సందేహాలు - సమాధానాలు PART-3
1.ప్రశ్న:
ఒక టీచర్ వేసవి సెలవుల్లో 35 రోజులు వివిధ రకాల ప్రభుత్వ పరీక్షలకి హాజరు అయ్యాడు.అతనికి ఎన్ని Els జమచేయబడతాయి??
*🌼జవాబు:*
*వినియోగించుకున్న వేసవి సెలవులు 14 రోజులే కనుక 24 రోజుల ELs జమ చేయబడతాయి.*
*****
2.ప్రశ్న:
మా స్కూల్లో నలుగురు SGT లు ఒకే DSC లో ,ఒకే రోజు స్కూల్లో జాయిన్ అయ్యారు.ఎవరు మాలో సీనియర్ అవుతారు??
*🌼జవాబు:*
*సీనియారిటీ DSC సెలక్షన్ లిస్ట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది.*
*****
3.ప్రశ్న:
FAC HM గ్రీన్ ఇంక్ వాడవచ్చా??
*🌼జవాబు:*
*FR.49 ప్రకారం FAC భాద్యతలు నిర్వహిస్తున్న వారికి పోస్టుకి గల అన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి గ్రీన్ ఇంక్ వాడవచ్చు.*
*****
4.ప్రశ్న:
నేను హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.నాకు మహిళా టీచర్ల కి ఇచ్చే 5 స్పెషల్ CL లు ఇవ్వడం లేదు. ఎందువల్ల??
*🌼జవాబు:*
*జీఓ.374 తేదీ:16.3.96 ప్రకారం 5 స్పెషల్ CL లు కేవలం మహిళా టీచర్ల కి మాత్రమే వర్తిస్తాయి.*
*****
ప్రశ్న:
నేను,మరొక టీచర్ ఇద్దరం ఒకే రోజు SA లుగా పదోన్నతి పొందాము.ఒకే రోజు జాయిన్ అయ్యాము.SA క్యాడర్ లో ఎవరు సీనియర్ అవుతారు??
*🌼జవాబు:*
*SGT క్యాడర్ లో ఎవరు సీనియర్ ఐతే,వారే SA క్యాడర్ లో కూడా సీనియర్ అవుతారు.*
*****
6.PF ఋణం ఎంత ఇస్తారు??తిరిగి ఎలా చెల్లించాలి??
*🌼జవాబు:*
*PF నిబంధనలు 15ఏ ప్రకారం 20 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు మరియు 10 ఇయర్స్ లోపు సర్వీసు గలవారు ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. గృహ నిర్మాణ0 కోసం, స్థలం కొనుగోలు చేయడానికి 15 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు కూడా ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. రూల్ 15సీ ప్రకారం బేసిక్ పే కి 6 రెట్లు లేదా నిల్వ లో సగం ఏది తక్కువ ఐతే అది ఋణంగా ఇస్తారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిల్వ మొత్తం లో గరిష్టంగా 75% వరకు ఇవ్వవచ్చు.*
7.ప్రశ్న:
కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి APGLI ఎప్పటి నుంచి కట్ చెయ్యాలి??
✅జవాబు:
జీఓ199, ఆర్థికశాఖ తేదీ:30.7.13 ప్రకారం మొదటి నెల వేతనం నుంచే APGLI మినహాయించాలి.
8.ప్రశ్న:
సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరితే ఎన్ని రోజులలోపు సమాధానం ఇవ్వాలి??
✅జవాబు:
30 రోజులలోపు సమాధానం ఇవ్వాలి.
9.ప్రశ్న:
SR లో సర్వీస్ వెరిఫికేషన్ ఎప్పుడు ఎంటర్ చెయ్యాలి??
✅జవాబు:
మెమో:8388, తేదీ:20.1.12 ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో సర్వీస్ వెరిఫికేషన్ ఎంటర్ చెయ్యాలి.
10.ప్రశ్న:
నేను B.Sc, M.Ed చేశాను.1995 లో SGT గా చేరాను.ఐతే నాకు M.Ed కి అదనపు ఇంక్రిమెంట్ ఇవ్వటం లేదు.ఎందువల్ల??
✅జవాబు:
మెమో:5399, తేదీ:23.11.2000 ప్రకారం పీజీ అర్హత ఉంటేనే M.Ed కి ఆదనపు ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుంది.
11.ప్రశ్న:
నాకు మొదటిసారి బాబు. తర్వాత కవల పిల్లలు పుట్టారు. ఐటీ కి ముగ్గురు పిల్లల ట్యూషన్ ఫీజు పెట్టుకోవచ్చా??
✅జవాబు:
ఐటీ కి ఇద్దరు పిల్లల ట్యూషన్ ఫీజు మాత్రమే సేవింగ్స్ కి పరిగణించబడుతుంది.
12.ప్రశ్న:
ఉద్యోగి తల్లిదండ్రులు కి వైట్ కార్డు ఉంటే EHS లో చేర్చవచ్చా??
*☘జవాబు:*
*చేర్చకూడదు.అందరూ కలసి ఉండి వైట్ కార్డ్ ఉపయోగించుచున్నందులకు ఉద్యోగి పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.*
____
13.ప్రశ్న:
నా భార్య హౌస్ వైఫ్.ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేఇ0చుకుంటే నాకు ప్రత్యేక సెలవులు ఏమైనా ఇస్తారా??
*☘జవాబు:*
*జీఓ.802 M&H తేదీ:21.4.72 ప్రకారం భర్త కి 7 రోజులు స్పెషల్ సెలవులు ఇస్తారు.*
____
14.ప్రశ్న:
మెడికల్ సెలవు లో ఉండి వాలంటరి రిటైర్మెంట్ కి అప్లై చేయవచ్చా??
*☘జవాబు:*
*చేయవచ్చు. కానీ నష్టం జరుగుతుంది.మెడికల్ సెలవులో ఉండి వాలంటర్ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి వేతనం రాదు.అదే స్కూల్లో జాయిన్ ఐన పిదప వాల0టరీ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి పూర్తి వేతనం పొందవచ్చు.*
____
15.ప్రశ్న:
స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయదలచుకొన్నపుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి??
*☘జవాబు:*
*స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కి అనుమతి కోరుతూ HM ద్వారా DEO గారికి 3 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, SR,10వ తరగతి నుండి విద్యా అర్హతల సర్టిఫికేట్లు,సెల్ఫ్ డిక్లరేషన్ జాతపరచాలి.*
____
16.ప్రశ్న:
సర్వీసు మొత్తం మీద ఎన్ని కమ్యూటెడ్ సెలవులు వాడుకోవాలి??
*☘జవాబు:*
*సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు.అప్పుడు అర్థ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి.ఆ తర్వాత కూడా సెలవు అవసరం ఐతే కేవలం అర్ధ జీతపు సెలవు గా మాత్రమే ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు వాడుకోవచ్చు.*
____
17.ప్రశ్న:
స్కూల్ అసిస్టెంట్ తెలుగు గా పదోన్నతి పొందటానికి కావాల్సిన అర్హతలు ఏమిటి??
*☘జవాబు:*
*జీఓ.15,16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో మెయిన్ గా గానీ లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టు లలో ఒక సబ్జెక్టు గా తెలుగు ఉండాలి. బి.ఈ డి లో తెలుగు methodology లేదా పండిట్ ట్రైనింగ్ కలిగి ఉండాలి.అదేవిధంగా జీఓ.28,29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హత తో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు కి అర్హులే.*
____
18.ప్రశ్న:
ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా??
*☘జవాబు:*
*అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నo.362/ఇ1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు.*
____
19.ప్రశ్న:
LFL HM కి 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి కావలసిన అర్హతలు ఏమిటి??
*☘జవాబు:*
*LFL HM కి తదుపరి పదోన్నతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాబట్టి డిగ్రీ, బీ. ఈ. డీ, డిపార్ట్మెంట్ పరీక్షల ఉతీర్ణత ఉండాలి.50 ఇయర్స్ వయస్సు నిండితే డిపార్ట్మెంట్ టెస్టుల మినహాయింపు వర్తిస్తుంది.*
_____________________________________
20.ప్రశ్న:
విదేశాలకి వెళ్లుటకు ఏ విధమైన సెలవు వాడుకోవచ్చు??
*🌸జవాబు:*
*విదేశాలకు వెళ్లుటకు 3 నెలల వరకు CSE, ఆ పై కాలానికి Edn. Sec నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలి.అనుమతి లభించిన కాలానికి అర్హత గల(EL/HPL/EOL)ఏ సెలవు నైనా వినియోగించుకోవచ్చు.జీఓ.70 తేదీ:6.7.2009 ప్రకారం 4 నెలల లోపు HM/MEO, 4--6 నెలల వరకు DY. EO,6 నెలల నుండి 1 ఇయర్ వరకు DEO,1--4 ఇయర్స్ వరకు CSE,4 ఇయర్స్ పైన Edn. Sec నుండి సెలవు మంజూరు చే ఇంచుకోవాలి.*
____
21.ప్రశ్న:
EOL కాలాన్ని మెడికల్ లీవ్ గా మార్చుకోవచ్చా??
*🌸జవాబు:*
*సెలవు నిబంధనలు ప్రకారం ఒకసారి EOL గా మంజూరు చేఇ0చుకొన్న సెలవును మెడికల్ లీవ్ గా మార్చుకొనే అవకాశం లేదు.*
____
22.ప్రశ్న:
మెడికల్ లీవ్ తో కలిసి మెటర్నటీ లీవ్ వాడుకోవచ్చా??
*🌸జవాబు:*
*జీఓ.2391 తేదీ:3.10.1960 ప్రకారం వైద్య కారణాల పై ఏ ఇతర సెలవు నైనా ప్రసూతి సెలవు తో కలిపి వాడుకోవచ్చు. కాబట్టి ఈ జీఓ ను అనుసరించి మెడికల్ లీవ్ తో కలిపి మెటర్నటీ లీవ్ వాడుకోవచ్చు.*
____
23.ప్రశ్న:
పాస్ పోర్టు కోసం no objection certificate ఎవరి నుండి తీసుకోవాలి??
*🌸జవాబు:*
*DSE కార్యాలయం నుండి NOC తీసుకోవాలి.నిర్ణీత నమూనాలో HM/MEO ల నుండి DEO ద్వారా DSE కి దరఖాస్తు చేసుకోవాలి.నమూనా దరఖాస్తులు DEO కార్యాలయంలో లభిస్తాయి.*
____
24.ప్రశ్న:
మూడు నెలల్లో నేను పదవీ విరమణ చేయబోతున్నాను. నెలకు వచ్చే బేసిక్ పింఛనులో మూడో వంతు కమ్యుటేషన్ చేసుకుంటే రూ.7,11,591 వస్తాయి. కానీ, నెలకు వచ్చే పింఛను రూ.8,581ని 15 ఏళ్లపాటు తగ్గిస్తారు. 15 ఏళ్ల తర్వాత కమ్యుటేషన్ కారణంగా తగ్గిన పింఛనును పునరుద్ధరించి పూర్తి పింఛను చెల్లిస్తారు. దీన్ని వినియోగించుకొని ముందే డబ్బు తీసుకోవడం మంచిదేనా?
*🌸జవాబు*
*పింఛనులో బేసిక్, కరువు భత్యం అని రెండు భాగాలు ఉంటాయి. 15 ఏళ్లలో అందుకునే బేసిక్ పింఛను మొత్తాన్ని కొంత డిస్కౌంటుతో పదవీ విరమణ చేసేప్పుడు తీసుకోవచ్చు. దీన్ని కమ్యుటేషన్ అంటారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులు 15 ఏళ్ల పింఛనను ముందుగానే తీసుకోవడం లాభదాయకమా? కాదా అన్నది తెలియాలంటే కొన్ని లెక్కలు తెలియాలి. కమ్యుటేషన్ వల్ల ఈ పింఛను రూ.8,581 తగ్గుతుంది. దీంతో వచ్చిన రూ.7,11,591లను సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంలో దాచుకుంటే మూడు నెలలకు ఒకసారి రూ.14,765 వరకూ వస్తాయి. కమ్యుటేషన్ వల్ల నెలకు మీకు అందే మొత్తం రూ.3,659 తగ్గిపోతుంది. కానీ, గడువు తర్వాత మీ అసలు మీ చేతికి వస్తుంది. కమ్యుటేషన్ చేస్తే వచ్చిన రూ.7,11,591 ను 13శాతం రాబడి వచ్చే యాన్యుటీ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు రూ.8,581 వస్తాయి. 15ఏళ్ల తర్వాత మీ చేతికి ఏమీ రాదు. అంటే కమ్యుటేషన్తో వచ్చిన డబ్బును కనీసం 13శాతం రాబడి వచ్చే మార్గంలో మదుపు చేయగలిగితేనే దీన్ని ఎంచుకోవాలి. పదవీ విరమణ తర్వాత నెలకు వచ్చే ఆదాయం తగ్గుతుంది.కమ్యుటేషన్ చేసి మీ ఆదాయాన్ని మరో రూ.3,659 తగ్గించుకోవడం కంటే ఎక్కువ పింఛను తీసుకోవడమే మంచిది. పదవీ విరమణ తర్వాత గ్రాట్యుటీ, మిగిలిన సెలవుల జీతం, ప్రావిడెంట్ ఫండ్ రూపంలో భారీ మొత్తం చేతికి వస్తుంది. ఈ డబ్బును అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా పెట్టుకోవచ్చు.ఇవేవీ లేకుండా కేవలం పింఛను మాత్రమే వచ్చేవారు కమ్యుటేషన్ ద్వారా వచ్చిన మొత్తాన్ని అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా దాచుకోవచ్చు.*
25.ప్రశ్న:
*పెన్షనర్ మరనించినచో కుటుంబ సభ్యులు ఏమి చేయాలి*
జవాబు:
పెన్షనర్ మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు ట్రెజరీ లో తెలియపరచాలి.తెలియ పరచకుంటే మరల లైఫ్ సెర్టిఫికెట్(ప్రస్తుతం డిజిటల్ బయోమెట్రిక్/ఐరిష్)ఇచ్చే వరకు నెల నెలా పెన్షన్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. ఎటిఎం తో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ భాద్యత గల పౌరులుగా అలా చేయడం తప్పు.రెండవది ప్రభుత్వంనకు ఈ విషయం తెలిసినా లేదా ఎవరైనా కంప్లైంట్ చేసినా క్రిమినల్ కేసులు పెడతారు. అందువల్ల వెంటనే ట్రెజరీలో తెలియపరచాలి.చనిపోయిన రోజు వరకు పెన్షన్ లెక్కకట్టి అకౌంట్ లో వేస్తారు.
26.ప్రశ్న:
*PRC లో ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చా??*
జవాబు:
వెనుకటి తేదీ నుంచి వేతనం మారిన సందర్భంలో తప్ప,సాధారణంగా ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మార్చుకొనే అవకాశం లేదు.
27.ప్రశ్న:
*స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఎవరికి ఇస్తారు??*
జవాబు:
ఒక ఉద్యోగి తాను పొందుతున్న వేతన స్కేలు గరిష్టం చేరిన తరువాత ఇంకా సర్వీసు లో ఉంచి ఇంక్రిమెంట్లు మంజూరు చేయవలసి ఉన్నప్పుడు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తారు.2015 PRC లో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు కి అవకాశం కల్పించారు.
28.ప్రశ్న:
*వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన ప్రసూతి సెలవు ఎలా మంజూరు చేస్తారు??*
జవాబు:
వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన, ప్రసవించిన రోజు నుండి 180 రోజుల వేసవి సెలవులు పోను మిగిలిన రోజులకు ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు.
29.ప్రశ్న:
*ఐటీ రిటర్న్ అందరూ సమర్పించాలా??*
జవాబు:
2,50,000రూ ఆదాయం దాటిన వారందరూ ఆగస్టు 31లోగా రిటర్న్ దాఖలు చెయ్యాలి. వేతన ఆదాయం మాత్రమే ఉన్నవారు ITR--1 ఫారంలో ఈ--ఫైలింగ్ చేయవచ్చు.
30.ప్రశ్న:
*నాకు ఈ నెలలో ఇంక్రిమెంట్ ఉంది.కానీ మెడికల్ లీవు పెట్టాను.నాకు ఈ నెలలో ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారా??చెయ్యరా??*
జవాబు:
జీఓ.192 తేదీ:1.7.74 ప్రకారం మీరు ML లో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్ ఇవ్వటం కుదరదు.మీరు ఎపుడు జాయిన్ ఐతే అప్పుడు నుండి మాత్రమే ఇంక్రిమెంట్ ఇవ్వటం జరుగుతుంది.అప్పటి వరకు పాత జీతమే వస్తుంది.
________
31.ప్రశ్న:
UP స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ అదే మండలం నకు FAC MEO గా భాద్యత లు నిర్వహించుచున్న అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు??
*🌼జవాబు:*
*FR.49 ప్రకారం ఒక పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు సంక్రమిస్తాయి.కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి ఆనుమతి తో జమ చేయవలసి ఉంటుంది.*
_____
32.ప్రశ్న:
SGT గా పనిచేస్తున్న టీచర్ VRO గా ఎంపిక ఐతే పే--ప్రొటెక్షన్,సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందా??
*🌼జవాబు:*
*DEO అనుమతి తో పరీక్ష రాస్తే వేతన రక్షణ ఉంటుంది. జీఓ.105 తేదీ:2.6.2011 ప్రకారం నూతన పోస్టు యొక్క స్కేల్ లో ప్రస్తుతం పొందుతున్న వేతనానికి సమానమైన స్టేజి లో వేతనం నిర్ణయించబడుతుంది. ఇంక్రిమెంట్ మాత్రం నూతన సర్వీసు లో చేరిన ఒక సంవత్సరం తర్వాతే మంజూరు చేస్తారు.*
_____
33.ప్రశ్న:
మహిళా టీచర్ భర్త నిరుద్యోగి.అత్త, మామ కూడా ఈమె పైనే ఆధార పడి జీవిస్తున్నారు.అత్త గారికి ఆరోగ్యం బాగా లేదు.మెడికల్ రీఅ0బర్సుమెంట్ వర్తిస్తుందా??
*🌼జవాబు:*
*APIMA రూల్ 1972 ప్రకారం వర్తించదు. కేవలం మహిళా టీచర్ అమ్మ,నాన్న లకి మాత్రమే వర్తిస్తుంది.*
_____
34.ప్రశ్న:
నాకు మొదటి సారి అమ్మాయి.తర్వాత కవల పిల్లలు జన్మించారు. LTC లో ముగ్గురు పిల్లలు ప్రయాణం చేయవచ్చా??
*🌼జవాబు:*
*జీఓ.140 తేదీ:3.4.96 ప్రకారం ఇద్దరు పిల్లలుకి మాత్రమే అవకాశం ఉంది.*
_____
35.ప్రశ్న:
అబార్షన్ కి రెండుసార్లు మాత్రమే సెలవు ఉపయోగించుకోవాలి అనుచున్నారు.వాస్తవమా?? కదా??
*🌼జవాబు:*
*జీఓ.254;ఆర్ధిక;తేదీ:10.11.95 ప్రకారం ఇద్దరు కంటే తక్కువ జీవించియున్న బిడ్డలు గలవారు అర్హులు.అంతేకానీ ఎన్నోసారి అనే దానితో నిమిత్తం లేదు.*
_______________________________
36.ప్రశ్న:
స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయదలచుకొన్నపుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి??
*🍄జవాబు:*
*స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కి అనుమతి కోరుతూ HM ద్వారా DEO గారికి 3 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, SR,10వ తరగతి నుండి విద్యా అర్హతల సర్టిఫికేట్లు,సెల్ఫ్ డిక్లరేషన్ జాతపరచాలి.*
_____
37.ప్రశ్న:
సర్వీసు మొత్తం మీద ఎన్ని కమ్యూటెడ్ సెలవులు వాడుకోవాలి??
*🍄జవాబు:*
*సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు.అప్పుడు అర్థ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి.ఆ తర్వాత కూడా సెలవు అవసరం ఐతే కేవలం అర్ధ జీతపు సెలవు గా మాత్రమే ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు వాడుకోవచ్చు.*
_____
38.ప్రశ్న:
స్కూల్ అసిస్టెంట్ తెలుగు గా పదోన్నతి పొందటానికి కావాల్సిన అర్హతలు ఏమిటి??
*🍄జవాబు:*
*జీఓ.15,16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో మెయిన్ గా గానీ లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టు లలో ఒక సబ్జెక్టు గా తెలుగు ఉండాలి. బి.ఈ డి లో తెలుగు methodology లేదా పండిట్ ట్రైనింగ్ కలిగి ఉండాలి.అదేవిధంగా జీఓ.28,29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హత తో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు కి అర్హులే.*
_____
39.ప్రశ్న:
ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా??
*🍄జవాబు:*
*అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నo.362/ఇ1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు.*
_____
40.ప్రశ్న:
LFL HM కి 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి కావలసిన అర్హతలు ఏమిటి??
*🍄జవాబు:*
*LFL HM కి తదుపరి పదోన్నతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాబట్టి డిగ్రీ, బీ. ఈ. డీ, డిపార్ట్మెంట్ పరీక్షల ఉతీర్ణత ఉండాలి.50 ఇయర్స్ వయస్సు నిండితే డిపార్ట్మెంట్ టెస్టుల మినహాయింపు వర్తిస్తుంది.*
41. ఇంటి అద్దె (HRA మినహాయింపు) గణన ఎలా?*
జ।। చెల్లించిన అద్దె -10% ఫే - 10% డి.ఏ
సంవత్సరంలో చెల్లించిన అద్దె 1లక్ష లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే ఇంటి యజమాని PAN ఇవ్వాలి (నెలసరి అద్దె 8400/- కానీ అంతకంటే ఎక్కువ చెల్లించిన వారు)
42. టాక్సేబుల్ ఆదాయం దాదాపు 7,00,000 ఉంటే టాక్స్ ఎలా గణించాలి?*
2,50,000 వరకు పన్ను లేదు (60 ఏళ్ల లోపు వారికి)
2,50,001-5,00,000 వరకు (2.50 లక్షలకు) 10%
5,00,001-10,00,000 వరకు (5 లక్షలకు) 20%
10,00,000 పైబడిన 30%
7,00,000 కు టాక్స్ గణిస్తే
2,50,000 వరకు పన్ను లేదు
2,50,001 - 5,00,000 వరకు (2.50 లక్షలకు) 10%
అంటే 2,50,000 X 10% = 25,000/-
5,00,001 - 7,00,000 వరకు (2 లక్షలకు) 20%
అంటే 2,00,000 X 20% = 40,000/-
చెల్లించాల్సిన టాక్స్ (25,000+40,000/-)+3%ఎడ్యుకేషన్ సెస్సు.
43. CPS వారికి సంబంధించిన సెక్షన్ల వారిగా ఉన్న అవకాశాలు.*
ఉద్యోగుల కంట్రీబ్యూషన్ చేసిన నిధి 80CCD(1) ప్రకారం 80C సెక్షన్ తో 1,50,000/- లో చూపాలి.
అధనంగా 80CCD1(B) ద్వార 50,000/- లబ్ధి ఎలా పొందే అవకాశం ఉంది
ఉద్యోగులకు వారి ప్రాన్ (PRAN) ఖాతా లో ఉద్యోగుల వాటకి సమానంగా జమచేసిన నిధిని ముందుగా ఆదాయం గా చూపించి తర్వాత 80CCD(2) ప్రకారం ఆదాయం నుండి పూర్తి మినహాయింపు కలదు.
44. అధనంగా 80CCD(1B) ద్వార 50,000/- లబ్ధి ఎలా పొందే అవకాశం ఉంది?*
ఉద్యోగులకు CPS కాకుండా 80C కింద 1,50,000/- సేవింగ్స్ ఉంటే CPS నిధిని 80CCD(1B) లో 50,000 వరకు మినహాయింపు పొందవచ్చు.
ఒకవేళ ఉద్యోగులకు 80C కింద CPS కాకుండా 1,30,000/- సేవింగ్స్ ఉండి CPS deduction 70,000/- ఉంటే అప్పుడు 20,000/- లను 80C కింద మిగతా 50,000/- లను 80CCD(1B) కింద చూపవచ్చు.
_______________________________
45.ప్రశ్న:
46.LTC ఎలా వాడుకోవచ్చు??
*🌸జవాబు:*
*జీఓ.98 తేదీ:21.5.2011 ప్రకారం సర్వీసు మొత్తం మీద ఒకసారి ఇండియా లోని ఎక్కడికైనా వెళ్ళటానికి ltc వాడుకోవచ్చు. బ్లాక్ పీరియడ్ లోని చివరి రెండు సంవత్సర0లలో మాత్రమే వినియోగించుకోవాలి.గరిష్టంగా రానూ, పోనూ 3500 కి.మీ వరకు మాత్రమే అనుమతి ఇస్తారు.12500రూ చెల్లిస్తారు.*
_____
47.ప్రశ్న:
నేరుగా స్కూల్ అసిస్టెంట్ గా సెలెక్ట్ ఐన వ్యక్తి కి 45 ఇయర్స్ తర్వాత డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ కాకుండా 12 ఇయర్స్ స్కేల్ ఇస్తారా??
*🌸జవాబు:*
*జీఓ.225 తేదీ:18.5.1999 ప్రకారం మొదటి పదోన్నతి స్కేల్ కి 45 ఇయర్స్ మినహాయింపు వర్తిస్తుంది.నేరుగా స్కూల్ అసిస్టెంట్ ఐన టీచర్ కి 12 ఇయర్స్ స్కేల్ మొదటి ప్రమోషన్ స్కేల్ అవుతుంది.*
_____
48.ప్రశ్న:
నేను సర్వీస్ పెన్షన్,కుటుంబ పెన్షన్ రెండూ తీసుకొనుచున్నాను.వీటిని ఐటీ లో ఎలా చూపాలి??
*🌸జవాబు:*
*సర్వీసు పెన్షన్ ను వేతన ఆదాయంగాను,కుటుంబ పెన్షన్ ను ఇతర ఆదాయంగాను చూపించాలి.*
_____
49.ప్రశ్న:
జాతీయ పెన్షన్ పథకం లో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చా??
*🌸జవాబు:*
*పెట్టవచ్చు. గరిష్టంగా 50000 వరకు మదుపు చేసి ఐటీ మినహాయింపు పొందవచ్చు.*
_____
50.ప్రశ్న:
పెన్షనర్ ఐటీ లో ఏవిధంగా HRA మినహాయింపు పొందవచ్చు??
*🌸జవాబు:*
*HRA పొందని వారు అద్దె ఇంట్లో ఉంటుంటే నెలకు 5000రూ వరకు ఐటీ మినహాయింపు పొందవచ్చు.*
________________________________
51.ప్రశ్న:
సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి మరణించినచో ఏమి జరుగుతుంది??
*🌼జవాబు:*
*జీఓ.275 , తేదీ:8.8.77 ప్రకారం సస్పెన్షన్ పీరియడ్ ను ఆన్ డ్యూటీ గా పరిగణిస్తారు.*
_____
52.ప్రశ్న:
జీతం డబ్బులు తీసుకోవటానికి కేవలం SBI/SBH లోనే అకౌంట్ ఉండాలా??
*🌼జవాబు:*
*జీఓ.58, తేదీ:21.3.05 ప్రకారం ప్రభుత్వం సూసించిన SBI/SBH బ్యాంక్ లలో ఏదో ఒక దానిలో అకౌంట్ ఉండాలి.*
_____
53.ప్రశ్న:
ఈ సంవత్సరం వార్షికోత్సవం జరపాలని అనుకొనుచున్నాము.డబ్బులు ఎంత ఇస్తారు??
*🌼జవాబు:*
*ప్రైమరీ స్కూళ్ళుకి 100 లోపు పిల్లలు ఉంటే 800రూ,100 పైన పిల్లలు ఉంటే 1000రూ ఇస్తారు. అదే అప్పర్ ప్రైమరీ కి 100 లోపు ఉంటే 1000రూ,100 పైన ఉంటే 1200రూ ఇస్తారు.*
_____
54.ప్రశ్న:
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి ప్రత్యేక సెలవు ఏమైనా ఇస్తారా??
*🌼జవాబు:*
*జీఓ.286,తేదీ:29.10.91 ప్రకారం 6 నెలలు గరిష్టంగా అర్ధ వేతన సెలవులకి అర్హుడు.ఈ కాలంలో పూర్తి వేతనం పొందవచ్చు.*
_____
55.ప్రశ్న:
వేసవి సెలవులు మరియు వ్యక్తిగత0గా పెట్టుకున్న సెలవులు 6 నెలలకు మించిన ఏమి జరుగుతుంది??
*🌼జవాబు:*
*జీఓ.143,తేదీ:1.6.68 ప్రకారం 6 నెలలకు మించితే మొత్తం "లీవ్" గా పరిగణించబడుతుంది.*
____________________________________
56.ప్రశ్న:
నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను.ఐతే ఏమి చెయ్యాలి??
*🌷జవాబు:*
*జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేఇ0చి,DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేఇ0చాలి.స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేఇ0చాలి.*
_____
57.ప్రశ్న:
నేను PF నుండి ఋణం పొందియున్నాను.
వాయిదాలు పూర్తి కాలేదు.మరలా ఋణం కావాలి.ఇస్తారా??
*🌷జవాబు:*
*ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి,కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.*
_____
58.ప్రశ్న:
ఒక డీజేబుల్డ్ ఉపాధ్యాయునికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి??
*🌷జవాబు:*
*జీఓ.1063 తేదీ:2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.*
_____
59.ప్రశ్న:
ఒక టీచర్ ఫిబ్రవరి 29న జాబ్ లో చేరాడు.అతనికి వార్షిక ఇంక్రిమెంట్ ఏ నెలలో ఇవ్వాలి??
*🌷జవాబు:*
*ఆర్.సి.2071 తేదీ:21.7.2010 ప్రకారం లీపు సంవత్సరం ఫిబ్రవరి 29న విధుల్లో చేరిన ఉపాధ్యాయుల వార్షిక ఇంక్రిమెంట్ ఫిబ్రవరి నెల లోనే ఇవ్వాలి.*
_____
60.ప్రశ్న:
బిడ్డ పుట్టి వెంటనే మరణించిన, వారికి మెటర్నిటీ లీవు కి అర్హత ఉందా??
*🌷జవాబు:*
*Lds.1941 తేదీ:11.6.90 ప్రకారం మరణించిన బిడ్డను ప్రసవించినా,ప్రసూతి సెలవు వాడుకోవచ్చు.*
_____________________________
61.ప్రశ్న:
వేసవి సెలవుల్లో పని చేస్తే ELs ఎలా జమచేస్తారు??
*🍁జవాబు:*
*వేసవి సెలవులు 15 రోజులు కన్నా తక్కువగా వాడుకుంటే,మొత్తం వేసవి సెలవులు వాడుకోలేదన్నట్లుగా భావించి 24 ELs ఇస్తారు.*
____
62.ప్రశ్న:
సంపాధిత సెలవును అర్ధ జీతపు సెలవు, వేసవి సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చు??
*🍁జవాబు:*
*ఒకేసారి 180 రోజులకి మించి వాడుకోకూడదు.*
____
63.ప్రశ్న:
ఒక ఉద్యోగి సస్పెన్షన్ లో ఉన్నప్పుడు ఉద్యోగం నుంచి విరమించుకోవచ్చా??
*🍁జవాబు:*
*విరమించుకోవటానికి అతనికి అనుమతి ఇవ్వరు.*
____
64.ప్రశ్న:
ఉద్యోగ విరమణ చేసే సమయంలో సస్పెండ్ అయితే ఎలా చేస్తారు??
*🍁జవాబు:*
*అతని సర్వీసును ఉన్నతాధికారులు పొడిగిస్తారు.*
____
65.ప్రశ్న:
బ్యాంకు లో 15G ఫారం ఎప్పుడు ఇవ్వాలి??
*🍁జవాబు:*
*ఒక బ్యాంక్ లో మనం డిపాజిిట్ చేసిన మొత్తం డబ్బులు పై సంవత్సరం నకు 10,000రూ పైన వడ్డీ వస్తే టాక్స్ పడకుండా ఉండేందుకు బ్యాంకు వారికి 15G ఫారం మరియు పాన్ కార్డు zerox కాపీ ఇవ్వాలి.అపుడు బ్యాంకు వారు మన డిపాజిిట్ లపైన టాక్స్ ను కట్ చేయరు. ఈ రెండూ ఇవ్వకపోతే వచ్చే వడ్డీ లో టాక్స్ కట్ చేస్తారు.ఈ రెండు ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరులో ఇవ్వాలి.*
_____________________________
66.ప్రశ్న:
ఇంటి నిర్మాణానికి అడ్వాన్స్ తీసుకుంటే ఎప్పటి లోగా తీర్చాలి??
*🌻జవాబు:*
*ఇంటి నిర్మాణానికి అడ్వాన్సు తీసుకుంటే 300 నెలల్లో, మరమ్మతులకి తీసుకుంటే 90 నెలల్లో,ఇంటి స్థలం కోసం తీసుకుంటే 12 నెలల్లో తీర్చాలి.*
____
67.ప్రశ్న:
వాల0టరీ నియామకం పొందువరికి కారుణ్య నియామకం వర్తిస్తుందా??
*🌻జవాబు:*
*వర్తించదు.*
____
68.ప్రశ్న:
CCL ను DDO నుండి ఎప్పటిలోగా తీసుకోవాలి??
*🌻జవాబు:*
*ఏ CCL ఐనా తాను పనిచేసిన ప్రభుత్వ సెలవు దినానికి 6 నెలలలోపే DDO దగ్గర నుండి పొందాలి.*
____
69.ప్రశ్న:
వ్యక్తి గత అవసరాలకు హాఫ్ పే లీవ్ వాడుకుంటే జీతం ఎలా చెల్లిస్తారు??
*🌻జవాబు:*
*మెమో.14568 ,తేదీ:31.1.2011 ప్రకారం పే,డీఏ సగం మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు.*
____
70.ప్రశ్న:
ఇంటి మరమ్మతులు కోసం ఎంత అడ్వాన్స్ గా పొందవచ్చు??
*🌻జవాబు:*
*ఇంటి మరమ్మతులు, విస్తరణకు ములవేతనం కి 20 రెట్లు గానీ, 4 లక్షలు గానీ ,ఏది తక్కువ ఐతే ఆ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇస్తారు.*
___________________________
71.ప్రశ్న:
వేసవి సెలవుల్లో పని చేస్తే ELs ఎలా జమచేస్తారు??
*🍁జవాబు:*
*వేసవి సెలవులు 15 రోజులు కన్నా తక్కువగా వాడుకుంటే,మొత్తం వేసవి సెలవులు వాడుకోలేదన్నట్లుగా భావించి 24 ELs ఇస్తారు.*
____
72.ప్రశ్న:
సంపాధిత సెలవును అర్ధ జీతపు సెలవు, వేసవి సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చు??
*🍁జవాబు:*
*ఒకేసారి 180 రోజులకి మించి వాడుకోకూడదు.*
____
73.ప్రశ్న:
ఒక ఉద్యోగి సస్పెన్షన్ లో ఉన్నప్పుడు ఉద్యోగం నుంచి విరమించుకోవచ్చా??
*🍁జవాబు:*
*విరమించుకోవటానికి అతనికి అనుమతి ఇవ్వరు.*
____
74.ప్రశ్న:
ఉద్యోగ విరమణ చేసే సమయంలో సస్పెండ్ అయితే ఎలా చేస్తారు??
*🍁జవాబు:*
*అతని సర్వీసును ఉన్నతాధికారులు పొడిగిస్తారు.*
____
75.ప్రశ్న:
బ్యాంకు లో 15G ఫారం ఎప్పుడు ఇవ్వాలి??
*🍁జవాబు:*
*ఒక బ్యాంక్ లో మనం డిపాజిిట్ చేసిన మొత్తం డబ్బులు పై సంవత్సరం నకు 10,000రూ పైన వడ్డీ వస్తే టాక్స్ పడకుండా ఉండేందుకు బ్యాంకు వారికి 15G ఫారం మరియు పాన్ కార్డు zerox కాపీ ఇవ్వాలి.అపుడు బ్యాంకు వారు మన డిపాజిిట్ లపైన టాక్స్ ను కట్ చేయరు. ఈ రెండూ ఇవ్వకపోతే వచ్చే వడ్డీ లో టాక్స్ కట్ చేస్తారు.ఈ రెండు ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరులో ఇవ్వాలి.*
_
76.ప్రశ్న:
అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారు సీనియారిటీ కోల్పోవటం అనేది పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందా?హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే క్రమము, రేషనలైజేషన్ వంటి ఇతర సంధర్భాలలో కూడా వర్తిస్తుందా?ఒక ఉపాధ్యాయిని 1998 లో వేరే జిల్లాలో నియామకమై అంతర్ జిల్లా బదిలీపై తేది:23-4-2013న రంగారెడ్డి జిల్లాలో ఒక పాఠశాలకు చేరారు.2000 సం!!లో ఇదే జిల్లాలో నియామకమైన మరో ఉపాధ్యాయిని తేది:20-5-2013 న ఆ పాఠశాలకు బదిలీపై వచ్చారు.వీరిలో ఎవరు సీనియరు?
*🌼జవాబు:*
*ఏ.పి.స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూల్ 35(b) ప్రకారం అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారి సీనియారిటీ మీ జిల్లాలో చేరిన తేది నుండి మాత్రమే లెక్కించబడుతుంది. సీనియారిటీ అనేది అన్ని సంధర్భాలలోనూ (పదోన్నతులు మొదలుకుని హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే వరకు) ఒకే విధంగా ఉంటుంది.2000సం!!లో రంగారెడ్డి జిల్లాలోనే నియామకమైన ఉపాధ్యాయిని సీనియరుగా పరిగణించబడతారు.*
*****
77.ప్రశ్న:
ఒక SGT ఉపాధ్యాయుడు 18 సం!! స్కేలు,24 సం!! స్కేలు కోసం ఏయే Dept.Exams ఉత్తీర్ణత పొందాలి.అదే విధంగా SA తన 12సం!! స్కేలు కోసం ఏఏ Dept.Tests పాస్ కావాలి, మినహాయింపులు ఏమైనా వున్నాయా?
*🌼జవాబు:*
*ఏ క్యాడర్ లో నైనా 18 సం!! స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం ఎటువంటి అదనపు అర్హతలు అవసరంలేదు.12సం!! స్కేలు పొందివుంటే యాంత్రికంగా 18సం!! ఇంక్రిమెంట్ కు అర్హత ఉంటుంది.SGT లు 24సం!! స్కేలు కోసం గ్రాడ్యుయేషన్ + B.Ed + GOT,EOT పరీక్షలు పాస్ కావాలి.SA లకు తమ 12సం!! స్కేలు కోసం GO,EO పరీక్షలు ఉత్తీర్ణత పొందివుండాలి. అయితే Direct Recruitment SA లకు మాత్రం 45సం!! వయస్సు దాటిన వారికి పై Dept.Test పరీక్షల నుండి మినహాయింపు కలదు.పై మినహాయింపులు అప్రయత్న పదోన్నతి పధకం(AAS) కు వర్తించవు.*
*****
78.ప్రశ్న:
ఒక ఉపాధ్యాయుడు ప్రమోషన్ ఎన్నిసార్లు తిరస్కరించడానికి అవకాశం ఉంది?
*🌼జవాబు:*
*వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా రాత పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు. అయితే ప్రభుత్వ cir.Memo.No.10445/ ser-D/2011,GAD తేది:1-6-2011 ప్రకారం ఒక్కసారి మాత్రం ప్రమోషన్ ఆర్డర్ తీసుకుని (లేదా)తీసుకోకుండా ప్రమోషన్ పొస్ట్ లో చేరకుండా చేయవచ్చును. అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తరువాత ఇక చేర్చరు.*
*(G.O.Ms.No.145 GAD,Dt:15-6-2004)*
*****
79.ప్రశ్న:
దాదాపు 6సం!! కాలం SGT గా పనిచేసి ప్రభుత్వంలోని వేరే శాఖకు ఎంపికై అక్కడ కూడా 2సం!! పనిచేసి తిరిగి పాత పోస్టులో చేరిన ఉపాధ్యాయుని 2సం!! సర్వీసును ఏ విధంగా లెక్కిస్తారు? ఇంక్రిమెంట్ ను AAS కి లెక్కిస్తారా?
*🌼జవాబు:*
*FR-26(i) ప్రకారం ప్రస్తుత పోస్టుపై 'Lien' కలిగియున్న ఉపాధ్యాయుడు,ప్రస్తుత పోస్టుకంటే తక్కువగాగాని పోస్టులో పనిచేసిన సర్వీసును ఇంక్రిమెంట్ కు లేక్కిన్చవచును. G.O.Ms.No.117,F&P, Dt:20-5-1981 ప్రకారం ఇంక్రిమెంట్ కు పరిగణింపబడే సర్వీసు అంతా AAS కు కూడా లెక్కించబడుతుంది. కాబట్టి సదరు 2సం!! ఇతర పోస్టు సర్వీసు AAS నకు కూడా లెక్కించబడుతుంది.*
*****
80.ప్రశ్న:
ఒక ఉపాధ్యాయుడు డిసెంబర్ 15 నుండి 19 వరకు వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు వినియోగించుకుంటున్నాడు. అయితే 13,14వ తేదీలు రెండవ శనివారం,ఆదివారం ఉన్నాయి. అవి కూడా కమ్యూటెడ్ సెలవుగా పరిగణించాలా?
*🌼జవాబు:*
*ఆర్ధిక శాఖ Memo.No.86595/1210/FR-1/7 తేది:29-5-1981 మరియు FR-68 ప్రకారం ఏ రకమైన ఆకస్మికేతర సేలవుకైనా ముందు లేదా వెనుక వున్న ప్రభుత్వ సెలవు దినాలు ప్రీఫిక్స్/సఫిక్స్ చేసి వినియోగించుకోవడానికి అనుమతించబడతాయి. అయితే G.O.Ms.No.319 F&P తేది:18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై వినియోగించుకున్న సెలవుకు ముందు,వెనుక ఉన్నప్రభుత్వ సెలవులను మినహాయించి పనిదినాల కాలానికి మాత్రమే వైద్య ధ్రువపత్రాలు A,B లు వుండాలి.*
______________________________
81.ప్రశ్న:
మెడికల్ సెలవుకోసం డాక్టరు సర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సర్టిఫికెట్ వేరేవేరే డాక్టర్ల నుండి సమర్పించవచ్చునా?వైద్య కారణాలపై తీసుకున్న EOL ఇంక్రిమెంట్ కోసం లెక్కించబడుతుందా?
*🍁జవాబు:*
*రెండు సర్టిఫికెట్లు ఒకే డాక్టర్ ఇవ్వాలని ఏ ఉత్తర్వులోనూ లేదు.ఇద్దరూ క్వాలిఫైడ్ వైద్యులైనంత వరకు ఎట్టి అభ్యంతరము ఉండదు. సాధారణంగా EOL వాడుకుంటే ఇంక్రిమెంట్ అన్ని రోజులు వాయిదా పడుతుంది.అయితే ప్రభుత్వం G.O.Ms.No.43 తేది:5-2-1976 ద్వారా వైద్య కారణాలపై 6 నెలల కాలం వరకు EOL ను ఇంక్రిమెంటుకు పరిగణించే అధికారం శాఖాధిపతులకు (ఉపాధ్యాయుల విషయంలో పాఠశాల విద్యా సంచాలకులకు) ఇవ్వడం జరిగింది.*
_____
82.ప్రశ్న:
ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా?
*🍁జవాబు:*
*అవును G.O.Ms.No.802 M&H Dated:21-4-1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి.*
_____
83.ప్రశ్న:
ఒక ఉపాధ్యాయుడు SA క్యాడర్ లో 12 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసాడు. అయితే Departmental Test E.O.T/G.O T పరీక్షలు పాస్ కాలేదు.తదుపరి పాస్ అయితే 12 సంవత్సరాల స్కేల్ ఎప్పటినుండి ఇస్తారు??
*🍁జవాబు:*
*F.R-26(a) క్రింద గల రూలింగ్ 2 ప్రకారం చివరి పరీక్ష మరుసటి తేది నుండి 12 సంవత్సరాల స్కేలు మరియు ఆర్ధిక లాభం ఇవ్వాలి.*
_____
84.ప్రశ్న:
పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలలో Spl.Language Tests Telugu,Hindi,Urdu ఎవరు రాయాలి?
*🍁జవాబు:*
*ఇంటర్మీడియేట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవనివారు Spl.language Test in Telugu(P.code-37) రాయాల్సి ఉంటుంది.*
*10వ తరగతి ఆ పై స్థాయిలో హింది/ఉర్దూ ఒక భాషగా చదవని వారు Spl.language Test in Hindi/Urdu రాయాల్సి ఉంటుంది.*
_____
85.ప్రశ్న:
సరెండర్ లీవ్ ను నెలలో ఎన్ని రోజులకు లెక్కగడతారు? 11 రోజుల సంపాదిత సెలవులున్నను లీవ్ సరెండర్ చేసుకోవచ్చునా?
*🍁జవాబు:*
*G.O.Ms.No.306 Fin Dept Dt:8-11-1974ప్రకారం సదరు నెలలో 28/29/30/31 ఎన్ని* *రోజులున్నను,రోజులతో నిమిత్తం లేకుండా 30 రోజులకు మాత్రమే లీవ్ సరెండర్ లెక్కగట్టి నగదు చెల్లిస్తారు.*
*G.O.Ms.No.334 F&P,Dt:28-9-1977 లో ఇలా వుంది Leave may be surrendered at any time not exceeding 15/30 days...అని వున్నది.అందుచేత 11రోజులు సరెండర్ చేసుకుని నగదు పొందవచ్చు.*
_____
86.ప్రశ్న:
నేను ప్రస్తుతం SGT గా పనిచేస్తున్నాను.రాబోయే DSC లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే,DEO గారి అనుమతి తీసుకోవాలా?
*🍁జవాబు:*
*అవును తప్పనిసరిగా నియామకాధికారి అనుమతి తీసుకోవాలి.*
87.చైల్డ్ కేర్ లీవ్ మంజూరు విషయంలో ఉపాధ్యాయినిల వేతనంలో కోత విధిస్తారా ?
*✅G.O.Ms.No.209 Fin తేది:21-11-2016 ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ సెలవును ముందుగా డి.డి.వో తో మంజూరు చేయించుకున్న తరువాత వాడుకోవాలి.మంజూరు ఉత్తర్వులిచ్చి,ఎస్.ఆర్ నందు నమోదుచేసి ఆ నెల పూర్తి వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాల్సిన బాధ్యత డి.డి.ఓ లకే ఉంటుంది.*
88.స్కూల్ ఇంచార్జ్ బాధ్యతలు హెచ్.ఏం ఎవ్వరికైనా ఇవ్వవచ్చునా ? లేక సీనియారిటీ ప్రకారమే ఇవ్వాలా ?
*✅డి.ఎస్.సి ఉత్తర్వుల సంఖ్య Rc.2409/C3-1/2004 తేది :27.01.2005 ప్రకారం ప్రధానోపాధ్యాయుని అర్హతలు కలిగిన వారిలో సీనియరు ఉపాధ్యాయుడిని మాత్రమే ఇంచార్జ్ గా లేదా ఎఫ్.ఏ.సి.గా నియమించాలి.*
👉89.ఎస్.జి.టి ఉపాధ్యాయుడు 24 సం॥ స్కేలు పొందుటకు డిపార్ట్మెంటల్ పరీక్షల ఉత్తీర్ణత సాధించాలా ?
*✅G.O.Ms.No.38 Fin తేది:15.04.2015 ప్రకారం 24 సం॥ స్కేలు పొందుటకు ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ పరీక్షలు (GOT&EOT) ఉత్తీర్ణత సాధించాలి*
90. వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటే ఎంత సర్వీస్ పూర్తిచేసి ఉండాలి? పూర్తి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయా?
*✅ఏ.పి.రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 లోని రూల్ 43 ప్రకారంగా 20 సం॥ సర్వీసు (అసాధారణ సెలవు కాకుండా) పూర్తిచేసిన వారికి వాలంటరి రిటైర్మెంట్ అర్హత లభిస్తుంది.రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ వర్తిస్తాయి.*
91. ముగ్గురు సంతానం ఉన్న ఉపాధ్యాయిని హిస్టరక్టమి ఆపరేషన్ చేయించుకుంటే 45 రోజుల సెలవుకు అర్హత ఉన్నదా ?
*✅G.O.Ms.No.52 Fin తేది:1.4.2011 లో సంతానం ఇంతే మంది ఉండాలన్న షరతు ఏమీలేదు.అందుచేత సంతానం సంఖ్యతో నిమిత్తం లేకుండా 45 రోజుల సెలవు పొందవచ్చును.*
92.electronic file*
*_భారత దేశంలోని ప్రజలు నెల వారిగా సంపాదించిన (సామానత్వం కోసం : ప్రభుత్వ నిభందనల ప్రకారం ) ఆదాయం - ఖర్చులను ఎప్పటికప్పుడు మదింపు చేయడానికి కొరకు ఉద్దేశించిన file_*
*💧"e-filing"*
*_💧e-filing ను Pan No తో Register చేసుకోవాలి._*
*_ప్రభుత్వ ఉద్యోగులు, ప్రవేటు సంస్ధలు, వ్యక్తులు e-filing ద్వారా తమ ఆదాయ వ్యయాలను ఆదాయపన్ను శాఖ (Income Tax Dept.) కు సులభంగా తెలుపుటకు ఉపాయోగపడే ఒక సాదనం._*
*_💧ఉపాయోగాలు_*
*_తమ వ్యక్తిగత ఖాతా లలో జమ అయ్యె ప్రతి మొత్తానికి Tax చెల్లించనవసరం ఉండదు._*
*_ఉద్యోగులు నెలవారి చెల్లించే Advance Income Tax వలన Quarter లో చెల్లించవలసిని Tax కంటె ఎక్కువ / తక్కువ చెల్లించినవారికి IT Dept. నుండి Notice లు రావు._*
*_Tax ఎక్కువ చెల్లించవసినా రాబోవు తదుపరి Quarters లో చెల్లించవచ్చు._*
*_Tax ఆదనంగా చెల్లించిన వారికి నేరుగా తమ ఖాతాలోకి తిరిగి జమ అవుతుంది._*
*DDO లు తమ ఉద్యోగులు నెలవారిగా* *చెల్లించిన Advance Tax ను ప్రతి Quarter లో TDS update* *చేయించుండాలి.*
*అలా చేయని DDO లకు రోజుకు Rs.200/- అపరాద రుసుము చెల్లించవలసి ఉంటుంది.*
*_💧ఇన్కం ట్యాక్స్ రిటర్న్ ఇ-ఫైలింగ్ చేయడం:_*
*_పన్ను వర్తించే ఆదాయం ఉన్న_* *_వారు జులై 31 లోగా_*
*_ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయవలసి ఉంటుంది_*.
*_ఫిబ్రవరి మాసంలో సమర్పించిన ఫారం 16 ఆధారంగా రిటర్న్ దాఖలు చేయాలి_*.
*_💧దాఖలు చేయవలసిన విధానం:_*
*_వేతనం లేదా పింఛను ద్వారా ఆదాయం పొందుచున్న వారు, పెట్టుబడులపై వడ్డీ ఆదాయం పోన్స్య్ వారూ, ఒకే గృహం ద్వారా ఆదాయం ఉన్న వారు ITR-1(సహజ్) ఫారం ద్వారా రిటర్న్ దాఖలు చేయాలి_.*
*_ఆన్ లైన్ ద్వారా "ఇ- రిటర్న్" ను సులభంగా దాఖలు చేయ వచ్చు. దాఖలు చేసే విధానాన్ని పరిశీలిద్దాం._*
*_💧పేరు రిజిస్టర్ చేసుకొనుట:_*
*_incometaxindiaefiling.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి Register your self అను ఆప్సన్ ను_* *_ఎంచుకొనవలెను. దానిలో పాస్ వర్డ్ తదితర వివరములను పూర్తిచేసిన తదుపరి మెయిల్ కు వచ్చిన లింక్ కాపీ చేసి బ్రౌజర్ లో పేస్ట్ చేసిన తర్వాత మొబైల్ కి వచ్చిన పిన్ నంబర్ ను నమోదు చేస్తే రెజిస్ట్రేషన్ పూర్తి అయినట్లే. మీ పాస్ వర్డ్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి_*.
*_💧ఫారం 26 AS:_*
*_ఇ- ఫైలింగ్ చేసేందుకు ఫారం 26 AS ను పరిశీలించుకోవాలి. పైన తెలిపిన వెబ్సైట్ ఓపెన్ చేసిన తదుపరి 'VIEW FORM 26 AS' ను ఎంచు కోవాలి. దానిలో యూజర్ ID అంటే పాన్ నంబర్, రిజిస్ట్రేషన్ లో మనం ఎంచుకొన్న పాస్ వర్డ్ తదితర అంశాలను నమోదు చేసిన తదుపరి ఫారం 26 AS ను క్లిక్ చేసి ఎసెస్మెంట్ సంవత్సరం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఫారం 26 AS ఓపెన్ అవుతుంది. దానిలో ఆ సంవత్సరం మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు అయినదీ లేనిదీ పరిశీలించుకోవచ్చు. ఫారం లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నప్పుడే ఇ- రిటర్న్ చేయాలి._*
*_💧ఫారం 26 AS లో నమోదుల పరిశీలన:_*
*_ఫారం 26 AS లో మనం పరిశీలన చేసినప్పుడు మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు కానట్లయితే DDO కు తెలియజేయాలి. సక్రమంగా నమోదు కాక పోవడానికి కారణాలు DDO త్రై మాసిక రిటర్న్(Q1, Q2, Q3, Q4) లను సమర్పించక పోవడం లేదా సమర్పించిన వానిలో పొరబాటు జరగడం అయివుండ వచ్చు. త్రైమాసిక రిటర్న్ దాఖలు చేయవలసిన బాధ్యత DDO లదే కాబట్టి వారే దాఖలు చేయడం లేదా తప్పులను సవరించడం చేయవలసి ఉంటుంది_*.
*_💧ఇ- ఫైలింగ్ చేయడం:_*
*_ఫారం 26 AS లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నట్లు సంతృప్తి చెందిన తరువాత ఇ- ఫైలింగ్ చేయడం ప్రారంభించాలి. ముందు చెప్పిన వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత 'Quick e file ITR- 4S' ఎంపిక చేసుకోవాలి._*
*_PAN నంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీతడితర వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి._* _లాగిన్ అయిన వెంటనే ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇష్టం అయితే నమోదు చేయవచ్చు లేదా తదుపరి అని పేర్కొన వచ్చు._
*_అనంతరం పాన్ నంబర్, ITR పేరు(ITR-1) అసెస్ మెంట్ సంవత్సరం సెలెక్ట్ చేసు కోవాలి. తరువాత_* *_ఇవ్వబడిన 3 ఆప్షన్ లు 1) పాన్ ఆధారంగా 2) గతంలో దాఖలు చేసిన రిటర్న్ ఆధారంగా 3) నూతన చిరునామా లలో ఒకటి ఎంపిక చేసుకొని లాగిన్ అవ్వాలి._*
*_తదుపరి వచ్చే ఫారం లో వ్యక్తిగత వివరాలు, ఆదాయం వివరాలు, పన్ను వివరాలు, పన్ను చెల్లింపు వివరాలు, 80 G వివరాలు నమోదు చేయాలి. నమోదులు ఎప్పటి కప్పుడు సేవ్ చేసుకొంటే మంచిది. అన్ని నమోదులు పూర్తి అయిన తరువాత సబ్ మిట్ చేయాలి. 26 AS లో నమోదు అయిన పన్ను, ఇ- ఫైలింగ్ లో పన్ను ఒకే విధంగా ఉండాలి. లేనట్లయితే నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది._*
*💧ఎకనాలెడ్జ్మెంట్:*
*_ITR- 1 సబ్ మిట్ చేసిన తరువాత ఎకనాలెడ్జ్మెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఎకనాలెడ్జ్మెంట్ సీపిసి బెంగుళూరుకు పంప వలసినదీ, లేనిదీ ఎకనాలెడ్జ్మెంట్ క్రింది భాగంలో పేర్కొన బడుతుంది. పంప వలసి వస్తే సంతకం చేసి 3 నెలల లోపు పంపాలి._*
___________________________________
93.ప్రశ్న:
OD తర్వాత CL పెట్టవచ్చా??
*💧జవాబు:*
*మీరు వాడిన OD కి TA&DA ఇస్తే మాత్రం CL పెట్టకూడదు.*
____
94.ప్రశ్న:
మున్సిపల్ టీచర్ల కి కూడా పిల్లల ఫీజు రీ- అ0బర్సుమెంట్ అవకాశం ఉందా??
*💧జవాబు:*
*RC.14311,తేదీ:15.7.13 ప్రకారం అవకాశం ఉంది.*
____
95.ప్రశ్న:
చైల్డ్ కేర్ లీవ్ మూడు సార్లు మాత్రమే వాడుకోవాలా??
*💧జవాబు:*
*బిడ్డల వయస్సు 18 ఇయర్స్ లోపు ఎన్ని పర్యాయాలు ఐనా వాడుకోవచ్చు. ఐతే మొత్తం 60 మాత్రమే వాడుకోవాలి.*
____
96.ప్రశ్న:
GIS పెంచినపుడు SR లో నమోదు చేయించుకోవాలా??
*💧జవాబు:*
*ఏ ఏ పీరియడ్ లో ఎంత మినహాయింపు జరిగిందో తెలియాలి అంటే SR మాత్రమే కీలకం. కాబట్టి SR లో నమోదు చేయించుకోవాలి.*
97.ప్రశ్న:
ఒక మహిళా టీచర్ ప్రసూతి సెలవులో ఉన్నారు.పెరిగిన DA ఆమెకు ఎప్పటినుంచి ఇవ్వాలి??
*🌻జవాబు:*
*మెమో.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ప్రసూతి సెలవు సహా ఏ సెలవు కైనా సెలవుకి ముందు రోజు వేతనం మాత్రమే చెల్లించబడుతుంది.*
_____
98.ప్రశ్న:
ఒక టీచర్ అనారోగ్యంతో 6 నెలల పాటు హాఫ్ పే లీవ్ పెట్టాడు.ఆ కాలానికి ELs ఎలా ఇవ్వాలి.
*🌻జవాబు:*
*Aplr 1933 లోని రూల్ 4 ప్రకారం ELs ను డ్యూటీ పీరియడ్ పై మాత్రమే లెక్కించాలి.ఏ విధమైన ఆకస్మికేతర సెలవు కూడా డ్యూటీ గా పరిగణించబడదు.కనుక 3 ELs జమ చేయకూడదు.*
_____
99.ప్రశ్న:
ఎవరెవరిని బదిలీల కి spouse కేటగిరీ గా పరిగణిస్తారు.
*🌻జవాబు:*
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు,గ్రాంట్ ఇన్ ఎయిడ్,ప్రభుత్వ రంగ సంస్థ ల ఉద్యోగుల ను మాత్రమే spouse కేటగిరీ గా పరిగణిస్తున్నారు.*
_____
100.ప్రశ్న:
ఫిబ్రవరి 29న విధులలో చేరిన టీచర్ కి 6 ఇయర్స్ స్కేల్ ఏ తేదీ నుంచి ఇవ్వాలి?
*🌻జవాబు:*
*మార్చి1 నుండి ఇవ్వాలి.AAS నిబంధనలు ప్రకారం 6 ఇయర్స్ సర్వీసు పూర్తి ఐన మరుసటిరోజు నుంచి స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేయాలి.*
_____
101.ప్రశ్న:
PF గరిష్టంగా ఎంత పెంచవచ్చు. ఎన్ని సార్లు పెంచవచ్చు??
*🌻జవాబు:*
*జీఓ.326 ; ఆర్థిక ; తేదీ:21.12.88 ప్రకారం PF చందా గరిష్టంగా పే+డీఏ కి మించకుండా ఉండాలి. జీఓ.21 ; ఆర్ధిక; తేదీ:24.1.81 ప్రకారం PF ప్రీమియం సంవత్సరం లో రెండు సార్లు పెంచుకోవచ్చు.ఒక్కసారి తగ్గించుకోవచ్చు.*
102.ప్రశ్న:
నేను జులై 14 న ఉద్యోగం లో చేరాను.ఇంక్రిమెంట్ నెల జులై.నేను జూన్ 30 న రిటైర్ అవుతున్నాను.పెన్షన్ ప్రతిపాదనలు ఎలా పంపాలి??
*🌼జవాబు:*
*జీఓ.133 తేదీ:3.5.74 మరియు మెమో.49643 తేదీ:6.10.74 ప్రకారం ఇంక్రిమెంట్ అనేది నెల మొదటి తేదీ అవుతుంది. ఉద్యోగం లో చేరిన తేదీ కాదు.కావున మీకు రిటైర్మెంట్ మరుసటి రోజు ఇంక్రిమెంట్ నోషనల్ గా మంజూరు చేసి పెన్షన్ ప్రతిపాదనలు పంపుకోవాలి.*
____
103.ప్రశ్న:
నేను ఉన్నత చదువుల కోసం 78 రోజులు జీత నష్టపు సెలవు పెట్టాను.ఆ కాలానికి ఇంక్రిమెంట్ వాయిదా వేశారు.వాయిదా పడకుండా ఉండేందుకు ఏమి చెయ్యాలి??
*🌼జవాబు:*
*FR-26 ప్రకారం 6 నెలల వరకు ఇంక్రిమెంట్ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికార0 CSE గారికి మాత్రమే ఉన్నది.కాబట్టి మీరు CSE గారికి దరఖాస్తు చేసుకోగలరు.*
____
104.ప్రశ్న:
డైస్ నాన్ కాలం అంటే ఏమిటి??
*🌼జవాబు:*
*FR.18 మరియు APLR-1933 లోని రూల్ 5 ప్రకారం 5ఇయర్స్ కి మించి గైర్హాజరు అయిన ఉద్యోగి, తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు గా భావించాలి.తిరిగి ఉద్యోగం లో చేరాలి అంటే ప్రభుత్వం యొక్క అనుమతి కంపల్సరీ.*
*FR.18 ప్రకారం డైస్ నాన్ కాలం ఇంక్రిమెంట్లు, సెలవులు, పెన్షన్ తదితర సందర్భాలకు సర్వీసు గా పరిగణించబడదు.కనుక ఈ కాలానికి సెలవు మంజూరు చేయటo,వేతనం చెల్లించటం అనే ప్రశ్నలు ఉత్పన్నం కావు.*
____
105.ప్రశ్న:
అనారోగ్యం కారణాలతో ఉద్యోగం చేయలేకపోతున్నాను.నా తమ్ముడు డిగ్రీ, బీ. ఈ. డి చదివాడు.నా ఉద్యోగం తమ్ముడు కి ఇప్పించవచ్చునా??
*🌼జవాబు:*
*టీచర్ ఉద్యోగం వేరే వారికి నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు.*
*కానీ జీఓ.66 తేదీ:23.10.2008 ప్రకారం నిబంధనలకు లోబడి మీరు అనారోగ్యం కారణంగా శాశ్వతంగా విధులు నిర్వహి0సలేరని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేసన్ కింద రిటైర్మెంట్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ స్థాయి కి మించకుండా కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది.*
____
106.ప్రశ్న:
నేను,నా భార్య ఇద్దరం టీచర్ల0.హెల్త్ కార్డుకి ప్రీమియం నా జీతం ద్వారా చెల్లించుచున్నాను.నా భార్య హెల్త్ కార్డులో వారి తల్లిదండ్రులు పేర్లు చేర్చుకోవచ్చా??
*🌼జవాబు:*
*చేర్చుకోవచ్చు. మహిళా టీచర్లు కూడా ఆధారిత తల్లిదండ్రులు పేర్లు హెల్త్ కార్డులో చేర్చుకోవచ్చు.*
____
107.ప్రశ్న:
EOL కాలాన్ని వాలoటరీ రిటైర్మెంట్ కి పరిగణనలోకి తీసుకుంటారా??
*🌼జవాబు:*
*EOL కాలాన్ని అర్హత గల సెలవు గా లెక్కించరు.*
*కానీ వ్యక్తిగత కారణాల తో eol ఐతే 36 నెలల వరకు, అనారోగ్య కారణాలతో ఐతే ఎంతకాలం ఐనా eol కాలాన్ని పెన్షన్ లెక్కింపు కి అర్హత సెలవుగానే పరిగణిస్తారు.*
____
108.ప్రశ్న:
నేను HM గా పనిచేస్తున్నాను.అనారోగ్య కారణాల చేత SA గా రివర్సన్ తీసుకోవాలని అనుకుంటున్నాను.పరిస్థితి ఏమిటి??
*🌼జవాబు:*
*FR14 ప్రకారం HM పోస్టులో లీన్ స్థిరీకరణ జరిగే వరకు SA పోస్టులో మీ లీన్ కొనసాగుతుంది.కనుక మీరు రివర్శన్ తీసుకోవచ్చు.ఐతే పదోన్నతి ద్వారా వచ్చిన 2 ఇంక్రిమెంట్లు రద్దు అవుతాయి.SA క్యాడర్ లో తదుపరి AAS కి అర్హత ఉండదు.*
____
109.ప్రశ్న:
నాకు వినికిడి లోపం 70 శాతం ఉన్నట్లు మెడికల్ సర్టిఫికేట్ కలదు. కాని ఎలవెన్స్ పొందటానికి సరైన వివరములు లేవు. నేను అలవెన్స్ పొందటానికి అర్హుడునా..???
*🌼జవాబు:*
*మీరు కన్వీయన్స్ ఎలవెన్స్ కు అర్హులు. సంబంధిత ఉత్తర్వులు DDO ఇస్తే సరిపోతుంది.GO MS:197, Dt:6-7-2006. సివిల్ సర్జన్ ర్యాంక్ తగ్గని తత్సంబంధిత వైద్యుడు ఈ ధృవపత్రం జారీ చేయాలి. ఈ సర్టిఫికేట్ జారీ చేసిన తేదీ నుండి వర్తించును. CL తప్పించి మరి ఏ సెలవులలోనూ ఈ ఎలవెన్స్ ఇవ్వబడదు. సస్పెన్సన్ కాలంలో కూడా ఇవ్వబడదు.*
*GO MS No:262, Dt:25-8-1980*
110.ప్రశ్న:
ఏ నెలలో ఆర్జిత సెలవు ను నగదుగా మార్చుకోవాలి??
*🌷జవాబు:*
*మెమో.1478 ; ఆర్ధిక ; తేదీ:22.6.11 ప్రకారం 12 నెలల వ్యవధిలో 15 రోజులు,24 నెలల కాల వ్యవధి లో 30 రోజులు ఏ నెలలో నైనా ఆర్జిత సెలవు ను నగదుగా మార్చుకోవచ్చు.*
____
111.ప్రశ్న:
వేసవి సెలవుల్లో ముందు రోజు బడికి వెళ్ళాను. సెలవులు అనంతరం ప్రారంభం రోజు బడికి వెళ్లలేకపోతే ఏ విధమైన సెలవు పెట్టుకోవచ్చు??
*🌷జవాబు:*
*Ldis. no.1933 , తేదీ:30.3.84 ప్రకారం అర్ధజీతపు,కమ్యూటెడ్,సంపాధిత, జీతనష్టం సెలవులను మాత్రమే వాడుకోవాలి.*
____
112.ప్రశ్న:
ఒక టీచర్ సర్వీసు మొత్తం మీద ఎన్ని రోజులు కమ్యూటెడ్ సెలవు వాడుకోవాలి??
*🌷జవాబు:*
*జీఓ.186 ; ఆర్ధిక ; తేదీ:23.7.75 ప్రకారం సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవు గా వాడుకోవచ్చు.*
____
113.ప్రశ్న:
ఒక టీచర్ ఏదైనా పరీక్ష రాయాలంటే పై అధికారి అనుమతి తీసుకోవాలా??
*🌷జవాబు:*
*సర్వీసు లో ఉండి ఏ పరీక్ష రాయాలన్నా పై అధికారి అనుమతి తప్పకుండా తీసుకోవాలి.*
____
114.ప్రశ్న:
ఒక sgt వేరే dsc లో sa గా ఎంపిక ఐతే వేతన రక్షణ ఉంటుందా?అదే ఇంక్రిమెంట్ తేదీ కొనసాగుతుందా??
*🌷జవాబు:*
*మీరు పై అధికారి అనుమతి తో relieve ఐతే FR.22(a) ప్రకారం రక్షణ ఉంటుంది. ఇంక్రిమెంట్ కి మాత్రం రక్షణ ఉండదు.sa గా చేరిన సంవత్సరం నకు మాత్రమే ఇంక్రిమెంట్ ఇస్తారు.*
115.ప్రశ్న:
నేను త్వరలో రిటైర్మెంట్ కాబోతున్నాను.పెన్షన్ బెనిఫిట్ లు ఐటీ లో చూపాలా??
*🍁జవాబు:*
*పెన్షన్ ను ఆదాయం గా చూపాలి.గ్రాట్యుటీ, కమ్యుటేషన్,సంపాధిత సెలవు నగదుగా మార్చుకోనుట ఆదాయం పరిధిలోకి రావు.*
____
116.ప్రశ్న:
నేను బదిలీ అయ్యాను.పాత మండలం లో చాలా ఎంట్రీ లు వేయలేదు.ఇంతలో పాత MEO రిటైర్మెంట్ అయ్యాడు.ఆ ఎంట్రీ ల కోసం నేను ఇప్పుడు ఏమి చేయాలి??
*🍁జవాబు:*
*సంబంధిత ఆధారాలతో ప్రస్తుత MEO సరిచేయవచ్చు.*
_____
117.ప్రశ్న:
నేను DEO గారి అనుమతి తో లీన్ పై ఇతర రాష్ట్రంలో ఉద్యోగం నకు ఎంపిక అయ్యాను.నేను ఆ ఉద్యోగం లో ఇమడ లేకపోతే తిరిగి నా సొంత పోస్టుకి రావచ్చునా??
*🍁జవాబు:*
*జీఓ.127 తేదీ:8.5.12 ప్రకారం కొత్త పోస్టులో ప్రొబేసన్ డిక్లరేషన్ ఐన తేదీ, లేదా పోబేషన్ డిక్లరేషన్ అయినట్లు భావించబడే తేదీ లేదా నూతన పోస్టు లో చేరిన తేదీ నుంచి 3 ఇయర్స్ లో ఏది ముందు ఐతే ఆ తేదీ వరకు పాత పోస్టుపై లీన్ కొనసాగుతుంది.అప్పటిలోగా మీరు పాత పోస్టుకి వచ్చే అవకాశం ఉంటుంది.*
____
118.ప్రశ్న:
బోన్ టీబీ కి ప్రత్యేక సెలవు ఉన్నదా??
*🍁జవాబు:*
*6 నెలల వరకు పూర్తి జీతంపై అర్ధ జీతపు సెలవు మంజూరు చేస్తారు.*
____
119.ప్రశ్న:
నేను జీత నష్టపు సెలవు పెట్టి M. ed చేయాలని అనుకుంటున్నాను.నేను ఏమి నష్ట పోతాను??
*🍁జవాబు:*
*జీత నష్టపు సెలవు పెట్టినంతకాలం ఇంక్రిమెంట్,AAS స్కేల్స్ వాయిదా పడతాయి.3 ఇయర్స్ పైన జీత నష్టపు సెలవు కాలం పెన్షన్ కి అర్హ దాయక సర్వీస్ గా పరిగణింపబడదు.*
120.ప్రశ్న:
నేను జూన్ 30 న రిటైర్మెంట్ అవుతున్నాను.నేను ఎన్ని సెలవులు వాడుకోవచ్చు??
*🌸జవాబు:*
*మొత్తం 22 CLs వాడుకోవచ్చు.*
____
121.ప్రశ్న:
నేను ,నా భర్త టీచర్ల0.నా భర్త మరణించిన పిదప నాకు కుటుంబ పెన్షన్ ఇస్తున్నారు.దీనికి DA ఇవ్వరా??
*🌸జవాబు:*
*జీఓ.51, తేదీ:30.4.15 ప్రకారం కారుణ్య నియామకం పొందిన వారికి మాత్రమే DA ఇవ్వరు.మీకు కుటుంబ పెన్షన్ పై DA చెల్లిస్తారు.*
____
122.ప్రశ్న:
నేను డ్రాయింగ్ టీచర్ ని.PAT పాస్ అయ్యాను.B. Com పాస్ అయ్యాను.B. ed లేదు.నాకు 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరా??
*🌸జవాబు:*
*24 ఇయర్స్ స్కేల్ పొందాలి అంటే డిగ్రీ&బీ.ఎడ్ ఉండాలి.*
____
123.ప్రశ్న:
నేను రెండు నెలలు FAC HM గా పనిచేశాను.అలవెన్సు ఇచ్చారు.పెరిగిన DA తేడా ఇవ్వరా??
*🌸జవాబు:*
*FAC కాలానికి,సరెండర్ లీవు కాలానికి DA తేడా పొందవచ్చు.*
____
124.ప్రశ్న:
ఒక టీచర్ సస్పెండ్ అయ్యాడు.ఇంక్రిమెంట్ ఆపారు.అతనికి 12 ఇయర్స్ స్కేల్ ఇచ్చేటప్పుడు ఈ కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చా??
*🌸జవాబు:*
*మెమో.41082, తేదీ:30.12.96 ప్రకారం ఇంక్రిమెంట్ నిలుపుదల కాలాన్ని కూడా AAS కి పరిగణలోకి తీసుకోవాలి.*
125 ప్రశ్న:
నేను శనివారం, సోమవారం సెలవు పెట్టాలి.రెండు CL లెటర్లు ఇవ్వాలా??
*🌻జవాబు:*
*అవసరం లేదు. ఒక లెటర్ పై రాసి ఆదివారం అనుమతి అని రాయండి సరిపోతుంది.*
____
126.ప్రశ్న:
APGLI నుండి పొందిన ఋణానికి వడ్డీ చెల్లించాలా??
*🌻జవాబు:*
*ఋణం మంజూరు చేసే సమయంలోనే వడ్డీ కూడా అంచనా వేసి సమాన నెలసరి వాయిదాలు నిర్ణయిస్తారు.*
____
127.ప్రశ్న:
నేను 13.6.16 న విధులలో చేరాను.ట్రైనింగ్ లేదు.కానీ జీతం 1.6.16 నుండి ఇచ్చారు.ఇపుడు జాయినింగ్ తేదీ గా ఏది SR లో రాయాలి??
*🌻జవాబు:*
*జీతం 1.6.16 నుండి ఇచ్చారు కాబట్టి మీ date of జాయినింగ్ కూడా 1.6.16 రే అవుతుంది.*
____
128.ప్రశ్న:
నేను cps ఉద్యోగిని.సేవింగ్స్ 1,20,000/- ఉన్నాయి. Cps మినహాయింపు 53,000/- ఉన్నాయి. వీటిని ఐటీ ఫారం లో ఎలా చూపాలి??
*🌻జవాబు:*
*30,000/- వరకు 80ccd(1) కింద, మిగిలిన 23,000/- ను 80ccd(1బి)కింద చూయించి పన్ను మినహాయింపు పొందవచ్చు.*
____
129.ప్రశ్న:
ఈ సంవత్సరం రెండు da లు కలపటం వల్ల నా ఆదాయం 5 లక్షలు దాటింది.20% పన్ను పరిధిలోకి వెళ్ళాను. ఆ రెండు da లు గత సంవత్సరం ఆదాయంలో చూయించుకోవచ్చా??
*🌻జవాబు:*
*చూపించుకోవచ్చు.గత సంవత్సరం నకు చెందిన బకాయిలను ఆయా సంవత్సరం లలో చూపి పన్ను మినహాయింపు పొందవచ్చు. అందుకోసం ఫారం 10-E సమర్పించాలి.*
__________________________
130.ప్రశ్న:
నేను ఎయిడెడ్ స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ గా ఉన్నాను.నేను HM అకౌంట్ టెస్ట్ పాస్ కాలేదు.నేను 6,12,18 ఇయర్స్ స్కేల్స్ పొందాను.నాకు 24 ఇయర్స్ స్కేల్ కి అర్హత ఉన్నదా??
*🌼జవాబు:*
*ఉన్నది. నేరుగా స్కూల్ అసిస్టెంట్ గా నియమించబడినందున మీరు 24 ఇయర్స్ స్కేల్ పొందాలంటే రెండవ ప్రమోషన్ పోస్ట్ లేనందువలన మీకు అర్హత లతో సంబంధం లేకుండా 24 ఇయర్స్ పూర్తి కాగానే స్కేల్ మంజూరు చేయబడుతుంది.*
____
131.ప్రశ్న:
నేను LFL HM గా పనిచేయుచున్నాను.6 ఇయర్స్ స్కేల్ తీసుకున్నాను.12 ఇయర్స్ స్కేల్ పొందటానికి ఏ ఏ అర్హతలు కావాలి.నాకు ప్రస్తుతం 50 ఇయర్స్ నిండినవి.
*🌼జవాబు:*
*మీరు 12 ఇయర్స్ స్కేల్ తీసుకోవాలి అంటే డిగ్రీ,బి.ఎడ్ లతో పాటు డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయి ఉండాలి.మెమో.34408 తేదీ:4.2.12 ప్రకారం 50 ఇయర్స్ మినహాయింపు వర్తించదు.*
____
132.ప్రశ్న:
నేను హైస్కూల్ లో పనిచేస్తున్నాను.పరీక్షల నిమిత్తం దాదాపు 35 రోజులు వేసవి సెలవుల్లో బడికి వచ్చాను.నాకు ఎన్ని ELs ఇస్తారు??
*🌼జవాబు:*
*మీరు 15 రోజుల కన్నా తక్కువ గా వేసవి సెలవులు వినియోగించుకున్నందున FR.82(డి) ప్రకారం 24 రోజులు సంపాదిత సెలవులు ఇవ్వాలి.*
____
133.ప్రశ్న:
నేను రక్త దానం చేశాను. spl. CL ఎవరు ఇస్తారు??
*🌼జవాబు:*
*జీఓ.137 తేదీ:23.2.84 ప్రకారం రక్త దానం చేస్తే CL మంజూరు చేసే అధికారే spl. Cl కూడా మంజూరు చేస్తారు.*
__________________________
134.ప్రశ్న:
నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను.ఐతే ఏమి చెయ్యాలి??
*🌺జవాబు:*
*జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేఇ0చి,DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేఇ0చాలి.స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేఇ0చాలి.*
____
135.ప్రశ్న:
నేను PF నుండి ఋణం పొందియున్నాను.
వాయిదాలు పూర్తి కాలేదు.మరలా ఋణం కావాలి.ఇస్తారా??
*🌺జవాబు:*
*ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి,కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.*
____
136.ప్రశ్న:
ఒక డీజేబుల్డ్ ఉపాధ్యాయునికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి??
*🌺జవాబు:*
*జీఓ.1063 తేదీ:2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.*
____
137.ప్రశ్న:
ఒక టీచర్ ఫిబ్రవరి 29న జాబ్ లో చేరాడు.అతనికి వార్షిక ఇంక్రిమెంట్ ఏ నెలలో ఇవ్వాలి??
*🌺జవాబు:*
*ఆర్.సి.2071 తేదీ:21.7.2010 ప్రకారం లీపు సంవత్సరం ఫిబ్రవరి 29న విధుల్లో చేరిన ఉపాధ్యాయుల వార్షిక ఇంక్రిమెంట్ ఫిబ్రవరి నెల లోనే ఇవ్వాలి.*
____
138.ప్రశ్న:
బిడ్డ పుట్టి వెంటనే మరణించిన, వారికి మెటర్నిటీ లీవు కి అర్హత ఉందా??
*🌺జవాబు:*
*Lds.1941 తేదీ:11.6.90 ప్రకారం మరణించిన బిడ్డను ప్రసవించినా,ప్రసూతి సెలవు వాడుకోవచ్చు.*
_______________________________
139.ప్రశ్న:
ఒక టీచర్ వైద్య కారణం లపై 3 సార్లు జీత నష్టపు సెలవు పెట్టాడు.అతని వార్షిక ఇంక్రిమెంట్ వాయిదా పడుతుందా??
*🌼జవాబు:*
*పడుతుంది. ఐతే CSE గారు అనుమతి మంజూరు చేస్తే,నార్మల్ ఇంక్రిమెంట్ కొనసాగే అవకాశం ఉంది.*
____
140.ప్రశ్న:
ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే,కారుణ్య నియామకం కింద వారుసునికి ఉద్యోగం ఇస్తారా??
*🌼జవాబు:*
*మెమో.41758 , తేదీ:19.7.2007 ప్రకారం ఉద్యోగం ఇస్తారు.*
____
141.ప్రశ్న:
CPS ఉద్యోగులు తమ ఖాతాలోని జమలు ఎన్ని సార్లు విత్ డ్రాల్ చేసుకోవచ్చు??
*🌼జవాబు:*
*మూడు సందర్భం లలో విత్ డ్రాయల్ చేసుకోవచ్చు. ఉద్యోగి పదవీ విరమణ సందర్భంలో,మరణించిన సందర్భంలో,పదవీ విరమణ కి ముందే పథకం నుంచి నిష్క్రమించే సందర్భంలో*
____
142.ప్రశ్న:
ఒక టీచర్ 2015 లో 7 నెలల పాటు సస్పెండ్ అయ్యాడు.పోస్టింగ్ ఆర్డర్ లో రెండు ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తున్నట్లు ఇచ్చారు.అతనికి ఎప్పుడు ఇంక్రిమెంట్లు ఇస్తారు??
*🌼జవాబు:*
*అతనికి 2015,2016 లలో రావాల్సిన ఇంక్రిమెంట్లు నిలుపుదల చేసి,2017 లో ముందు రెండు ఇంక్రిమెంట్లు కూడా కలిపి మంజూరు చేస్తారు.*
___________________________
143.ప్రశ్న:
సీనియర్ స్టెప్ అప్ తీసుకున్న తర్వాత జూనియర్ SPP-1A స్కేల్ తీసుకోవటం వల్ల సీనియర్ కంటే ఎక్కువ వేతనం పొందుతున్నాడు.ఇపుడు సీనియర్ మరల స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నదా??
*🌹జవాబు:*
*వీలు లేదు. స్టెప్ అప్ నిబంధనలు ప్రకారం సీనియర్ ఒకసారి మాత్రమే స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నది.*
____
144.ప్రశ్న:
నేను ZPHS లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.స్కూల్ అసిస్టెంట్ కి ఉండవలసిన అర్హతలు అన్నీ కలిగి ఉన్నాను.నాకు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి ఇస్తారా??
*🌹జవాబు:*
*అవకాశం లేదు.*
____
145.ప్రశ్న:
నా భార్య CPS ఉద్యోగి.ఆమె మరణించారు.ఇపుడు నేను ఏమి చేయాలి??
*🌹జవాబు:*
*CPS లో ఉన్న డబ్బులు కోసం 103--జీడీ ఫారం పూర్తి చేయాలి.సంబంధిత పత్రాలు జతపరచి DDO ద్వారా ట్రెజరీకి పంపాలి.వీరు వాటిని PRA ముంబై కి పంపాలి.వారు పరిశీలించి,మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.*
____
146.ప్రశ్న:
వేసవి సెలవుల్లో పాఠశాల విధులు నిర్వహి0చటానికి జూనియర్ అసిస్టెంట్ లేకపోతే ఎవరిని నియమించాలి??
*🌹జవాబు:*
*ఆ స్కూల్లో సీనియర్ ఉపాధ్యాయునికి ముందు అవకాశం ఇవ్వాలి.*
____
147.ప్రశ్న:
నేను జీత నష్టపు సెలవు పెట్టాను.EHS ప్రీమియం చెల్లించలేదు.ఇపుడు నేను ఏమి చేయాలి??
*🌹జవాబు:*
*చలానా ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు.*
____
148.ప్రశ్న:
నేను,మరొక టీచర్ ఇద్దరం ఒకే సారి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాము.HM పదోన్నతికి మా ఇద్దరిలో ఎవరు సీనియర్??
*🌹జవాబు:*
*Rc. No.142 తేదీ:11.8.2011 ప్రకారం SGTలో సీనియర్ ఐన ఉపాధ్యాయుడు ఎస్ఏ లో సీనియర్ అవుతాడు.వారికే ముందు HM పదోన్నతి వస్తుంది.*
149. ప్రశ్న:
ప్రసూతి సెలవును ఏదైనా సెలవు తో కలిపి వాడుకోవచ్చునా??
*🍁జవాబు:*
*FR.101(ఎ)ప్రకారం మెడికల్ సెర్టిఫికెట్ జతపరచి అర్హత గల సెలవును ప్రసూతి సెలవుతో కలిపి వాడుకోవచ్చు.*
౼౼౼౼
150.. ప్రశ్న:
పిల్లల ఫీజు రీ- అ0బర్సుమెంట్ పెంచిన ఉత్తర్వులు వెలువడ్డాయా??
*🍁జవాబు:*
*మెమో.7215 తేదీ:2.5.12 ప్రకారం 4వ తరగతి మరియు నాన్-గజిటెడ్ ఉద్యోగులు అందరికీ ఈ సౌకర్యం వర్తిస్తుంది.2015 prc లో దీనిని 2500రూ కి పెంచారు.కానీ ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు.ప్రస్తుతం ఒక్కో పిల్లవాడికి 1000రూ మాత్రమే ఇస్తారు. ఇద్దరు పిల్లలకి మాత్రమే వర్తిస్తుంది.*
౼౼౼౼
151. ప్రశ్న:
OH, ఆదివారం లను కూడా suffix, prefix గా వాడుకోవచ్చా??
*🍁జవాబు:*
*మెమో.86595 తేదీ:29.5.61 ప్రకారం ఐచ్చిక సెలవు దినాలు,పరిహార సెలవు దినాలను suffix లేదా preffix గా వాడుకోవచ్చు.*
౼౼౼౼
152.ప్రశ్న:
APGLI ప్రీమియం అదనంగా చెల్లించాలంటే వైద్య ధ్రువ పత్రం సమర్పించాలా??
*🍁జవాబు:*
*జీఓ.26 తేదీ:22.2.95 ప్రకారం చెల్లించవలసిన ప్రీమియం కన్నా అదనంగా చెల్లించుటకు ప్రతిపాదనలు సమర్పించేవారు గుడ్ హెల్త్ సెర్టిఫికెట్ ఇవ్వవలసి ఉంటుంది.*
౼౼౼౼
153.ప్రశ్న:
మెడికల్ రీ-అ0బర్సుమెంట్ బిల్లులు ఎప్పట్లోగా dse కి పంపాలి??
*🍁జవాబు:*
*హాస్పిటల్ నుండి డిశ్చార్జి ఐన తర్వాత 6 నెలలు లోగా ప్రతిపాదనలు dse కి పంపుకోవాలి.*
154. ) అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారు సీనియారిటీ కోల్పోవటం అనేది పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందా?హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే క్రమము, రేషనలైజేషన్ వంటి ఇతర సంధర్భాలలో కూడా వర్తిస్తుందా?*
💐
*B) ఒక ఉపాధ్యాయిని 1998 లో వేరే జిల్లాలో నియామకమై అంతర్ జిల్లా బదిలీపై తేది:23-4-2013న రంగారెడ్డి జిల్లాలో ఒక పాఠశాలకు చేరారు.2000 సం!!లో ఇదే జిల్లాలో నియామకమైన మరో ఉపాధ్యాయిని తేది:20-5-2013 న ఆ పాఠశాలకు బదిలీపై వచ్చారు.వీరిలో ఎవరు సీనియరు?*
💎సమాధానం:ఏ.పి.స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూల్ 35(b) ప్రకారం అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారి సీనియారిటీ మీ జిల్లాలో చేరిన తేది నుండి మాత్రమే లెక్కించబడుతుంది. సీనియారిటీ అనేది అన్ని సంధర్భాలలోనూ (పదోన్నతులు మొదలుకుని హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే వరకు) ఒకే విధంగా ఉంటుంది.2000సం!!లో రంగారెడ్డి జిల్లాలోనే నియామకమైన ఉపాధ్యాయిని సీనియరుగా పరిగణించబడతారు.
************
155.) సందేహం:
*ఒక SGT ఉపాధ్యాయుడు 18 సం!! స్కేలు,24 సం!! స్కేలు కోసం ఏయే Dept.Exams ఉత్తీర్ణత పొందాలి.అదే విధంగా SA తన 12సం!! స్కేలు కోసం ఏఏ Dept.Tests పాస్ కావాలి, మినహాయింపులు ఏమైనా వున్నాయా?*
సమాధానం:
ఏ క్యాడర్ లో నైనా 18 సం!! స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం ఎటువంటి అదనపు అర్హతలు అవసరంలేదు.12సం!! స్కేలు పొందివుంటే యాంత్రికంగా 18సం!! ఇంక్రిమెంట్ కు అర్హత ఉంటుంది.
👉SGT లు 24సం!! స్కేలు కోసం గ్రాడ్యుయేషన్ + B.Ed + GOT,EOT పరీక్షలు పాస్ కావాలి.
👉SA లకు తమ 12సం!! స్కేలు కోసం GO,EO పరీక్షలు ఉత్తీర్ణత పొందివుండాలి. అయితే Direct Recruitment SA లకు మాత్రం 45సం!! వయస్సు దాటిన వారికి పై Dept.Test పరీక్షల నుండి మినహాయింపు కలదు.
💥పై మినహాయింపులు అప్రయత్న పదోన్నతి పధకం(AAS) కు వర్తించవు.
156.) సందేహం:
*ఒక ఉపాధ్యాయుడు ప్రమోషన్ ఎన్నిసార్లు తిరస్కరించడానికి అవకాశం ఉంది?*
సమాధానం:
వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా రాత పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు. అయితే ప్రభుత్వ cir.Memo.No.10445/ ser-D/2011,GAD తేది:1-6-2011 ప్రకారం ఒక్కసారి మాత్రం ప్రమోషన్ ఆర్డర్ తీసుకుని (లేదా)తీసుకోకుండా ప్రమోషన్ పొస్ట్ లో చేరకుండా చేయవచ్చును. అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తరువాత ఇక చేర్చరు.
(G.O.Ms.No.145 GAD,Dt:15-6-2004)
157.) సందేహం:
*దాదాపు 6సం!! కాలం SGT గా పనిచేసి ప్రభుత్వంలోని వేరే శాఖకు ఎంపికై అక్కడ కూడా 2సం!! పనిచేసి తిరిగి పాత పోస్టులో చేరిన ఉపాధ్యాయుని 2సం!! సర్వీసును ఏ విధంగా లెక్కిస్తారు? ఇంక్రిమెంట్ ను AAS కి లెక్కిస్తారా?*
సమాధానం:
FR-26(i) ప్రకారం ప్రస్తుత పోస్టుపై 'Lien' కలిగియున్న ఉపాధ్యాయుడు,ప్రస్తుత పోస్టుకంటే తక్కువగాగాని పోస్టులో పనిచేసిన సర్వీసును ఇంక్రిమెంట్ కు లేక్కిన్చవచును. G.O.Ms.No.117,F&P, Dt:20-5-1981 ప్రకారం ఇంక్రిమెంట్ కు పరిగణింపబడే సర్వీసు అంతా AAS కు కూడా లెక్కించబడుతుంది. కాబట్టి సదరు 2సం!! ఇతర పోస్టు సర్వీసు AAS నకు కూడా లెక్కించబడుతుంది.
********
158.) : సందేహం:
*ఒక ఉపాధ్యాయుడు డిసెంబర్ 15 నుండి 19 వరకు వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు వినియోగించుకుంటున్నాడు. అయితే 13,14వ తేదీలు రెండవ శనివారం,ఆదివారం ఉన్నాయి. అవి కూడా కమ్యూటెడ్ సెలవుగా పరిగణించాలా?*
సమాధానం:
ఆర్ధిక శాఖ Memo.No.86595/1210/FR-1/7 తేది:29-5-1981 మరియు FR-68 ప్రకారం ఏ రకమైన ఆకస్మికేతర సేలవుకైనా ముందు లేదా వెనుక వున్న ప్రభుత్వ సెలవు దినాలు ప్రీఫిక్స్/సఫిక్స్ చేసి వినియోగించుకోవడానికి అనుమతించబడతాయి. అయితే G.O.Ms.No.319 F&P తేది:18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై వినియోగించుకున్న సెలవుకు ముందు,వెనుక ఉన్నప్రభుత్వ సెలవులను మినహాయించి పనిదినాల కాలానికి మాత్రమే వైద్య ధ్రువపత్రాలు A,B లు వుండాలి.
159.) సందేహం
*మెడికల్ సెలవుకోసం డాక్టరు సర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సర్టిఫికెట్ వేరేవేరే డాక్టర్ల నుండి సమర్పించవచ్చునా?వైద్య కారణాలపై తీసుకున్న EOL ఇంక్రిమెంట్ కోసం లెక్కించబడుతుందా?*
సమాధానం:
రెండు సర్టిఫికెట్లు ఒకే డాక్టర్ ఇవ్వాలని ఏ ఉత్తర్వులోనూ లేదు.ఇద్దరూ క్వాలిఫైడ్ వైద్యులైనంత వరకు ఎట్టి అభ్యంతరము ఉండదు. సాధారణంగా EOL వాడుకుంటే ఇంక్రిమెంట్ అన్ని రోజులు వాయిదా పడుతుంది.అయితే ప్రభుత్వం G.O.Ms.No.43 తేది:5-2-1976 ద్వారా వైద్య కారణాలపై 6 నెలల కాలం వరకు EOL ను ఇంక్రిమెంటుకు పరిగణించే అధికారం శాఖాధిపతులకు (ఉపాధ్యాయుల విషయంలో పాఠశాల విద్యా సంచాలకులకు) ఇవ్వడం జరిగింది.
160.): సందేహం:
*ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా?*
సమాధానం:
అవును G.O.Ms.No.802 M&H Dated:21-4-1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి
161): సందేహం :
*ఒక ఉపాధ్యాయుడు SA క్యాడర్ లో 12 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసాడు. అయితే Departmental Test E.O.T/G.O T పరీక్షలు పాస్ కాలేదు.తదుపరి పాస్ అయితే 12 సంవత్సరాల స్కేల్ ఎప్పటినుండి ఇస్తారు?*
సమాధానం :
-F.R-26(a) క్రింద గల రూలింగ్ 2 ప్రకారం చివరి పరీక్ష మరుసటి తేది నుండి 12 సంవత్సరాల స్కేలు మరియు ఆర్ధిక లాభం ఇవ్వాలి.
162. సందేహం :
*పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలలో Spl.Language Tests Telugu,Hindi,Urdu ఎవరు రాయాలి?*
సమాధానం :
ఇంటర్మీడియేట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవనివారు Spl.language Test in Telugu(P.code-37) రాయాల్సి ఉంటుంది.
10వ తరగతి ఆ పై స్థాయిలో హింది/ఉర్దూ ఒక భాషగా చదవని వారు Spl.language Test in Hindi/Urdu రాయాల్సి ఉంటుంది.
163.): సందేహం_:
*సరెండర్ లీవ్ ను నెలలో ఎన్ని రోజులకు లెక్కగడతారు? 11 రోజుల సంపాదిత సెలవులున్నను లీవ్ సరెండర్ చేసుకోవచ్చునా?*
సమాధానం:
G.O.Ms.No.306 Fin Dept Dt:8-11-1974ప్రకారం సదరు నెలలో 28/29/30/31 ఎన్ని రోజులున్నను,రోజులతో నిమిత్తం లేకుండా 30 రోజులకు మాత్రమే లీవ్ సరెండర్ లెక్కగట్టి నగదు చెల్లిస్తారు.
G.O.Ms.No.334 F&P,Dt:28-9-1977 లో ఇలా వుంది Leave may be surrendered at any time not exceeding 15/30 days...అని వున్నది.అందుచేత 11రోజులు సరెండర్ చేసుకుని నగదు పొందవచ్చు.
164: సందేహం:
*నేను ప్రస్తుతం SGT గా పనిచేస్తున్నాను.రాబోయే DSC లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే,DEO గారి అనుమతి తీసుకోవాలా?*
సమాధానం:
అవును తప్పనిసరిగా నియామకాధికారి అనుమతి తీసుకోవాలి.
165.ప్రశ్న:
నేను SA గా పనిచేస్తున్నాను.నేను లెక్చరర్ పోస్టుకి ప్రిపేర్ అవుతున్నాను.ఒక వేళ నాకు వస్తే, పాత పెన్షన్ విధానం వస్తుందా??
*🍁జవాబు:*
*ఏపీ revised పెన్షన్ రూల్స్ ప్రకారం మీకు పాత సర్వీసు కౌంట్ అవుతుంది. ఐతే మీరు deo అనుమతి తో పరీక్ష రాసి ఉండాలి.కొత్త జాబ్ లో కూడా deo అనుమతి తో చేరాలి.*
____
166..ప్రశ్న:
2014 dsc ద్వారా సెలెక్ట్ ఐన వారు ప్రాన్ నెంబర్ కోసం ఏ ఫారం లో దరఖాస్తు చేయాలి?
*🍁జవాబు:*
*Csrf-1,ఎస్-5,ఎస్-6 ఫారం లను www.nsdl. co. in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, వాటిని పూర్తి చేసి sto ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.*
____
167..ప్రశ్న:
నేను sgt గా పనిచేస్తున్నాను.ma(ఇంగ్లీషు), ma(ఎడ్యుకేషన్) చేశాను. నాకు SA ఇంగ్లీషు పదోన్నతి ఇస్తారా??
*🍁జవాబు:*
*జీఓ.66 తేదీ:4.7.09 ప్రకారం 1981--2009 మధ్య ఆంధ్రా యూనివర్సిటీ నుండి పొందిన ఎంఏ(ఎడ్యుకేషన్) డిగ్రీని బి. ఎడ్ కి సమానంగా పరిగణించి పదోన్నతి కి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.అందువల్ల మీకు sa ఇంగ్లీషు పదోన్నతి కి అవకాశం ఉంది.*
____
168...ప్రశ్న:
ఒక టీచర్ ఇప్పటి వరకు 200 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకున్నాడు.ఇంకా ఎన్ని వాడుకోవచ్చు?? ఇంకా సెలవులు అవసరం ఐతే ఎలా చేయాలి??
*🍁జవాబు:*
*ఒక టీచర్ సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవు గా వాడుకోవచ్చు. అపుడు అర్ధ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి.ఇంకా సెలవు అవసరం ఐతే అర్ధ జీతపు సెలవుగా మాత్రమే వాడుకోవాలి.ఐతే ఖాతాలో ఉండి ఉండాలి.*
_____
169.ప్రశ్న:
సంక్రాంతి సెలవులు 10 రోజులు ఇచ్చారు.ముందు రోజు CL పెడితే ఏమి జరుగుతుంది??
*🍁జవాబు:*
*సంక్రాంతి సెలవులు 10 రోజులు ఇచ్చారు.మీరు cl పెడితే మొత్తం రోజులు 11 అవుతాయి.అందువల్ల మొత్తం సెలవులు 11 రోజులకి అర్హత గల సెలవును(el/hpl/mcl/eol...) పెట్టుకోవలసి ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు cl పెట్టకూడదు.*
*170.సందేహం*
*ఒక ఉపాధ్యాయుడు ప్రమోషన్ ఎన్నిసార్లు తిరస్కరించడానికి అవకాశం ఉంది?*
*🌸సమాధానం*
*వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా రాత పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు. అయితే ప్రభుత్వ cir.Memo.No.10445/ ser-D/2011,GAD తేది:1-6-2011 ప్రకారం ఒక్కసారి మాత్రం ప్రమోషన్ ఆర్డర్ తీసుకుని* *(లేదా)తీసుకోకుండా ప్రమోషన్ పొస్ట్ లో చేరకుండా చేయవచ్చును. అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తరువాత ఇక చేర్చరు*
*(G.O.Ms.No.145 GAD,Dt:15-6-2004)*
---
*171.సందేహం*
*ఒక ఉపాధ్యాయిని 1998 లో వేరే జిల్లాలో నియామకమై అంతర్ జిల్లా బదిలీపై తేది:23-4-2013న రంగారెడ్డి జిల్లాలో ఒక పాఠశాలకు చేరారు.2000 సం.లో ఇదే జిల్లాలో నియామకమైన మరో ఉపాధ్యాయిని తేది:20-5-2013 న ఆ పాఠశాలకు బదిలీపై వచ్చారు.వీరిలో ఎవరు సీనియరు?*
*🌸సమాధానం:*
*ఏ.పి.స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూల్ 35(b) ప్రకారం అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారి సీనియారిటీ మీ జిల్లాలో చేరిన తేది నుండి మాత్రమే లెక్కించబడుతుంది. సీనియారిటీ అనేది అన్ని సంధర్భాలలోనూ (పదోన్నతులు మొదలుకుని హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే వరకు) ఒకే విధంగా ఉంటుంది.2000సం.లో రంగారెడ్డి జిల్లాలోనే నియామకమైన ఉపాధ్యాయిని సీనియరుగా పరిగణించబడతారు*
*172..సందేహం:*
*ఒక SGT ఉపాధ్యాయుడు 18 సం.ల స్కేలు,24 సం.ల స్కేలు కోసం ఏయే Dept.Exams ఉత్తీర్ణత పొందాలి.అదే విధంగా SA తన 12సం.ల స్కేలు కోసం ఏఏ Dept.Tests పాస్ కావాలి, మినహాయింపులు ఏమైనా వున్నాయా?*
*🌸సమాధానం*
*ఏ క్యాడర్ లో నైనా 18 సం.ల స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం ఎటువంటి అదనపు అర్హతలు అవసరంలేదు.12సం.ల స్కేలు పొందివుంటే యాంత్రికంగా 18స.ల ఇంక్రిమెంట్ కు అర్హత ఉంటుంది.SGT లు 24సం.ల స్కేలు కోసం గ్రాడ్యుయేషన్ + B.Ed + GOT,EOT పరీక్షలు పాస్ కావాలి.SA లకు తమ 12సం.ల స్కేలు కోసం GO,EO పరీక్షలు ఉత్తీర్ణత పొందివుండాలి. అయితే Direct Recruitment SA లకు మాత్రం 45సం.ల వయస్సు దాటిన వారికి పై Dept.Test పరీక్షల నుండి మినహాయింపు కలదు.పై మినహాయింపులు అప్రయత్న పదోన్నతి పధకం(AAS) కు వర్తించవు*
173.సందేహం:*
*దాదాపు 6సం.ల కాలం SGT గా పనిచేసి ప్రభుత్వంలోని వేరే శాఖకు ఎంపికై అక్కడ కూడా 2సం!! పనిచేసి తిరిగి పాత పోస్టులో చేరిన ఉపాధ్యాయుని 2సం!! సర్వీసును ఏ విధంగా లెక్కిస్తారు? ఇంక్రిమెంట్ ను AAS కి లెక్కిస్తారా?*
*🌸సమాధానం:*
*FR-26(i) ప్రకారం ప్రస్తుత పోస్టుపై 'Lien' కలిగియున్న ఉపాధ్యాయుడు,ప్రస్తుత పోస్టుకంటే తక్కువగాగాని పోస్టులో పనిచేసిన సర్వీసును ఇంక్రిమెంట్ కు లేక్కిన్చవచును. G.O.Ms.No.117,F&P, Dt:20-5-1981 ప్రకారం ఇంక్రిమెంట్ కు పరిగణింపబడే సర్వీసు అంతా AAS కు కూడా లెక్కించబడుతుంది. కాబట్టి సదరు 2సం!! ఇతర పోస్టు సర్వీసు AAS నకు కూడా లెక్కించబడుతుంది*
*174.సందేహం*
*ఒక ఉపాధ్యాయుడు డిసెంబర్ 15 నుండి 19 వరకు వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు వినియోగించుకుంటున్నాడు. అయితే 13,14వ తేదీలు రెండవ శనివారం,ఆదివారం ఉన్నాయి. అవి కూడా కమ్యూటెడ్ సెలవుగా పరిగణించాలా?*
*🌸సమాధానం:*
*ఆర్ధిక శాఖ Memo.No.86595/1210/FR-1/7 తేది:29-5-1981 మరియు FR-68 ప్రకారం ఏ రకమైన ఆకస్మికేతర సెలవుకైనా ముందు లేదా వెనుక వున్న ప్రభుత్వ సెలవు దినాలు ప్రీఫిక్స్/సఫిక్స్ చేసి వినియోగించుకోవడానికి అనుమతించబడతాయి. అయితే G.O.Ms.No.319 F&P తేది:18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై వినియోగించుకున్న సెలవుకు ముందు,వెనుక ఉన్నప్రభుత్వ సెలవులను మినహాయించి పనిదినాల కాలానికి మాత్రమే వైద్య ధ్రువపత్రాలు A,B లు వుండాలి*
*175.సందేహం:*
*మెడికల్ సెలవుకోసం డాక్టరు సర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సర్టిఫికెట్ వేరేవేరే డాక్టర్ల నుండి సమర్పించవచ్చునా?వైద్య కారణాలపై తీసుకున్న EOL ఇంక్రిమెంట్ కోసం లెక్కించబడుతుందా?*
*🌸సమాధానం:*
*రెండు సర్టిఫికెట్లు ఒకే డాక్టర్ ఇవ్వాలని ఏ ఉత్తర్వులోనూ లేదు.ఇద్దరూ క్వాలిఫైడ్ వైద్యులైనంత వరకు ఎట్టి అభ్యంతరము ఉండదు. సాధారణంగా EOL వాడుకుంటే ఇంక్రిమెంట్ అన్ని రోజులు వాయిదా పడుతుంది.అయితే ప్రభుత్వం G.O.Ms.No.43 తేది:5-2-1976 ద్వారా వైద్య కారణాలపై 6 నెలల కాలం వరకు EOL ను ఇంక్రిమెంటుకు పరిగణించే అధికారం శాఖాధిపతులకు (ఉపాధ్యాయుల విషయంలో పాఠశాల విద్యా సంచాలకులకు) ఇవ్వడం జరిగింది*
176..సందేహం:*
*పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలలో Spl.Language Tests Telugu,Hindi,Urdu ఎవరు రాయాలి?*
*🌸సమాధానం :*
*ఇంటర్మీడియేట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవనివారు Spl.language Test in Telugu(P.code-37) రాయాల్సి ఉంటుంది*
*10వ తరగతి ఆ పై స్థాయిలో హింది/ఉర్దూ ఒక భాషగా వారు Spl.language Test in Hindi/Urdu రాయాల్సి ఉంటుంది*
177.సందేహం:*
*సరెండర్ లీవ్ ను నెలలో ఎన్ని రోజులకు లెక్కగడతారు? 11 రోజుల సంపాదిత సెలవులున్నను లీవ్ సరెండర్ చేసుకోవచ్చునా?*
*🌸సమాధానం:*
*G.O.Ms.No.306 Fin Dept Dt:8-11-1974ప్రకారం సదరు నెలలో 28/29/30/31 ఎన్ని రోజులున్నను,రోజులతో నిమిత్తం లేకుండా 30 రోజులకు మాత్రమే లీవ్ సరెండర్ లెక్కగట్టి నగదు చెల్లిస్తారు*
*G.O.Ms.No.334 F&P,Dt:28-9-1977 లో ఇలా వుంది Leave may be surrendered at any time not exceeding 15/30 days...అని వున్నది.అందుచేత 11రోజులు సరెండర్ చేసుకుని నగదు పొందవచ్చు*
178..సందేహం*
*నేను ప్రస్తుతం SGT గా పనిచేస్తున్నాను.రాబోయే DSC లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే,DEO గారి అనుమతి తీసుకోవాలా?*
*🌸సమాధానం:*
*అవును తప్పనిసరిగా నియామకాధికారి అనుమతి తీసుకోవాలి.
179.ప్రశ్న:
విదేశాలకి వెళ్లుటకు ఏ విధమైన సెలవు వాడుకోవచ్చు??
*🌼జవాబు:*
*విదేశాలకు వెళ్లుటకు 3 నెలల వరకు CSE, ఆ పై కాలానికి Edn. Sec నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలి.అనుమతి లభించిన కాలానికి అర్హత గల(EL/HPL/EOL)ఏ సెలవు నైనా వినియోగించుకోవచ్చు.జీఓ.70 తేదీ:6.7.2009 ప్రకారం 4 నెలల లోపు HM/MEO, 4--6 నెలల వరకు DY. EO,6 నెలల నుండి 1 ఇయర్ వరకు DEO,1--4 ఇయర్స్ వరకు CSE,4 ఇయర్స్ పైన Edn. Sec నుండి సెలవు మంజూరు చే ఇంచుకోవాలి.*
____
180..ప్రశ్న:
EOL కాలాన్ని మెడికల్ లీవ్ గా మార్చుకోవచ్చా??
*🌼జవాబు:*
*సెలవు నిబంధనలు ప్రకారం ఒకసారి EOL గా మంజూరు చేఇ0చుకొన్న సెలవును మెడికల్ లీవ్ గా మార్చుకొనే అవకాశం లేదు.*
____
181.ప్రశ్న:
మెడికల్ లీవ్ తో కలిసి మెటర్నటీ లీవ్ వాడుకోవచ్చా??
*🌼జవాబు:*
*జీఓ.2391 తేదీ:3.10.1960 ప్రకారం వైద్య కారణాల పై ఏ ఇతర సెలవు నైనా ప్రసూతి సెలవు తో కలిపి వాడుకోవచ్చు. కాబట్టి ఈ జీఓ ను అనుసరించి మెడికల్ లీవ్ తో కలిపి మెటర్నటీ లీవ్ వాడుకోవచ్చు.*
____
182.ప్రశ్న:
పాస్ పోర్టు కోసం no objection certificate ఎవరి నుండి తీసుకోవాలి??
*🌼జవాబు:*
*DSE కార్యాలయం నుండి NOC తీసుకోవాలి.నిర్ణీత నమూనాలో HM/MEO ల నుండి DEO ద్వారా DSE కి దరఖాస్తు చేసుకోవాలి.నమూనా దరఖాస్తులు DEO కార్యాలయంలో లభిస్తాయి.
ఉద్యోగ, ఉపాధ్యాయులు వాలంటరీ రిటైర్మెంట్ (VR) తీసుకునే విధానంపై కొన్ని ప్రశ్నలు వేసి...
గ్రూపు ద్వారా జావాబులివ్వాలని కోరారు.... కాబట్టి ఈ స్పందన:
1.
VR తీసుకోదలిస్తే ఎన్నినెలల ముందు దరఖాస్తు పెట్టుకోవాలి? దరఖాస్తు ఎవరికి చేయాలి? ఏయే పత్రాలు జతపర్చాలి?
Ans: VR తీసుకోదలిస్తే 3 నెలల ముందు నియామకపు అధికారికి నోటీసు (దరఖాస్తు) ఇవ్వాలి. మూడు నెలల లోపు ఇచ్చే నోటీసులను సైతం నియామకపు అధికారి అనుమతించవచ్చు. ఉపాధ్యాయుల విషయంలో మండల పరిధిలోని టీచర్లు MEO ద్వారా, హైస్కూల్ టీచర్లు HM ద్వారా DEO కు ఏ తేదీ నుంచి VR అమల్లోకి రావాలని కోరుకుంటున్నారో స్పష్టంగా తెల్పుతూ నోటీసు ఇవ్వాలి. స్పెసిఫిక్ గా జత చేయాల్సిన పత్రాలేవీ లేవు.
2. VR ఏయే కారణాలపై తీసుకోవచ్చు?
Ans: వ్యక్తిగత, అనారోగ్యం తదితర కారణాలను చూపవచ్చు.
3. ఒక టీచరుకు అక్టోబర్ 2018 నాటికి 20 ఏళ్ళ సర్వీస్ పూర్తవుతుంది. అక్టోబర్ తర్వాత VR తీసుకుంటే పూర్తి పెన్షన్ వస్తుందా?
Ans: 20 ఏళ్ళ నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ పూర్తి చేస్తే VR కి ఎలిజిబిలిటీ వస్తుందికానీ, పూర్తి పెన్షన్ రాదు.
4. ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేశాక VR తీసుకోదలిస్తే... వెయిటేజీ ఎన్ని సంవత్సరాలు Add చేస్తారు?
Ans: క్వాలిఫయింగ్ సర్వీస్ కు.... సూపరాన్యుయేషన్ (58/60 ఏళ్ళు) కి గల తేడాను వెయిటేజీగా Add చేస్తారు. అయితే... దీని గరిష్ట పరిమితి ఐదేళ్లు.
5. Loss of Pay, Long Leave (medical grounds) లో ఉండి VR కి దరఖాస్తు చేయవచ్చా?
Ans: Yes.
6. Medical Leave లో ఉండి, స్కూల్లో జాయిన్ అయ్యాకే VR కి అప్లై చేయాలా? సెలవులో ఉండి VR తీసుకోవడం ప్రయోజనమా?
Ans: సెలవులో ఉండి VR తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకోరాదు. స్కూల్లో జూయిన్ అయి VR తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకొని సెలవు కాలానికి పూర్తి వేతనం పొందే అవకాశం ఉంటుంది.
7. అక్టోబర్ 2018 నుంచి VR తీసుకుంటే కొత్త PRC వర్తిస్తుందా?
Ans: 11 వ PRC.... ఫస్ట్ జులై, 2018 నుంచి అమల్లోకి రావాల్సి వుంది. వస్తుందనే నమ్మకమూ నాకుంది. అయితే... నోషనలా? మానిటరీ బెనిఫిట్ ఉంటుందా? అనే విషయాన్ని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం!
8. VR తీసుకున్న తర్వాత GI కంటిన్యూ చేయవచ్చా? GI అమౌంట్ ఎంత వస్తుంది?
Ans: VR తవ్వాత గ్రూప్ ఇన్సూరెన్సు కంటిన్యూ అయ్యే అవకాశంలేదు. ప్రభుత్వం ఏటేటా విడుదల చేసే టేబుల్ ప్రకారం అమౌంట్ వస్తుంది.
9. చివరగా ఒక ప్రశ్న. 20 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ సర్వీస్ మధ్య VR తీసుకుంటే పెన్షన్ ఎంతెంత వస్తుంది?
Ans: వెయిటేజీతో కలుపుకొని 33 ఏళ్ళ సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అయితే.... చివరి Basic Pay లో 50 % పెన్షన్ గా నిర్ధారించబడుతుంది. అలా కాకుండా VR తీసుకుంటే....
నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ > పెన్షన్
20>37.87% (చివరి మూలవేతనంలో)
21>39.4%
22>40.9%
23>42.4%
24>43.93%
25>45.45%
26>46.97%
27>48.48%
28>50%
(ఈ టేబుల్ 58 ఏళ్ళ వయస్సు నిండి ఉద్యోగ విరమణ చేసే వారికీ వర్తిస్తుంది.
183.ప్రశ్న:
నాకు 20 ఇయర్స్ సర్వీసు నిండినది.నేను వాలంటీర్ రిటైర్మెంట్ కావాలి అని అనుకుంటున్నాను.నాకు వెయిటేజ్ ఎంత ఇస్తారు??
*🌻జవాబు:*
*క్వాలిఫై సర్వీసుకి 60 ఇయర్స్ కి గల తేడాను వెయిటేజ్ గా add చేస్తారు.ఐతే దీని గరిష్ట పరిమితి 5 ఇయర్స్.*
*****
184.ప్రశ్న:
డిపార్ట్మెంట్ టెస్టుల్లో తెలుగు, హిందీ, ఉర్దూ ఎవరు రాయాలి??
*🌻జవాబు:*
*ఇంటర్ మరియు పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని వారు తెలుగు(కోడ్--37)రాయాలి.అదేవిధంగా 10,ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని వారు spl language test హిందీ/ఉర్దూ రాయాలి.*
*****
185.ప్రశ్న:
UP స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ అదే మండలం నకు FAC MEO గా భాద్యత లు నిర్వహించుచున్న అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు??
*🌻జవాబు:*
*FR.49 ప్రకారం ఒక పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు సంక్రమిస్తాయి.కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి ఆనుమతి తో జమ చేయవలసి ఉంటుంది.*
*****
186.ప్రశ్న:
SGT గా పనిచేస్తున్న టీచర్ VRO గా ఎంపిక ఐతే పే--ప్రొటెక్షన్,సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందా??
*🌻జవాబు:*
*DEO అనుమతి తో పరీక్ష రాస్తే వేతన రక్షణ ఉంటుంది. జీఓ.105 తేదీ:2.6.2011 ప్రకారం నూతన పోస్టు యొక్క స్కేల్ లో ప్రస్తుతం పొందుతున్న వేతనానికి సమానమైన స్టేజి లో వేతనం నిర్ణయించబడుతుంది. ఇంక్రిమెంట్ మాత్రం నూతన సర్వీసు లో చేరిన ఒక సంవత్సరం తర్వాతే మంజూరు చేస్తారు.*
*****
187.ప్రశ్న:
మహిళా టీచర్ భర్త నిరుద్యోగి.అత్త, మామ కూడా ఈమె పైనే ఆధార పడి జీవిస్తున్నారు.అత్త గారికి ఆరోగ్యం బాగా లేదు.మెడికల్ రీఅ0బర్సుమెంట్ వర్తిస్తుందా??
*🌻జవాబు:*
*APIMA రూల్ 1972 ప్రకారం వర్తించదు. కేవలం మహిళా టీచర్ అమ్మ,నాన్న లకి మాత్రమే వర్తిస్తుంది.*
188..ప్రశ్న:
ఉద్యోగి తల్లిదండ్రులు కి వైట్ కార్డు ఉంటే EHS లో చేర్చవచ్చా??
*☘జవాబు:*
*చేర్చకూడదు.అందరూ కలసి ఉండి వైట్ కార్డ్ ఉపయోగించుచున్నందులకు ఉద్యోగి పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.*
____
189.ప్రశ్న:
నా భార్య హౌస్ వైఫ్.ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేఇ0చుకుంటే నాకు ప్రత్యేక సెలవులు ఏమైనా ఇస్తారా??
*☘జవాబు:*
*జీఓ.802 M&H తేదీ:21.4.72 ప్రకారం భర్త కి 7 రోజులు స్పెషల్ సెలవులు ఇస్తారు.*
____
190ప్రశ్న:
మెడికల్ సెలవు లో ఉండి వాలంటరి రిటైర్మెంట్ కి అప్లై చేయవచ్చా??
*☘జవాబు:*
*చేయవచ్చు. కానీ నష్టం జరుగుతుంది.మెడికల్ సెలవులో ఉండి వాలంటర్ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి వేతనం రాదు.అదే స్కూల్లో జాయిన్ ఐన పిదప వాల0టరీ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి పూర్తి వేతనం పొందవచ్చు.*
____
191.ప్రశ్న:
స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయదలచుకొన్నపుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి??
*☘జవాబు:*
*స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కి అనుమతి కోరుతూ HM ద్వారా DEO గారికి 3 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, SR,10వ తరగతి నుండి విద్యా అర్హతల సర్టిఫికేట్లు,సెల్ఫ్ డిక్లరేషన్ జాతపరచాలి.*
____
192.ప్రశ్న:
సర్వీసు మొత్తం మీద ఎన్ని కమ్యూటెడ్ సెలవులు వాడుకోవాలి??
*☘జవాబు:*
*సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు.అప్పుడు అర్థ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి.ఆ తర్వాత కూడా సెలవు అవసరం ఐతే కేవలం అర్ధ జీతపు సెలవు గా మాత్రమే ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు వాడుకోవచ్చు.*
____
193.ప్రశ్న:
స్కూల్ అసిస్టెంట్ తెలుగు గా పదోన్నతి పొందటానికి కావాల్సిన అర్హతలు ఏమిటి??
*☘జవాబు:*
*జీఓ.15,16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో మెయిన్ గా గానీ లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టు లలో ఒక సబ్జెక్టు గా తెలుగు ఉండాలి. బి.ఈ డి లో తెలుగు methodology లేదా పండిట్ ట్రైనింగ్ కలిగి ఉండాలి.అదేవిధంగా జీఓ.28,29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హత తో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు కి అర్హులే.*
____
194.ప్రశ్న:
ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా??
*☘జవాబు:*
*అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నo.362/ఇ1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు.*
____
195.ప్రశ్న:
LFL HM కి 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి కావలసిన అర్హతలు ఏమిటి??
*☘జవాబు:*
*LFL HM కి తదుపరి పదోన్నతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాబట్టి డిగ్రీ, బీ. ఈ. డీ, డిపార్ట్మెంట్ పరీక్షల ఉతీర్ణత ఉండాలి.50 ఇయర్స్ వయస్సు నిండితే డిపార్ట్మెంట్ టెస్టుల మినహాయింపు వర్తిస్తుంది.*
196.ప్రశ్న:
నేను ఉన్నత చదువుల కోసం 78 రోజులు జీత నష్టపు సెలవు పెట్టాను.ఆ కాలానికి ఇంక్రిమెంట్ వాయిదా వేశారు.వాయిదా పడకుండా ఉండేందుకు ఏమి చెయ్యాలి??
*🌼జవాబు:*
*FR-26 ప్రకారం 6 నెలల వరకు ఇంక్రిమెంట్ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికార0 CSE గారికి మాత్రమే ఉన్నది.కాబట్టి మీరు CSE గారికి దరఖాస్తు చేసుకోగలరు.*
******
197.ప్రశ్న:
డైస్ నాన్ కాలం అంటే ఏమిటి??
*🌼జవాబు:*
*FR.18 మరియు APLR-1933 లోని రూల్ 5 ప్రకారం 5ఇయర్స్ కి మించి గైర్హాజరు అయిన ఉద్యోగి, తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు గా భావించాలి.తిరిగి ఉద్యోగం లో చేరాలి అంటే ప్రభుత్వం యొక్క అనుమతి కంపల్సరీ.*
*FR.18 ప్రకారం డైస్ నాన్ కాలం ఇంక్రిమెంట్లు, సెలవులు, పెన్షన్ తదితర సందర్భాలకు సర్వీసు గా పరిగణించబడదు.కనుక ఈ కాలానికి సెలవు మంజూరు చేయటo,వేతనం చెల్లించటం అనే ప్రశ్నలు ఉత్పన్నం కావు.*
******
198.ప్రశ్న:
అనారోగ్యం కారణాలతో ఉద్యోగం చేయలేకపోతున్నాను.నా తమ్ముడు డిగ్రీ, బీ. ఈ. డి చదివాడు.నా ఉద్యోగం తమ్ముడు కి ఇప్పించవచ్చునా??
*🌼జవాబు:*
*టీచర్ ఉద్యోగం వేరే వారికి నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు.*
*కానీ జీఓ.66 తేదీ:23.10.2008 ప్రకారం నిబంధనలకు లోబడి మీరు అనారోగ్యం కారణంగా శాశ్వతంగా విధులు నిర్వహి0సలేరని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేసన్ కింద రిటైర్మెంట్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ స్థాయి కి మించకుండా కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది.*
******
199.ప్రశ్న:
నేను,నా భార్య ఇద్దరం టీచర్ల0.హెల్త్ కార్డుకి ప్రీమియం నా జీతం ద్వారా చెల్లించుచున్నాను.నా భార్య హెల్త్ కార్డులో వారి తల్లిదండ్రులు పేర్లు చేర్చుకోవచ్చా??
*🌼జవాబు:*
*చేర్చుకోవచ్చు. మహిళా టీచర్లు కూడా ఆధారిత తల్లిదండ్రులు పేర్లు హెల్త్ కార్డులో చేర్చుకోవచ్చు.*
******
200.ప్రశ్న:
EOL కాలాన్ని వాలoటరీ రిటైర్మెంట్ కి పరిగణనలోకి తీసుకుంటారా??
*🌼జవాబు:*
*EOL కాలాన్ని అర్హత గల సెలవు గా లెక్కించరు.*
*కానీ వ్యక్తిగత కారణాల తో eol ఐతే 36 నెలల వరకు, అనారోగ్య కారణాలతో ఐతే ఎంతకాలం ఐనా eol కాలాన్ని పెన్షన్ లెక్కింపు కి అర్హత సెలవుగానే పరిగణిస్తారు.*
******
201.ప్రశ్న:
నేను HM గా పనిచేస్తున్నాను.అనారోగ్య కారణాల చేత SA గా రివర్సన్ తీసుకోవాలని అనుకుంటున్నాను.పరిస్థితి ఏమిటి??
*🌼జవాబు:*
*FR14 ప్రకారం HM పోస్టులో లీన్ స్థిరీకరణ జరిగే వరకు SA పోస్టులో మీ లీన్ కొనసాగుతుంది.కనుక మీరు రివర్శన్ తీసుకోవచ్చు.ఐతే పదోన్నతి ద్వారా వచ్చిన 2 ఇంక్రిమెంట్లు రద్దు అవుతాయి.SA క్యాడర్ లో తదుపరి AAS కి అర్హత ఉండదు.*
******
202.ప్రశ్న:
నాకు వినికిడి లోపం 70 శాతం ఉన్నట్లు మెడికల్ సర్టిఫికేట్ కలదు. కాని ఎలవెన్స్ పొందటానికి సరైన వివరములు లేవు. నేను అలవెన్స్ పొందటానికి అర్హుడునా..???
*🌼జవాబు:*
*మీరు కన్వీయన్స్ ఎలవెన్స్ కు అర్హులు. సంబంధిత ఉత్తర్వులు DDO ఇస్తే సరిపోతుంది.GO MS:197, Dt:6-7-2006. సివిల్ సర్జన్ ర్యాంక్ తగ్గని తత్సంబంధిత వైద్యుడు ఈ ధృవపత్రం జారీ చేయాలి. ఈ సర్టిఫికేట్ జారీ చేసిన తేదీ నుండి వర్తించును. CL తప్పించి మరి ఏ సెలవులలోనూ ఈ ఎలవెన్స్ ఇవ్వబడదు. సస్పెన్సన్ కాలంలో కూడా ఇవ్వబడదు.*
*GO MS No:262, Dt:25-8-1980.*
203.ప్రశ్న:
సీనియర్ స్టెప్ అప్ తీసుకున్న తర్వాత జూనియర్ SPP-1A స్కేల్ తీసుకోవటం వల్ల సీనియర్ కంటే ఎక్కువ వేతనం పొందుతున్నాడు.ఇపుడు సీనియర్ మరల స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నదా??
*🍁జవాబు:*
*వీలు లేదు. స్టెప్ అప్ నిబంధనలు ప్రకారం సీనియర్ ఒకసారి మాత్రమే స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నది.*
_____
204.ప్రశ్న:
నేను ZPHS లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.స్కూల్ అసిస్టెంట్ కి ఉండవలసిన అర్హతలు అన్నీ కలిగి ఉన్నాను.నాకు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి ఇస్తారా??
*🍁జవాబు:*
*అవకాశం లేదు.*
_____
205.ప్రశ్న:
నా భార్య CPS ఉద్యోగి.ఆమె మరణించారు.ఇపుడు నేను ఏమి చేయాలి??
*🍁జవాబు:*
*CPS లో ఉన్న డబ్బులు కోసం 103--జీడీ ఫారం పూర్తి చేయాలి.సంబంధిత పత్రాలు జతపరచి DDO ద్వారా ట్రెజరీకి పంపాలి.వీరు వాటిని PRA ముంబై కి పంపాలి.వారు పరిశీలించి,మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.*
_____
206.ప్రశ్న:
వేసవి సెలవుల్లో పాఠశాల విధులు నిర్వహి0చటానికి జూనియర్ అసిస్టెంట్ లేకపోతే ఎవరిని నియమించాలి??
*🍁జవాబు:*
*ఆ స్కూల్లో సీనియర్ ఉపాధ్యాయునికి ముందు అవకాశం ఇవ్వాలి.*
_____
207.ప్రశ్న:
నేను జీత నష్టపు సెలవు పెట్టాను.EHS ప్రీమియం చెల్లించలేదు.ఇపుడు నేను ఏమి చేయాలి??
*🍁జవాబు:*
*చలానా ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు.*
_____
208.ప్రశ్న:
నేను,మరొక టీచర్ ఇద్దరం ఒకే సారి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాము.HM పదోన్నతికి మా ఇద్దరిలో ఎవరు సీనియర్??
*🍁జవాబు:*
*Rc. No.142 తేదీ:11.8.2011 ప్రకారం SGTలో సీనియర్ ఐన ఉపాధ్యాయుడు ఎస్ఏ లో సీనియర్ అవుతాడు.వారికే ముందు HM పదోన్నతి వస్తుంది.*
209.ప్రశ్న:
సవతి పిల్లలు కి EHS వర్తిస్తుందా??
*🌼జవాబు:*
*జీఓ.174; తేదీ:1.11.2013 ప్రకారం సవతి పిల్లలు కూడా ehs ప్రయోజనాలు పొందవచ్చు.*
_____
210.ప్రశ్న:
దత్తత తీసుకున్న తల్లిదండ్రులకి EHS వర్తిస్తుందా??
*🌼జవాబు:*
*జన్మనిచ్చిన తల్లిదండ్రులకి లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులకి ఎవరో ఒకరికి మాత్రమే ehs వర్తిస్తుంది.*
_____
211.ప్రశ్న:
20 ఇయర్స్ కి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే పెన్షన్ ఎంత వస్తుంది??
*🌼జవాబు:*
*చివరి ములవేతనం లో 37.87% పెన్షన్ గా వస్తుంది.*
_____
212.ప్రశ్న:
స్కూల్ అసిస్టెంట్ తెలుగు పదోన్నతి కి ఏ ఏ అర్హతలు కావాలి??
*🌼జవాబు:*
*జీఓ.15&16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో తెలుగు ఒక సబ్జెక్టు గా మరియు తెలుగు methodology గా బి.ఈ. డి,పండిట్ ట్రైనింగ్ అర్హతలు కలిగి ఉండాలి.అంతే కానీ పి జీ లో తెలుగు ఉన్నంత మాత్రాన పదోన్నతి ఇవ్వరు.జీఓ.28&29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హతతో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి అర్హులే.*
_____
213.ప్రశ్న:
సస్పెన్షన్ పీరియడ్ ను అర్హత గల సెలవుగా మంజూరు చేశారు.అంటే ఏమిటి??
*🌼జవాబు:*
*సెలవు నిబంధనలు 1933 ప్రకారం అర్హత గల సెలవు అంటే అర్ధ జీతపు సెలవు లేదా సంపాదిత సెలవు లేదా జీత నష్టపు సెలవు.*
_____
214..ప్రశ్న:
ఇంటర్మీడియట్ లో సెకండ్ language గా తెలుగు చదివిన ఒక టీచర్ డిపార్ట్మెంట్ టెస్ట్ లలో తెలుగు పేపర్ రాయాలా??
*🌼జవాబు:*
*అవసరం లేదు.*
_____
215.ప్రశ్న:
మా గ్రామ పంచాయతీ ని కొత్త గా మున్సిపాలిటీ లో కలిపారు.నేను cca పొందాలంటే ప్రత్యేకంగా గజిట్ నోటిఫికేషన్ రావాలా??
*🌼జవాబు:*
*అవసరం లేదు. విలీన ఉత్తర్వులు ద్వారా సిసిఏ పొందవచ్చు.*
_____
216.ప్రశ్న:
నేను 10వ తరగతి తర్వాత ఇంటర్ చదవకుండా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేశాను. తదుపరి బి.ఎడ్ చేసి ప్రస్తుతం Sgt గా పనిచేస్తున్నాను.నాకు పదోన్నతి ఇస్తారా??ఇవ్వరా??
*🌼జవాబు:*
*స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కి మీకు ఈ అర్హతలు సరిపోతాయి.*
_______________________________________
217.ప్రశ్న:
జాతీయ పండుగల రోజు జెండా వందనం కి హాజరు కాలేకపోతే చర్యలు తీసుకుంటారా??
*🍁జవాబు:*
*సివిల్ సర్వీస్ కోడ్ ప్రకారం జెండా వందనం కి హజరు కాకపోతే జాతీయ జెండాను అగౌరవపరచినట్లుగా భావించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.*
******
218.ప్రశ్న:
స్థానికత దేని ఆధారంగా నిర్ణయిస్తారు??
*🍁జవాబు:*
*జీఓ.674 జీఏడీ: తేదీ:20.10.1975 రాష్టప్రతి ఉత్తర్వులలోని పేరా 7 ప్రకారం 4 నుంచి 10వ తరగతి వరకు గల 7 ఇయర్స్ కాలంలో ఎక్కువ భాగం ఎక్కడ చదివితే ఆ జిల్లానే లోకల్ గా పరిగణింపబడుతుంది.*
******
219.ప్రశ్న:
నేను 1996 డిసెంబరు లో sgt గా చేరాను.ఐతే 2001 లో 142 రోజులు,2005 లో 90 రోజులు అనారోగ్యంతో జీత నష్టం(ఇఓఎల్)సెలవు పెట్టాను.ఇంక్రిమెంట్ ఆగస్టుకి పోస్టుపోన్ అయ్యింది. ఐతే ఇంక్రిమెంట్ ను డిసెంబరు కి మార్చుకొనే అవకాశం లేదా??
*🍁జవాబు:*
*జీఓ.43; తేదీ:5.2.76 ప్రకారం డిసెంబరుకి మార్చుకోవచ్చు.ఐతే సంబంధిత ప్రతిపాదనలు వైద్య ధ్రువపత్రాలతో మరియు SR తో deo ద్వారా DSE కి పంపాలి.180 రోజుల వరకు DSE, అంతకు మించిన కాలానికి విద్యా శాఖ కార్యదర్శి అనుమతితో ఈఓయల్ కాలం ఇంక్రిమెంట్కి సర్వీసు గా పరిగణించబడుతుంది.*
******
220.ప్రశ్న:
సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి బ్రతికేది ఎలా??
*🍁జవాబు:*
*సస్పెండ్ పీరియడ్ లో సబ్ స్టెన్స్ అలవెన్సు కింద సగం జీతం(హాఫ్ పే,హాఫ్ డీఏ,హాఫ్ హెచ్ఆర్ఏ)ఇస్తారు.*
******
221.ప్రశ్న:
ఒక ఉద్యోగి 9 ఇయర్స్ పాటు ఉద్యోగానికి గైరు హాజరు అయ్యాడు.అతనికి మరల పోస్టింగ్ ఇస్తారా??
*🍁జవాబు:*
*FR.18 మరియు aplr.1933 లోని రూల్ 5 ప్రకారం ఒక ఉద్యోగి 5 ఇయర్స్ పాటు గైర్హాజరు అయితే ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా భావించాలి.తిరిగి చేరాలి అంటే విద్యాశాఖ కార్యదర్శి నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.*
222.ప్రశ్న:
నేను sgt ను.75% అంగవైకల్యం తో బాధపడుతున్నాను.నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను.నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. డిగ్రీ,బీ.ఎడ్ చేశాడు. నా ఉద్యోగం నా తమ్ముడు కి ఇప్పించవచ్చా??
*🌼జవాబు:*
*మీ ఉద్యోగం ఎవ్వరికీ నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు. కానీ జీఓ.66 జీఏడీ తేదీ:23.10.2008 ప్రకారం మీరు అనారోగ్యంతో విధులు నిర్వర్హించలేక పోతున్నారని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన, మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేషన్ కింద రిటైర్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ పోస్టు కారుణ్య నియామకం కోటాలో ఇవ్వటానికి అవకాశం ఉంది.*
_____
223.ప్రశ్న:
ఉన్నత పాఠశాలలో బోధనేతర సిబ్బంది లేనప్పుడు వేసవి సెలవుల్లో ssc అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షల విధులను ఎవరికి అప్పగించాలి??
*🌼జవాబు:*
*ఆర్.సి.132 తేదీ:14.5.14 ప్రకారం బోధనేతర సిబ్బంది లేనప్పుడు వేసవిలో ssc భాద్యతను ఆ ఉన్నత పాఠశాలలోని సీనియర్ ఉపాధ్యాయుడికి అప్పగించాలి.*
_____
224.ప్రశ్న:
విద్యాహక్కు చట్టంలోని ఏ నిబంధన ప్రకారం 1 నుండి 8వ తరగతి వరకు పిల్లలను నేరుగా చేర్చుకోవచ్చు??
*🌼జవాబు:*
*విద్యాహక్కు చట్టం 2009 లోని 2వ అధ్యాయం 4వ సెక్షన్ ప్రకారం 6--14 వయస్సు గల పిల్లలను వారి వయస్సుకి తగిన విధంగా 1--8 తరగతులలో నేరుగా చేర్చుకోవలసి ఉంటుంది.*
_____
225.ప్రశ్న:
గత సంవత్సరం 9వ తరగతి లో ముగ్గురు పిల్లలు వార్షిక పరీక్షలు రాయలేదు.కనీసం 20% హాజరు కూడా లేదు.వారిని ఈ సంవత్సరం 10 లోకి చేర్చుకోవచ్చా??
*🌼జవాబు:*
*9,10 తరగతులు విద్యాహక్కు చట్టం పరిధిలోకి రావు.కావున కనీస హాజరు లేకుండా పై తరగతికి ప్రమోట్ చేయకూడదు.*
_____
226.ప్రశ్న:
ఒక LFL HM కి కన్వేయన్స్ అలవెన్సు ఎవరు మంజూరు చేయాలి??
*🌼జవాబు:*
*జీఓ.40 తేదీ:7.2.02 ప్రకారం మండల పరిషత్ యాజమాన్యం లోని స్కూళ్ళు కి MEO నే కన్వేయన్స్ అలవెన్సు మంజూరు చేయాలి.*
_______________________________________
227.ప్రశ్న:
నేను 9.11.17న ఉద్యోగం లో చేరాను.నాకు వార్షిక ఇంక్రిమెంట్ నవంబర్ 9 నుండి ఇస్తారా?? లేక నవంబర్ 1 నుండి ఇస్తారా??
*🍁జవాబు:*
*జీఓ.133 , ఆర్ధిక ; తేదీ:13.5.76 ప్రకారం నియామకం తేదీ నెలలో ఏ తేదీన ఉన్నా, ఆ నెల మొదటి తేదీ నుండే వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చెయ్యాలి.*
_____
228.ప్రశ్న:
నేను sgt గా పనిచేస్తున్నాను.EOT, GOT పాస్ కాలేదు. నాకు 51 సంవత్సరంలు.నాకు ఇప్పుడు 24 ఇయర్స్ స్కేల్ ఇస్తారా??
*🍁జవాబు:*
*మీకు 50 ఇయర్స్ దాటినప్పటికీ 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వాలి అంటే డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ కావాలి.వాస్తవానికి PRC లో మినహాయింపు ఇచ్చినప్పటికీ ఆర్ధిక శాఖ ఒప్పుకోలేదు.*
_____
229..ప్రశ్న:
కారుణ్య నియామకం కింద నా కుమారుడు కి ఉద్యోగం ఇవ్వాలి అంటే నాకు ఎంత సర్వీస్ మిగిలి ఉండాలి??
*🍁జవాబు:*
*జీఓ.661, ఆర్ధిక : తేదీ:23.10.08 ప్రకారం అనారోగ్య కారణాలతో రిటైర్డ్ అయి, వారసుడు కి కారుణ్య నియామకం కావాలి అంటే, రిటైర్మెంట్ తేదీ నాటికి 5 ఇయర్స్ సర్వీస్ మిగిలి ఉండాలి.*
_____
230..ప్రశ్న:
LFL HM పదోన్నతి పొందటానికి ఏ ఏ అర్హతలు కావాలి??
*🍁జవాబు:*
*సర్వీసు నిబంధనలు ప్రకారం ఇంటర్, డీ.ఎడ్ చాలు.డిగ్రీ,బీ.ఎడ్ ఉండవలసిన అవసరం లేదు.*
_____
231..ప్రశ్న:
నేను జీత నష్టం సెలవు పెట్టిన కారణంగా నా ఇంక్రిమెంట్ 29.1.17 కి మారింది.ఇపుడు నాకు ఇంక్రిమెంట్ జనవరి 29న ఇస్తారా?? లేక జనవరి 1న ఇస్తారా??
*🍁జవాబు:*
*మెమో.49643 ; ఆర్ధిక ; తేదీ:6.10.74 ప్రకారం అసాధారణ సెలవు కారణంగా వాయిదా పడిన ఇంక్రిమెంట్ ను ,ఆ నెల మొదటి తేదీ నుంచే మంజూరు చేయాలి.అంటే జనవరి 1 నుంచే ఇస్తారు.*
232.ప్రశ్న:
CL వరుసగా ఎన్ని రోజులు పెట్టవచ్చు??
*🍁జవాబు:*
*ఆదివారం మరియు సెలవు దినాలతో కలిపి మొత్తం 10 రోజులకి మించకూడదు.*
______
233.ప్రశ్న:
స్పెషల్ CL ఎన్ని రోజులు వరుసగా వాడుకోవచ్చు??
*🍁జవాబు:*
*ఆదివారం మరియు సెలవు దినాలతో కలిపి మొత్తం 7 రోజులకి మించకూడదు.*
______
234.ప్రశ్న:
మహిళా ఉద్యోగి గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేఇ0చుకొన్నచో ఆమెకు స్పెషల్ CL లు ఏమైనా ఇస్తారా??
*🍁జవాబు:*
*జీఓ.52 ; తేదీ:1.4.2011 ప్రకారం మహిళా ఉద్యోగులకి సివిల్ సర్జన్ రికమండేషన్ పై 45 రోజులు ప్రత్యేక సెలవు ఇవ్వవచ్చు.*
______
235.ప్రశ్న:
CCL ఒకేసారి వాడుకోవచ్చా??
*🍁జవాబు:*
*మెమో.13112 ; తేదీ: 1.3.58 ప్రకారం CCL లు ఒకేసారి 7 రోజులకి మించి నిల్వ ఉండకూడదు.1 ఇయర్ లో 10 రోజులకి మించి వాడుకోకూడదు.*
______
236..ప్రశ్న:
"లీవ్ నాట్ డ్యూ" ఎపుడు మంజూరు చేస్తారు??
*🍁జవాబు:*
*1933 aplr రూల్స్ లోని రూల్ 18-సి ప్రకారం ఉద్యోగి ఖాతాలో ELs గానీ, హాఫ్ పే లీవ్ గానీ లేనప్పుడు ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ద్వారా వీటిని మంజూరు చేయవచ్చు. ఇలా మంజూరు చేసిన సెలవును భవిష్యత్ లో అతనికి వచ్చే సెలవు నుండి మినహాయిఇస్తారు.*
______
237.ఒక ఉద్యోగి డిస్మిస్ ఐతే అతను ఏమి కోల్పోతాడు??
*🍁జవాబు:*
*రూల్ 24 ప్రకారం పెన్షన్ బెనిఫిట్ లురావు.ఐతే రూల్ 40 ప్రకారం అతను రిటైర్మెంట్ అయి ఉంటే వచ్చే పెన్షన్, గ్రాట్యుటీ లలో 2/3వ వంతు ప్రత్యేక పరిస్థితి లలో మంజూరు చేయవచ్చు.*
_____________________________________
238..ప్రశ్న:
నేను అనారోగ్యంతో ఏప్రిల్ 1 నుండి సెలవులో ఉన్నాను.సమ్మర్ హాలిడేస్ లో విధులలో చేరవచ్చా??
*🌼జవాబు:*
*వేసవి సెలవుల్లో చేరటానికి అవకాశం లేదు. స్కూళ్ళు రీ--ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే విధులలో చేరాలి.*
_____
238.ప్రశ్న:
నేను స్కూల్ అసిస్టెంట్ హిందీ గా పనిచేస్తున్నాను.ఇంటర్,డిగ్రీ,హిందీ పోస్టుకి కావాల్సిన అర్హతలు ఉన్నాయి. ఐనా నాకు 12 ఇయర్స్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు.HM పదోన్నతి కూడా ఇవ్వటం లేదు.ఎందుకని??
*🌼జవాబు:*
*మీకు బీ.ఎడ్ లేనందున ఇవ్వలేదు.*
_____
239.ప్రశ్న:
ఒకే విద్యా సంవత్సరం లో రెండు కోర్సులు చేయవచ్చా??
*🌼జవాబు:*
*ఒకే విద్యా సంవత్సరం లో ఒక రెగ్యులర్ కోర్సు,ఒక దూర విద్యా కోర్సు చేయటానికి అనుమతి ఇవ్వండి,అంతేగానీ రెండు రెగ్యులర్ కోర్సులు చేయడానికి అనుమతి ఇవ్వవద్దని యూజీసి 28.12.12 న అన్ని యూనివర్సిటీ లకి లేఖ రాసింది.*
_____
240..ప్రశ్న:
నేను 25 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను.ఇక వాలంటీర్ రిటైర్మెంట్ అవుదామని అనుకొనుచున్నాను.నాకు పెన్షన్ ఎంత వస్తుంది??
*🌼జవాబు:*
*చివరి ములవేతనం లో 45.45% పెన్షన్ గా రావటానికి అవకాశం ఉంది.*
_____
241.ప్రశ్న:
నాకు పదోన్నతి వచ్చింది. నేను పదోన్నతి ఆర్డర్ తీసుకోలేదు. ఇపుడు ఏమి జరుగుతుంది??
*🌼జవాబు:*
*మెమో.10445 ; జీఏడి ; తేదీ:1.6.11 ప్రకారం ఒక సారి పదోన్నతి తిరస్కరించవచ్చు.ఐతే జీఓ.145 ; జీఏడి ; 15.6.04 ప్రకారం మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తర్వాత ఇక చేర్చరు.*
___________________
242.ప్రశ్న:
నేను B. ed లో 3rd methodology గా maths చేశాను. నాకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి ఇస్తారా??
*🌼జవాబు:*
*మెమో.434204/2016 ప్రకారం సింగిల్ సబ్జెక్టు లు & 3rd methodology లు పదోన్నతి కి పనికిరావు.*
*****
243ప్రశ్న:
పిల్లలను దండించటం నేరమా??
*🌼జవాబు:*
*జీఓ.16 ; తేదీ:18.2.2002 ప్రకారం స్కూళ్ళు లో పిల్లలను దండించటం పూర్తి గా నిషేదించటమైనది.*
*****
244.ప్రశ్న:
నేను ఫిబ్రవరిలో ELs క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నాను.నాకు 28 రోజులకే డబ్బులు ఇస్తారా??
*🌼జవాబు:*
*జీఓ.306 ; ఆర్ధిక ; 8.11.74 ప్రకారం నెలలో ఎన్ని రోజులు(28,29,30,31) ఉన్నను డబ్బులు 30 రోజులకి లెక్కగట్టి ఇస్తారు*.
*****
245.ప్రశ్న:
నాకు 20 ఇయర్స్ సర్వీసు నిండినది.నేను వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకొనుచున్నాను.ఐతే నేను మధ్యలో 3 ఇయర్స్ జీత నష్టపు సెలవు పెట్టాను.ఇపుడు నాకు అర్హత ఉందా? లేదా??
*🌼జవాబు:*
*అర్హత లేదు.20 ఇయర్స్ నెట్ సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.*
*****
246..ప్రశ్న:
నేను సంక్రాంతి సెలవులు అనంతరం సెలవు పెట్టాలని అనుకొనుచున్నాను.సెలవు పెట్టవచ్చా??
*🌼జవాబు:*
*సంక్రాంతి సెలవులు 10 రోజులు ఇచ్చారు.మీరు 1 రోజు సెలవు పెడితే మొత్తం సెలవులు 11 రోజులు అవుతాయి.కాబట్టి CL ఇవ్వటం కుదరదు.మీరు గనక సెలవు పెడితే మొత్తం సెలవులకు eligible leave పెట్టుకోవలసి ఉంటుంది.*
_________
247ప్రశ్న:
ఒక మహిళా టీచర్ ప్రసూతి సెలవులో ఉన్నారు.పెరిగిన DA ఆమెకు ఎప్పటినుంచి ఇవ్వాలి??
*🌻జవాబు:*
*మెమో.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ప్రసూతి సెలవు సహా ఏ సెలవు కైనా సెలవుకి ముందు రోజు వేతనం మాత్రమే చెల్లించబడుతుంది.*
_____
248.ప్రశ్న:
ఒక టీచర్ అనారోగ్యంతో 6 నెలల పాటు హాఫ్ పే లీవ్ పెట్టాడు.ఆ కాలానికి ELs ఎలా ఇవ్వాలి.
*🌻జవాబు:*
*Aplr 1933 లోని రూల్ 4 ప్రకారం ELs ను డ్యూటీ పీరియడ్ పై మాత్రమే లెక్కించాలి.ఏ విధమైన ఆకస్మికేతర సెలవు కూడా డ్యూటీ గా పరిగణించబడదు.కనుక 3 ELs జమ చేయకూడదు.*
_____
249.ప్రశ్న:
ఎవరెవరిని బదిలీల కి spouse కేటగిరీ గా పరిగణిస్తారు.
*🌻జవాబు:*
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు,గ్రాంట్ ఇన్ ఎయిడ్,ప్రభుత్వ రంగ సంస్థ ల ఉద్యోగుల ను మాత్రమే spouse కేటగిరీ గా పరిగణిస్తున్నారు.*
_____
250..ప్రశ్న: