రోజు కూడ మెడికల్ లీవ్ మంజూరు చేయవచ్చునా..?

*జవాబు:*
*చేయవచ్చు. APLR-1933 రూల్స్ 13 మరియు 15 బి ప్రకారం వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు లేదా అర్థవేతన సెలవు ఒక్క రోజు కూడా మంజూరు చేయవచ్చు.కనీస పరిమితి లేదు. అయితే ఒక్క రోజైనా సెలవు కొరకు ఫారం-A, జాయినింగ్ కొరకు ఫారం-B వైద్య ధ్రువపత్రాలు సమర్పించాలి.*

 41.ప్రశ్న:★*
చైల్డ్ కేర్ లీవ్ ఇద్దరు పిల్లలకు చెరో 60 రోజులు వాడుకోవచ్చా??

*జవాబు:*
*అలా కుదరదు.ఇద్దరు పెద్ద పిల్లలు కి 18 ఇయర్స్ నిండే లోపు 60 రోజులు మాత్రమే వాడుకోవాలి.అనగా టీచర్ కి 60 రోజులు అని అర్థం.*

42.ప్రశ్న:★*
పండుగ అడ్వాన్స్ ఎవరికి ఇస్తారు??

*జవాబు:*
*జీఓ.167 తేదీ:20.9.17 ప్రకారం వేతన స్కేల్ 26600-77030 లేదా అంతకంటే తక్కువ స్కేల్ గల ఉద్యోగుల కి 7500రూ మరియు నాల్గవ తరగతి ఉద్యోగుల కి 5000రూ పండుగ అడ్వాన్స్ గా చెల్లిస్తారు.*

43.ప్రశ్న:★*
నాకు ఉద్యోగం రాకముందు పాప ఉంది. ఉద్యోగం లో చేరిన తరువాత ఒకసారి ప్రసూతి సెలవు వాడుకున్నాను.మరొక పర్యాయం ప్రసూతి సెలవు వాడుకోవచ్చునా??

*జవాబు:*
*ఇద్దరు జీవించి ఉన్న పెద్ద పిల్లలు వరకు మాత్రమే ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది.బిడ్డ పుట్టినది ఉద్యోగం రాక పూర్వమా?వచ్చిన తరువాతా?అనే దానితో నిమిత్తం లేదు.కావున మూడవ బిడ్డకి ప్రసూతి సెలవు కి మీకు అవకాశం లేదు.*

44.ప్రశ్న:★*
SSC డూప్లికేట్ సర్టిఫికేట్ పొందటానికి ఏమి చెయ్యాలి??

*జవాబు:*
*అభ్యర్థి దరఖాస్తు,250రూ ల చలానా,నోటరీ చే దృవీకరించిన 50రూ,ల అఫిడవిట్, అభ్యర్థి డిక్లరేషన్, ssc రికార్డు నకలు జతపరచి ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారికి పంపుకోవాలి.*

 45.ప్రశ్న:★*
ఉద్యోగి మరణించిన సందర్భంలో CPS డబ్బులు ఎలా తీసుకోవాలి??

*జవాబు:*
*103-జీడీ ఫారం లో సంబంధిత పత్రాలు జాతపరచాలి. చివరి నెల చందా చెల్లించిన ddo ద్వారా ట్రెజరీ అధికారులు ద్వారా పి ఆర్ ఏ ముంబై కి పంపుకుంటే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయి.*

46.ప్రశ్న:★*
ఉపాధ్యాయులకు ఒక రోజు కూడ మెడికల్ లీవ్ మంజూరు చేయవచ్చునా..?

*జవాబు:*
*చేయవచ్చు. APLR-1933 రూల్స్ 13 మరియు 15 బి ప్రకారం వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు లేదా అర్థవేతన సెలవు ఒక్క రోజు కూడా మంజూరు చేయవచ్చు.కనీస పరిమితి లేదు. అయితే ఒక్క రోజైనా సెలవు కొరకు ఫారం-A, జాయినింగ్ కొరకు ఫారం-B వైద్య ధ్రువపత్రాలు సమర్పించాలి.*

 47.ప్రశ్న:★*
చైల్డ్ కేర్ లీవ్ ఇద్దరు పిల్లలకు చెరో 60 రోజులు వాడుకోవచ్చా??

*జవాబు:*
*అలా కుదరదు.ఇద్దరు పెద్ద పిల్లలు కి 18 ఇయర్స్ నిండే లోపు 60 రోజులు మాత్రమే వాడుకోవాలి.అనగా టీచర్ కి 60 రోజులు అని అర్థం.*

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

48.ప్రశ్న:
అర్ధజీతపు సెలవు కాలానికి HRA సగమే చెల్లిస్తారా??

*🍁జవాబు:*
*జీఓ.28 తేదీ:9.3.2011 ప్రకారం 6 నెలల వరకు HRA పూర్తిగా చెల్లించాలి.*

°°°°°

49.ప్రశ్న:
నా వయస్సు 57 ఇయర్స్.నేను ఇప్పుడు APGLI ప్రీమియం పెంచవచ్చా??

*🍁జవాబు:*
*జీఓ.36 తేదీ:5.3.2016 ప్రకారం 55 ఇయర్స్ తర్వాత ప్రీమియం పెంచటం కుదరదు.బాండ్ కూడా ఇవ్వరు.*

°°°°°

50.ప్రశ్న:
చైల్డ్ కేర్ లీవ్ సంవత్సరం లో 20 రోజులు మాత్రమే వాడుకోవాలా??

*🍁జవాబు:*
*జీఓ.132 తేదీ:6.7.2016 ప్రకారం లీవు మూడు సార్లు తక్కువ కాకుండా వాడుకోవాలని మాత్రమే ఉన్నది.*

°°°°°
51.ప్రశ్న:
నేను మున్సిపాలిటీ లో టీచర్ గా పని చేస్తున్నాను.నేను ఏ ఏ టెస్టులు పాస్ కావాలి?

*🍁జవాబు:*
*మున్సిపల్ సర్వీస్ రూల్స్ వచ్చిన 7.12.2016 నాటికి HM a/c టెస్టు పాస్ అయి ఉంటే 3 ఇయర్స్ వరకు EOT, GOT పాస్ కానవసరం లేదు.తదుపరి SA లు 12 ఇయర్స్ స్కేల్ కొరకు,SGT లు 24 ఇయర్స్ స్కేల్ కొరకు EOT, GOT తప్పక పాస్ కావాలి.*

°°°°°

52.ప్రశ్న:
తల్లి పేరు కూడా అడ్మిషన్ రిజిస్టర్ లో రాయాలా??

*🍁జవాబు:*
*విద్యా శాఖ ఉత్తర్వులు మెమో.7679 తేదీ:14.9.2010 ప్రకారం తల్లి పేరు కూడా అడ్మిషన్ రిజిస్టర్ లో తప్పక రాయాలి.*

°°°°°

53.ప్రశ్న:
నేను 24 ఇయర్స్ స్కేల్ పొందిన పిదప పదోన్నతి పొందాను.నా వేతనం FR--22బి ప్రకారం నిర్ణయించబడే అవకాశం ఉందా??

*🍁జవాబు:*
*లేదు.మీకు FR--22ఎ(i) ప్రకారం మాత్రమే వేతన నిర్ణయం జరుగుతు0ది.*

°°°°°

54.ప్రశ్న:
మొదటి బిడ్డ పుట్టినప్పుడు పితృత్వ సెలవు వాడుకోలేదు.రెండవ బిడ్డ పుట్టినప్పుడు వాడుకున్నాను.ప్రస్తుతం మూడవ బిడ్డ పుట్టినది. ఇపుడు సెలవు వాడుకోవచ్చా??

*🍁జవాబు:*
*అవకాశం లేదు. జీఓ.231 తేదీ:16.9.2005 ప్రకారం పితృత్వ సెలవు ఇద్దరు జీవించియున్న పెద్ద పిల్లలు కి మాత్రమే వర్తిస్తుంది.*

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

55.ప్రశ్న:
ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా ?

*🌼జవాబు:*
*G.O.Ms.No.802 తేది:21.4.1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి.*

°°°°°

56.ప్రశ్న:
ప్రసూతి సెలవులో ఉన్నవారికి జీతం విధుల్లో చేరిన తరువాత ఇస్తారా? ప్రతినెలా ఇవ్వవచ్చునా ?

*🌼జవాబు:*
*A.P.Fundamental Rule 74(a) క్రింద గల సబ్ రూల్ 32 ప్రకారంగా "Leave Salary payable in India after the end of each calender month" కాబట్టి నెలనెలా జీతం చెల్లించవచ్చు.*

°°°°°

57.ప్రశ్న:
సాధారణంగా వార్షిక ఇంక్రిమెంట్ ను మంజూరు చేయకుండా నిలుపుదల చెయ్యవచ్చునా ?

*🌼జవాబు:*
*FR-24 లో "Increment should be drawn as a matter of course,unless it is withheld" అని ఉంది.క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారి నుండి ఇంక్రిమెంటు నిలుపుదల చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు ఉంటే తప్ప వార్షిక ఇంక్రిమెంటు యథావిధిగా మంజూరు చేయాల్సిందే.*

°°°°°

58.ప్రశ్న:
కారుణ్య నియామక  పథకం క్రింద ఉద్యోగం పొందిన ఆమెకు భర్త తరఫున కుటుంబ పెన్షన్ వస్తుందా? డి.ఏ రెండిటిపైనా చెల్లిస్తారా?

*🌼జవాబు:*
*కుటుంబ పెన్షన్ వస్తుంది.కాని  G.O.Ms.No.125 F&P తేది:01.09.2000 ప్రకారం రెండిటిపైన కరువుభత్యాలు రావు.అయితే రెండింటిలో ఏది లాభకరమో అది ఎంచుకునే అవకాశం సదరు ఉద్యోగికి ఉన్నది.*

°°°°°

59.ప్రశ్న:
ఒక సంవత్సర కాలంలో ఆరు మాసములు జీతనష్టపు సెలవుపై వెళ్ళిన,ఆ కాలానికి అర్ధజీతపు సెలవు యధాతధంగా జమచెయ్యవచ్చునా ?

*🌼జవాబు:*
*జమ  చెయ్యవచ్చును. సెలవు నిబంధనలు 1933 లోని రూలు 13(a) ప్రకారం మంజూరు చేయబడిన జీతనష్టపు సెలవు లేదా అసాధారణ సెలవు కూడా సర్వీసుగానే పరిగణించబడుతుంది.*

°°°°°

60.ప్రశ్న:
నేను ఒక cps ఉద్యోగిని. ఏ సందర్భంలో50వేల రూపాయలు టాక్స్ ఎక్జంప్సన్  క్లైం చేసుకోవచ్చు.

*🌼జవాబు:*
*మీ సేవింగ్స్ 80CC ప్రకారం 1.5 లక్షలు దాటి వున్నపుడు మాత్రమే అదనంగా 50వేల రూపాయల టాక్స్ ఎక్జంప్సన్ వర్తిస్తుంది(eఫైలింగ్ చేస్తే)లేదంటే వర్తించదు.*

°°°°°

61.ప్రశ్న:
ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ మరియు అదనపు విద్యా అర్హతలకి ఇంక్రిమెంట్లు ఎప్పటి నుంచి నిలుపుదల చేశారు??

*🌼జవాబు:*
*వీటిని 98 వేతన స్కేల్స్ లో నిలుపుదల చేశారు.ఈ నిలుపుదల 1.7.98 నుండి అమలు చేశారు.1.7.98 ముందు వారికి ఈ ఇంక్రిమెంట్లు వర్తిస్తాయి.*

°°°°°

62.ప్రశ్న:
ఐటీ లో ధార్మిక సంస్థ లకి ఇచ్చే విరాళాలు పై ఎంత మినహాయింపు వర్తిస్తుంది??

*🌼జవాబు:*
*కొన్ని సంస్థలకి 100% , మరికొన్ని సంస్థ లకి 50% పన్ను మినహాయింపు వర్తిస్తుంది.*
°°°°°°°


63.ప్రశ్న:
ప్రసూతి సెలవును ఏదైనా సెలవు తో కలిపి వాడుకోవచ్చునా??

*✨జవాబు:*
*FR.101(ఎ)ప్రకారం మెడికల్ సెర్టిఫికెట్ జతపరచి అర్హత గల సెలవును ప్రసూతి సెలవుతో కలిపి వాడుకోవచ్చు.*

°°°°°

64. ప్రశ్న:
పిల్లల ఫీజు రీ- అ0బర్సుమెంట్ పెంచిన ఉత్తర్వులు వెలువడ్డాయా??

*✨జవాబు:*
*మెమో.7215 తేదీ:2.5.12 ప్రకారం 4వ తరగతి మరియు నాన్-గజిటెడ్ ఉద్యోగులు అందరికీ ఈ సౌకర్యం వర్తిస్తుంది.2015 prc లో దీనిని 2500రూ కి పెంచారు.కానీ ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.ప్రస్తుతం ఒక్కో పిల్లవాడికి 1000రూ మాత్రమే ఇస్తారు. ఇద్దరు పిల్లలకి మాత్రమే వర్తిస్తుంది.*

°°°°°

65.ప్రశ్న:
OH, ఆదివారం లను కూడా suffix, prefix గా వాడుకోవచ్చా??

*✨జవాబు:*
*మెమో.86595 తేదీ:29.5.61 ప్రకారం ఐచ్చిక సెలవు దినాలు,పరిహార సెలవు దినాలను suffix లేదా preffix గా వాడుకోవచ్చు.*

°°°°°

66.ప్రశ్న:
APGLI ప్రీమియం అదనంగా చెల్లించాలంటే వైద్య ధ్రువ పత్రం సమర్పించాలా??

*✨జవాబు:*
*జీఓ.26 తేదీ:22.2.95 ప్రకారం చెల్లించవలసిన ప్రీమియం కన్నా అదనంగా చెల్లించుటకు ప్రతిపాదనలు సమర్పించేవారు గుడ్ హెల్త్ సెర్టిఫికెట్ ఇవ్వవలసి ఉంటుంది.*

°°°°°

67.ప్రశ్న:
మెడికల్ రీ-అ0బర్సుమెంట్ బిల్లులు ఎప్పట్లోగా dse కి పంపాలి??

*✨జవాబు:*
*హాస్పిటల్ నుండి డిశ్చార్జి ఐన తర్వాత 6 నెలలు లోగా ప్రతిపాదనలు dse కి పంపుకోవాలి.*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

68.ప్రశ్న:
నాకు 20 ఇయర్స్ సర్వీసు నిండినది.నేను వాలంటీర్ రిటైర్మెంట్ కావాలి అని అనుకుంటున్నాను.నాకు వెయిటేజ్ ఎంత ఇస్తారు??

*జవాబు:*
*క్వాలిఫై సర్వీసుకి 60 ఇయర్స్ కి గల తేడాను వెయిటేజ్ గా add చేస్తారు.ఐతే దీని గరిష్ట పరిమితి 5 ఇయర్స్.*

°°°°°

69.ప్రశ్న:
డిపార్ట్మెంట్ టెస్టుల్లో తెలుగు, హిందీ, ఉర్దూ ఎవరు రాయాలి??

*జవాబు:*
*ఇంటర్ మరియు పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని వారు తెలుగు(కోడ్--37)రాయాలి.అదేవిధంగా 10,ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని వారు spl language test హిందీ/ఉర్దూ రాయాలి.*

°°°°°

70. ప్రశ్న:
UP స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ అదే మండలం నకు FAC MEO గా భాద్యత లు నిర్వహించుచున్న అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు??

*జవాబు:*
*FR.49 ప్రకారం ఒక పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు సంక్రమిస్తాయి.కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి ఆనుమతి తో జమ చేయవలసి ఉంటుంది."*

°°°°°

71. ప్రశ్న:
SGT గా పనిచేస్తున్న టీచర్ VRO గా ఎంపిక ఐతే పే--ప్రొటెక్షన్,సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందా??

*జవాబు:*
*DEO అనుమతి తో పరీక్ష రాస్తే వేతన రక్షణ ఉంటుంది. జీఓ.105 తేదీ:2.6.2011 ప్రకారం నూతన పోస్టు యొక్క స్కేల్ లో ప్రస్తుతం పొందుతున్న వేతనానికి సమానమైన స్టేజి లో వేతనం నిర్ణయించబడుతుంది. ఇంక్రిమెంట్ మాత్రం నూతన సర్వీసు లో చేరిన ఒక సంవత్సరం తర్వాతే మంజూరు చేస్తారు.*

°°°°°

72.ప్రశ్న:
మహిళా టీచర్ భర్త నిరుద్యోగి.అత్త, మామ కూడా ఈమె పైనే ఆధార పడి జీవిస్తున్నారు.అత్త గారికి ఆరోగ్యం బాగా లేదు.మెడికల్ రీఅ0బర్సుమెంట్ వర్తిస్తుందా??

*జవాబు:*
*APIMA రూల్ 1972 ప్రకారం వర్తించదు. కేవలం మహిళా టీచర్ అమ్మ,నాన్న లకి మాత్రమే వర్తిస్తుంది.*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

73.ప్రశ్న:
నేను SA గా పనిచేస్తున్నాను.నేను లెక్చరర్ పోస్టుకి ప్రిపేర్ అవుతున్నాను.ఒక వేళ నాకు వస్తే, పాత పెన్షన్ విధానం వస్తుందా??

*జవాబు:*
*ఏపీ revised పెన్షన్ రూల్స్ ప్రకారం మీకు పాత సర్వీసు కౌంట్ అవుతుంది. ఐతే మీరు deo అనుమతి తో పరీక్ష రాసి ఉండాలి.కొత్త జాబ్ లో కూడా deo అనుమతి తో చేరాలి.*

°°°°°

74.ప్రశ్న:
2014 dsc ద్వారా సెలెక్ట్ ఐన వారు ప్రాన్ నెంబర్ కోసం ఏ ఫారం లో దరఖాస్తు చేయాలి?

*జవాబు:*
*Csrf-1,ఎస్-5,ఎస్-6 ఫారం లను www.nsdl. co. in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, వాటిని పూర్తి చేసి sto ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.*

°°°°°

75.ప్రశ్న:
నేను sgt గా పనిచేస్తున్నాను.ma(ఇంగ్లీషు), ma(ఎడ్యుకేషన్) చేశాను. నాకు SA ఇంగ్లీషు పదోన్నతి ఇస్తారా??

*జవాబు:*
*జీఓ.66 తేదీ:4.7.09 ప్రకారం 1981--2009 మధ్య ఆంధ్రా యూనివర్సిటీ నుండి పొందిన ఎంఏ(ఎడ్యుకేషన్) డిగ్రీని బి. ఎడ్ కి సమానంగా పరిగణించి పదోన్నతి కి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.అందువల్ల మీకు sa ఇంగ్లీషు పదోన్నతి కి అవకాశం ఉంది.*

°°°°°

76.ప్రశ్న:
ఒక టీచర్ ఇప్పటి వరకు 200 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకున్నాడు.ఇంకా ఎన్ని వాడుకోవచ్చు?? ఇంకా సెలవులు అవసరం ఐతే ఎలా చేయాలి??

*జవాబు:*
*ఒక టీచర్ సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవు గా వాడుకోవచ్చు. అపుడు అర్ధ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి.ఇంకా సెలవు అవసరం ఐతే అర్ధ జీతపు సెలవుగా మాత్రమే వాడుకోవాలి.ఐతే ఖాతాలో ఉండి ఉండాలి.*

°°°°°

77.ప్రశ్న:
సంక్రాంతి సెలవులు 10 రోజులు ఇచ్చారు.ముందు రోజు CL పెడితే ఏమి జరుగుతుంది??

*జవాబు:*
*సంక్రాంతి సెలవులు 10 రోజులు ఇచ్చారు.మీరు cl పెడితే మొత్తం రోజులు 11 అవుతాయి.అందువల్ల మొత్తం సెలవులు 11 రోజులకి అర్హత గల సెలవును(el/hpl/mcl/eol...) పెట్టుకోవలసి ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు cl పెట్టకూడదు.*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

78.ప్రశ్న:
స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయదలచుకొన్నపుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి??

*జవాబు:*
*స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కి అనుమతి కోరుతూ HM ద్వారా DEO గారికి 3 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, SR,10వ తరగతి నుండి విద్యా అర్హతల సర్టిఫికేట్లు,సెల్ఫ్ డిక్లరేషన్ జాతపరచాలి.*

°°°°°

79.ప్రశ్న:
సర్వీసు మొత్తం మీద ఎన్ని కమ్యూటెడ్ సెలవులు వాడుకోవాలి??

*జవాబు:*
*సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు.అప్పుడు అర్థ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి.ఆ తర్వాత కూడా సెలవు అవసరం ఐతే కేవలం అర్ధ జీతపు సెలవు గా మాత్రమే ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు వాడుకోవచ్చు.*

°°°°°

80.ప్రశ్న:
స్కూల్ అసిస్టెంట్ తెలుగు గా పదోన్నతి పొందటానికి కావాల్సిన అర్హతలు ఏమిటి??

*జవాబు:*
*జీఓ.15,16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో మెయిన్ గా గానీ లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టు లలో ఒక సబ్జెక్టు గా తెలుగు ఉండాలి. బి.ఈ డి లో తెలుగు methodology లేదా పండిట్ ట్రైనింగ్ కలిగి ఉండాలి.అదేవిధంగా జీఓ.28,29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హత తో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు కి అర్హులే.*

°°°°°

81.ప్రశ్న:
ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా??

*జవాబు:*
*అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నo.362/ఇ1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు.*

°°°°°

82.ప్రశ్న:
LFL HM కి 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి కావలసిన అర్హతలు ఏమిటి??

*జవాబు:*
*LFL HM కి తదుపరి పదోన్నతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాబట్టి డిగ్రీ, బీ. ఈ. డీ, డిపార్ట్మెంట్ పరీక్షల ఉతీర్ణత ఉండాలి.50 ఇయర్స్ వయస్సు నిండితే డిపార్ట్మెంట్ టెస్టుల మినహాయింపు వర్తిస్తుంది.*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

★83.ప్రశ్న:
నేను 1996 డిసెంబరు లో sgt గా చేరాను.ఐతే 2001 లో 142 రోజులు,2005 లో 90 రోజులు అనారోగ్యంతో జీత నష్టం(ఇఓఎల్)సెలవు పెట్టాను.ఇంక్రిమెంట్ ఆగస్టుకి పోస్టుపోన్ అయ్యింది. ఐతే ఇంక్రిమెంట్ ను డిసెంబరు కి మార్చుకొనే అవకాశం లేదా??

*జవాబు:*
*జీఓ.43; తేదీ:5.2.76 ప్రకారం డిసెంబరుకి మార్చుకోవచ్చు.ఐతే సంబంధిత ప్రతిపాదనలు వైద్య ధ్రువపత్రాలతో మరియు SR తో deo ద్వారా DSE కి పంపాలి.180 రోజుల వరకు DSE, అంతకు మించిన కాలానికి విద్యా శాఖ కార్యదర్శి అనుమతితో ఈఓయల్ కాలం ఇంక్రిమెంట్కి సర్వీసు గా పరిగణించబడుతుంది.*

°°°°°

84.ప్రశ్న:
సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి బ్రతికేది ఎలా??

*జవాబు:*
*సస్పెండ్ పీరియడ్ లో సబ్ స్టెన్స్ అలవెన్సు కింద సగం జీతం(హాఫ్ పే,హాఫ్ డీఏ,హాఫ్ హెచ్ఆర్ఏ)ఇస్తారు.*

°°°°°

85. ప్రశ్న:
ఒక ఉద్యోగి 9 ఇయర్స్ పాటు ఉద్యోగానికి గైరు హాజరు అయ్యాడు.అతనికి మరల పోస్టింగ్ ఇస్తారా??

*జవాబు:*
*FR.18 మరియు aplr.1933 లోని రూల్ 5 ప్రకారం ఒక ఉద్యోగి 5 ఇయర్స్ పాటు గైర్హాజరు అయితే ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా భావించాలి.తిరిగి చేరాలి అంటే విద్యాశాఖ కార్యదర్శి నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

86. ప్రశ్న:
నేను sgt ను.75% అంగవైకల్యం తో బాధపడుతున్నాను.నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను.నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. డిగ్రీ,బీ.ఎడ్ చేశాడు. నా ఉద్యోగం నా తమ్ముడు కి ఇప్పించవచ్చా??

*🌸జవాబు:*
*మీ ఉద్యోగం ఎవ్వరికీ నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు. కానీ జీఓ.66 జీఏడీ తేదీ:23.10.2008 ప్రకారం మీరు అనారోగ్యంతో విధులు నిర్వర్హించలేక పోతున్నారని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన, మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేషన్ కింద రిటైర్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ పోస్టు కారుణ్య నియామకం కోటాలో ఇవ్వటానికి అవకాశం ఉంది.*

°°°°°

87. ప్రశ్న:
ఉన్నత పాఠశాలలో బోధనేతర సిబ్బంది లేనప్పుడు వేసవి సెలవుల్లో ssc అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల విధులను ఎవరికి అప్పగించాలి??

*🌸జవాబు:*
*ఆర్.సి.132 తేదీ:14.5.14 ప్రకారం బోధనేతర సిబ్బంది లేనప్పుడు వేసవిలో ssc భాద్యతను ఆ ఉన్నత పాఠశాలలోని సీనియర్ ఉపాధ్యాయుడికి అప్పగించాలి.*

°°°°°

88. ప్రశ్న:
విద్యాహక్కు చట్టంలోని ఏ నిబంధన ప్రకారం 1 నుండి 8వ తరగతి వరకు పిల్లలను నేరుగా చేర్చుకోవచ్చు??

*🌸జవాబు:*
*విద్యాహక్కు చట్టం 2009 లోని 2వ అధ్యాయం 4వ సెక్షన్ ప్రకారం 6--14 వయస్సు గల పిల్లలను వారి వయస్సుకి తగిన విధంగా 1--8 తరగతులలో నేరుగా చేర్చుకోవలసి ఉంటుంది.*

°°°°°

89. ప్రశ్న:
గత సంవత్సరం 9వ తరగతి లో ముగ్గురు పిల్లలు వార్షిక పరీక్షలు రాయలేదు.కనీసం 20% హాజరు కూడా లేదు.వారిని ఈ సంవత్సరం 10 లోకి చేర్చుకోవచ్చా??

*🌸జవాబు:*
*9,10 తరగతులు విద్యాహక్కు చట్టం పరిధిలోకి రావు.కావున కనీస హాజరు లేకుండా పై తరగతికి ప్రమోట్ చేయకూడదు.*

°°°°°

90.ప్రశ్న:
ఒక LFL HM కి కన్వేయన్స్ అలవెన్సు ఎవరు మంజూరు చేయాలి??

*🌸జవాబు:*
*జీఓ.40 తేదీ:7.2.02 ప్రకారం మండల పరిషత్ యాజమాన్యం లోని స్కూళ్ళు కి MEO నే కన్వేయన్స్ అలవెన్సు మంజూరు చేయాలి.*
_____________________________

91.ప్రశ్న:
నేను 9.11.17న ఉద్యోగం లో చేరాను.నాకు వార్షిక ఇంక్రిమెంట్ నవంబర్ 9 నుండి ఇస్తారా?? లేక నవంబర్ 1 నుండి ఇస్తారా??

*జవాబు:*
*జీఓ.133 , ఆర్ధిక ; తేదీ:13.5.76 ప్రకారం నియామకం తేదీ నెలలో ఏ తేదీన ఉన్నా, ఆ నెల మొదటి తేదీ నుండే వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చెయ్యాలి.*

°°°°°

92.ప్రశ్న:
నేను sgt గా పనిచేస్తున్నాను.EOT, GOT పాస్ కాలేదు. నాకు 51 సంవత్సరంలు.నాకు ఇప్పుడు 24 ఇయర్స్ స్కేల్ ఇస్తారా??

*జవాబు:*
*మీకు 50 ఇయర్స్ దాటినప్పటికీ 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వాలి అంటే డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ కావాలి.వాస్తవానికి PRC లో మినహాయింపు ఇచ్చినప్పటికీ ఆర్ధిక శాఖ ఒప్పుకోలేదు.*

°°°°°

93.ప్రశ్న:
LFL HM పదోన్నతి పొందటానికి ఏ ఏ అర్హతలు కావాలి??

*జవాబు:*
*సర్వీసు నిబంధనలు ప్రకారం డిగ్రీ,మరియు బీఈడీ ఉండాలి.*

°°°°°

94.ప్రశ్న:
నేను జీత నష్టం సెలవు పెట్టిన కారణంగా నా ఇంక్రిమెంట్ 29.1.17 కి మారింది.ఇపుడు నాకు ఇంక్రిమెంట్ జనవరి 29న ఇస్తారా?? లేక జనవరి 1న ఇస్తారా??

*జవాబు:*
*మెమో.49643 ; ఆర్ధిక ; తేదీ:6.10.74 ప్రకారం అసాధారణ సెలవు కారణంగా వాయిదా పడిన ఇంక్రిమెంట్ ను ,ఆ నెల మొదటి తేదీ నుంచే మంజూరు చేయాలి.అంటే జనవరి 1 నుంచే ఇస్తారు.* ___

95. ప్రశ్న:
ఒక టీచర్ తేదీ 1.1.1998 నాడు నియామకం అయ్యారు. 31.12.2017 నాటికి 20 సర్వీస్ పూర్తి అయింది. అయితే, ఈ ఇరవై ఏళ్ళ సర్వీస్లో 3 సంవత్సరాలు మెడికల్ గ్రౌండ్స్  పై తీసుకున్న జీతనష్టపు అసాధారణ సెలవు ఉంది. సదరు టీచర్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చా?

*జవాబు:*
*తీసుకోరాదు. 20 ఏళ్ళ నెట్ సర్వీస్ పూర్తిచేసి ఉండాలి. పెన్షన్ రూల్ 43 ప్రకారం ఒక ఉద్యోగి/టీచర్ 20 సర్వీస్ పూర్తిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలచినప్పుడు.... Study కోసం పొందిన జీతనష్టపు అసాధారణ సెలవు (OCL Loss of Pay)ను మాత్రమే క్వాలిఫయింగ్ సర్వీస్ గా పరిగణిస్తారు. మెడికల్ గ్రౌండ్స్  లేదా ప్రైవేట్ అఫైర్స్ పొందిన OCL LP ని క్వాలిఫయింగ్ సర్వీస్ గా పరిగణించరు.అయితే... సూపెరాన్యుయేషన్ (58/60 Years) తో రిటైర్ అయినప్పుడు మాత్రం.... మెడికల్ గ్రౌండ్స్ పై తీసుకున్న Unlimited Period మరియు ప్రైవేట్ అఫైర్స్ తో పొందిన 36 నెలల OCL Loss of Pay ని పెన్షన్ కు క్వాలిఫయింగ్ సర్వీస్ గా లెక్కిస్తారు.*

°°°°°

96. ప్రశ్న:
ఉద్యోగి తల్లిదండ్రులు కి వైట్ కార్డు ఉంటే EHS లో చేర్చవచ్చా??

*జవాబు:*
*చేర్చకూడదు.అందరూ కలసి ఉండి వైట్ కార్డ్ ఉపయోగించుచున్నందులకు ఉద్యోగి పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.*

°°°°°

97. ప్రశ్న:
నా భార్య హౌస్ వైఫ్.ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేఇ0చుకుంటే నాకు ప్రత్యేక సెలవులు ఏమైనా ఇస్తారా??

*జవాబు:*
*జీఓ.802 M&H తేదీ:21.4.72 ప్రకారం భర్త కి 7 రోజులు స్పెషల్ సెలవులు ఇస్తారు.*

°°°°°

98. ప్రశ్న:
మెడికల్ సెలవు లో ఉండి వాలంటరి రిటైర్మెంట్ కి అప్లై చేయవచ్చా??

*జవాబు:*
*చేయవచ్చు. కానీ నష్టం జరుగుతుంది.మెడికల్ సెలవులో ఉండి వాలంటర్ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి వేతనం రాదు.అదే స్కూల్లో జాయిన్ ఐన పిదప వాల0టరీ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి పూర్తి వేతనం పొందవచ్చు.*

99. ప్రశ్న:
CL వరుసగా ఎన్ని రోజులు పెట్టవచ్చు??

*జవాబు:*
*ఆదివారం మరియు సెలవు దినాలతో కలిపి మొత్తం 10 రోజులకి మించకూడదు.*

°°°°°

100. ప్రశ్న:
స్పెషల్ CL ఎన్ని రోజులు వరుసగా వాడుకోవచ్చు??

*జవాబు:*
*ఆదివారం మరియు సెలవు దినాలతో కలిపి మొత్తం 10 రోజులకి మించకూడదు.*

°°°°°

101. ప్రశ్న:
మహిళా ఉద్యోగి గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేఇంచుకొన్నచో ఆమెకు స్పెషల్ CL లు ఏమైనా ఇస్తారా??

*జవాబు:*
*జీఓ.52 ; తేదీ:1.4.2011 ప్రకారం మహిళా ఉద్యోగులకి సివిల్ సర్జన్ రికమండేషన్ పై 45 రోజులు ప్రత్యేక సెలవు ఇవ్వవచ్చు.*

°°°°°

102.  ప్రశ్న:
 CL మరియు CCL ఒకేసారి వాడుకోవచ్చా??

*జవాబు:*
*CL మరియు CCL  కలిపి వాడుకోకూడదు*

°°°°°

103.  ప్రశ్న:
 "లీవ్ నాట్ డ్యూ" ఎపుడు మంజూరు చేస్తారు??

*జవాబు:*
*1933 aplr రూల్స్ లోని రూల్ 18-సి ప్రకారం ఉద్యోగి ఖాతాలో ELs గానీ, హాఫ్ పే లీవ్ గానీ లేనప్పుడు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ద్వారా వీటిని మంజూరు చేయవచ్చు. ఇలా మంజూరు చేసిన సెలవును భవిష్యత్ లో అతనికి వచ్చే సెలవు నుండి మినహాయిఇస్తారు.*

°°°°°

104.  ప్రశ్న:
ఒక ఉద్యోగి డిస్మిస్ ఐతే అతను ఏమి కోల్పోతాడు??

*జవాబు:*
*రూల్ 24 ప్రకారం పెన్షన్ బెనిఫిట్ లురావు.ఐతే రూల్ 40 ప్రకారం అతను రిటైర్మెంట్ అయి ఉంటే వచ్చే పెన్షన్, గ్రాట్యుటీ లలో 2/3వ వంతు ప్రత్యేక పరిస్థితి లలో మంజూరు చేయవచ్చు.*
_______________________________

105.  ప్రశ్న:
నేను అనారోగ్యంతో ఏప్రిల్ 1 నుండి సెలవులో ఉన్నాను.సమ్మర్ హాలిడేస్ లో విధులలో చేరవచ్చా??

*జవాబు:*
*వేసవి సెలవుల్లో చేరటానికి అవకాశం లేదు. స్కూళ్ళు రీ--ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే విధులలో చేరాలి.*

°°°°°

106.ప్రశ్న:
నేను స్కూల్ అసిస్టెంట్ హిందీ గా పనిచేస్తున్నాను.ఇంటర్,డిగ్రీ,హిందీ పోస్టుకి కావాల్సిన అర్హతలు ఉన్నాయి. ఐనా నాకు 12 ఇయర్స్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు.HM పదోన్నతి కూడా ఇవ్వటం లేదు.ఎందుకని??

*జవాబు:*
*మీకు బీ.ఎడ్ లేనందున ఇవ్వలేదు.*

°°°°°

107. ప్రశ్న:
ఒకే విద్యా సంవత్సరం లో రెండు కోర్సులు చేయవచ్చా??

*జవాబు:*
*ఒకే విద్యా సంవత్సరం లో ఒక రెగ్యులర్ కోర్సు,ఒక దూర విద్యా కోర్సు చేయటానికి అనుమతి ఉంది,అంతేగానీ రెండు రెగ్యులర్ కోర్సులు చేయడానికి అనుమతి ఇవ్వవద్దని యూజీసి 28.12.12 న అన్ని యూనివర్సిటీ లకి లేఖ రాసింది.*

°°°°°

108. ప్రశ్న:
నేను 25 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను.ఇక వాలంటీర్ రిటైర్మెంట్ అవుదామని అనుకొనుచున్నాను.నాకు పెన్షన్ ఎంత వస్తుంది??

*జవాబు:*
*చివరి ములవేతనం లో 45.45% పెన్షన్ గా రావటానికి అవకాశం ఉంది.*

°°°°°

109. ప్రశ్న:
నాకు పదోన్నతి వచ్చింది. నేను పదోన్నతి ఆర్డర్ తీసుకోలేదు. ఇపుడు ఏమి జరుగుతుంది??

*జవాబు:*
*మెమో.10445 ; జీఏడి ; తేదీ:1.6.11 ప్రకారం ఒక సారి పదోన్నతి తిరస్కరించవచ్చు.ఐతే జీఓ.145 ; జీఏడి ; 15.6.04 ప్రకారం మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తర్వాత ఇక చేర్చరు.*
________________________________

110. ప్రశ్న:
నేను sgt గా చేస్తున్నాను.నేను meo అనుమతి తో 30 రోజులు హాఫ్ పే లీవ్ ఉపయోగించుకొని B. ed పూర్తి చేశాను.నా బీ. ఎడ్ చెల్లుబాటు అవుతుందా??

*జవాబు:*
*సరైన పద్ధతి కాదు.deo అనుమతి లేకుండా రెగ్యులర్ కోర్సు చదవటం రూల్స్ కి విరుద్ధం.ఇప్పటికైనా deo గారికి దరఖాస్తు చేసి ఆ పీరియడ్కు సెలవు మంజూరు చేఇ0చుకుంటే మీ B.ed చెల్లుబాటు అవుతుంది.*

°°°°°

111. ప్రశ్న:
పిఈటీ,క్రాఫ్ట్,డ్రాయింగ్,పండిట్ పోస్టుల్లో పనిచేస్తున్న టీచర్లు కి LFL HM పదోన్నతి పొందే అవకాశం ఉందా??

*జవాబు:*
*జీఓ.11/12 ; తేదీ:23.1.2009 ప్రకారం కేవలం sgt లకి మాత్రమే lfl hm గా పదోన్నతి పొందే అవకాశం ఉంది.*

°°°°°

112. ప్రశ్న:
సరెండర్ లీవ్ జీతంపై ఐఆర్ వస్తుందా??

*జవాబు:*
*రాదు.*

°°°°°

113.ప్రశ్న:
నేను మున్సిపాలిటీ లో sgt ను.నేను 1 ఇయర్ పాటు జీత నష్టం సెలవు పెట్టాలని అనుకుంటున్నాను.మంజూరు చేసే అధికారం ఎవరికి ఉంటుంది??

*జవాబు:*
*మున్సిపాలిటీ టీచర్ల కి నియామకపు అధికారి కమీషనర్ కనుక 1 ఇయర్ eol మంజూరు చేసే అధికారం కూడా కమీషనర్ కే ఉంటుంది.*

°°°°°

114. ప్రశ్న:
HM సెలవు పై వెళ్లే సందర్భంలో ఇన్చార్జి భాద్యతలు ఎవరికి ఎలా ఇవ్వాలి.

*జవాబు:*
*Rc. No.2409 ; తేదీ:27.1.2005 ప్రకారం HM సెలవు పెట్టే సందర్భంలో సీనియర్ మోస్ట్ కి భాద్యతలు అప్పగించాలి.ఇన్ ఛార్జ్ ఇచ్చిన విషయం స్టాఫ్ ఆర్డర్ లో రాసి సంబంధిత టీచర్ ఆమోదం తీసుకోవాలి.సదరు విషయం సెలవు మంజూరు అధికారికి తెలియపరచాలి.*
_____________________________

115.ప్రశ్న:
మెడికల్ సెలవుకోసం డాక్టరు సర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సర్టిఫికెట్ వేరేవేరే డాక్టర్ల నుండి సమర్పించవచ్చునా?వైద్య కారణాలపై తీసుకున్న EOL ఇంక్రిమెంట్ కోసం లెక్కించబడుతుందా?

*🍁జవాబు:*
*రెండు సర్టిఫికెట్లు ఒకే డాక్టర్ ఇవ్వాలని ఏ ఉత్తర్వులోనూ లేదు.ఇద్దరూ క్వాలిఫైడ్ వైద్యులైనంత వరకు ఎట్టి అభ్యంతరము ఉండదు.  సాధారణంగా EOL వాడుకుంటే ఇంక్రిమెంట్ అన్ని రోజులు వాయిదా పడుతుంది.అయితే ప్రభుత్వం G.O.Ms.No.43 తేది:5-2-1976 ద్వారా వైద్య కారణాలపై 6 నెలల కాలం వరకు EOL ను ఇంక్రిమెంటుకు పరిగణించే అధికారం శాఖాధిపతులకు (ఉపాధ్యాయుల విషయంలో పాఠశాల విద్యా సంచాలకులకు) ఇవ్వడం జరిగింది.*                     
_

116.ప్రశ్న:
ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా?

*🍁జవాబు:*
*అవును G.O.Ms.No.802 M&H Dated:21-4-1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి.*                     
_

118.ప్రశ్న:
ఒక ఉపాధ్యాయుడు SA క్యాడర్ లో 12 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసాడు. అయితే Departmental Test E.O.T/G.O T పరీక్షలు పాస్ కాలేదు.తదుపరి పాస్ అయితే 12 సంవత్సరాల స్కేల్ ఎప్పటినుండి ఇస్తారు??

*🍁జవాబు:*
*F.R-26(a) క్రింద గల రూలింగ్ 2 ప్రకారం చివరి పరీక్ష మరుసటి తేది నుండి 12 సంవత్సరాల స్కేలు మరియు ఆర్ధిక లాభం ఇవ్వాలి.*                     
_

119.ప్రశ్న:
పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలలో Spl.Language Tests Telugu,Hindi,Urdu ఎవరు రాయాలి?

*🍁జవాబు:*
*ఇంటర్మీడియేట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవనివారు Spl.language Test in Telugu(P.code-37) రాయాల్సి ఉంటుంది.*
*10వ తరగతి ఆ పై స్థాయిలో హింది/ఉర్దూ ఒక భాషగా చదవని వారు Spl.language Test in Hindi/Urdu రాయాల్సి ఉంటుంది.*                     
_

119.ప్రశ్న:
సరెండర్ లీవ్ ను నెలలో ఎన్ని రోజులకు లెక్కగడతారు? 11 రోజుల సంపాదిత  సెలవులున్నను లీవ్  సరెండర్ చేసుకోవచ్చునా?

*🍁జవాబు:*
*G.O.Ms.No.306 Fin Dept Dt:8-11-1974ప్రకారం సదరు నెలలో 28/29/30/31 ఎన్ని* *రోజులున్నను,రోజులతో నిమిత్తం లేకుండా 30 రోజులకు మాత్రమే లీవ్ సరెండర్ లెక్కగట్టి నగదు చెల్లిస్తారు.*
*G.O.Ms.No.334 F&P,Dt:28-9-1977 లో ఇలా వుంది Leave may be surrendered at any time not exceeding 15/30 days...అని వున్నది.అందుచేత 11రోజులు సరెండర్ చేసుకుని నగదు పొందవచ్చు.*                     
_

120. ప్రశ్న:
నేను ప్రస్తుతం SGT గా పనిచేస్తున్నాను.రాబోయే DSC లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే,DEO గారి అనుమతి తీసుకోవాలా?

*🍁జవాబు:*
*అవును తప్పనిసరిగా నియామకాధికారి అనుమతి తీసుకోవాలి.*



121. ప్రశ్న:
ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు??

*జవాబు:*
*రూల్-22A ప్రకారం అన్ని కేటగిరీ లకు చెందిన రిజర్వేషన్ స్థానాలలో మహిళలు కి 33 1/2 % రిజర్వ్ చేయబడి ఉన్నది.sc/st/bc/oc కేటగిరీ ల వారికి కేటాయించబడిన స్థానం లలో ఆయా కేటగిరీ కి చెందిన మొదటి స్థానం, ఆ తదుపరి ప్రతి మూడవ స్థానం మహిళలు కి రిజర్వ్ చేయబడింది. పై రెండు రకాల రిజర్వేషన్లు వర్తింప జేస్తూ కమ్యూనల్ రోస్టర్ తయారు చేయబడుతుంది.*

°°°°°

122. ప్రశ్న:
DSC లో స్థానికేతర అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారు??

*జవాబు:*
*నింపవలసిన ఖాళీలలో ఓపెన్ కాంపిటీషన్ కింద మొదట 20% ఖాళీలను నింపిన తర్వాత మిగిలిన 80% ఖాళీలను కేవలం స్థానిక అభ్యర్థులను మాత్రమే మెరిట్ మరియు రిజర్వేషన్లు ప్రాతిపదికగా ఎంపిక చేస్తారు.*

*20% ఖాళీలను ఓపెన్ కాంపిటీషన్ ద్వారా అనగా మెరిట్ ప్రాతిపదికగా స్థానిక మరియు స్థానికేతరులను ఉమ్మడి గా పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేయాలి.ఆ విధంగా ఓపెన్ కాంపిటీషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు కూడా ఆ 20% ఖాళీలకు ఏ ఏ రోస్టర్ పాయింట్లు వర్తిస్తాయా చూసి,ఆయా రోస్టర్ పాయింట్లకు సరిపడ అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయాలి.*

*స్థానికేతర అభ్యర్థులకు ప్రత్యేక కేటాయింపు ఏది లేదు.ఓపెన్ కాంపిటీషన్ కింద మాత్రమే వారు పరిగణింపబడతారు.*

°°°°°

123. ప్రశ్న:
రిలింక్విష్ ఇవ్వటం అంటే ఏమిటి??

*జవాబు:*
*రిలింక్విష్ అంటే పదోన్నతిని నిరాకరించడం.ప్రమోషన్ శాశ్వతంగా నిరాకరిస్తే స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ లో 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వబడదు.ఒకవేళ అప్పటికే 12 ఇయర్స్ స్కేల్ పొందుతూ ఉంటే 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరు.*

°°°°°

124. ప్రశ్న:
ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏమిటీ??

*జవాబు:*
*మెమో.41758 తేదీ:19.07.2007 ప్రకారం ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే వారసుడి కి కారుణ్య నియామకం కింద ఉద్యోగ0 ఇస్తారు.*
_______________________________

125. ప్రశ్న:
నేను sgt గా పనిచేస్తున్నాను.ప్రస్తుతం నా ఖాతాలో 80 ELs ఉన్నాయి. నేను బ్యాంక్ జాబ్ కి సెలెక్ట్ అయ్యాను.జాబ్ లో చేరితే నా 80 ELs నాకు ఉంటాయా??

*జవాబు:*
*జీఓ.46 ; ఆర్ధిక; తేదీ:19.2.2014 ప్రకారం మీరు వేరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ0లో చేరితేనే మీ సెలవులు మొత్తం క్వారీ ఫార్వర్డ్ అవుతుంది. బ్యాంక్ ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు కాదు.కాబట్టి 80 ELs రద్దు అవుతాయి.*

°°°°°

126. ప్రశ్న:
అడ్మిషన్ రిజిస్టర్ లో కులం,పుట్టిన తేదీ, తల్లి తండ్రులు పేర్లు మార్చవచ్చా??

*జవాబు:*
*తల్లి తండ్రులు కోరిక మేరకు మార్చవచ్చు. ఐతే సంబంధిత ధ్రువపత్రాలు, నోటరీ అఫిడవిట్ దగ్గర పెట్టుకోవాలి.remarks కాలంలో కారణం రాయాలి.*

°°°°°

127. ప్రశ్న:
ఒక టీచర్ 7 ఇయర్స్ కూడా ఉద్యోగం చేయకుండా అనారోగ్యంతో మరణించిన, నామినీ కి పెన్షన్ ఎంత వస్తుంది??

*జవాబు:*
*అతని చివరి బేసిక్ పే లో 30% ఫ్యామిలీ పెన్షన్ గా ఇస్తారు.*

°°°°°

128. ప్రశ్న:
ఒక పెన్షనర్ మరల వివాహం చేసుకున్నాడు.మరల ఒక కుమారుడు జన్మించారు. ఇతను కుటుంబ పెన్షన్ తీసుకొనుటకు అర్హుడేనా???

*జవాబు:*
*జీఓ.236 ; ఆర్ధిక ; తేదీ:28.5.1994 ప్రకారం అర్హులే.*

°°°°°

129.ప్రశ్న:
 ఒక పెన్షనర్ రెండు పెన్షన్ లు తీసుకుంటూ ఉంటే అందులో ఒక DA ని వదులుకోవాలా???

*జవాబు:*
*జీఓ.35 ; ఆర్థికశాఖ; తేదీ:9.8.74 ప్రకారం రెండు పెన్షన్ లు తీసుకోనువారికి ఆ రెండు పెన్షన్ లపై DA లలో ఏది ఎక్కువో ఆ DA ని ఉంచుకోవచ్చు.తక్కువ DA ని వదులుకోవలసి ఉంటుంది.*

°°°°°

130.ప్రశ్న:
పోస్టులు సృష్టించు అధికారం కలెక్టర్ గారికి ఉంటుందా??

*జవాబు:*
*జీఓ.427 ; GAD ; తేదీ:1.7.91 ప్రకారం జిల్లా కలెక్టర్ గారికి 5 పోస్టులు సృష్టించు అధికారం ఉంటుంది.*
~~~~~~~~~~~~~~~~~~~~~

131. ప్రశ్న:
నేను B. ed లో 3rd methodology గా maths చేశాను. నాకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి ఇస్తారా??

*జవాబు:*
*మెమో.434204/2016 ప్రకారం సింగిల్ సబ్జెక్టు లు & 3rd methodology లు పదోన్నతి కి పనికిరావు.*

°°°°°

132. ప్రశ్న:
పిల్లలను దండించటం నేరమా??

*జవాబు:*
*జీఓ.16 ; తేదీ:18.2.2002 ప్రకారం స్కూళ్ళు లో పిల్లలను దండించటం పూర్తి గా నిషేదించటమైనది.*

°°°°°

133.ప్రశ్న:
నేను ఫిబ్రవరిలో ELs క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాను.నాకు 28 రోజులకే డబ్బులు ఇస్తారా??

*జవాబు:*
*జీఓ.306 ; ఆర్ధిక ; 8.11.74 ప్రకారం నెలలో ఎన్ని రోజులు(28,29,30,31) ఉన్నను డబ్బులు 30 రోజులకి లెక్కగట్టి ఇస్తారు.*

°°°°°

134. ప్రశ్న:
నాకు 20 ఇయర్స్ సర్వీసు నిండినది.నేను వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకొనుచున్నాను.ఐతే నేను మధ్యలో 3 ఇయర్స్ జీత నష్టపు సెలవు పెట్టాను.ఇపుడు నాకు అర్హత ఉందా? లేదా??

*జవాబు:*
*అర్హత లేదు.20 ఇయర్స్ నెట్ సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.*

°°°°°

135.ప్రశ్న:
నేను సంక్రాంతి సెలవులు అనంతరం సెలవు పెట్టాలని అనుకొనుచున్నాను.సెలవు పెట్టవచ్చా??

*జవాబు:*
*సంక్రాంతి సెలవులు 10 రోజులు ఇచ్చారు.మీరు 1 రోజు సెలవు పెడితే మొత్తం సెలవులు 11 రోజులు అవుతాయి.కాబట్టి CL ఇవ్వటం కుదరదు.మీరు గనక సెలవు పెడితే మొత్తం సెలవులకు eligible leave పెట్టుకోవలసి ఉంటుంది.*
~~~~~~~~~~~~~~~~~~~

136. ప్రశ్న:
స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయదలచుకొన్నపుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి??

*☑జవాబు:*
*స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కి అనుమతి కోరుతూ HM ద్వారా DEO గారికి 3 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, SR,10వ తరగతి నుండి విద్యా అర్హతల సర్టిఫికేట్లు,సెల్ఫ్ డిక్లరేషన్ జాతపరచాలి.*

°°°°°
137. ప్రశ్న:
సర్వీసు మొత్తం మీద ఎన్ని కమ్యూటెడ్ సెలవులు వాడుకోవాలి??

*☑జవాబు:*
*సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు.అప్పుడు అర్థ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి.ఆ తర్వాత కూడా సెలవు అవసరం ఐతే కేవలం అర్ధ జీతపు సెలవు గా మాత్రమే ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు వాడుకోవచ్చు.*

°°°°°

138.ప్రశ్న:
స్కూల్ అసిస్టెంట్ తెలుగు గా పదోన్నతి పొందటానికి కావాల్సిన అర్హతలు ఏమిటి??

*☑జవాబు:*
*జీఓ.15,16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో మెయిన్ గా గానీ లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టు లలో ఒక సబ్జెక్టు గా తెలుగు ఉండాలి. బి.ఈ డి లో తెలుగు methodology లేదా పండిట్ ట్రైనింగ్ కలిగి ఉండాలి.అదేవిధంగా జీఓ.28,29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హత తో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు కి అర్హులే.*

°°°°°

139. ప్రశ్న:
ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా??

*☑జవాబు:*
*అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నo.362/ఇ1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు.*


140. ప్రశ్న: నేను డిగ్రీలో జువాలజీ, డైరి సైన్స్ మరియు కెమిస్ట్రీ మరియు బిఇడిలో బయాలజీ, తెలుగు మెథడాలజీలను కలిగి ఉన్నాను.నేను స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) ప్రమోషన్ కు అర్హుడనేనా?

*జవాబు: జిఓఎంఎస్ నం.12 విద్య; తేది.23.01.2009 ప్రకారం స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) గా పదోన్నతి పొందాలంటే డిగ్రీలో బోటనీ మరియు జువాలజీ చదివి ఉండాలి.*

141 ప్రశ్న: నేను ముగ్గురు బిడ్డలను కలిగి యున్నాను.మొదటి ఇద్దరి పిల్లల వయస్సు 18 సంవత్సరాలు దాటింది.మూడవ బిడ్డ వయస్సు 18 సంవత్సరాల లోపు ఉంది.మూడవ బిడ్డ కోసం చైల్డ్ కేర్ సెలవు కొరకు దరఖాస్తు చేయగా మొదటి ఇద్దరు పెద్ద పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు వర్తిస్తుందని, మూడవ బిడ్డకు అర్హత లేదని అంటున్నారు.వాస్తవమేనా?

*జవాబు: మొదటి ఇద్దరి పిల్లలకు శిశు సంరక్షణ సెలవు వాడుకోవాలనేది పే కమీషన్ రికమండేషన్ మాత్రమే.ఆ విషయం మాత్రమే జి.ఓ.132; తేది.06.07.216 పేర్కొనడం జరిగింది.కాని సదరు జి.ఓ లో ఆ విధమైన ఆదేశాలు లేవు.ఇద్దరు పిల్లలకు అని మాత్రమే ఉన్నది.కావున మీకు శిశు సంరక్షణ సెలవు ఇవ్వవచ్చు.*

142. ప్రశ్న: నేను సర్వీసులో చేరిన తేది.20.11.1996. నా వార్షిక ఇంక్రిమెంట్ నవంబర్ లో ఉన్నది. నేను  20 రోజులు జీత నష్టపు సెలవు పెట్టాను. నా ఇంక్రిమెంట్ నవంబర్ లో ఇవ్వాలా? డిసెంబర్ లో ఇవ్వాలా?

*జవాబు: జి.ఓ.133; తేది.13.05.1974 ప్రకారం జీత నష్టపు సెలవు పెట్టినప్పుడు ఒకటవ తేది నుండే లెక్కించి ఇంక్రిమెంట్ వాయుదా వేయవలసి ఉంటుంది. మేరు 20 రోజులు సెలవు పెట్టినందున నవంబర్ 20 కి వాయిదా వేయాలి. నెల మధ్యలో ఇంక్రిమెంట్ ఉండరు కాబట్టి నవంబర్ ఒకటవ తేదీనే మీ వార్షిక ఇంక్రిమెంట్ కొనసాగుతుంది.*
~~~~~~~~~~~~~~~~~~~

143. ప్రశ్న:
OD తర్వాత CL పెట్టవచ్చా??

*జవాబు:*
*మీరు వాడిన OD కి TA&DA ఇస్తే మాత్రం CL పెట్టకూడదు.*

°°°°°
144.  ప్రశ్న:
మున్సిపల్ టీచర్ల కి కూడా పిల్లల ఫీజు రీ- అ0బర్సుమెంట్ అవకాశం ఉందా??

*జవాబు:*
*RC.14311,తేదీ:15.7.13 ప్రకారం అవకాశం ఉంది.*

°°°°°
145. ప్రశ్న:
చైల్డ్ కేర్ లీవ్ మూడు సార్లు మాత్రమే వాడుకోవాలా??

*జవాబు:*
*బిడ్డల వయస్సు 18 ఇయర్స్ లోపు ఎన్ని పర్యాయాలు ఐనా వాడుకోవచ్చు. ఐతే మొత్తం 60 మాత్రమే వాడుకోవాలి.*

°°°°°
146.ప్రశ్న:
GIS పెంచినపుడు SR లో నమోదు చేయించుకోవాలా??

*జవాబు:*
*ఏ ఏ పీరియడ్ లో ఎంత మినహాయింపు జరిగిందో తెలియాలి అంటే SR మాత్రమే కీలకం. కాబట్టి SR లో నమోదు చేయించుకోవాలి.*

°°°°°
147.  ప్రశ్న:
పిల్లల ఫీజు రీ-అంబర్సుమెంట్ ఎప్పుడైనా డ్రా చేయవచ్చా??

*జవాబు:*
*మూడు సంవత్సరాలు లోపు బిల్ పెట్టి డ్రా చేసుకోవాలి.ఇద్దరు పిల్లలు కి చెరో వెయ్యి ఇస్తారు.*

148. ప్రశ్న:
*నేను డ్రాయింగ్ టీచర్ ని.PAT పాస్ అయ్యాను.B. Com పాస్ అయ్యాను.B. ed లేదు.నాకు 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరా?*
*🍎జవాబు:*
*24 ఇయర్స్ స్కేల్ పొందాలి అంటే డిగ్రీ&బీ.ఎడ్ ఉండాలి.*

 149. ప్రశ్న:
*నేను రెండు నెలలు FAC HM గా పనిచేశాను. అలవెన్సు ఇచ్చారు.పెరిగిన DA తేడా ఇవ్వరా?*
*🍎జవాబు:*
*FAC కాలానికి,సరెండర్ లీవు కాలానికి DA తేడా పొందవచ్చు.

150. ప్రశ్న:
*ఒక టీచర్ సస్పెండ్ అయ్యాడు.ఇంక్రిమెంట్ ఆపారు.అతనికి 12 ఇయర్స్ స్కేల్ ఇచ్చేటప్పుడు  ఈ కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చా?*
*🍎జవాబు:*
*మెమో.41082, తేదీ:30.12.96 ప్రకారం ఇంక్రిమెంట్ నిలుపుదల కాలాన్ని కూడా AAS కి పరిగణలోకి తీసుకోవాలి.*

151. ప్రశ్న:
సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి మరణించినచో ఏమి జరుగుతుంది??

*🍎జవాబు:*
*జీఓ.275 , తేదీ:8.8.77 ప్రకారం సస్పెన్షన్ పీరియడ్ ను ఆన్ డ్యూటీ గా పరిగణిస్తారు.*

152.ప్రశ్న:
జీతం డబ్బులు తీసుకోవటానికి కేవలం SBI/SBH లోనే అకౌంట్ ఉండాలా??
*🍎జవాబు:*
*జీఓ.58, తేదీ:21.3.05 ప్రకారం ప్రభుత్వం సూసించిన 50 రకాల బ్యాంక్ లలో దేనిలోనైన అకౌంట్ ఉండవచ్చు. కేవలం SBI/SBH లలో మాత్రమే అకౌంట్ ఉండాలనే నిబంధనలు ఏమి లేవు.*

153. ప్రశ్న:
ఈ సంవత్సరం వార్షికోత్సవం జరపాలని అనుకొనుచున్నాము.డబ్బులు ఎంత ఇస్తారు??
*🍎జవాబు:*
*ప్రైమరీ స్కూళ్ళుకి 100 లోపు పిల్లలు ఉంటే 800రూ,100 పైన పిల్లలు ఉంటే 1000రూ ఇస్తారు. అదే అప్పర్ ప్రైమరీ కి 100 లోపు ఉంటే 1000రూ,100 పైన ఉంటే 1200రూ ఇస్తారు.*

154. ప్రశ్న:
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి ప్రత్యేక సెలవు ఏమైనా ఇస్తారా??
*🍎జవాబు:*
*జీఓ.286,తేదీ:29.10.91 ప్రకారం 6 నెలలు గరిష్టంగా అర్ధ వేతన సెలవులకి అర్హుడు.ఈ కాలంలో పూర్తి వేతనం పొందవచ్చు.*

155. ప్రశ్న:
వేసవి సెలవులు మరియు వ్యక్తిగత0గా పెట్టుకున్న సెలవులు 6 నెలలకు మించిన ఏమి జరుగుతుంది??
*🍎జవాబు:*
*జీఓ.143,తేదీ:1.6.68 ప్రకారం 6 నెలలకు మించితే మొత్తం "లీవ్" గా పరిగణించబడుతుంది.*

156. ప్రశ్న:
స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయదలచుకొన్నపుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి??
*🍎జవాబు:*
*స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కి అనుమతి కోరుతూ HM ద్వారా DEO గారికి 3 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, SR,10వ తరగతి నుండి విద్యా అర్హతల సర్టిఫికేట్లు,సెల్ఫ్ డిక్లరేషన్ జాతపరచాలి.*

157. ప్రశ్న:
సర్వీసు మొత్తం మీద ఎన్ని కమ్యూటెడ్ సెలవులు వాడుకోవాలి??
*🍎జవాబు:*
*సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు.అప్పుడు అర్థ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి.ఆ తర్వాత కూడా సెలవు అవసరం ఐతే కేవలం అర్ధ జీతపు సెలవు గా మాత్రమే ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు వాడుకోవచ్చు.*

158. ప్రశ్న:
స్కూల్ అసిస్టెంట్ తెలుగు గా పదోన్నతి పొందటానికి కావాల్సిన అర్హతలు ఏమిటి??
*🍎జవాబు:*
*జీఓ.15,16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో మెయిన్ గా గానీ లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టు లలో ఒక సబ్జెక్టు గా తెలుగు ఉండాలి. బి.ఈ డి లో తెలుగు methodology లేదా పండిట్ ట్రైనింగ్ కలిగి ఉండాలి.అదేవిధంగా జీఓ.28,29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హత తో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు కి అర్హులే.*

159.  ప్రశ్న:
ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా??
*🍎జవాబు:*
*అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నo.362/ఇ1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు.

160. ప్రశ్న:
నేను B. ed లో 3rd methodology గా maths చేశాను. నాకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి ఇస్తారా??
*🍎జవాబు:*
*మెమో.434204/2016 ప్రకారం సింగిల్ సబ్జెక్టు లు & 3rd methodology లు పదోన్నతి కి పనికిరావు.*

161. ప్రశ్న:
పిల్లలను దండించటం నేరమా??
*🍎జవాబు:*
*జీఓ.16 ; తేదీ:18.2.2002 ప్రకారం స్కూళ్ళు లో పిల్లలను దండించటం పూర్తి గా నిషేదించటమైనది.*

162.  ప్రశ్న:
నేను ఫిబ్రవరిలో ELs క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాను.నాకు 28 రోజులకే డబ్బులు ఇస్తారా??
*🍎జవాబు:*
*జీఓ.306 ; ఆర్ధిక ; 8.11.74 ప్రకారం నెలలో ఎన్ని రోజులు(28,29,30,31) ఉన్నను డబ్బులు 30 రోజులకి లెక్కగట్టి ఇస్తారు.*

163. ప్రశ్న:
నాకు 20 ఇయర్స్ సర్వీసు నిండినది.నేను వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకొనుచున్నాను.ఐతే నేను మధ్యలో 3 ఇయర్స్ జీత నష్టపు సెలవు పెట్టాను.ఇపుడు నాకు అర్హత ఉందా? లేదా??
*🍎జవాబు:*
*అర్హత లేదు.20 ఇయర్స్ నెట్ సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.*

164. ప్రశ్న:
నేను సంక్రాంతి సెలవులు అనంతరం సెలవు పెట్టాలని అనుకొనుచున్నాను.సెలవు పెట్టవచ్చా??
*🍎జవాబు:*
*సంక్రాంతి సెలవులు 10 రోజులు ఇచ్చారు.మీరు 1 రోజు సెలవు పెడితే మొత్తం సెలవులు 11 రోజులు అవుతాయి.కాబట్టి CL ఇవ్వటం కుదరదు.మీరు గనక సెలవు పెడితే మొత్తం సెలవులకు eligible leave పెట్టుకోవలసి ఉంటుంది.*

~~~~~~~~~~~~~~~~~~~~

165.  ప్రశ్న:
ఇంటి నిర్మాణానికి అడ్వాన్స్ తీసుకుంటే ఎప్పటి లోగా తీర్చాలి??

*జవాబు:*
*ఇంటి నిర్మాణానికి అడ్వాన్సు తీసుకుంటే 300 నెలల్లో, మరమ్మతులకి తీసుకుంటే 90 నెలల్లో,ఇంటి స్థలం కోసం తీసుకుంటే 12 నెలల్లో తీర్చాలి.*

°°°°°
165.ప్రశ్న:
వాల0టరీ  నియామకం పొందువరికి కారుణ్య నియామకం వర్తిస్తుందా??

*జవాబు:*
*వర్తించదు.*

°°°°°
166.  ప్రశ్న:
CCL ను DDO నుండి ఎప్పటిలోగా తీసుకోవాలి??

*జవాబు:*
*ఏ CCL ఐనా తాను పనిచేసిన ప్రభుత్వ సెలవు దినానికి 6 నెలలలోపే DDO దగ్గర నుండి పొందాలి.*

°°°°°
167. ప్రశ్న:
వ్యక్తి గత అవసరాలకు హాఫ్ పే లీవ్ వాడుకుంటే జీతం ఎలా చెల్లిస్తారు??

*జవాబు:*
*మెమో.14568 ,తేదీ:31.1.2011 ప్రకారం పే,డీఏ సగం మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు.*

°°°°°
168. ప్రశ్న:
ఇంటి మరమ్మతులు కోసం ఎంత అడ్వాన్స్ గా పొందవచ్చు??

*జవాబు:*
*ఇంటి మరమ్మతులు, విస్తరణకు ములవేతనం కి 20 రెట్లు గానీ, 4 లక్షలు గానీ ,ఏది తక్కువ ఐతే ఆ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇస్తారు.*
~~~~~~~~~~~~~~~~~~~

169. ప్రశ్న:
DSC నియామకాలలో రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు??

*జవాబు:*
*మొత్తం ఖాళీల లో 80% కేవలం స్థానికులకు,మిగిలిన 20% ఖాళీలు ఓపెన్ కాంపిటేషన్ కింద స్థానికులు కి,స్థానికేతారులకి కలిపి ఇస్తారు.*

°°°°°
170.  ప్రశ్న:
ఒక టీచర్ వైద్య కారణం లపై 3 సార్లు జీత నష్టపు సెలవు పెట్టాడు.అతని వార్షిక ఇంక్రిమెంట్ వాయిదా పడుతుందా??

*జవాబు:*
*పడుతుంది. ఐతే CSE గారు అనుమతి మంజూరు చేస్తే,నార్మల్ ఇంక్రిమెంట్ కొనసాగే అవకాశం ఉంది.*

°°°°°
171. ప్రశ్న:
ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే,కారుణ్య నియామకం కింద వారుసునికి ఉద్యోగం ఇస్తారా??

*జవాబు:*
*మెమో.41758 , తేదీ:19.7.2007 ప్రకారం ఉద్యోగం ఇస్తారు.*

°°°°°
172. ప్రశ్న:
CPS ఉద్యోగులు తమ ఖాతాలోని జమలు ఎన్ని సార్లు విత్ డ్రాల్ చేసుకోవచ్చు??

*జవాబు:*
*మూడు సందర్భం లలో విత్ డ్రాయల్ చేసుకోవచ్చు. ఉద్యోగి పదవీ విరమణ సందర్భంలో,మరణించిన సందర్భంలో,పదవీ విరమణ కి ముందే పథకం నుంచి నిష్క్రమించే సందర్భంలో...*

 °°°°°
173.ప్రశ్న:
ఒక టీచర్ 2015 లో 7 నెలల పాటు సస్పెండ్ అయ్యాడు.పోస్టింగ్ ఆర్డర్ లో రెండు ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తున్నట్లు ఇచ్చారు.అతనికి ఎప్పుడు ఇంక్రిమెంట్లు ఇస్తారు??

*జవాబు:*
*అతనికి 2015,2016 లలో రావాల్సిన ఇంక్రిమెంట్లు క్యుములేటివ్ నిలుపుదల అయితే గనుక,2017 లో ముందు రెండు ఇంక్రిమెంట్లు చెల్లించరు.*

174. ప్రశ్న:
*విదేశాలకి వెళ్లుటకు ఏ విధమైన సెలవు వాడుకోవచ్చు?*

*జవాబు:*
 *విదేశాలకు వెళ్లుటకు 3 నెలల వరకు CSE, ఆ పై కాలానికి Edn. Sec నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలి.అనుమతి లభించిన కాలానికి అర్హత గల(EL/HPL/EOL)ఏ సెలవు నైనా వినియోగించుకోవచ్చు.జీఓ.70 తేదీ:6.7.2009 ప్రకారం 4 నెలల లోపు HM/MEO, 4--6 నెలల వరకు DY. EO,6 నెలల నుండి 1 ఇయర్ వరకు DEO,1--4 ఇయర్స్ వరకు CSE,4 ఇయర్స్ పైన Edn. Sec నుండి సెలవు మంజూరు చే ఇంచుకోవాలి.*

175. ప్రశ్న:
*EOL కాలాన్ని మెడికల్ లీవ్ గా మార్చుకోవచ్చా?*

*జవాబు:*
*సెలవు నిబంధనలు ప్రకారం ఒకసారి EOL గా మంజూరు చేఇ0చుకొన్న సెలవును మెడికల్ లీవ్ గా మార్చుకొనే అవకాశం లేదు.*

176. ప్రశ్న:
*మెడికల్ లీవ్ తో కలిసి మెటర్నటీ లీవ్ వాడుకోవచ్చా?*

*జవాబు:*
*జీఓ.2391 తేదీ:3.10.1960 ప్రకారం వైద్య కారణాల పై ఏ ఇతర సెలవు నైనా ప్రసూతి సెలవు తో కలిపి వాడుకోవచ్చు. కాబట్టి ఈ జీఓ ను అనుసరించి మెడికల్ లీవ్ తో కలిపి మెటర్నటీ లీవ్ వాడుకోవచ్చు.*

177. ప్రశ్న:
*పాస్ పోర్టు కోసం no objection certificate ఎవరి నుండి తీసుకోవాలి?*

*జవాబు:*
*DSE కార్యాలయం నుండి NOC తీసుకోవాలి.నిర్ణీత నమూనాలో HM/MEO ల నుండి DEO ద్వారా DSE కి దరఖాస్తు చేసుకోవాలి.నమూనా దరఖాస్తులు DEO కార్యాలయంలో లభిస్తాయి.*
~~~~~~~~~~~~~~~~~~~

178. ప్రశ్న:
నేను sgt గా చేస్తున్నాను.తర్వాత ssc, డిగ్రీ పూర్తి చేశాను. నాకు SA గా పదోన్నతి ఇస్తారా??

*జవాబు:*
*జీఓ.38 తేదీ:19.11.14 ప్రకారం ఉన్నత అర్హతలు పొందిన తరువాత ssc పాస్ అయితే పదోన్నతి కి అర్హత ఉండదు.*

°°°°°
179. ప్రశ్న:
ఐటీ లో విరాళాలు కింద ఆదాయం నుంచి ఎంత మినహాయించుకోవచ్చు??

*జవాబు:*
*సీఎం/పీఎం సహాయనిది కి చెల్లించే మొత్తం 100% కు,అనుమతించిన మత/స్వచ్ఛంద సంస్థ లకి ఇచ్చిన విరాళాలు లో 50% వరకు 80G కింద ఆదాయం నుండి మినహాయింపు లభిస్తుంది.*

°°°°°
180.  ప్రశ్న:
నేను SA క్యాడర్ లో 24 సంవత్సరంలు సర్వీసు పూర్తి చేసాను. నేను HM పదోన్నతి రిలింక్విష్ చేయలేదు.నేను 24 ఇయర్స్ స్కేల్ పొందవచ్చా??

*జవాబు:*
*డిపార్ట్మెంట్ టెస్ట్ లు పాస్ ఐతే 24 ఇయర్స్ స్కేల్ పొందవచ్చు.*

°°°°°
181. ప్రశ్న:
నేను SA ను.నేను ఇంటర్మీడియట్ లో సెకండ్ లాంగ్వేజ్ కింద సంస్కృతం చేసాను. డిగ్రీ లో సెకండ్ లాంగ్వేజ్ కింద తెలుగు చదివాను.నేను HM గా పదోన్నతి పొందాలి అంటే లాంగ్వేజ్ టెస్టులు పాస్ కావాలా??

*జవాబు:*
*జీఓ.10 తేదీ:23.01.2009 ప్రకారం లాంగ్వేజ్ టెస్టులు పాస్ కావాల్సిన అవసరం లేదు.*


182.  ప్రశ్న:
సీనియర్ స్టెప్ అప్ తీసుకున్న తర్వాత జూనియర్ SPP-1A స్కేల్ తీసుకోవటం వల్ల సీనియర్ కంటే ఎక్కువ వేతనం పొందుతున్నాడు.ఇపుడు సీనియర్ మరల స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నదా??

*🍥 జవాబు:*
*వీలు లేదు. స్టెప్ అప్ నిబంధనలు ప్రకారం సీనియర్ ఒకసారి మాత్రమే స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నది.*

°°°°°
183. ప్రశ్న:
నేను ZPHS లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.స్కూల్ అసిస్టెంట్ కి ఉండవలసిన అర్హతలు అన్నీ కలిగి ఉన్నాను.నాకు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి ఇస్తారా??

*🍥 జవాబు:*
*అవకాశం లేదు.*

°°°°°
184.  ప్రశ్న:
నా భార్య CPS ఉద్యోగి.ఆమె మరణించారు.ఇపుడు నేను ఏమి చేయాలి??

*🍥 జవాబు:*
*CPS లో ఉన్న డబ్బులు కోసం 103--జీడీ ఫారం పూర్తి చేయాలి.సంబంధిత పత్రాలు జతపరచి DDO ద్వారా ట్రెజరీకి పంపాలి.వీరు వాటిని PRA ముంబై కి పంపాలి.వారు పరిశీలించి,మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.*

°°°°°
185. ప్రశ్న:
వేసవి సెలవుల్లో పాఠశాల విధులు నిర్వహి0చటానికి జూనియర్ అసిస్టెంట్ లేకపోతే ఎవరిని నియమించాలి??

*🍥 జవాబు:*
*ఆ స్కూల్లో సీనియర్ ఉపాధ్యాయునికి ముందు అవకాశం ఇవ్వాలి.*

 °°°°°
186.ప్రశ్న:
నేను జీత నష్టపు సెలవు పెట్టాను.EHS ప్రీమియం చెల్లించలేదు.ఇపుడు నేను ఏమి చేయాలి??

*🍥 జవాబు:*
*చలానా ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు.*

°°°°°
187. ప్రశ్న:
నేను,మరొక టీచర్ ఇద్దరం ఒకే సారి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాము.HM పదోన్నతికి మా ఇద్దరిలో ఎవరు సీనియర్??

*🍥 జవాబు:*
*Rc. No.142 తేదీ:11.8.2011 ప్రకారం SGTలో సీనియర్ ఐన ఉపాధ్యాయుడు ఎస్ఏ లో సీనియర్ అవుతాడు.వారికే ముందు HM పదోన్నతి వస్తుంది.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~

188. ప్రశ్న:
కొత్తగా ఉద్యోగంలో చేరే వ్యక్తి సెలవు రోజు జాయిన్ అవ్వవచ్చా??

*🍥 జవాబు:*
*ఖచ్చితంగా వర్కింగ్ డే నాడే చేరాలి.*

°°°°°
189. ప్రశ్న:
ఒక టీచర్ జులై నుంచి డిసెంబర్ వరకు ప్రసూతి సెలవులో ఉన్నారు.అక్టోబర్ నెలలో ఇంక్రిమెంట్ కలదు.ఇస్తారా??

*🍥 జవాబు:*
*ఇంక్రిమెంట్ తేదీ నుంచి సెలవు లో ఉన్నప్పుడు సెలవు అనంతరం విధులలో చేరిన తేదీ నుంచి మాత్రమే ఆర్ధిక లాభం వచ్చేవిధంగా ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది.*

°°°°°
190.  ప్రశ్న:
అర్ధ జీతపు సెలవు ఎన్ కాష్ మెంట్ ఎలా??

*🍥 జవాబు:*
*జీఓ.148 తేదీ:21.8.2017 న ఆర్ధిక శాఖ విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం రిటైర్మెంట్ అనంతరం ఎరెoడ్ లీవ్ మరియు అర్ధ జీతపు సెలవు కలిపి 300 రోజులకి ఎన్ క్యాష్  చేసుకోవచ్చు.*

°°°°°
191. ప్రశ్న:
ఇపుడు కారుణ్య నియామకాలకు అర్హత ఏమిటీ??

*🍥 జవాబు:*
*జీఓ.112 తేదీ:18.8.2017 ప్రకారం జూనియర్ అసిస్టెంట్/టైపిస్టు స్థాయి పోస్టులకు కారుణ్య నియామకం లకి ఇంటర్మీడియట్ కనీస అర్హత.2015 లో రాష్ట్ర ప్రభుత్వం కనీస అర్హతగా డిగ్రీ చేసింది. దీన్ని ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ గా మార్పు చేసింది. ఐతే ఇలా నియామకం పొందిన వారు 5 ఇయర్స్ లోగా డిగ్రీ అర్హత సంపాదించాలి.*

°°°°°
192.ప్రశ్న:
ఆన్ డ్యూటీ తర్వాత రోజు CL పెట్టవచ్చా??

*🍥 జవాబు:*
*కొన్ని సందర్భంలలో OD పై వెళ్ళినప్పుడు TA చెల్లిస్తారు. అదే మీరు తర్వాత రోజు CL పెడితే TA చెల్లించరు.TA వద్దనుకుంటే CL పెట్టుకోవచ్చు.*

°°°°°
193. ప్రశ్న:
ఉమ్మడి సర్వీసు రూల్స్ లో డిపార్ట్మెంట్ టెస్టుల ప్రస్తావన ఏమిటి??

*🍥 జవాబు:*
*బి.కామ్ , కామర్స్ అర్హత లు కలిగిన వారికి పదోన్నతి కి అవకాశం కల్పించారు. గజిటెడ్ ఆఫీసర్ పోస్టులకు ఈఓ,జిఓ టెస్టులు పాస్ కావాలి.45 ఇయర్స్ వయస్సు దాటిన వారికి మొదటి పదోన్నతి,50 ఇయర్స్ వయస్సు దాటిన వారికి టెస్టుల నుండి మినహాయింపు ఇచ్చారు.*


194. ప్రశ్న:*

*వేసవి సెలవుల్లో పని చేస్తే ELs ఎలా జమచేస్తారు??*

జవాబు:

వేసవి సెలవులు 15 రోజులు కన్నా తక్కువగా వాడుకుంటే,మొత్తం వేసవి సెలవులు వాడుకోలేదన్నట్లుగా భావించి 24 ELs ఇస్తారు.



195. ప్రశ్న:

*సంపాధిత సెలవును అర్ధ జీతపు సెలవు, వేసవి సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చు??*

జవాబు:

ఒకేసారి 180 రోజులకి మించి వాడుకోకూడదు.



196.ప్రశ్న:

*ఒక ఉద్యోగి సస్పెన్షన్ లో ఉన్నప్పుడు ఉద్యోగం నుంచి విరమించుకోవచ్చా??*

జవాబు:

విరమించుకోవటానికి అతనికి అనుమతి ఇవ్వరు.



197.ప్రశ్న:

*ఉద్యోగ విరమణ చేసే సమయంలో సస్పెండ్ అయితే ఎలా చేస్తారు??*

జవాబు:

అతని సర్వీసును ఉన్నతాధికారులు పొడిగిస్తారు.


198.ప్రశ్న:

*బ్యాంకు లో 15G ఫారం ఎప్పుడు ఇవ్వాలి??*

జవాబు:

ఒక బ్యాంక్ లో మనం డిపాజిిట్ చేసిన మొత్తం డబ్బులు పై సంవత్సరం నకు 10,000రూ పైన వడ్డీ వస్తే టాక్స్ పడకుండా ఉండేందుకు బ్యాంకు వారికి 15G ఫారం మరియు పాన్ కార్డు zerox కాపీ ఇవ్వాలి.అపుడు బ్యాంకు వారు మన డిపాజిిట్ లపైన టాక్స్ ను కట్ చేయరు. ఈ రెండూ ఇవ్వకపోతే వచ్చే వడ్డీ లో టాక్స్ కట్ చేస్తారు.ఈ రెండు ప్రతి సంవత్సరం  ఏప్రిల్ మొదటి వారంలో(7వ తారీకు లోపల) ఇవ్వాలి.


*199. ప్రశ్న:*

ఏ నెలలో ఆర్జిత సెలవు ను నగదుగా మార్చుకోవాలి??

*✍జవాబు:*

మెమో.1478 ; ఆర్ధిక ; తేదీ:22.6.11 ప్రకారం 12 నెలల వ్యవధిలో 15 రోజులు,24 నెలల కాల వ్యవధి లో 30 రోజులు ఏ నెలలో నైనా ఆర్జిత సెలవు ను నగదుగా మార్చుకోవచ్చు.

🏐

*200. ప్రశ్న:*

వేసవి సెలవుల్లో ముందు రోజు బడికి వెళ్ళాను. సెలవులు అనంతరం ప్రారంభం రోజు బడికి వెళ్లలేకపోతే ఏ విధమైన సెలవు పెట్టుకోవచ్చు??

*✍జవాబు:*

Ldis. no.1933 , తేదీ:30.3.84 ప్రకారం అర్ధజీతపు,కమ్యూటెడ్,సంపాధిత, జీతనష్టం సెలవులను మాత్రమే వాడుకోవాలి.





*201. ప్రశ్న:*


ఒక టీచర్ సర్వీసు మొత్తం మీద ఎన్ని రోజులు కమ్యూటెడ్ సెలవు వాడుకోవాలి??

*✍జవాబు:*

జీఓ.186 ; ఆర్ధిక ; తేదీ:23.7.75 ప్రకారం సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవు గా వాడుకోవచ్చు.


🌷

202.ప్రశ్న:*

ఒక టీచర్ ఏదైనా పరీక్ష రాయాలంటే పై అధికారి అనుమతి తీసుకోవాలా??

*✍జవాబు:*

సర్వీసు లో ఉండి ఏ పరీక్ష రాయాలన్నా పై అధికారి అనుమతి తప్పకుండా తీసుకోవాలి.



*203. ప్రశ్న:*

ఒక sgt వేరే dsc లో sa గా ఎంపిక ఐతే వేతన రక్షణ ఉంటుందా?అదే ఇంక్రిమెంట్ తేదీ కొనసాగుతుందా??

*✍జవాబు:*

మీరు పై అధికారి అనుమతి తో relieve ఐతే FR.22(a) ప్రకారం రక్షణ ఉంటుంది. ఇంక్రిమెంట్ కి మాత్రం రక్షణ ఉండదు.sa గా చేరిన సంవత్సరం నకు మాత్రమే ఇంక్రిమెంట్ ఇస్తారు.


~~~~~~~~~~~~~~~~~~~

204.ప్రశ్న:
మెడికల్ సెలవుకోసం డాక్టరు సర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సర్టిఫికెట్ వేరేవేరే డాక్టర్ల నుండి సమర్పించవచ్చునా?వైద్య కారణాలపై తీసుకున్న EOL ఇంక్రిమెంట్ కోసం లెక్కించబడుతుందా?

*🍥 జవాబు:*
*రెండు సర్టిఫికెట్లు ఒకే డాక్టర్ ఇవ్వాలని ఏ ఉత్తర్వులోనూ లేదు.ఇద్దరూ క్వాలిఫైడ్ వైద్యులైనంత వరకు ఎట్టి అభ్యంతరము ఉండదు.  సాధారణంగా EOL వాడుకుంటే ఇంక్రిమెంట్ అన్ని రోజులు వాయిదా పడుతుంది.అయితే ప్రభుత్వం G.O.Ms.No.43 తేది:5-2-1976 ద్వారా వైద్య కారణాలపై 6 నెలల కాలం వరకు EOL ను ఇంక్రిమెంటుకు పరిగణించే అధికారం శాఖాధిపతులకు (ఉపాధ్యాయుల విషయంలో పాఠశాల విద్యా సంచాలకులకు) ఇవ్వడం జరిగింది.*                   

°°°°°
205. ప్రశ్న:
ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా?

*🍥 జవాబు:*
*అవును G.O.Ms.No.802 M&H Dated:21-4-1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి.*                   

°°°°°
206.ప్రశ్న:
ఒక ఉపాధ్యాయుడు SA క్యాడర్ లో 12 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసాడు. అయితే Departmental Test E.O.T/G.O T పరీక్షలు పాస్ కాలేదు.తదుపరి పాస్ అయితే 12 సంవత్సరాల స్కేల్ ఎప్పటినుండి ఇస్తారు??

*🍥 జవాబు:*
*F.R-26(a) క్రింద గల రూలింగ్ 2 ప్రకారం చివరి పరీక్ష మరుసటి తేది నుండి 12 సంవత్సరాల స్కేలు మరియు ఆర్ధిక లాభం ఇవ్వాలి.*                   

°°°°°
207. ప్రశ్న:
పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలలో Spl.Language Tests Telugu,Hindi,Urdu ఎవరు రాయాలి?

*🍥 జవాబు:*
*ఇంటర్మీడియేట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవనివారు Spl.language Test in Telugu(P.code-37) రాయాల్సి ఉంటుంది.*
*10వ తరగతి ఆ పై స్థాయిలో హింది/ఉర్దూ ఒక భాషగా చదవని వారు Spl.language Test in Hindi/Urdu రాయాల్సి ఉంటుంది.*                   

°°°°°
208. ప్రశ్న:
సరెండర్ లీవ్ ను నెలలో ఎన్ని రోజులకు లెక్కగడతారు? 11 రోజుల సంపాదిత  సెలవులున్నను లీవ్  సరెండర్ చేసుకోవచ్చునా?

*🍥 జవాబు:*
*G.O.Ms.No.306 Fin Dept Dt:8-11-1974ప్రకారం సదరు నెలలో 28/29/30/31 ఎన్ని రోజులున్నను,రోజులతో నిమిత్తం లేకుండా 30 రోజులకు మాత్రమే లీవ్ సరెండర్ లెక్కగట్టి నగదు చెల్లిస్తారు.*
*G.O.Ms.No.334 F&P,Dt:28-9-1977 లో ఇలా వుంది Leave may be surrendered at any time not exceeding 15/30 days...అని వున్నది.అందుచేత 11రోజులు సరెండర్ చేసుకుని నగదు పొందవచ్చు*.
                     
°°°°°
209. ప్రశ్న:
నేను ప్రస్తుతం SGT గా పనిచేస్తున్నాను.రాబోయే DSC లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే,DEO గారి అనుమతి తీసుకోవాలా?

*🍥 జవాబు:*
*అవును తప్పనిసరిగా నియామకాధికారి అనుమతి తీసుకోవాలి.*


210. ప్రశ్న:
"లీవ్ నాట్ డ్యూ" ఎపుడు మంజూరు చేస్తారు??

*🍥 జవాబు:*
*1933 aplr రూల్స్ లోని రూల్ 18-సి ప్రకారం ఉద్యోగి ఖాతాలో ELs గానీ, హాఫ్ పే లీవ్ గానీ లేనప్పుడు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ద్వారా వీటిని మంజూరు చేయవచ్చు. ఇలా మంజూరు చేసిన సెలవును భవిష్యత్ లో అతనికి వచ్చే సెలవు నుండి మినహాయిఇస్తారు.*

°°°°°
211.  ప్రశ్న:
ఒక ఉద్యోగి డిస్మిస్ ఐతే అతను ఏమి కోల్పోతాడు??

*🍥 జవాబు:*
*రూల్ 24 ప్రకారం పెన్షన్ బెనిఫిట్ లురావు.ఐతే రూల్ 40 ప్రకారం అతను రిటైర్మెంట్ అయి ఉంటే వచ్చే పెన్షన్, గ్రాట్యుటీ లలో 2/3వ వంతు ప్రత్యేక పరిస్థితి లలో మంజూరు చేయవచ్చు.*

°°°°°
212. ప్రశ్న:
CL వరుసగా ఎన్ని రోజులు పెట్టవచ్చు??

*🍥 జవాబు:*
*ఆదివారం మరియు సెలవు దినాలతో కలిపి మొత్తం 10 రోజులకి మించకూడదు.*

°°°°°
213.ప్రశ్న:
స్పెషల్ CL ఎన్ని రోజులు వరుసగా వాడుకోవచ్చు??

*🍥 జవాబు:*
*ఆదివారం మరియు సెలవు దినాలతో కలిపి మొత్తం 7 రోజులకి మించకూడదు.*

°°°°°
214.ప్రశ్న:
మహిళా ఉద్యోగి గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేఇ0చుకొన్నచో ఆమెకు స్పెషల్ CL లు ఏమైనా ఇస్తారా??

*🍥 జవాబు:*
*జీఓ.52 ; తేదీ:1.4.2011 ప్రకారం మహిళా ఉద్యోగులకి సివిల్ సర్జన్ రికమండేషన్ పై 45 రోజులు ప్రత్యేక సెలవు ఇవ్వవచ్చు.*

°°°°°
215. ప్రశ్న:
CCL ఒకేసారి వాడుకోవచ్చా??

*🍥 జవాబు:*
*మెమో.13112 ; తేదీ: 1.3.58 ప్రకారం CCL లు ఒకేసారి 7 రోజులకి మించి నిల్వ ఉండకూడదు.1 ఇయర్ లో 10 రోజులకి మించి వాడుకోకూడదు.*


216.ప్రశ్న:*
డిపార్ట్మెంట్ పరీక్షల కోసం ఎన్ని సార్లు OD వాడుకోవచ్చు?

*జవాబు:*
రెండు పర్యాయాలు మాత్రమే OD వాడుకోవచ్చు.

217.ప్రశ్న:*
చిల్డ్రన్ ఫీజు రీ-అంబర్సుమెంట్ ఎలా వాడుకోవాలి??

*జవాబు:*
ఇద్దరు పిల్లలుకి వాడుకోవాలి. ఒక్కో పిల్లవానికి 1 ఇయర్ కి 1000రూ చెల్లిస్తారు.వాస్తవానికి PRC లో 2500రూ, కి పెంచినప్పటికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు.

218.*ప్రశ్న:*
స్కూల్ అసిస్టెంట్ తెలుగు పదోన్నతి కి ఏ ఏ అర్హతలు కావాలి??

*జవాబు:*
జీఓ.15&16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో తెలుగు ఒక సబ్జెక్టు గా మరియు తెలుగు methodology గా బి.ఈ. డి,పండిట్ ట్రైనింగ్ అర్హతలు కలిగి ఉండాలి.అంతే కానీ పి జీ లో తెలుగు ఉన్నంత మాత్రాన పదోన్నతి ఇవ్వరు.జీఓ.28&29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హతతో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి అర్హులే.

219.ప్రశ్న:*
సస్పెన్షన్ పీరియడ్ ను అర్హత గల సెలవుగా మంజూరు చేశారు.అంటే ఏమిటి??

*జవాబు:*
సెలవు నిబంధనలు 1933 ప్రకారం అర్హత గల సెలవు అంటే అర్ధ జీతపు సెలవు లేదా సంపాదిత సెలవు లేదా జీత నష్టపు సెలవు.

220.*ప్రశ్న:*
ఇంటర్మీడియట్ లో సెకండ్ language గా తెలుగు చదివిన ఒక టీచర్ డిపార్ట్మెంట్ టెస్ట్ లలో తెలుగు పేపర్ రాయాలా??

*జవాబు:*
అవసరం లేదు.

221.*ప్రశ్న:*
మా గ్రామ పంచాయతీ ని కొత్త గా మున్సిపాలిటీ లో కలిపారు.నేను cca పొందాలంటే ప్రత్యేకంగా గజిట్ నోటిఫికేషన్ రావాలా??

*జవాబు:*
అవసరం లేదు. విలీన ఉత్తర్వులు ద్వారా సిసిఏ పొందవచ్చు.

222.*ప్రశ్న:*
నేను 10వ తరగతి తర్వాత ఇంటర్ చదవకుండా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేశాను. తదుపరి బి.ఎడ్ చేసి ప్రస్తుతం Sgt గా పనిచేస్తున్నాను.నాకు పదోన్నతి ఇస్తారా??ఇవ్వరా??

*జవాబు:*
స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కి మీకు ఈ అర్హతలు సరిపోతాయి.


223.ప్రశ్న:

*సవతి పిల్లలు కి EHS వర్తిస్తుందా??*

జవాబు:

జీఓ.174; తేదీ:1.11.2013 ప్రకారం సవతి పిల్లలు కూడా ehs ప్రయోజనాలు పొందవచ్చు.



224.ప్రశ్న:

*దత్తత తీసుకున్న తల్లిదండ్రులకి EHS వర్తిస్తుందా??*

జవాబు:

జన్మనిచ్చిన తల్లిదండ్రులకి లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులకి ఎవరో ఒకరికి మాత్రమే ehs వర్తిస్తుంది.



225.ప్రశ్న:

*20 ఇయర్స్ కి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే పెన్షన్ ఎంత వస్తుంది??*

జవాబు:

చివరి ములవేతనం లో 37.87% పెన్షన్ గా వస్తుంది.



226.ప్రశ్న:

*స్కూల్ అసిస్టెంట్ తెలుగు పదోన్నతి కి ఏ ఏ అర్హతలు కావాలి??*

జవాబు:

జీఓ.15&16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో తెలుగు ఒక సబ్జెక్టు గా మరియు తెలుగు methodology గా బి.ఈ. డి,పండిట్ ట్రైనింగ్ అర్హతలు కలిగి ఉండాలి.అంతే కానీ పి జీ లో తెలుగు ఉన్నంత మాత్రాన పదోన్నతి ఇవ్వరు.జీఓ.28&29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హతతో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి అర్హులే.



227.ప్రశ్న:

*సస్పెన్షన్ పీరియడ్ ను అర్హత గల సెలవుగా మంజూరు చేశారు.అంటే ఏమిటి??*

జవాబు:

సెలవు నిబంధనలు 1933 ప్రకారం అర్హత గల సెలవు అంటే అర్ధ జీతపు సెలవు లేదా సంపాదిత సెలవు లేదా జీత నష్టపు సెలవు.


228.ప్రశ్న:

*ఇంటర్మీడియట్ లో సెకండ్ language గా తెలుగు చదివిన ఒక టీచర్ డిపార్ట్మెంట్ టెస్ట్ లలో తెలుగు పేపర్ రాయాలా??*

జవాబు:

అవసరం లేదు.



229.ప్రశ్న:

*మా గ్రామ పంచాయతీ ని కొత్త గా మున్సిపాలిటీ లో కలిపారు.నేను cca పొందాలంటే ప్రత్యేకంగా గజిట్ నోటిఫికేషన్ రావాలా??*

జవాబు:

అవసరం లేదు. విలీన ఉత్తర్వులు ద్వారా సిసిఏ పొందవచ్చు.



230.ప్రశ్న:

*నేను 10వ తరగతి తర్వాత ఇంటర్ చదవకుండా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేశాను. తదుపరి బి.ఎడ్ చేసి ప్రస్తుతం Sgt గా పనిచేస్తున్నాను.నాకు పదోన్నతి ఇస్తారా??ఇవ్వరా??*

జవాబు:

స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కి మీకు ఈ అర్హతలు సరిపోతాయి.

~~~~~~~~~~~~~~~~~~~~

231. ప్రశ్న:
నేను అనారోగ్యంతో ఏప్రిల్ 1 నుండి సెలవులో ఉన్నాను.సమ్మర్ హాలిడేస్ లో విధులలో చేరవచ్చా??

*🍥 జవాబు:*
*వేసవి సెలవుల్లో చేరటానికి అవకాశం లేదు. స్కూళ్ళు రీ--ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే విధులలో చేరాలి.*

°°°°°
232.ప్రశ్న:
నేను స్కూల్ అసిస్టెంట్ హిందీ గా పనిచేస్తున్నాను.ఇంటర్,డిగ్రీ,హిందీ పోస్టుకి కావాల్సిన అర్హతలు ఉన్నాయి. ఐనా నాకు 12 ఇయర్స్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు.HM పదోన్నతి కూడా ఇవ్వటం లేదు.ఎందుకని??

*🍥 జవాబు:*
*మీకు బీ.ఎడ్ లేనందున ఇవ్వలేదు.*

°°°°°
233.ప్రశ్న:
ఒకే విద్యా సంవత్సరం లో రెండు కోర్సులు చేయవచ్చా??

*🍥 జవాబు:*
*ఒకే విద్యా సంవత్సరం లో ఒక రెగ్యులర్ కోర్సు,ఒక దూర విద్యా కోర్సు చేయటానికి అనుమతి ఇవ్వండి,అంతేగానీ రెండు రెగ్యులర్ కోర్సులు చేయడానికి అనుమతి ఇవ్వవద్దని యూజీసి 28.12.12 న అన్ని యూనివర్సిటీ లకి లేఖ రాసింది.*

°°°°°
234.  ప్రశ్న:
నేను 25 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను.ఇక వాలంటీర్ రిటైర్మెంట్ అవుదామని అనుకొనుచున్నాను.నాకు పెన్షన్ ఎంత వస్తుంది??

*🍥 జవాబు:*
*చివరి ములవేతనం లో 45.45% పెన్షన్ గా రావటానికి అవకాశం ఉంది.*

°°°°°
235. ప్రశ్న:
నాకు పదోన్నతి వచ్చింది. నేను పదోన్నతి ఆర్డర్ తీసుకోలేదు. ఇపుడు ఏమి జరుగుతుంది??

*🍥 జవాబు:*
*మెమో.10445 ; జీఏడి ; తేదీ:1.6.11 ప్రకారం ఒక సారి పదోన్నతి తిరస్కరించవచ్చు.ఐతే జీఓ.145 ; జీఏడి ; 15.6.04 ప్రకారం మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తర్వాత ఇక చేర్చరు.*

236.*దాదాపు 6సం!! కాలం SGT గా పనిచేసి ప్రభుత్వంలోని వేరే శాఖకు ఎంపికై అక్కడ కూడా 2సం!! పనిచేసి తిరిగి పాత పోస్టులో చేరిన ఉపాధ్యాయుని 2సం!! సర్వీసును ఏ విధంగా లెక్కిస్తారు? ఇంక్రిమెంట్ ను AAS కి లెక్కిస్తారా?*

*✍జవాబు:*

FR-26(i) ప్రకారం ప్రస్తుత పోస్టుపై 'Lien' కలిగియున్న ఉపాధ్యాయుడు,ప్రస్తుత పోస్టుకంటే తక్కువగాగాని పోస్టులో పనిచేసిన సర్వీసును ఇంక్రిమెంట్ కు లేక్కిన్చవచును. G.O.Ms.No.117,F&P, Dt:20-5-1981 ప్రకారం ఇంక్రిమెంట్ కు పరిగణింపబడే సర్వీసు అంతా AAS కు కూడా లెక్కించబడుతుంది. కాబట్టి సదరు 2సం!! ఇతర పోస్టు సర్వీసు AAS నకు కూడా లెక్కించబడుతుంది.

           
237. ప్రశ్న:*

*ఒక ఉపాధ్యాయుడు డిసెంబర్ 15 నుండి 19 వరకు వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు వినియోగించుకుంటున్నాడు. అయితే 13,14వ తేదీలు రెండవ శనివారం,ఆదివారం ఉన్నాయి. అవి కూడా కమ్యూటెడ్  సెలవుగా పరిగణించాలా?*

*✍జవాబు:*

ఆర్ధిక శాఖ Memo.No.86595/1210/FR-1/7 తేది:29-5-1981 మరియు FR-68 ప్రకారం ఏ రకమైన ఆకస్మికేతర సేలవుకైనా ముందు లేదా వెనుక వున్న ప్రభుత్వ సెలవు దినాలు ప్రీఫిక్స్/సఫిక్స్ చేసి వినియోగించుకోవడానికి అనుమతించబడతాయి.అయితే G.O.Ms.No.319 F&P తేది:18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై వినియోగించుకున్న సెలవుకు ముందు,వెనుక ఉన్నప్రభుత్వ  సెలవులను మినహాయించి పనిదినాల కాలానికి మాత్రమే వైద్య ధ్రువపత్రాలు A,B లు వుండాలి.                     


*238.ప్రశ్న:*

*నేను సర్వీసులో చేరిన తేది.20.11.1996. నా వార్షిక ఇంక్రిమెంట్ నవంబర్ లో ఉన్నది. నేను  20 రోజులు జీత నష్టపు సెలవు పెట్టాను. నా ఇంక్రిమెంట్ నవంబర్ లో ఇవ్వాలా? డిసెంబర్ లో ఇవ్వాలా?*

*✍జవాబు:*

 జి.ఓ.133; తేది.13.05.1974 ప్రకారం జీత నష్టపు సెలవు పెట్టినప్పుడు ఒకటవ తేది నుండే లెక్కించి ఇంక్రిమెంట్ వాయుదా వేయవలసి ఉంటుంది. మేరు 20 రోజులు సెలవు పెట్టినందున నవంబర్ 20 కి వాయిదా వేయాలి. నెల మధ్యలో ఇంక్రిమెంట్ ఉండరు కాబట్టి నవంబర్ ఒకటవ తేదీనే మీ వార్షిక ఇంక్రిమెంట్ కొనసాగుతుంది.


*సందేహం--సమాధానం*


239. ప్రశ్న:


*మూడు నెలల్లో నేను పదవీ విరమణ చేయబోతున్నాను. నెలకు వచ్చే బేసిక్‌ పింఛనులో మూడో వంతు కమ్యుటేషన్‌ చేసుకుంటే రూ.7,11,591 వస్తాయి. కానీ, నెలకు వచ్చే పింఛను రూ.8,581ని 15 ఏళ్లపాటు తగ్గిస్తారు. 15 ఏళ్ల తర్వాత కమ్యుటేషన్‌ కారణంగా తగ్గిన పింఛనును పునరుద్ధరించి పూర్తి పింఛను చెల్లిస్తారు. దీన్ని వినియోగించుకొని ముందే డబ్బు తీసుకోవడం మంచిదేనా?*

జవాబు:

పింఛనులో బేసిక్‌, కరువు భత్యం అని రెండు భాగాలు ఉంటాయి. 15 ఏళ్లలో అందుకునే బేసిక్‌ పింఛను మొత్తాన్ని కొంత డిస్కౌంటుతో పదవీ విరమణ చేసేప్పుడు తీసుకోవచ్చు. దీన్ని కమ్యుటేషన్‌ అంటారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులు 15 ఏళ్ల పింఛనను ముందుగానే తీసుకోవడం లాభదాయకమా? కాదా అన్నది తెలియాలంటే కొన్ని లెక్కలు తెలియాలి. కమ్యుటేషన్‌ వల్ల ఈ పింఛను రూ.8,581 తగ్గుతుంది. దీంతో వచ్చిన రూ.7,11,591లను సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంలో దాచుకుంటే మూడు నెలలకు ఒకసారి రూ.14,765 వరకూ వస్తాయి. కమ్యుటేషన్‌ వల్ల నెలకు మీకు అందే మొత్తం రూ.3,659 తగ్గిపోతుంది. కానీ, గడువు తర్వాత మీ అసలు మీ చేతికి వస్తుంది. కమ్యుటేషన్‌ చేస్తే వచ్చిన రూ.7,11,591 ను 13శాతం రాబడి వచ్చే యాన్యుటీ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు రూ.8,581 వస్తాయి. 15ఏళ్ల తర్వాత మీ చేతికి ఏమీ రాదు. అంటే కమ్యుటేషన్‌తో వచ్చిన డబ్బును కనీసం 13శాతం రాబడి వచ్చే మార్గంలో మదుపు చేయగలిగితేనే దీన్ని ఎంచుకోవాలి. పదవీ విరమణ తర్వాత నెలకు వచ్చే ఆదాయం తగ్గుతుంది.కమ్యుటేషన్‌ చేసి మీ ఆదాయాన్ని మరో రూ.3,659 తగ్గించుకోవడం కంటే ఎక్కువ పింఛను తీసుకోవడమే మంచిది. పదవీ విరమణ తర్వాత గ్రాట్యుటీ, మిగిలిన సెలవుల జీతం, ప్రావిడెంట్‌ ఫండ్‌ రూపంలో భారీ మొత్తం చేతికి వస్తుంది. ఈ డబ్బును అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా పెట్టుకోవచ్చు.ఇవేవీ లేకుండా కేవలం పింఛను మాత్రమే వచ్చేవారు కమ్యుటేషన్‌ ద్వారా వచ్చిన మొత్తాన్ని అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా దాచుకోవచ్చు.





240.ప్రశ్న:

*నేను డిగ్రీలో జువాలజీ, డైరి సైన్స్ మరియు కెమిస్ట్రీ మరియు బిఇడిలో బయాలజీ, తెలుగు మెథడాలజీలను కలిగి ఉన్నాను.నేను స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) ప్రమోషన్ కు అర్హుడనేనా?*

జవాబు:

 జిఓఎంఎస్ నం.12 విద్య; తేది.23.01.2009 ప్రకారం స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ) గా పదోన్నతి పొందాలంటే డిగ్రీలో బోటనీ మరియు జువాలజీ చదివి ఉండాలి.





241. ప్రశ్న:

*నేను ముగ్గురు బిడ్డలను కలిగి యున్నాను.మొదటి ఇద్దరి పిల్లల వయస్సు 18 సంవత్సరాలు దాటింది.మూడవ బిడ్డ వయస్సు 18 సంవత్సరాల లోపు ఉంది.మూడవ బిడ్డ కోసం చైల్డ్ కేర్ సెలవు కొరకు దరఖాస్తు చేయగా మొదటి ఇద్దరు పెద్ద పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు వర్తిస్తుందని, మూడవ బిడ్డకు అర్హత లేదని అంటున్నారు.వాస్తవమేనా?*

జవాబు:

మొదటి ఇద్దరి పిల్లలకు శిశు సంరక్షణ సెలవు వాడుకోవాలనేది పే కమీషన్ రికమండేషన్ మాత్రమే.ఆ విషయం మాత్రమే జి.ఓ.132; తేది.06.07.216 పేర్కొనడం జరిగింది.కాని సదరు జి.ఓ లో ఆ విధమైన ఆదేశాలు లేవు.ఇద్దరు పిల్లలకు అని మాత్రమే ఉన్నది.కావున మీకు శిశు సంరక్షణ సెలవు ఇవ్వవచ్చు.




➖➖
~~~~~~~~~~~~~~~~~~~~~

242. ప్రశ్న:
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే ఎన్నినెలల ముందు దరఖాస్తు పెట్టుకోవాలి? దరఖాస్తు ఎవరికి చేయాలి? ఏయే పత్రాలు జతపర్చాలి?

*🍥 జవాబు:*
*వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే 3 నెలల ముందు నియామకపు అధికారికి నోటీసు (దరఖాస్తు) ఇవ్వాలి. మూడు నెలల లోపు ఇచ్చే నోటీసులను సైతం నియామకపు అధికారి అనుమతించవచ్చు. ఉపాధ్యాయుల విషయంలో మండల పరిధిలోని టీచర్లు MEO ద్వారా, హైస్కూల్ టీచర్లు HM ద్వారా DEO కు ఏ తేదీ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ అమల్లోకి రావాలని కోరుకుంటున్నారో స్పష్టంగా తెల్పుతూ నోటీసు ఇవ్వాలి. స్పెసిఫిక్ గా జత చేయాల్సిన పత్రాలేవీ లేవు.*

°°°°°
243.ప్రశ్న:
వాలంటరీ రిటైర్మెంట్ ఏయే కారణాలపై తీసుకోవచ్చు?

*🍥 జవాబు:*
*వ్యక్తిగత, అనారోగ్యం తదితర కారణాలను చూపవచ్చు.*

°°°°°
244.ప్రశ్న:
ఒక టీచరుకు అక్టోబర్ 2018 నాటికి 20 ఏళ్ళ సర్వీస్ పూర్తవుతుంది. అక్టోబర్ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే పూర్తి పెన్షన్ వస్తుందా?

*🍥 జవాబు:*
*20 ఏళ్ళ నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ పూర్తి చేస్తే వాలంటరీ రిటైర్మెంట్ కి ఎలిజిబిలిటీ వస్తుందికానీ, పూర్తి పెన్షన్ రాదు.*

°°°°°
245.ప్రశ్న:
ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేశాక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే... వెయిటేజీ ఎన్ని సంవత్సరాలు Add చేస్తారు?

*🍥 జవాబు:*
*క్వాలిఫయింగ్ సర్వీస్ కు.... సూపరాన్యుయేషన్ (58/60 ఏళ్ళు) కి గల తేడాను వెయిటేజీగా Add చేస్తారు. అయితే... దీని గరిష్ట పరిమితి ఐదేళ్లు.*

°°°°°
246.ప్రశ్న:
Loss of Pay, Long Leave (medical grounds) లో ఉండి వాలంటరీ రిటైర్మెంట్ కి దరఖాస్తు చేయవచ్చా?

*🍥 జవాబు:*
*చేయవచ్చు.*

°°°°°
247.ప్రశ్న:
Medical Leave లో ఉండి,  స్కూల్లో జాయిన్ అయ్యాకే వాలంటీర్ రిటైర్మెంట్ కి అప్లై చేయాలా? సెలవులో ఉండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం ప్రయోజనమా?

*🍥 జవాబు:*
*సెలవులో ఉండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకోరాదు. స్కూల్లో జూయిన్ అయి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకొని సెలవు కాలానికి పూర్తి వేతనం పొందే అవకాశం ఉంటుంది.*

°°°°°
248. ప్రశ్న:
అక్టోబర్ 2018 నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే కొత్త PRC వర్తిస్తుందా?

*🍥 జవాబు:*
*11 వ PRC.... ఫస్ట్ జులై, 2018 నుంచి అమల్లోకి రావాల్సి వుంది. వస్తుందనే నమ్మకమూ నాకుంది. అయితే... నోషనలా? మానిటరీ బెనిఫిట్ ఉంటుందా? అనే విషయాన్ని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం!*

°°°°°
249. ప్రశ్న:
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత GIS కంటిన్యూ చేయవచ్చా? GIS అమౌంట్ ఎంత వస్తుంది?

*🍥 జవాబు:*
*వాలంటరీ రిటైర్మెంట్ తరువాత గ్రూప్ ఇన్సూరెన్సు కంటిన్యూ అయ్యే అవకాశంలేదు. ప్రభుత్వం ఏటేటా విడుదల చేసే టేబుల్ ప్రకారం అమౌంట్ వస్తుంది.*

°°°°°
250. ప్రశ్న:
20 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ సర్వీస్ మధ్య వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే పెన్షన్ ఎంతెంత వస్తుంది?

*🍥 జవాబు:*
*వెయిటేజీతో కలుపుకొని 33 ఏళ్ళ సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అయితే.... చివరి Basic Pay లో 50 % పెన్షన్ గా నిర్ధారించబడుతుంది. అలా కాకుండా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే...*

*నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ > పెన్షన్*
*20>37.87% (చివరి మూలవేతనంలో)*
*21>39.4%*
*22>40.9%*
*23>42.4%*
*24>43.93%*
*25>45.45%*
*26>46.97%*
*27>48.48%*
*28>50%*
*(ఈ టేబుల్ 58 ఏళ్ళ వయస్సు నిండి ఉద్యోగ విరమణ చేసే వారికీ వర్తిస్తుంది...*