Thursday, October 4, 2018

సందేహాలు - సమాధానాలు PART - 2


సందేహాలు -  సమాధానాలు  PART-2

1. ప్రశ్న:
*UP స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ అదే మండలం నకు FAC MEO గా భాద్యత లు నిర్వహించుచున్న అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు??*
జవాబు:
*FR.49 ప్రకారం ఒక పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు। సంక్రమిస్తాయి.కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి ఆనుమతి తో జమ చేయవలసి ఉంటుంది.*

2. ప్రశ్న:
*SGT గా పనిచేస్తున్న టీచర్ VRO గా ఎంపిక ఐతే పే--ప్రొటెక్షన్,సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందా??*
జవాబు:
*DEO అనుమతి తో పరీక్ష రాస్తే వేతన రక్షణ ఉంటుంది. జీఓ.105 తేదీ:2.6.2011 ప్రకారం నూతన పోస్టు యొక్క స్కేల్ లో ప్రస్తుతం పొందుతున్న వేతనానికి సమానమైన స్టేజి లో వేతనం నిర్ణయించబడుతుంది. ఇంక్రిమెంట్ మాత్రం నూతన సర్వీసు లో చేరిన ఒక సంవత్సరం తర్వాతే మంజూరు చేస్తారు.*

3. ప్రశ్న:
*మహిళా టీచర్ భర్త నిరుద్యోగి.అత్త, మామ కూడా ఈమె పైనే ఆధార పడి జీవిస్తున్నారు.అత్త గారికి ఆరోగ్యం బాగా లేదు.మెడికల్ రీఅ0బర్సుమెంట్ వర్తిస్తుందా??*
జవాబు:
*APIMA రూల్ 1972 ప్రకారం వర్తించదు. కేవలం మహిళా టీచర్ అమ్మ,నాన్న లకి మాత్రమే వర్తిస్తుంది.*


4.ప్రశ్న:
*నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను.ఐతే ఏమి చెయ్యాలి??*
🌼జవాబు:
జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేఇ0చి,DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేఇ0చాలి.స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేఇ0చాలి.
******
5. ప్రశ్న:
*నేను PF నుండి ఋణం పొందియున్నాను.*
*వాయిదాలు పూర్తి కాలేదు.మరలా ఋణం కావాలి.ఇస్తారా??*
🌼జవాబు:
ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి,కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.
******
6. ప్రశ్న:
*ఒక డీజేబుల్డ్ ఉపాధ్యాయునికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి?*
🌼జవాబు:
జీఓ.1063 తేదీ:2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
******
7. ప్రశ్న:
*ఒక టీచర్ ఫిబ్రవరి 29న జాబ్ లో చేరాడు.అతనికి వార్షిక ఇంక్రిమెంట్ ఏ నెలలో ఇవ్వాలి?*
🌼జవాబు:
ఆర్.సి.2071 తేదీ:21.7.2010 ప్రకారం లీపు సంవత్సరం ఫిబ్రవరి 29న విధుల్లో చేరిన ఉపాధ్యాయుల వార్షిక ఇంక్రిమెంట్ ఫిబ్రవరి నెల లోనే ఇవ్వాలి.
******
8. ప్రశ్న:
*బిడ్డ పుట్టి వెంటనే మరణించిన, వారికి మెటర్నిటీ లీవు కి అర్హత ఉందా?*
🌼జవాబు:
Lds.1941 తేదీ:11.6.90 ప్రకారం మరణించిన బిడ్డను ప్రసవించినా,ప్రసూతి సెలవు వాడుకోవచ్చు.

9.ప్రశ్న:
నేను ఎయిడెడ్ స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ గా ఉన్నాను.నేను HM అకౌంట్ టెస్ట్ పాస్ కాలేదు.నేను 6,12,18 ఇయర్స్ స్కేల్స్ పొందాను.నాకు 24 ఇయర్స్ స్కేల్ కి అర్హత ఉన్నదా?
🌼జవాబు:
*ఉన్నది. నేరుగా స్కూల్ అసిస్టెంట్ గా నియమించబడినందున మీరు 24 ఇయర్స్ స్కేల్ పొందాలంటే రెండవ ప్రమోషన్ పోస్ట్ లేనందువలన మీకు అర్హత లతో సంబంధం లేకుండా 24 ఇయర్స్ పూర్తి కాగానే స్కేల్ మంజూరు చేయబడుతుంది.*
******
10. ప్రశ్న:
నేను LFL HM గా పనిచేయుచున్నాను.6 ఇయర్స్ స్కేల్ తీసుకున్నాను.12 ఇయర్స్ స్కేల్ పొందటానికి ఏ ఏ అర్హతలు కావాలి.నాకు ప్రస్తుతం 50 ఇయర్స్ నిండినవి.
🌼జవాబు:
*మీరు 12 ఇయర్స్ స్కేల్ తీసుకోవాలి అంటే డిగ్రీ,బి.ఎడ్ లతో పాటు డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయి ఉండాలి.మెమో.34408 తేదీ:4.2.12 ప్రకారం 50 ఇయర్స్ మినహాయింపు వర్తించదు.*
******
11. ప్రశ్న:
నేను హైస్కూల్ లో పనిచేస్తున్నాను.పరీక్షల నిమిత్తం దాదాపు 35 రోజులు వేసవి సెలవుల్లో బడికి వచ్చాను.నాకు ఎన్ని ELs ఇస్తారు?
🌼జవాబు:
*మీరు 15 రోజుల కన్నా తక్కువ గా వేసవి సెలవులు వినియోగించుకున్నందున FR.82(డి) ప్రకారం 24 రోజులు సంపాదిత సెలవులు ఇవ్వాలి.*
******
12. ప్రశ్న:
నేను రక్త దానం చేశాను. spl. CL ఎవరు ఇస్తారు?
🌼జవాబు:
*జీఓ.137 తేదీ:23.2.84 ప్రకారం రక్త దానం చేస్తే CL మంజూరు చేసే అధికారే spl. CL కూడా మంజూరు చేస్తారు.*

13.*ప్రశ్న :-*
*ఇంక్రిమెంట్ ఉన్న నెలలో మెడికల్ లీవ్ పెట్టి , తరువాత నెలలో విధులలో చేరితే ఇంక్రిమెంట్ ఎప్పట్నుంచి ఇస్తారు ?*
🌼 *జవాబు :-*
*సెలవు ముందు రోజు జీతం ఎంత ఉన్నదో ఆ మొత్తాన్ని సెలవు కాలమంతా జీతముగా చెల్లిస్తారు. విధులలో చేరిన తర్వాత ఇంక్రిమెంట్ మంజూరు చేసి అప్పటి నుండి మాత్రమే ఇంక్రిమెంట్ మొత్తము కలిపి జీతం చెల్లించుతారు.*
*G.O.Ms.133 Fin Dt.13.05.1974*
*G.O.Ms.192 Fin Dt.01.07.1974*

14. ప్రశ్న :-*
*On duty తరువాత రోజు CL పెట్టరాదా ?*
🌼 *జవాబు :-*
*On Duty లో వెళ్లినప్పుడు టి.ఏ తీసుకుంటే CL  పెడితే టి.ఏ చెల్లించబడదు. ఎందుకనగా On Duty .తరువాత Dutyలో తప్పనిసరిగా చేరాలి.టి.ఏ అవసరం లేదంటే CL పెట్టవచ్చును.*

15. *ప్రశ్న :-*
*క్రొత్తగా విధులలో చేరిన ఉద్యోగులు సెలవురోజులలో చేరవచ్చునా ! అభ్యంతరాలు ఉన్నావా ?*
🌼 *జవాబు :-*
*సెలవు రోజులలో చేరకూడదు.*

16.ప్రశ్న:
నేను 31.7.17న రిటైర్డ్ అవుతాను.నా ఇంక్రిమెంట్ నెల ఆగస్టు. నాకు ఇంక్రిమెంట్ ఇస్తారా??
*🌼జవాబు:*
*జీఓ.235 తేదీ:27.10.1998 ప్రకారం ఉద్యోగి రిటైర్ అయిన మరుసటి రోజు గల ఇంక్రిమెంట్ పెన్షన్ కి లెక్కించబడుతుంది.*
******
17.ప్రశ్న:
నేను Sgt నుండి SA గా పదోన్నతి పొందాను.నా కన్నా జూనియర్ sgt నుంచి lfl hm గా పదోన్నతి పొంది , నా కన్నా ఎక్కువ వేతనం పొందుతున్నాడు.ఇపుడు నేను స్టెప్ అప్ చేఇ0చు కోవచ్చా??
*🌼జవాబు:*
*వీలు లేదు. ఒకే కేటగిరీ లో ఒకే సబ్జెక్టులో పదోన్నతి పొందిన వారితో మాత్రమే స్టెప్ అప్ కు అవకాశం ఉంది.*
******
18.ప్రశ్న:
వేసవి సెలవుల్లో ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలకి invegilator గా వెళ్లాను. ఏ జీఓ ప్రకారం ELs జమ చేస్తారు??
*🌼జవాబు:*
*ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వవలసిన అవసరం లేదు. Rc. No.362 తేదీ:16.11.2013 CSE, AP ప్రకారం ELs జమ చేయవచ్చు.*
******
19.ప్రశ్న:
నేను sgt గా చేస్తున్నాను.AU లో అడిషనల్ సబ్జెక్టు గా తెలుగు చేశాను. నాకు SA తెలుగు కి అవకాశం ఉంటుందా??
*🌼జవాబు:*
*తెలుగు అదనపు సబ్జెక్టు గా చేస్తే అర్హత ఉంటుంది. సింగిల్ సబ్జెక్టు గా చేస్తే అర్హత వుండదు.*
******
20. ప్రశ్న:
ఒక ఉపాధ్యాయుడు సస్పెన్షన్ ఐతే,అతనికి PRC వర్తించదా??
*🌼జవాబు:*
*అతను సస్పెన్షన్ కి ముందు రోజు ఉన్న బేసిక్ పే ఆధారంగా PRC చేసుకోవచ్చు.*

21.ప్రశ్న:
నా వయస్సు 55సం.లు. నేను స్కూల్ అసిస్టెంట్ గా 12సం.లు సర్వీసు పూర్తి చేసితిని. 12సం.లు స్కేలు రావడానికి నేను EOT,GOT పరీక్షలు వ్రాసితిని.12సం.లు ఇంక్రిమెంట్ రావడానికి పరీక్షలు వ్రాసే తేదీ నుండి వస్తుందా ? లేదా రిజల్ట్ తేదీ నుండి వస్తుందా ? పరీక్షలు పాస్ కాకపోయినా 12సం.ల స్కేలు వస్తుందా ? ఏఏ అర్హతలు ఉండాలి..?
>జవాబు :
ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ లో 12సం.లు పొందడానికి స్కూల్ అసిస్టెంట్ కేడర్ లో EOT,GOT పరీక్షలు వ్రాసిన ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైతే ఆఖరి పరీక్ష తేదీ నుండి వర్తింపచేయాలి. G.O.Ms.No.93, Dt.03.04.2010లో రెగ్యులర్ ప్రమోషన్ కి ఇచ్చిన రాయితీలు అన్నీ AASకు కూడా వర్తించునని పేర్కొనబడినది.అయితే ఆర్థికశాఖ వారి మెమో నెం.034408/248/PC-2/2011, Dt.02.04.2012 ద్వారా ఈ నిబంధనను నిరాకరిస్తూ వివరణ ఇచ్చినది.కాబట్టి స్కూల్ అసిస్టెంట్ రీమెమో మేరకు 12సం.లు ప్రమోషన్ స్కేలు పొందడానికి EOT,GOT లలో ఉత్తీర్ణత కావలసియున్నది.


22.ప్రశ్న:
స్కూల్ అసిస్టెంట్ తెలుగు పదోన్నతి కి ఏ ఏ అర్హతలు కావాలి??
*🌼జవాబు:*
*జీఓ.15&16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో తెలుగు ఒక సబ్జెక్టు గా మరియు తెలుగు methodology గా బి.ఈ. డి,పండిట్ ట్రైనింగ్ అర్హతలు కలిగి ఉండాలి.అంతే కానీ పి జీ లో తెలుగు ఉన్నంత మాత్రాన పదోన్నతి ఇవ్వరు.జీఓ.28&29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హతతో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి అర్హులే.*
******
23.ప్రశ్న:
సస్పెన్షన్ పీరియడ్ ను అర్హత గల సెలవుగా మంజూరు చేశారు.అంటే ఏమిటి??
*🌼జవాబు:*
*సెలవు నిబంధనలు 1933 ప్రకారం అర్హత గల సెలవు అంటే అర్ధ జీతపు సెలవు లేదా సంపాదిత సెలవు లేదా జీత నష్టపు సెలవు.*
******
24.ప్రశ్న:
ఇంటర్మీడియట్ లో సెకండ్ language గా తెలుగు చదివిన ఒక టీచర్ డిపార్ట్మెంట్ టెస్ట్ లలో తెలుగు పేపర్ రాయాలా??
*🌼జవాబు:*
*అవసరం లేదు.*
******
25.ప్రశ్న:
మా గ్రామ పంచాయతీ ని కొత్త గా మున్సిపాలిటీ లో కలిపారు.నేను cca పొందాలంటే ప్రత్యేకంగా గజిట్ నోటిఫికేషన్ రావాలా??
*🌼జవాబు:*
*అవసరం లేదు. విలీన ఉత్తర్వులు ద్వారా సిసిఏ పొందవచ్చు.*
******
26.ప్రశ్న:
నేను 10వ తరగతి తర్వాత ఇంటర్ చదవకుండా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేశాను. తదుపరి బి.ఎడ్ చేసి ప్రస్తుతం Sgt గా పనిచేస్తున్నాను.నాకు పదోన్నతి ఇస్తారా??ఇవ్వరా??
*🌼జవాబు:*
*స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కి మీకు ఈ అర్హతలు సరిపోతాయి.*

27.సందేహం:*
*సరెండర్ లీవ్ ను నెలలో ఎన్ని రోజులకు లెక్కగడతారు 11 రోజుల సంపాదిత  సెలవులున్నను లీవ్ సరెండర్ చేసుకోవచ్చునా?*
*సమాధానం:*
G.O.Ms.No.306 Fin Dept Dt:8-11-1974ప్రకారం సదరు నెలలో 28/29/30/31 ఎన్ని రోజులున్నను,రోజులతో నిమిత్తం లేకుండా 30 రోజులకు మాత్రమే లీవ్ సరెండర్ లెక్కగట్టి నగదు చెల్లిస్తారు.
♦G.O.Ms.No.334 F&P,Dt:28-9-1977 లో ఇలా వుంది Leave may be surrendered at any time not exceeding 15/30 days...అని వున్నది.అందుచేత 11రోజులు సరెండర్ చేసుకుని నగదు పొందవచ్చు.
♦సరెండర్ లీవు (Surrender Leave) కాలానికి పూర్తివేతనం,ఇతర అలవెన్సులు మంజూరు చేయబడతాయి.IR చెల్లించబడదు.తెలంగాణ ఇంక్రిమెంట్ చెల్లించబడుతుంది.
(Memo No.31948 F&P తేది:12-08-1998)
(Memo No.3572/107/A1/Admn.I/2014 Dt:15-12-2014)
                                                             
28.ప్రశ్న :-*
*డిపార్ట్ మెంట్ పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులు ఎన్నిసార్లు Onduty సౌకర్యం ఏ ఉత్తర్వుల ప్రకారం ఉంటుంది ?*
🌼 *జవాబు :-*
*AP ట్రావలింగ్ రూల్స్ లో 73 ప్రకారం , F.R 9(6)(B)(iii) ప్రకారం ఒక అభ్యర్థి డిపార్ట్ మెంట్ పరీక్షలకు హాజరగుటకు DA లేకుండా రెండుసార్లు TA మరియు OD సౌకర్యాన్ని వినియోగించవచ్చును.*

29.*ప్రశ్న :-*
*SA(Hindi) గా పనిచేయుచున్న నేను HM Post ప్రమోషన్ కు అర్హుడనేనా ?*
🌼 *జవాబు :-*
*అవును. సంబంధిత డిపార్ట్ మెంట్ టెస్టు పాస్ అయి , డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ అయితే 45 సం.లు దాటినా లేదా స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందినవారు 50సం.లు వయస్సు దాటినా హెచ్.ఎం గా ప్రమోషన్ పొందడానికి అర్హులు.10వ తరగతి తర్వాత 5 సంవత్సరములు స్టడీ ఉండాలి.*

30.ప్రశ్న:🔥
*ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు??*
జవాబు:
*రూల్-22A ప్రకారం అన్ని కేటగిరీ లకు చెందిన రిజర్వేషన్ స్థానాలలో మహిళలు కి 33 1/2 % రిజర్వ్ చేయబడి ఉన్నది.sc/st/bc/oc కేటగిరీ ల వారికి కేటాయించబడిన స్థానం లలో ఆయా కేటగిరీ కి చెందిన మొదటి స్థానం, ఆ తదుపరి ప్రతి మూడవ స్థానం మహిళలు కి రిజర్వ్ చేయబడింది. పై రెండు రకాల రిజర్వేషన్లు వర్తింప జేస్తూ కమ్యూనల్ రోస్టర్ తయారు చేయబడుతుంది.*

31.ప్రశ్న:
*DSC లో స్థానికేతర అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారు??*
జవాబు:
*నింపవలసిన ఖాళీలలో ఓపెన్ కాంపిటీషన్ కింద మొదట 20% ఖాళీలను నింపిన తర్వాత మిగిలిన 80% ఖాళీలను కేవలం స్థానిక అభ్యర్థులను మాత్రమే మెరిట్ మరియు రిజర్వేషన్లు ప్రాతిపదికగా ఎంపిక చేస్తారు.*
*20% ఖాళీలను ఓపెన్ కాంపిటీషన్ ద్వారా అనగా మెరిట్ ప్రాతిపదికగా స్థానిక మరియు స్థానికేతరులను ఉమ్మడి గా పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేయాలి.ఆ విధంగా ఓపెన్ కాంపిటీషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు కూడా ఆ 20% ఖాళీలకు ఏ ఏ రోస్టర్ పాయింట్లు వర్తిస్తాయా చూసి,ఆయా రోస్టర్ పాయింట్లకు సరిపడ అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయాలి.*
*స్థానికేతర అభ్యర్థులకు ప్రత్యేక కేటాయింపు ఏది లేదు.ఓపెన్ కాంపిటీషన్ కింద మాత్రమే వారు పరిగణింపబడతారు.*

32.ప్రశ్న:
*రిలింక్విష్ ఇవ్వటం అంటే ఏమిటి??*
జవాబు:
*రిలింక్విష్ అంటే పదోన్నతిని నిరాకరించడం.ప్రమోషన్ శాశ్వతంగా నిరాకరిస్తే స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ లో 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వబడదు.ఒకవేళ అప్పటికే 12 ఇయర్స్ స్కేల్ పొందుతూ ఉంటే 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరు.*

33.ప్రశ్న:
*ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏమిటీ??*
జవాబు:
*మెమో.41758 తేదీ:19.07.2007 ప్రకారం ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే వారసుడి కి కారుణ్య నియామకం కింద ఉద్యోగ0 ఇస్తారు.*

34.సందేహం :-*
*ఒక కన్ను కనబడే ఉద్యోగికి కన్వేయన్స్ ఎలవెన్స్ పొందే అవకాశం ఉన్నదా ?*
🌼 *సమాధానం :-*
*లేదు*
***************************
35.*సందేహం :-*
*నేను SGTగా పనిచేయుచూ 2015 - 16 సం.లో  B.Ed Onduty పై చేసితిని. కాకతీయ విశ్శవిద్యాలయం నిబంధనల మేరకు ఏప్రిల్ 26 నుండి మే 18 వరకు మరియు జూన్ 2 నుండి జూన్ 11 వరకు బి.ఎడ్ కాలేజీలో తరగతులకు హాజరైనందున సంపాదిత సెలవులకు అర్హత ఉన్నదా ?*
🌼 *సమాధానం :-*
*మీరు డెప్యుటేషన్ మీద B.Ed చేసినారు. డెప్యుటేషన్ లో తరగతులకు హాజరైనందున ఆర్జిత సెలవు యివ్వబడవు.*
***************************
36.సందేహం :-*
*610 మేరకు ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు మారితే సీనియారిటీ ఎలా లెక్కపెడతారు ?*
🌼 *సమాధానం :-*
*అతని పాత సీనియారిటీ కొనసాగుతుంది.*
***************************
37.ప్రశ్న:
నేను SA గా పదోన్నతి పొందాను.నాకు ప్రస్తుతం 56 ఇయర్స్.GOT పాస్ అయ్యాను.నాకు 12 ఇయర్స్ స్కేల్ వస్తుందా??
*🌼జవాబు:*
*మెమో.21073 తేదీ:21.2.2009 ప్రకారం మీకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటం సాధ్యపడదు.*
******
38.ప్రశ్న:
నేను 19 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను.వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి అవకాశం ఉందా??
*🌼జవాబు:*
*వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి 20 ఇయర్స్ సర్వీసు తప్పక ఉండాలి.ఐతే 20 ఇయర్స్ సర్వీసు లేకుండానే ఒక టీచర్ కి జీఓ.51  తేదీ:24.8.13 ప్రకారం వాలంటరి రిటైర్మెంట్ కి అవకాశం కల్పించారు. మీరు కూడా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు పొందవలసి ఉంటుంది.*
******
39.ప్రశ్న:
11 రోజులను కూడా సరెండర్  చేసుకోవచ్చా??
*🌼జవాబు:*
*జీఓ.334 తేదీ:28.9.1977 ప్రకారం 11 రోజులు కూడా సరెండర్ చేసుకొని నగదు పొందవచ్చు.*
******
40.ప్రశ్న:
సరెండర్ కాలానికి ఏవేవి చెల్లించబడతాయి??
*🌼జవాబు:*
*జీఓ.172 తేదీ:1.7.74 ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్, అడిషనల్ ఇంక్రిమెంట్ లు,స్పెషల్ పే చెల్లించబడతాయి.ఐతే IR మాత్రం చెల్లించబడదు.*

41.ప్రశ్న:
*కొత్తగా ఉద్యోగంలో చేరే వ్యక్తి సెలవు రోజు జాయిన్ అవ్వవచ్చా??*
📍జవాబు:
*ఖచ్చితంగా వర్కింగ్ డే నాడే చేరాలి.*

42.ప్రశ్న:
*ఒక టీచర్ జులై నుంచి డిసెంబర్ వరకు ప్రసూతి సెలవులో ఉన్నారు.అక్టోబర్ నెలలో ఇంక్రిమెంట్ కలదు.ఇస్తారా??*
📍జవాబు:
*ఇంక్రిమెంట్ తేదీ నుంచి సెలవు లో ఉన్నప్పుడు సెలవు అనంతరం విధులలో చేరిన తేదీ నుంచి మాత్రమే ఆర్ధిక లాభం వచ్చేవిధంగా ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది.*

43.ప్రశ్న:
*అర్ధ జీతపు సెలవు ఎన్ కాష్ మెంట్ ఎలా??*
📍జవాబు:
*జీఓ.148 తేదీ:21.8.2017 న ఆర్ధిక శాఖ విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం రిటైర్మెంట్ అనంతరం ఎరెoడ్ లీవ్ మరియు అర్ధ జీతపు సెలవు కలిపి 300 రోజులకి ఎన్ క్యాష్  చేసుకోవచ్చు.*

44.ప్రశ్న:
*ఇపుడు కారుణ్య నియామకాలకు అర్హత ఏమిటీ??*
📍జవాబు:
*జీఓ.112 తేదీ:18.8.2017 ప్రకారం జూనియర్ అసిస్టెంట్/టైపిస్టు స్థాయి పోస్టులకు కారుణ్య నియామకం లకి ఇంటర్మీడియట్ కనీస అర్హత.2015 లో రాష్ట్ర ప్రభుత్వం కనీస అర్హతగా డిగ్రీ చేసింది. దీన్ని ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ గా మార్పు చేసింది. ఐతే ఇలా నియామకం పొందిన వారు 5 ఇయర్స్ లోగా డిగ్రీ అర్హత సంపాదించాలి.*

45.ప్రశ్న:
*ఆన్ డ్యూటీ తర్వాత రోజు CL పెట్టవచ్చా??*
📍జవాబు:
*కొన్ని సందర్భంలలో OD పై వెళ్ళినప్పుడు TA చెల్లిస్తారు. అదే మీరు తర్వాత రోజు CL పెడితే TA చెల్లించరు.TA వద్దనుకుంటే CL పెట్టుకోవచ్చు.*

46.ప్రశ్న:
*ఉమ్మడి సర్వీసు రూల్స్ లో డిపార్ట్మెంట్ టెస్టుల ప్రస్తావన ఏమిటి??*
📍జవాబు:
*బి.కామ్ , కామర్స్ అర్హత లు కలిగిన వారికి పదోన్నతి కి అవకాశం కల్పించారు. గజిటెడ్ ఆఫీసర్ పోస్టులకు ఈఓ,జిఓ టెస్టులు పాస్ కావాలి.45 ఇయర్స్ వయస్సు దాటిన వారికి మొదటి పదోన్నతి,50 ఇయర్స్ వయస్సు దాటిన వారికి టెస్టుల నుండి మినహాయింపు ఇచ్చారు.*

47.ప్రశ్న:
పెన్షనర్
మరణించినపుడు కుటుంబ సభ్యులు ఏమి చెయ్యాలి??
జవాబు:
పెన్షనర్ మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు ట్రెజరీ లో తెలియపరచాలి.తెలియ పరచకుంటే మరల లైఫ్ సెర్టిఫికెట్(ప్రస్తుతం డిజిటల్ బయోమెట్రిక్/ఐరిష్)ఇచ్చే వరకు నెల నెలా పెన్షన్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. ఎటిఎం తో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ భాద్యత గల పౌరులుగా అలా చేయడం తప్పు.రెండవది ప్రభుత్వంనకు ఈ విషయం తెలిసినా లేదా ఎవరైనా కంప్లైంట్ చేసినా క్రిమినల్ కేసులు పెడతారు. అందువల్ల వెంటనే ట్రెజరీలో తెలియపరచాలి.చనిపోయిన రోజు వరకు పెన్షన్ లెక్కకట్టి అకౌంట్ లో వేస్తారు.

48.ప్రశ్న:
PRC లో ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చా??
జవాబు:
వెనుకటి తేదీ నుంచి వేతనం మారిన సందర్భంలో తప్ప,సాధారణంగా ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మార్చుకొనే అవకాశం లేదు.

49.ప్రశ్న:
స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఎవరికి ఇస్తారు??
జవాబు:
ఒక ఉద్యోగి తాను పొందుతున్న వేతన స్కేలు గరిష్టం చేరిన తరువాత ఇంకా సర్వీసు లో ఉంచి ఇంక్రిమెంట్లు మంజూరు చేయవలసి ఉన్నప్పుడు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తారు.2015 PRC లో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు కి అవకాశం కల్పించారు.

50.ప్రశ్న:
వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన ప్రసూతి సెలవు ఎలా మంజూరు చేస్తారు??
జవాబు:
వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన, ప్రసవించిన రోజు నుండి 180 రోజుల వేసవి సెలవులు పోను మిగిలిన రోజులకు ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు.

51.ప్రశ్న:
ఐటీ రిటర్న్ అందరూ సమర్పించాలా??
జవాబు:
2,50,000రూ ఆదాయం దాటిన వారందరూ ఆగస్టు 31లోగా రిటర్న్ దాఖలు చెయ్యాలి. వేతన ఆదాయం మాత్రమే ఉన్నవారు ITR--1 ఫారంలో ఈ--ఫైలింగ్ చేయవచ్చు.

52.ప్రశ్న:
నాకు ఈ నెలలో ఇంక్రిమెంట్ ఉంది.కానీ మెడికల్ లీవు పెట్టాను.నాకు ఈ నెలలో ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారా??చెయ్యరా??
జవాబు:
జీఓ.192 తేదీ:1.7.74 ప్రకారం మీరు ML లో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్ ఇవ్వటం కుదరదు.మీరు ఎపుడు జాయిన్ ఐతే అప్పుడు నుండి మాత్రమే ఇంక్రిమెంట్ ఇవ్వటం జరుగుతుంది.అప్పటి వరకు పాత జీతమే వస్తుంది.

53.ప్రశ్నా: ఉపాధ్యాయులకు ఒక రోజు కూడ మెడికల్ లీవ్ మంజూరు చేయవచ్చునా?*
జవాబు:
*చేయవచ్చు APLR-1933 రూల్స్ 13 మరియు 15 బి ప్రకారం వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు లేదా అర్థవేతన సెలవు ఒక్క రోజు కూడా మంజూరు చేయవచ్చు.కనీస పరిమితి లేదు.అయితే ఒక్క రోజైనా సెలవు కొరకు ఫారం-A,జాయినింగ్ కొరకు    ఫారం-B వైద్య ధ్రువపత్రాలు సమర్పించాలి.*

54.ప్రశ్న:
*కొత్తగా ఉద్యోగంలో చేరే వ్యక్తి సెలవు రోజు జాయిన్ అవ్వవచ్చా??*
🌾జవాబు:
*ఖచ్చితంగా వర్కింగ్ డే నాడే చేరాలి.*

55.ప్రశ్న:
*ఒక టీచర్ జులై నుంచి డిసెంబర్ వరకు ప్రసూతి సెలవులో ఉన్నారు.అక్టోబర్ నెలలో ఇంక్రిమెంట్ కలదు.ఇస్తారా??*
జవాబు:
*ఇంక్రిమెంట్ తేదీ నుంచి సెలవు లో ఉన్నప్పుడు సెలవు అనంతరం విధులలో చేరిన తేదీ నుంచి మాత్రమే ఆర్ధిక లాభం వచ్చేవిధంగా ఇంక్రిమెంట్ మంజూరు చేయబడుతుంది.*

56.ప్రశ్న:
*అర్ధ జీతపు సెలవు ఎన్ కాష్ మెంట్ ఎలా??*
జవాబు:
*జీఓ.148 తేదీ:21.8.2017 న ఆర్ధిక శాఖ విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం రిటైర్మెంట్ అనంతరం ఎరెoడ్ లీవ్ మరియు అర్ధ జీతపు సెలవు కలిపి 300 రోజులకి ఎన్ క్యాష్  చేసుకోవచ్చు.*

57.ప్రశ్న:
*ఇపుడు కారుణ్య నియామకాలకు అర్హత ఏమిటీ??*
జవాబు:
*జీఓ.112 తేదీ:18.8.2017 ప్రకారం జూనియర్ అసిస్టెంట్/టైపిస్టు స్థాయి పోస్టులకు కారుణ్య నియామకం లకి ఇంటర్మీడియట్ కనీస అర్హత.2015 లో రాష్ట్ర ప్రభుత్వం కనీస అర్హతగా డిగ్రీ చేసింది. దీన్ని ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ గా మార్పు చేసింది. ఐతే ఇలా నియామకం పొందిన వారు 5 ఇయర్స్ లోగా డిగ్రీ అర్హత సంపాదించాలి.*

58.ప్రశ్న:
*ఆన్ డ్యూటీ తర్వాత రోజు CL పెట్టవచ్చా??*
🌾జవాబు:
*కొన్ని సందర్భంలలో OD పై వెళ్ళినప్పుడు TA చెల్లిస్తారు. అదే మీరు తర్వాత రోజు CL పెడితే TA చెల్లించరు.TA వద్దనుకుంటే CL పెట్టుకోవచ్చు.*

59.ప్రశ్న:
*ఉమ్మడి సర్వీసు రూల్స్ లో డిపార్ట్మెంట్ టెస్టుల ప్రస్తావన ఏమిటి??*
జవాబు:
*బి.కామ్ , కామర్స్ అర్హత లు కలిగిన వారికి పదోన్నతి కి అవకాశం కల్పించారు. గజిటెడ్ ఆఫీసర్ పోస్టులకు ఈఓ,జిఓ టెస్టులు పాస్ కావాలి.45 ఇయర్స్ వయస్సు దాటిన వారికి మొదటి పదోన్నతి,50 ఇయర్స్ వయస్సు దాటిన వారికి టెస్టుల నుండి మినహాయింపు ఇచ్చారు.*

60. NPS/CPS *ఉద్యోగులకు 50వేల అదనపు పన్నురాయితీ వర్తిస్తుందా?*
A) వర్తిస్తున్నది అయితే దీనిని మ్యానువల్ రిటర్న్ లలో అనుమతించనప్పటికి ప్రస్తుతం e ఫైలింగ్ లో అనుమతించ బడుతున్నది.

61. *e ఫైలింగ్ ఎపుడు చేయవచ్చు*
మన DDO లు సంబందిత ఫైనాన్షియల్ ఇయర్ TDS చేసివుంటే మన e ఫైలింగ్ చేయవచ్చు.

62.*నేను ఇది వరకే టాక్స్ చెల్లించా నాకు కట్టిన టాక్స్ రిటర్న్ వస్తుందా*
ఖచ్చితంగా
మీరు అదనంగా కట్టిన టాక్స్ మీ బ్యాంక్ ఖాతాకు జమచేయబడుతుంది.

63.*నేను ఒక cps ఉద్యోగిని ఏ సందర్భంలో50వేల రూపాయలు టాక్స్ ఎక్జంప్సన్  క్లైం చేసుకోవచ్చు*
మీ సేవింగ్స్ 80CC ప్రకారం *1.5*లక్షలు దాటి వున్నపుడు మాత్రమే అదనంగా 50వేల రూపాయల టాక్స్ ఎక్జంప్సన్ వర్తిస్తుంది(eఫైలింగ్ చేస్తే).లేదంటే వర్తించదు.

64.ప్రశ్న:
ఉదయం CL పెట్టి మధ్యాహ్నం బడికి వెళ్లాలని అనుకుంటే ఎలా చేయాలి??
*🌼జవాబు:*

APTeLS యాప్ లో ఒక పూట సెలవుకి ఆప్షన్ లేదు. మనం ఉదయం పూట సెలవు పెట్టాలనుకుంటే, ముందుగా ఒక రోజు మొత్తానికి అప్లై చేయాలి. తదుపరి మనం సెలవు పెట్టిన రోజు మధ్యాహ్నం బడికి వెళ్ళి  IRIS login కాగానే ఆటోమేటిగ్గా ఉదయం సెలవు, మధ్యాహ్నం హాజరు నమోదౌతుంది.*

65. >ప్రశ్న :
SGTలలో  50 సం.లు దాటినవారు 24 సం.ల స్కేలు పొందుటకు అర్హులా..?
>జవాబు :
కారు.వారు G.O.Ms.No.93,Dt.03.04.2010 ప్రకారం సదరు ఉపాధ్యాయులు అందుకు సంబంధించిన విద్యార్హతలు మరియు డిపార్ట్ మెంట్ టెస్టులు ఉత్తీర్ణత పొంది ఉండాలి.


66.ప్రశ్న:
ఉదయం బడికి వెళ్లి,మధ్యాహ్నం CL పెట్టాలి అంటే ఎలా చేయాలి??
*🌼జవాబు:*
*బడికెళ్ళాక మధ్యాహ్నం సెలవు కావాల్సి వస్తే మొత్తం రోజుకి సెలవు అప్లై చేస్తే ఆటోమేటిగ్గా కేవలం మధ్యాహ్నం ఒక్క పూటకే సెలవు నమోదౌతుంది.*
******
67.ప్రశ్న:
టాబ్ లో ఈ రోజు సాయంత్రం(బడి వదిలే ముందు)రేపటి కోసం CL అప్లై చేశాను. ఐతే నాకు పని పూర్తి అయినందున బడికి వెళ్లాలని అనుకుంటున్నాను.నేను ఇప్పుడు ఏమి చేయాలి?? ఇటువంటి సమస్య కోసం ఏదైనా ఆప్షన్ ఉందా??నా CL పోయినట్లేనా??
*🌼జవాబు:*
*మీరు CL నష్టపోవాల్సిన అవసరం లేదు. మీరు స్కూల్ కి వెళ్లి ఐరిష్/థంబ్ వేయగానే ముందు రోజు మీరు అప్లై చేసిన CL ఆటోమాటిక్ గా రద్దు అవుతుంది.*
******
68.ప్రశ్న:
నా వయస్సు 55సం.లు. నేను స్కూల్ అసిస్టెంట్ గా 12సం.లు సర్వీసు పూర్తి చేసితిని.12సం.లు స్కేలు రావడానికి నేను EOT,GOT పరీక్షలు పాస్ అయ్యాను.నాకు12సం.లు ఇంక్రిమెంట్ ఏ తేదీ నుంచి ఇస్తారు??
*🌼జవాబు :*
*ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ లో 12 సం.లు పొందడానికి స్కూల్ అసిస్టెంట్ కేడర్ లో EOT,GOT పరీక్షలు వ్రాసి ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైతే ఆఖరి పరీక్ష తేదీ నుండి వర్తింపచేయాలి.*
******
69.ప్రశ్న:
నాకు 50 ఇయర్స్ దాటినవి.నేను స్కూల్ అసిస్టెంట్ గా పనిచేయుచున్నాను.నాకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటానికి EOT, GOT పాస్ కావాలా??
*🌼జవాబు:*
*G.O.Ms.No.93, Dt.03.04.2010 లో రెగ్యులర్ ప్రమోషన్ కి ఇచ్చిన రాయితీలు అన్నీ AASకు కూడా వర్తించునని పేర్కొనబడినది.అయితే ఆర్థికశాఖ వారి మెమో నెం.034408/248/PC-2/2011, Dt.02.04.2012 ద్వారా ఈ నిబంధనను నిరాకరిస్తూ వివరణ ఇచ్చినది.కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కూడా 12సం.లు ప్రమోషన్ స్కేలు పొందడానికి EOT,GOT లలో ఉత్తీర్ణత కావలసియున్నది.*

70.ప్రశ్న :
SGTలలో  50 సం.లు దాటినవారు EOT, GOT పాస్ కాకుండా 24 సం.ల స్కేలు పొందుటకు అర్హులా..?
*🌼జవాబు:*
కారు.వారు కూడా G.O.Ms.No.93,Dt.03.04.2010 ప్రకారం  అందుకు సంబంధించిన విద్యార్హతలు మరియు డిపార్ట్ మెంట్ టెస్టులు ఉత్తీర్ణత పొంది ఉండాలి.*
******
71.ప్రశ్న:
నా భార్య టీచర్.ఆమె మరణించి0ది.రిటైర్మెంట్ బెనిఫిట్ ఎవరు పొందుతారు??
*🌼జవాబు:*
*భార్యాభర్తలు ఇద్దరూ టీచర్లు అయి, భార్య మరణించిన సందర్భంలో భార్య యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ లు & పెన్షన్ భర్త తీసుకోవచ్చు.*
*అలా కాకుండా భార్య మరణించిన తరువాత సమర్పించే ఫారాలు లో నామినీ గా కొడుకు పేరు రాస్తే(కొడుకు కి 18 సంవత్సరం లు పైన ఉండాలి) భార్య యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ లు మొత్తం కొడుకు తీసుకుంటాడు.*

72.ప్రశ్న:
ఈ--ఫైలింగ్ ఎప్పుడు చెయ్యాలి??
*🌷జవాబు:*
*ముందుగా 26 ఏఎస్ ఫారం పరిశీలించుకోవాలి.దానిలో మనం చెల్లించిన ఆదాయపన్ను మొత్తం జమ ఐనది, లేనిదీ తెలుస్తుంది. అది సరిగా ఉన్నప్పుడే ఈ-ఫైలింగ్ కి వెళ్ళాలి.జులై 31 లోగా ఈ-ఫైలింగ్ చేయవలసి ఉంటుంది. అకనాలెడ్జిమెంట్ కింది భాగంలో పంపమని నోట్ ఉన్న వారు తప్పనిసరిగా  అకనాలెడ్జిమెంట్ ని డిపార్ట్మెంట్ కి పంపాలి.*
*****
73.ప్రశ్న:
కారుణ్య నియామకాలకి గరిష్ట వయోపరిమితి ఎంత??
*🌷జవాబు:*
*భార్య/భర్త కారుణ్య నియామకం పొందవలసి వచ్చినప్పుడు గరిష్ట వయసు 45 సంవత్సరాలు.మిగిలిన వారి విషయంలో సాధారణ నియామక వయోపరిమితి వర్తిస్తుంది.*
*****
74.ప్రశ్న:
సర్వీస్ రూల్స్ వచ్చినందున మున్సిపల్ టీచర్లు కూడా ఈఓ,జీఓ టెస్టులు రాయాలా??
*🌷జవాబు:*
*జీఓ.320 తేదీ:7.12.2016 ప్రకారం HM అకౌంట్ టెస్ట్ ఉతీర్ణులు అయిన వారిని సర్వీసు రూల్స్ వచ్చిన 3 సంవత్సరంల వరకు పదోన్నతి కి పరిగణనలోకి తీసుకుoటారు.*
*****
75.ప్రశ్న:                                             

 డిగ్రీ పూర్తిచేశాను. ప్రస్తుతం దూరవిద్య ద్వారా ఎంఏ (తెలుగు) చేస్తున్నాను. దీంతోపాటు బ్యాచిలర్‌ ఇన్‌ లైబ్రరీ సైన్స్‌ను కూడా ఒకేసారి దూరవిద్యలో చేద్దామనుకుంటున్నాను. కుదురుతుందా?
*🌷జవాబు:*
*ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులను లేదా పీజీ కోర్సులను, ఒక డిగ్రీ, ఒక పీజీ కోర్సును విద్యార్థులు* *అభ్యసించినట్లయితే ఏదేని ఒక కోర్సు మాత్రమే పరిగణనలోకి వస్తుంది. మీరు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి తగినదాన్ని చూపించుకోవాల్సి* *ఉంటుంది. కాబట్టి సంబంధిత ఉద్యోగ ప్రకటననుబట్టి మీ విద్యార్హతను వాడుకోవాలి. అంతేతప్ప రెండు కోర్సులనూ ఒకే ఏడాది పూర్తిచేసినట్లు చూపిస్తే కొన్నిసార్లు చిక్కులు ఏర్పడే అవకాశముంది. కొన్ని సంస్థలు ఒక దూరవిద్య కోర్సు, ఒక రెగ్యులర్‌ కోర్సుకు వెసులుబాటు కల్పిస్తాయి.*
*దూరవిద్య కోర్సును అభ్యసించేముందు సంబంధిత విశ్వవిద్యాలయానికి డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ వారి అనుమతి ఉందో లేదో తెలుసుకోవాలి. అనుమతి ఉన్న విశ్వవిద్యాలయం నుంచే కోర్సును అభ్యసించాలి.*
*****
76.ప్రశ్న:
CPS ఉద్యోగులకు 50 వేల అదనపు పన్నురాయితీ కి అవకాశం ఉందా??
*🌷జవాబు:*
*అవకాశం ఉంది.అయితే దీనిని మ్యానువల్ రిటర్న్ లలో అనుమతించనప్పటికి ప్రస్తుతం e ఫైలింగ్ లో అనుమతించ బడుతున్నది.*

77.ప్రశ్న:
ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా ?
*🌼జవాబు:*
*G.O.Ms.No.802 తేది:21.4.1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి.*
*****
78.ప్రశ్న:
ప్రసూతి సెలవులో ఉన్నవారికి జీతం విధుల్లో చేరిన తరువాత ఇస్తారా? ప్రతినెలా ఇవ్వవచ్చునా ?
*🌼జవాబు:*
*A.P.Fundamental Rule 74(a) క్రింద గల సబ్ రూల్ 32 ప్రకారంగా &Leave Salary payable in India after the end of each calender month& కాబట్టి నెలనెలా జీతం చెల్లించవచ్చు.*
*****
79.ప్రశ్న:
సాధారణంగా వార్షిక ఇంక్రిమెంట్ ను మంజూరు చేయకుండా నిలుపుదల చెయ్యవచ్చునా ?
*🌼జవాబు:*
*FR-24 లో &Increment should be drawn as a matter of course,unless it is withheld& అని ఉంది.క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారి నుండి ఇంక్రిమెంటు నిలుపుదల చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు ఉంటే తప్ప వార్షిక ఇంక్రిమెంటు యథావిధిగా మంజూరు చేయాల్సిందే.*
*****
80.ప్రశ్న:
కారుణ్య నియామక  పథకం క్రింద ఉద్యోగం పొందిన ఆమెకు భర్త తరఫున కుటుంబ పెన్షన్ వస్తుందా? డి.ఏ రెండిటిపైనా చెల్లిస్తారా?
*🌼జవాబు:*
*కుటుంబ పెన్షన్ వస్తుంది.కాని  G.O.Ms.No.125 F&P తేది:01.09.2000 ప్రకారం రెండిటిపైన కరువుభత్యాలు రావు.అయితే రెండింటిలో ఏది లాభకరమో అది ఎంచుకునే అవకాశం సదరు ఉద్యోగికి ఉన్నది.*
*****
81.ప్రశ్న:
ఒక సంవత్సర కాలంలో ఆరు మాసములు జీతనష్టపు సెలవుపై వెళ్ళిన,ఆ కాలానికి అర్ధజీతపు సెలవు యధాతధంగా జమచెయ్యవచ్చునా ?
*🌼జవాబు:*
*జమ  చెయ్యవచ్చును. సెలవు నిబంధనలు 1933 లోని రూలు 13(a) ప్రకారం మంజూరు చేయబడిన జీతనష్టపు సెలవు లేదా అసాధారణ సెలవు కూడా సర్వీసుగానే పరిగణించబడుతుంది.*
*****
82.ప్రశ్న:
నేను ఒక cps ఉద్యోగిని. ఏ సందర్భంలో50వేల రూపాయలు టాక్స్ ఎక్జంప్సన్  క్లైం చేసుకోవచ్చు.
*🌼జవాబు:*
*మీ సేవింగ్స్ 80CC ప్రకారం 1.5 లక్షలు దాటి వున్నపుడు మాత్రమే అదనంగా 50వేల రూపాయల టాక్స్ ఎక్జంప్సన్ వర్తిస్తుంది(eఫైలింగ్ చేస్తే)లేదంటే వర్తించదు.*
*****
83.ప్రశ్న:
ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ మరియు అదనపు విద్యా అర్హతలకి ఇంక్రిమెంట్లు ఎప్పటి నుంచి నిలుపుదల చేశారు??
*🌼జవాబు:*
*వీటిని 98 వేతన స్కేల్స్ లో నిలుపుదల చేశారు.ఈ నిలుపుదల 1.7.98 నుండి అమలు చేశారు.1.7.98 ముందు వారికి ఈ ఇంక్రిమెంట్లు వర్తిస్తాయి.*
*****
84.ప్రశ్న:
ఐటీ లో ధార్మిక సంస్థ లకి ఇచ్చే విరాళాలు పై ఎంత మినహాయింపు వర్తిస్తుంది??
*🌼జవాబు:*
*కొన్ని సంస్థలకి 100% , మరికొన్ని సంస్థ లకి 50% పన్ను మినహాయింపు వర్తిస్తుంది.*

85.ప్రశ్న:
పండుగ అడ్వాన్స్ ఎవరికి ఇస్తారు??
*🌼జవాబు:*
*జీఓ.167 తేదీ:20.9.17 ప్రకారం వేతన స్కేల్ 26600-77030 లేదా అంతకంటే తక్కువ స్కేల్ గల ఉద్యోగుల కి 7500రూ మరియు నాల్గవ తరగతి ఉద్యోగుల కి 5000రూ పండుగ అడ్వాన్స్ గా చెల్లిస్తారు.*
*****
86.ప్రశ్న:
నాకు ఉద్యోగం రాకముందు పాప ఉంది. ఉద్యోగం లో చేరిన తరువాత ఒకసారి ప్రసూతి సెలవు వాడుకున్నాను.మరొక పర్యాయం ప్రసూతి సెలవు వాడుకోవచ్చునా??
*🌼జవాబు:*
*ఇద్దరు జీవించి ఉన్న పెద్ద పిల్లలు వరకు మాత్రమే ప్రసూతి సెలవు మంజూరు చేయబడుతుంది.బిడ్డ పుట్టినది ఉద్యోగం రాక పూర్వమా?వచ్చిన తరువాతా?అనే దానితో నిమిత్తం లేదు.కావున మూడవ బిడ్డకి ప్రసూతి సెలవు కి మీకు అవకాశం లేదు.*
*****
87.ప్రశ్న:
SSC డూప్లికేట్ సర్టిఫికేట్ పొందటానికి ఏమి చెయ్యాలి??
*🌼జవాబు:*
*అభ్యర్థి దరఖాస్తు,250రూ ల చలానా,నోటరీ చే దృవీకరించిన 50రూ,ల అఫిడవిట్, అభ్యర్థి డిక్లరేషన్, ssc రికార్డు నకలు జతపరచి ప్రభుత్వ పరీక్షల సంచాలకులు వారికి పంపుకోవాలి.*
*****
88.ప్రశ్న:
ఉద్యోగి మరణించిన సందర్భంలో CPS డబ్బులు ఎలా తీసుకోవాలి??
*🌼జవాబు:*
*103-జీడీ ఫారం లో సంబంధిత పత్రాలు జాతపరచాలి. చివరి నెల చందా చెల్లించిన ddo ద్వారా ట్రెజరీ అధికారులు ద్వారా పి ఆర్ ఏ ముంబై కి పంపుకుంటే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబడతాయి.*
*****
89.ప్రశ్న:
ఉపాధ్యాయులకు ఒక రోజు కూడ మెడికల్ లీవ్ మంజూరు చేయవచ్చునా..?
*🌼జవాబు:*
*చేయవచ్చు. APLR-1933 రూల్స్ 13 మరియు 15 బి ప్రకారం వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు లేదా అర్థవేతన సెలవు ఒక్క రోజు కూడా మంజూరు చేయవచ్చు.కనీస పరిమితి లేదు. అయితే ఒక్క రోజైనా సెలవు కొరకు ఫారం-A, జాయినింగ్ కొరకు ఫారం-B వైద్య ధ్రువపత్రాలు సమర్పించాలి.*
*****
90.ప్రశ్న:
చైల్డ్ కేర్ లీవ్ ఇద్దరు పిల్లలకు చెరో 60 రోజులు వాడుకోవచ్చా??
*🌼జవాబు:*
*అలా కుదరదు.ఇద్దరు పెద్ద పిల్లలు కి 18 ఇయర్స్ నిండే లోపు 60 రోజులు మాత్రమే వాడుకోవాలి.అనగా టీచర్ కి 60 రోజులు అని అర్థం.*

91.ప్రశ్న:
అర్ధజీతపు సెలవు కాలానికి HRA సగమే చెల్లిస్తారా??
*🍁జవాబు:*
*జీఓ.28 తేదీ:9.3.2011 ప్రకారం 6 నెలల వరకు HRA పూర్తిగా చెల్లించాలి.*
~~~~~
92.ప్రశ్న:
నా వయస్సు 57 ఇయర్స్.నేను ఇప్పుడు APGLI ప్రీమియం పెంచవచ్చా??
*🍁జవాబు:*
*జీఓ.36 తేదీ:5.3.2016 ప్రకారం 55 ఇయర్స్ తర్వాత ప్రీమియం పెంచటం కుదరదు.బాండ్ కూడా ఇవ్వరు.*
~~~~~

93.ప్రశ్న:
చైల్డ్ కేర్ లీవ్ సంవత్సరం లో 20 రోజులు మాత్రమే వాడుకోవాలా??
*🍁జవాబు:*
*జీఓ.132 తేదీ:6.7.2016 ప్రకారం లీవు మూడు సార్లు తక్కువ కాకుండా వాడుకోవాలని మాత్రమే ఉన్నది.*
~~~~~
94.ప్రశ్న:
నేను మున్సిపాలిటీ లో టీచర్ గా పని చేస్తున్నాను.నేను ఏ ఏ టెస్టులు పాస్ కావాలి?
*🍁జవాబు:*
*మున్సిపల్ సర్వీస్ రూల్స్ వచ్చిన 7.12.2016 నాటికి HM a/c టెస్టు పాస్ అయి ఉంటే 3 ఇయర్స్ వరకు EOT, GOT పాస్ కానవసరం లేదు.తదుపరి SA లు 12 ఇయర్స్ స్కేల్ కొరకు,SGT లు 24 ఇయర్స్ స్కేల్ కొరకు EOT, GOT తప్పక పాస్ కావాలి.*
~~~~~
95.ప్రశ్న:
తల్లి పేరు కూడా అడ్మిషన్ రిజిస్టర్ లో రాయాలా??
*🍁జవాబు:*
*విద్యా శాఖ ఉత్తర్వులు మెమో.7679 తేదీ:14.9.2010 ప్రకారం తల్లి పేరు కూడా అడ్మిషన్ రిజిస్టర్ లో తప్పక రాయాలి.*
~~~~~
96.ప్రశ్న
నేను 24 ఇయర్స్ స్కేల్ పొందిన పిదప పదోన్నతి పొందాను.నా వేతనం FR--22బి ప్రకారం నిర్ణయించబడే అవకాశం ఉందా??
*🍁జవాబు:*
*లేదు.మీకు FR--22ఎ(i) ప్రకారం మాత్రమే వేతన నిర్ణయం జరుగుతు0ది.*
~~~~~

97.ప్రశ్న:
మొదటి బిడ్డ పుట్టినప్పుడు పితృత్వ సెలవు వాడుకోలేదు.రెండవ బిడ్డ పుట్టినప్పుడు వాడుకున్నాను.ప్రస్తుతం మూడవ బిడ్డ పుట్టినది. ఇపుడు సెలవు వాడుకోవచ్చా??
*🍁జవాబు:*
*అవకాశం లేదు. జీఓ.231 తేదీ:16.9.2005 ప్రకారం పితృత్వ సెలవు ఇద్దరు జీవించియున్న పెద్ద పిల్లలు కి మాత్రమే వర్తిస్తుంది.*

98.ప్రశ్న:
నేను త్వరలో రిటైర్మెంట్ కాబోతున్నాను.పెన్షన్ బెనిఫిట్ లు ఐటీ లో చూపాలా??
*🍁జవాబు:*
*పెన్షన్ ను ఆదాయం గా చూపాలి.గ్రాట్యుటీ, కమ్యుటేషన్,సంపాధిత సెలవు నగదుగా మార్చుకోనుట ఆదాయం పరిధిలోకి రావు.*
*****
99.ప్రశ్న:
నేను బదిలీ అయ్యాను.పాత మండలం లో చాలా ఎంట్రీ లు వేయలేదు.ఇంతలో పాత MEO రిటైర్మెంట్ అయ్యాడు.ఆ ఎంట్రీ ల కోసం నేను ఇప్పుడు ఏమి చేయాలి??
*🍁జవాబు:*
*సంబంధిత ఆధారాలతో ప్రస్తుత MEO సరిచేయవచ్చ.*
*****
100.ప్రశ్న:
నేను DEO గారి అనుమతి తో లీన్ పై ఇతర రాష్ట్రంలో ఉద్యోగం నకు ఎంపిక అయ్యాను.నేను ఆ ఉద్యోగం లో ఇమడ లేకపోతే తిరిగి నా సొంత పోస్టుకి రావచ్చునా??
*🍁జవాబు:*
*జీఓ.127 తేదీ:8.5.12 ప్రకారం కొత్త పోస్టులో ప్రొబేసన్ డిక్లరేషన్ ఐన తేదీ, లేదా పోబేషన్ డిక్లరేషన్ అయినట్లు భావించబడే తేదీ లేదా నూతన పోస్టు లో చేరిన తేదీ నుంచి 3 ఇయర్స్ లో ఏది ముందు ఐతే ఆ తేదీ వరకు పాత పోస్టుపై లీన్ కొనసాగుతుంది.అప్పటిలోగా మీరు పాత పోస్టుకి వచ్చే అవకాశం ఉంటుంది.*
*****
101.ప్రశ్న:
బోన్ టీబీ కి ప్రత్యేక సెలవు ఉన్నదా??
*🍁జవాబు:*
*6 నెలల వరకు పూర్తి జీతంపై అర్ధ జీతపు సెలవు మంజూరు చేస్తారు.*
*****
102.ప్రశ్న:
నేను జీత నష్టపు సెలవు పెట్టి M. ed చేయాలని అనుకుంటున్నాను.నేను ఏమి నష్ట పోతాను??
*🍁జవాబు:*
*జీత నష్టపు సెలవు పెట్టినంతకాలం ఇంక్రిమెంట్,AAS స్కేల్స్ వాయిదా పడతాయి.3 ఇయర్స్ పైన జీత నష్టపు సెలవు కాలం పెన్షన్ కి అర్హ దాయక సర్వీస్ గా పరిగణింపబడదు.*




                                             
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
103. ప్రశ్న:
ఒక టీచర్ వేసవి సెలవుల్లో 35 రోజులు వివిధ రకాల ప్రభుత్వ పరీక్షలకి హాజరు అయ్యాడు.అతనికి ఎన్ని ELs జమచేయబడతాయి??

*🌼జవాబు:*
*వినియోగించుకున్న వేసవి సెలవులు 14 రోజులే కనుక 24 రోజుల ELs జమ చేయబడతాయి.*

*****

104. ప్రశ్న:
మా స్కూల్లో నలుగురు SGT లు ఒకే DSC లో ,ఒకే రోజు స్కూల్లో జాయిన్ అయ్యారు.ఎవరు మాలో సీనియర్ అవుతారు??

*🌼జవాబు:*
*సీనియారిటీ DSC సెలక్షన్ లిస్ట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది.*

*****

105.ప్రశ్న:
FAC HM గ్రీన్ ఇంక్ వాడవచ్చా??

*🌼జవాబు:*
*FR.49 ప్రకారం FAC భాద్యతలు నిర్వహిస్తున్న వారికి పోస్టుకి గల అన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి గ్రీన్ ఇంక్ వాడవచ్చు.*

*****

106. ప్రశ్న:
నేను హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.నాకు మహిళా టీచర్ల కి ఇచ్చే 5 స్పెషల్ CL లు ఇవ్వడం లేదు. ఎందువల్ల??

*🌼జవాబు:*
*జీఓ.374 తేదీ:16.3.96 ప్రకారం 5 స్పెషల్ CL లు కేవలం మహిళా టీచర్ల కి మాత్రమే వర్తిస్తాయి.*

*****

107.ప్రశ్న:
నేను,మరొక టీచర్ ఇద్దరం ఒకే రోజు SA లుగా పదోన్నతి పొందాము.ఒకే రోజు జాయిన్ అయ్యాము.SA క్యాడర్ లో ఎవరు సీనియర్ అవుతారు??

*🌼జవాబు:*
*SGT క్యాడర్ లో ఎవరు సీనియర్ ఐతే,వారే SA క్యాడర్ లో కూడా సీనియర్ అవుతారు.*

*****

108. PF ఋణం ఎంత ఇస్తారు??తిరిగి ఎలా చెల్లించాలి??

*🌼జవాబు:*
*PF నిబంధనలు 15ఏ ప్రకారం 20 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు మరియు 10 ఇయర్స్ లోపు సర్వీసు గలవారు ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. గృహ నిర్మాణ0 కోసం, స్థలం కొనుగోలు చేయడానికి 15 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు కూడా ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. రూల్ 15సీ ప్రకారం బేసిక్ పే కి 6 రెట్లు లేదా నిల్వ లో సగం ఏది తక్కువ ఐతే అది ఋణంగా ఇస్తారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిల్వ మొత్తం లో గరిష్టంగా 75% వరకు ఇవ్వవచ్చు.*


109.ప్రశ్న:
కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి APGLI ఎప్పటి నుంచి కట్ చెయ్యాలి??

✅జవాబు:
జీఓ199, ఆర్థికశాఖ తేదీ:30.7.13 ప్రకారం మొదటి నెల వేతనం నుంచే APGLI మినహాయించాలి.


110.ప్రశ్న:
సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరితే ఎన్ని రోజులలోపు సమాధానం ఇవ్వాలి??

✅జవాబు:
30 రోజులలోపు సమాధానం ఇవ్వాలి.


111.ప్రశ్న:
SR లో సర్వీస్ వెరిఫికేషన్ ఎప్పుడు ఎంటర్ చెయ్యాలి??

✅జవాబు:
మెమో:8388, తేదీ:20.1.12 ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో సర్వీస్ వెరిఫికేషన్ ఎంటర్ చెయ్యాలి.


112.ప్రశ్న:
నేను B.Sc, M.Ed చేశాను.1995 లో SGT గా చేరాను.ఐతే నాకు M.Ed కి అదనపు ఇంక్రిమెంట్ ఇవ్వటం లేదు.ఎందువల్ల??

✅జవాబు:
మెమో:5399, తేదీ:23.11.2000 ప్రకారం పీజీ అర్హత ఉంటేనే M.Ed కి ఆదనపు ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుంది.


113.ప్రశ్న:
నాకు మొదటిసారి బాబు. తర్వాత కవల పిల్లలు పుట్టారు. ఐటీ కి ముగ్గురు పిల్లల ట్యూషన్ ఫీజు పెట్టుకోవచ్చా??

✅జవాబు:
ఐటీ కి ఇద్దరు పిల్లల ట్యూషన్ ఫీజు మాత్రమే సేవింగ్స్ కి పరిగణించబడుతుంది.

114.ప్రశ్న:
ఉద్యోగి తల్లిదండ్రులు కి వైట్ కార్డు ఉంటే EHS లో చేర్చవచ్చా??

*☘జవాబు:*
*చేర్చకూడదు.అందరూ కలసి ఉండి వైట్ కార్డ్ ఉపయోగించుచున్నందులకు ఉద్యోగి పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.*

____

115.ప్రశ్న:
నా భార్య హౌస్ వైఫ్.ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేఇ0చుకుంటే నాకు ప్రత్యేక సెలవులు ఏమైనా ఇస్తారా??

*☘జవాబు:*
*జీఓ.802 M&H తేదీ:21.4.72 ప్రకారం భర్త కి 7 రోజులు స్పెషల్ సెలవులు ఇస్తారు.*

____

116.ప్రశ్న:
మెడికల్ సెలవు లో ఉండి వాలంటరి రిటైర్మెంట్ కి అప్లై చేయవచ్చా??

*☘జవాబు:*
*చేయవచ్చు. కానీ నష్టం జరుగుతుంది.మెడికల్ సెలవులో ఉండి వాలంటర్ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి వేతనం రాదు.అదే స్కూల్లో జాయిన్ ఐన పిదప వాల0టరీ రిటైర్మెంట్ కి అప్లై చేస్తే కమ్యూటెడ్ కాలానికి పూర్తి వేతనం పొందవచ్చు.*

____

117.ప్రశ్న:
స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయదలచుకొన్నపుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి??

*☘జవాబు:*
*స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కి అనుమతి కోరుతూ HM ద్వారా DEO గారికి 3 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, SR,10వ తరగతి నుండి విద్యా అర్హతల సర్టిఫికేట్లు,సెల్ఫ్ డిక్లరేషన్ జాతపరచాలి.*

____

118.ప్రశ్న:
సర్వీసు మొత్తం మీద ఎన్ని కమ్యూటెడ్ సెలవులు వాడుకోవాలి??

*☘జవాబు:*
*సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు.అప్పుడు అర్థ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి.ఆ తర్వాత కూడా సెలవు అవసరం ఐతే కేవలం అర్ధ జీతపు సెలవు గా మాత్రమే ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు వాడుకోవచ్చు.*

____

119.ప్రశ్న:
స్కూల్ అసిస్టెంట్ తెలుగు గా పదోన్నతి పొందటానికి కావాల్సిన అర్హతలు ఏమిటి??

*☘జవాబు:*
*జీఓ.15,16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో మెయిన్ గా గానీ లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టు లలో ఒక సబ్జెక్టు గా తెలుగు ఉండాలి. బి.ఈ డి లో తెలుగు methodology లేదా పండిట్ ట్రైనింగ్ కలిగి ఉండాలి.అదేవిధంగా జీఓ.28,29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హత తో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు కి అర్హులే.*

____

120.ప్రశ్న:
ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా??

*☘జవాబు:*
*అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నo.362/ఇ1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు.*

____

121.ప్రశ్న:
LFL HM కి 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి కావలసిన అర్హతలు ఏమిటి??

*☘జవాబు:*
*LFL HM కి తదుపరి పదోన్నతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాబట్టి డిగ్రీ, బీ. ఈ. డీ, డిపార్ట్మెంట్ పరీక్షల ఉతీర్ణత ఉండాలి.50 ఇయర్స్ వయస్సు నిండితే డిపార్ట్మెంట్ టెస్టుల మినహాయింపు వర్తిస్తుంది.*
_____________________________________

122.ప్రశ్న:
విదేశాలకి వెళ్లుటకు ఏ విధమైన సెలవు వాడుకోవచ్చు??

*🌸జవాబు:*
 *విదేశాలకు వెళ్లుటకు 3 నెలల వరకు CSE, ఆ పై కాలానికి Edn. Sec నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలి.అనుమతి లభించిన కాలానికి అర్హత గల(EL/HPL/EOL)ఏ సెలవు నైనా వినియోగించుకోవచ్చు.జీఓ.70 తేదీ:6.7.2009 ప్రకారం 4 నెలల లోపు HM/MEO, 4--6 నెలల వరకు DY. EO,6 నెలల నుండి 1 ఇయర్ వరకు DEO,1--4 ఇయర్స్ వరకు CSE,4 ఇయర్స్ పైన Edn. Sec నుండి సెలవు మంజూరు చే ఇంచుకోవాలి.*
____

123.ప్రశ్న:
EOL కాలాన్ని మెడికల్ లీవ్ గా మార్చుకోవచ్చా??

*🌸జవాబు:*
*సెలవు నిబంధనలు ప్రకారం ఒకసారి EOL గా మంజూరు చేఇ0చుకొన్న సెలవును మెడికల్ లీవ్ గా మార్చుకొనే అవకాశం లేదు.*
____

124.ప్రశ్న:
మెడికల్ లీవ్ తో కలిసి మెటర్నటీ లీవ్ వాడుకోవచ్చా??

*🌸జవాబు:*
*జీఓ.2391 తేదీ:3.10.1960 ప్రకారం వైద్య కారణాల పై ఏ ఇతర సెలవు నైనా ప్రసూతి సెలవు తో కలిపి వాడుకోవచ్చు. కాబట్టి ఈ జీఓ ను అనుసరించి మెడికల్ లీవ్ తో కలిపి మెటర్నటీ లీవ్ వాడుకోవచ్చు.*
____

125.ప్రశ్న:
పాస్ పోర్టు కోసం no objection certificate ఎవరి నుండి తీసుకోవాలి??

*🌸జవాబు:*
*DSE కార్యాలయం నుండి NOC తీసుకోవాలి.నిర్ణీత నమూనాలో HM/MEO ల నుండి DEO ద్వారా DSE కి దరఖాస్తు చేసుకోవాలి.నమూనా దరఖాస్తులు DEO కార్యాలయంలో లభిస్తాయి.*
____

126.ప్రశ్న:
మూడు నెలల్లో నేను పదవీ విరమణ చేయబోతున్నాను. నెలకు వచ్చే బేసిక్‌ పింఛనులో మూడో వంతు కమ్యుటేషన్‌ చేసుకుంటే రూ.7,11,591 వస్తాయి. కానీ, నెలకు వచ్చే పింఛను రూ.8,581ని 15 ఏళ్లపాటు తగ్గిస్తారు. 15 ఏళ్ల తర్వాత కమ్యుటేషన్‌ కారణంగా తగ్గిన పింఛనును పునరుద్ధరించి పూర్తి పింఛను చెల్లిస్తారు. దీన్ని వినియోగించుకొని ముందే డబ్బు తీసుకోవడం మంచిదేనా?

*🌸జవాబు*
*పింఛనులో బేసిక్‌, కరువు భత్యం అని రెండు భాగాలు ఉంటాయి. 15 ఏళ్లలో అందుకునే బేసిక్‌ పింఛను మొత్తాన్ని కొంత డిస్కౌంటుతో పదవీ విరమణ చేసేప్పుడు తీసుకోవచ్చు. దీన్ని కమ్యుటేషన్‌ అంటారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులు 15 ఏళ్ల పింఛనను ముందుగానే తీసుకోవడం లాభదాయకమా? కాదా అన్నది తెలియాలంటే కొన్ని లెక్కలు తెలియాలి. కమ్యుటేషన్‌ వల్ల ఈ పింఛను రూ.8,581 తగ్గుతుంది. దీంతో వచ్చిన రూ.7,11,591లను సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంలో దాచుకుంటే మూడు నెలలకు ఒకసారి రూ.14,765 వరకూ వస్తాయి. కమ్యుటేషన్‌ వల్ల నెలకు మీకు అందే మొత్తం రూ.3,659 తగ్గిపోతుంది. కానీ, గడువు తర్వాత మీ అసలు మీ చేతికి వస్తుంది. కమ్యుటేషన్‌ చేస్తే వచ్చిన రూ.7,11,591 ను 13శాతం రాబడి వచ్చే యాన్యుటీ పథకంలో పెట్టుబడి పెడితే నెలకు రూ.8,581 వస్తాయి. 15ఏళ్ల తర్వాత మీ చేతికి ఏమీ రాదు. అంటే కమ్యుటేషన్‌తో వచ్చిన డబ్బును కనీసం 13శాతం రాబడి వచ్చే మార్గంలో మదుపు చేయగలిగితేనే దీన్ని ఎంచుకోవాలి. పదవీ విరమణ తర్వాత నెలకు వచ్చే ఆదాయం తగ్గుతుంది.కమ్యుటేషన్‌ చేసి మీ ఆదాయాన్ని మరో రూ.3,659 తగ్గించుకోవడం కంటే ఎక్కువ పింఛను తీసుకోవడమే మంచిది. పదవీ విరమణ తర్వాత గ్రాట్యుటీ, మిగిలిన సెలవుల జీతం, ప్రావిడెంట్‌ ఫండ్‌ రూపంలో భారీ మొత్తం చేతికి వస్తుంది. ఈ డబ్బును అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా పెట్టుకోవచ్చు.ఇవేవీ లేకుండా కేవలం పింఛను మాత్రమే వచ్చేవారు కమ్యుటేషన్‌ ద్వారా వచ్చిన మొత్తాన్ని అనారోగ్య అవసరాలకు అత్యవసర నిధిగా దాచుకోవచ్చు.*

127.ప్రశ్న:

*పెన్షనర్  మరనించినచో కుటుంబ సభ్యులు ఏమి చేయాలి*
జవాబు:

పెన్షనర్ మరణించిన వెంటనే కుటుంబ సభ్యులు ట్రెజరీ లో తెలియపరచాలి.తెలియ పరచకుంటే మరల లైఫ్ సెర్టిఫికెట్(ప్రస్తుతం డిజిటల్ బయోమెట్రిక్/ఐరిష్)ఇచ్చే వరకు నెల నెలా పెన్షన్ అకౌంట్ లో పడుతూ ఉంటుంది. ఎటిఎం తో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ భాద్యత గల పౌరులుగా అలా చేయడం తప్పు.రెండవది ప్రభుత్వంనకు ఈ విషయం తెలిసినా లేదా ఎవరైనా కంప్లైంట్ చేసినా క్రిమినల్ కేసులు పెడతారు. అందువల్ల వెంటనే ట్రెజరీలో తెలియపరచాలి.చనిపోయిన రోజు వరకు పెన్షన్ లెక్కకట్టి అకౌంట్ లో వేస్తారు.

128.ప్రశ్న:

*PRC లో ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మరల మార్చుకోవచ్చా??*


జవాబు:

వెనుకటి తేదీ నుంచి వేతనం మారిన సందర్భంలో తప్ప,సాధారణంగా ఒకసారి ఆప్షన్ ఇచ్చిన తర్వాత మార్చుకొనే అవకాశం లేదు.

129.ప్రశ్న:
*స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఎవరికి ఇస్తారు??*


జవాబు:
ఒక ఉద్యోగి తాను పొందుతున్న వేతన స్కేలు గరిష్టం చేరిన తరువాత ఇంకా సర్వీసు లో ఉంచి ఇంక్రిమెంట్లు మంజూరు చేయవలసి ఉన్నప్పుడు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తారు.2015 PRC లో 5 స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు కి అవకాశం కల్పించారు.

130.ప్రశ్న:
*వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన ప్రసూతి సెలవు ఎలా మంజూరు చేస్తారు??*

జవాబు:
వేసవి సెలవుల మధ్యలో ప్రసవించిన, ప్రసవించిన రోజు నుండి 180 రోజుల వేసవి సెలవులు పోను మిగిలిన రోజులకు ప్రసూతి సెలవు మంజూరు చేస్తారు.

131.ప్రశ్న:
*ఐటీ రిటర్న్ అందరూ సమర్పించాలా??*

జవాబు:
2,50,000రూ ఆదాయం దాటిన వారందరూ ఆగస్టు 31లోగా రిటర్న్ దాఖలు చెయ్యాలి. వేతన ఆదాయం మాత్రమే ఉన్నవారు ITR--1 ఫారంలో ఈ--ఫైలింగ్ చేయవచ్చు.

132.ప్రశ్న:
*నాకు ఈ నెలలో ఇంక్రిమెంట్ ఉంది.కానీ మెడికల్ లీవు పెట్టాను.నాకు ఈ నెలలో ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారా??చెయ్యరా??*

జవాబు:
జీఓ.192 తేదీ:1.7.74 ప్రకారం మీరు ML లో ఉన్నప్పుడు ఇంక్రిమెంట్ ఇవ్వటం కుదరదు.మీరు ఎపుడు జాయిన్ ఐతే అప్పుడు నుండి మాత్రమే ఇంక్రిమెంట్ ఇవ్వటం జరుగుతుంది.అప్పటి వరకు పాత జీతమే వస్తుంది.
________

133.ప్రశ్న:
UP స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ అదే మండలం నకు FAC MEO గా భాద్యత లు నిర్వహించుచున్న అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు??

*🌼జవాబు:*
*FR.49 ప్రకారం ఒక పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు సంక్రమిస్తాయి.కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి ఆనుమతి తో జమ చేయవలసి ఉంటుంది.*
_____

134.ప్రశ్న:
SGT గా పనిచేస్తున్న టీచర్ VRO గా ఎంపిక ఐతే పే--ప్రొటెక్షన్,సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందా??

*🌼జవాబు:*
*DEO అనుమతి తో పరీక్ష రాస్తే వేతన రక్షణ ఉంటుంది. జీఓ.105 తేదీ:2.6.2011 ప్రకారం నూతన పోస్టు యొక్క స్కేల్ లో ప్రస్తుతం పొందుతున్న వేతనానికి సమానమైన స్టేజి లో వేతనం నిర్ణయించబడుతుంది. ఇంక్రిమెంట్ మాత్రం నూతన సర్వీసు లో చేరిన ఒక సంవత్సరం తర్వాతే మంజూరు చేస్తారు.*
_____

135..ప్రశ్న:
మహిళా టీచర్ భర్త నిరుద్యోగి.అత్త, మామ కూడా ఈమె పైనే ఆధార పడి జీవిస్తున్నారు.అత్త గారికి ఆరోగ్యం బాగా లేదు.మెడికల్ రీఅ0బర్సుమెంట్ వర్తిస్తుందా??

*🌼జవాబు:*
*APIMA రూల్ 1972 ప్రకారం వర్తించదు. కేవలం మహిళా టీచర్ అమ్మ,నాన్న లకి మాత్రమే వర్తిస్తుంది.*
_____

136.ప్రశ్న:
నాకు మొదటి సారి అమ్మాయి.తర్వాత కవల పిల్లలు జన్మించారు. LTC లో ముగ్గురు పిల్లలు ప్రయాణం చేయవచ్చా??

*🌼జవాబు:*
*జీఓ.140 తేదీ:3.4.96 ప్రకారం ఇద్దరు పిల్లలుకి మాత్రమే అవకాశం ఉంది.*
_____

137.ప్రశ్న:
అబార్షన్ కి రెండుసార్లు మాత్రమే సెలవు ఉపయోగించుకోవాలి అనుచున్నారు.వాస్తవమా?? కదా??

*🌼జవాబు:*
*జీఓ.254;ఆర్ధిక;తేదీ:10.11.95 ప్రకారం ఇద్దరు కంటే తక్కువ జీవించియున్న బిడ్డలు గలవారు అర్హులు.అంతేకానీ ఎన్నోసారి అనే దానితో నిమిత్తం లేదు.*
_______________________________

138.ప్రశ్న:
స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయదలచుకొన్నపుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి??

*🍄జవాబు:*
*స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కి అనుమతి కోరుతూ HM ద్వారా DEO గారికి 3 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, SR,10వ తరగతి నుండి విద్యా అర్హతల సర్టిఫికేట్లు,సెల్ఫ్ డిక్లరేషన్ జాతపరచాలి.*
_____

139.ప్రశ్న:
సర్వీసు మొత్తం మీద ఎన్ని కమ్యూటెడ్ సెలవులు వాడుకోవాలి??

*🍄జవాబు:*
*సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు.అప్పుడు అర్థ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి.ఆ తర్వాత కూడా సెలవు అవసరం ఐతే కేవలం అర్ధ జీతపు సెలవు గా మాత్రమే ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు వాడుకోవచ్చు.*
_____

140.ప్రశ్న:
స్కూల్ అసిస్టెంట్ తెలుగు గా పదోన్నతి పొందటానికి కావాల్సిన అర్హతలు ఏమిటి??

*🍄జవాబు:*
*జీఓ.15,16 తేదీ:7.2.2015 ప్రకారం డిగ్రీ లో మెయిన్ గా గానీ లేదా 3 ఆప్షనల్ సబ్జెక్టు లలో ఒక సబ్జెక్టు గా తెలుగు ఉండాలి. బి.ఈ డి లో తెలుగు methodology లేదా పండిట్ ట్రైనింగ్ కలిగి ఉండాలి.అదేవిధంగా జీఓ.28,29 తేదీ:2.7.15 ప్రకారం పీజీ అర్హత తో భాషా పండితులు గా నియమించబడిన వారు కూడా స్కూల్ అసిస్టెంట్ తెలుగు కి అర్హులే.*
_____

141.ప్రశ్న:
ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా??

*🍄జవాబు:*
*అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నo.362/ఇ1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు.*
_____

142.ప్రశ్న:
LFL HM కి 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి కావలసిన అర్హతలు ఏమిటి??

*🍄జవాబు:*
*LFL HM కి తదుపరి పదోన్నతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాబట్టి డిగ్రీ, బీ. ఈ. డీ, డిపార్ట్మెంట్ పరీక్షల ఉతీర్ణత ఉండాలి.50 ఇయర్స్ వయస్సు నిండితే డిపార్ట్మెంట్ టెస్టుల మినహాయింపు వర్తిస్తుంది.*

*1. ఇంటి అద్దె (HRA మినహాయింపు) గణన ఎలా?*
జ।। చెల్లించిన అద్దె -10% ఫే - 10% డి.ఏ

సంవత్సరంలో చెల్లించిన అద్దె 1లక్ష లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే ఇంటి యజమాని  PAN ఇవ్వాలి (నెలసరి అద్దె 8400/- కానీ అంతకంటే ఎక్కువ చెల్లించిన వారు)

*★2. టాక్సేబుల్ ఆదాయం దాదాపు 7,00,000 ఉంటే టాక్స్ ఎలా గణించాలి?*
2,50,000 వరకు పన్ను లేదు (60 ఏళ్ల లోపు వారికి)
2,50,001-5,00,000 వరకు (2.50 లక్షలకు) 10%
5,00,001-10,00,000 వరకు (5 లక్షలకు) 20%
10,00,000  పైబడిన 30%

7,00,000 కు టాక్స్ గణిస్తే
2,50,000 వరకు పన్ను లేదు
2,50,001 - 5,00,000 వరకు (2.50 లక్షలకు) 10%
అంటే 2,50,000 X 10% = 25,000/-
5,00,001 - 7,00,000 వరకు (2 లక్షలకు) 20%
అంటే 2,00,000 X 20% = 40,000/-
చెల్లించాల్సిన టాక్స్ (25,000+40,000/-)+3%ఎడ్యుకేషన్ సెస్సు.

*★3. CPS వారికి సంబంధించిన సెక్షన్ల వారిగా ఉన్న అవకాశాలు.*
ఉద్యోగుల కంట్రీబ్యూషన్ చేసిన నిధి 80CCD(1) ప్రకారం 80C సెక్షన్ తో 1,50,000/- లో చూపాలి.

అధనంగా 80CCD1(B) ద్వార 50,000/- లబ్ధి ఎలా పొందే అవకాశం ఉంది

ఉద్యోగులకు వారి ప్రాన్ (PRAN)  ఖాతా లో ఉద్యోగుల వాటకి సమానంగా జమచేసిన నిధిని ముందుగా ఆదాయం గా చూపించి తర్వాత 80CCD(2) ప్రకారం ఆదాయం నుండి పూర్తి మినహాయింపు కలదు.

*★4. అధనంగా 80CCD(1B) ద్వార 50,000/- లబ్ధి ఎలా పొందే అవకాశం ఉంది?*
ఉద్యోగులకు CPS కాకుండా 80C కింద 1,50,000/- సేవింగ్స్ ఉంటే CPS నిధిని 80CCD(1B) లో 50,000 వరకు మినహాయింపు పొందవచ్చు.

ఒకవేళ ఉద్యోగులకు 80C కింద CPS కాకుండా 1,30,000/- సేవింగ్స్ ఉండి CPS deduction 70,000/- ఉంటే అప్పుడు 20,000/- లను 80C కింద మిగతా 50,000/- లను 80CCD(1B) కింద చూపవచ్చు.
_______________________________

143.ప్రశ్న:
LTC ఎలా వాడుకోవచ్చు??

*🌸జవాబు:*
*జీఓ.98 తేదీ:21.5.2011 ప్రకారం సర్వీసు మొత్తం మీద ఒకసారి ఇండియా లోని ఎక్కడికైనా వెళ్ళటానికి ltc వాడుకోవచ్చు. బ్లాక్ పీరియడ్ లోని చివరి రెండు సంవత్సర0లలో మాత్రమే వినియోగించుకోవాలి.గరిష్టంగా రానూ, పోనూ 3500 కి.మీ వరకు మాత్రమే అనుమతి ఇస్తారు.12500రూ చెల్లిస్తారు.*
_____

144.ప్రశ్న:
నేరుగా స్కూల్ అసిస్టెంట్ గా సెలెక్ట్ ఐన వ్యక్తి కి 45 ఇయర్స్ తర్వాత డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ కాకుండా 12 ఇయర్స్ స్కేల్ ఇస్తారా??

*🌸జవాబు:*
*జీఓ.225 తేదీ:18.5.1999 ప్రకారం మొదటి పదోన్నతి స్కేల్ కి 45 ఇయర్స్  మినహాయింపు వర్తిస్తుంది.నేరుగా స్కూల్ అసిస్టెంట్ ఐన టీచర్ కి 12 ఇయర్స్ స్కేల్ మొదటి ప్రమోషన్ స్కేల్ అవుతుంది.*
_____

145.ప్రశ్న:
నేను సర్వీస్ పెన్షన్,కుటుంబ పెన్షన్ రెండూ తీసుకొనుచున్నాను.వీటిని ఐటీ లో ఎలా చూపాలి??

*🌸జవాబు:*
*సర్వీసు పెన్షన్ ను వేతన ఆదాయంగాను,కుటుంబ పెన్షన్ ను ఇతర ఆదాయంగాను చూపించాలి.*
_____

146.ప్రశ్న:
జాతీయ పెన్షన్ పథకం లో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చా??

*🌸జవాబు:*
*పెట్టవచ్చు. గరిష్టంగా 50000 వరకు మదుపు చేసి ఐటీ మినహాయింపు పొందవచ్చు.*
_____

147.ప్రశ్న:
పెన్షనర్ ఐటీ లో ఏవిధంగా HRA మినహాయింపు పొందవచ్చు??

*🌸జవాబు:*
*HRA పొందని వారు అద్దె ఇంట్లో ఉంటుంటే నెలకు 5000రూ వరకు ఐటీ మినహాయింపు పొందవచ్చు.*
________________________________

148.ప్రశ్న:
సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి మరణించినచో ఏమి జరుగుతుంది??

*🌼జవాబు:*
*జీఓ.275 , తేదీ:8.8.77 ప్రకారం సస్పెన్షన్ పీరియడ్ ను ఆన్ డ్యూటీ గా పరిగణిస్తారు.*
_____

149.ప్రశ్న:
జీతం డబ్బులు తీసుకోవటానికి కేవలం SBI/SBH లోనే అకౌంట్ ఉండాలా??

*🌼జవాబు:*
*జీఓ.58, తేదీ:21.3.05 ప్రకారం ప్రభుత్వం సూసించిన SBI/SBH బ్యాంక్ లలో ఏదో ఒక దానిలో అకౌంట్ ఉండాలి.*
_____

150.ప్రశ్న:
ఈ సంవత్సరం వార్షికోత్సవం జరపాలని అనుకొనుచున్నాము.డబ్బులు ఎంత ఇస్తారు??

*🌼జవాబు:*
*ప్రైమరీ స్కూళ్ళుకి 100 లోపు పిల్లలు ఉంటే 800రూ,100 పైన పిల్లలు ఉంటే 1000రూ ఇస్తారు. అదే అప్పర్ ప్రైమరీ కి 100 లోపు ఉంటే 1000రూ,100 పైన ఉంటే 1200రూ ఇస్తారు.*
_____

151.ప్రశ్న:
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి ప్రత్యేక సెలవు ఏమైనా ఇస్తారా??

*🌼జవాబు:*
*జీఓ.286,తేదీ:29.10.91 ప్రకారం 6 నెలలు గరిష్టంగా అర్ధ వేతన సెలవులకి అర్హుడు.ఈ కాలంలో పూర్తి వేతనం పొందవచ్చు.*
_____

152.ప్రశ్న:
వేసవి సెలవులు మరియు వ్యక్తిగత0గా పెట్టుకున్న సెలవులు 6 నెలలకు మించిన ఏమి జరుగుతుంది??

*🌼జవాబు:*
*జీఓ.143,తేదీ:1.6.68 ప్రకారం 6 నెలలకు మించితే మొత్తం "లీవ్" గా పరిగణించబడుతుంది.*

____________________________________

153.ప్రశ్న:
నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను.ఐతే ఏమి చెయ్యాలి??

*🌷జవాబు:*
*జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేఇ0చి,DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేఇ0చాలి.స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేఇ0చాలి.*
_____

154.ప్రశ్న:
నేను PF నుండి ఋణం పొందియున్నాను.
వాయిదాలు పూర్తి కాలేదు.మరలా ఋణం కావాలి.ఇస్తారా??

*🌷జవాబు:*
*ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి,కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.*
_____

155.ప్రశ్న:
ఒక డీజేబుల్డ్ ఉపాధ్యాయునికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి??

*🌷జవాబు:*
*జీఓ.1063 తేదీ:2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.*
_____

156.ప్రశ్న:
ఒక టీచర్ ఫిబ్రవరి 29న జాబ్ లో చేరాడు.అతనికి వార్షిక ఇంక్రిమెంట్ ఏ నెలలో ఇవ్వాలి??

*🌷జవాబు:*
*ఆర్.సి.2071 తేదీ:21.7.2010 ప్రకారం లీపు సంవత్సరం ఫిబ్రవరి 29న విధుల్లో చేరిన ఉపాధ్యాయుల వార్షిక ఇంక్రిమెంట్ ఫిబ్రవరి నెల లోనే ఇవ్వాలి.*
_____

157.ప్రశ్న:
బిడ్డ పుట్టి వెంటనే మరణించిన, వారికి మెటర్నిటీ లీవు కి అర్హత ఉందా??

*🌷జవాబు:*
*Lds.1941 తేదీ:11.6.90 ప్రకారం మరణించిన బిడ్డను ప్రసవించినా,ప్రసూతి సెలవు వాడుకోవచ్చు.*
_____________________________

158.ప్రశ్న:
వేసవి సెలవుల్లో పని చేస్తే ELs ఎలా జమచేస్తారు??

*🍁జవాబు:*
*వేసవి సెలవులు 15 రోజులు కన్నా తక్కువగా వాడుకుంటే,మొత్తం వేసవి సెలవులు వాడుకోలేదన్నట్లుగా భావించి 24 ELs ఇస్తారు.*
____

159.ప్రశ్న:
సంపాధిత సెలవును అర్ధ జీతపు సెలవు, వేసవి సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చు??

*🍁జవాబు:*
*ఒకేసారి 180 రోజులకి మించి వాడుకోకూడదు.*
____

160.ప్రశ్న:
ఒక ఉద్యోగి సస్పెన్షన్ లో ఉన్నప్పుడు ఉద్యోగం నుంచి విరమించుకోవచ్చా??

*🍁జవాబు:*
*విరమించుకోవటానికి అతనికి అనుమతి ఇవ్వరు.*
____

161.ప్రశ్న:
ఉద్యోగ విరమణ చేసే సమయంలో సస్పెండ్ అయితే ఎలా చేస్తారు??

*🍁జవాబు:*
*అతని సర్వీసును ఉన్నతాధికారులు పొడిగిస్తారు.*
____

162.ప్రశ్న:
బ్యాంకు లో 15G ఫారం ఎప్పుడు ఇవ్వాలి??

*🍁జవాబు:*
*ఒక బ్యాంక్ లో మనం డిపాజిిట్ చేసిన మొత్తం డబ్బులు పై సంవత్సరం నకు 10,000రూ పైన వడ్డీ వస్తే టాక్స్ పడకుండా ఉండేందుకు బ్యాంకు వారికి 15G ఫారం మరియు పాన్ కార్డు zerox కాపీ ఇవ్వాలి.అపుడు బ్యాంకు వారు మన డిపాజిిట్ లపైన టాక్స్ ను కట్ చేయరు. ఈ రెండూ ఇవ్వకపోతే వచ్చే వడ్డీ లో టాక్స్ కట్ చేస్తారు.ఈ రెండు ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరులో ఇవ్వాలి.*
_____________________________

163.ప్రశ్న:
ఇంటి నిర్మాణానికి అడ్వాన్స్ తీసుకుంటే ఎప్పటి లోగా తీర్చాలి??

*🌻జవాబు:*
*ఇంటి నిర్మాణానికి అడ్వాన్సు తీసుకుంటే 300 నెలల్లో, మరమ్మతులకి తీసుకుంటే 90 నెలల్లో,ఇంటి స్థలం కోసం తీసుకుంటే 12 నెలల్లో తీర్చాలి.*
____

164.ప్రశ్న:
వాల0టరీ  నియామకం పొందువరికి కారుణ్య నియామకం వర్తిస్తుందా??

*🌻జవాబు:*
*వర్తించదు.*
____

165.ప్రశ్న:
CCL ను DDO నుండి ఎప్పటిలోగా తీసుకోవాలి??

*🌻జవాబు:*
*ఏ CCL ఐనా తాను పనిచేసిన ప్రభుత్వ సెలవు దినానికి 6 నెలలలోపే DDO దగ్గర నుండి పొందాలి.*
____

166.ప్రశ్న:
వ్యక్తి గత అవసరాలకు హాఫ్ పే లీవ్ వాడుకుంటే జీతం ఎలా చెల్లిస్తారు??

*🌻జవాబు:*
*మెమో.14568 ,తేదీ:31.1.2011 ప్రకారం పే,డీఏ సగం మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు.*
____

167.ప్రశ్న:
ఇంటి మరమ్మతులు కోసం ఎంత అడ్వాన్స్ గా పొందవచ్చు??

*🌻జవాబు:*
*ఇంటి మరమ్మతులు, విస్తరణకు ములవేతనం కి 20 రెట్లు గానీ, 4 లక్షలు గానీ ,ఏది తక్కువ ఐతే ఆ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇస్తారు.*
___________________________

168.ప్రశ్న:
వేసవి సెలవుల్లో పని చేస్తే ELs ఎలా జమచేస్తారు??

*🍁జవాబు:*
*వేసవి సెలవులు 15 రోజులు కన్నా తక్కువగా వాడుకుంటే,మొత్తం వేసవి సెలవులు వాడుకోలేదన్నట్లుగా భావించి 24 ELs ఇస్తారు.*
____

169.ప్రశ్న:
సంపాధిత సెలవును అర్ధ జీతపు సెలవు, వేసవి సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చు??

*🍁జవాబు:*
*ఒకేసారి 180 రోజులకి మించి వాడుకోకూడదు.*
____

170.ప్రశ్న:
ఒక ఉద్యోగి సస్పెన్షన్ లో ఉన్నప్పుడు ఉద్యోగం నుంచి విరమించుకోవచ్చా??

*🍁జవాబు:*
*విరమించుకోవటానికి అతనికి అనుమతి ఇవ్వరు.*
____

171.ప్రశ్న:
ఉద్యోగ విరమణ చేసే సమయంలో సస్పెండ్ అయితే ఎలా చేస్తారు??

*🍁జవాబు:*
*అతని సర్వీసును ఉన్నతాధికారులు పొడిగిస్తారు.*
____

172.ప్రశ్న:
బ్యాంకు లో 15G ఫారం ఎప్పుడు ఇవ్వాలి??

*🍁జవాబు:*
*ఒక బ్యాంక్ లో మనం డిపాజిిట్ చేసిన మొత్తం డబ్బులు పై సంవత్సరం నకు 10,000రూ పైన వడ్డీ వస్తే టాక్స్ పడకుండా ఉండేందుకు బ్యాంకు వారికి 15G ఫారం మరియు పాన్ కార్డు zerox కాపీ ఇవ్వాలి.అపుడు బ్యాంకు వారు మన డిపాజిిట్ లపైన టాక్స్ ను కట్ చేయరు. ఈ రెండూ ఇవ్వకపోతే వచ్చే వడ్డీ లో టాక్స్ కట్ చేస్తారు.ఈ రెండు ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరులో ఇవ్వాలి.*
_

173.ప్రశ్న:
అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారు సీనియారిటీ కోల్పోవటం అనేది పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందా?హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే క్రమము, రేషనలైజేషన్ వంటి ఇతర సంధర్భాలలో కూడా వర్తిస్తుందా?ఒక ఉపాధ్యాయిని 1998 లో వేరే జిల్లాలో నియామకమై అంతర్ జిల్లా బదిలీపై తేది:23-4-2013న రంగారెడ్డి జిల్లాలో ఒక పాఠశాలకు చేరారు.2000 సం!!లో ఇదే జిల్లాలో నియామకమైన మరో ఉపాధ్యాయిని తేది:20-5-2013 న ఆ పాఠశాలకు బదిలీపై వచ్చారు.వీరిలో ఎవరు సీనియరు?

*🌼జవాబు:*
*ఏ.పి.స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూల్ 35(b) ప్రకారం అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారి సీనియారిటీ మీ జిల్లాలో చేరిన తేది నుండి మాత్రమే లెక్కించబడుతుంది. సీనియారిటీ అనేది అన్ని సంధర్భాలలోనూ (పదోన్నతులు మొదలుకుని హాజరు రిజిస్టర్ లో పేర్లు వ్రాసే వరకు) ఒకే విధంగా ఉంటుంది.2000సం!!లో రంగారెడ్డి జిల్లాలోనే నియామకమైన ఉపాధ్యాయిని సీనియరుగా పరిగణించబడతారు.* 
               
 *****

174.ప్రశ్న:
ఒక SGT ఉపాధ్యాయుడు 18 సం!! స్కేలు,24 సం!! స్కేలు కోసం ఏయే Dept.Exams ఉత్తీర్ణత పొందాలి.అదే విధంగా SA తన 12సం!! స్కేలు కోసం ఏఏ  Dept.Tests పాస్ కావాలి, మినహాయింపులు  ఏమైనా వున్నాయా?

*🌼జవాబు:*
*ఏ క్యాడర్ లో నైనా 18 సం!! స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం ఎటువంటి అదనపు అర్హతలు అవసరంలేదు.12సం!! స్కేలు పొందివుంటే యాంత్రికంగా 18సం!! ఇంక్రిమెంట్ కు అర్హత ఉంటుంది.SGT లు 24సం!! స్కేలు కోసం గ్రాడ్యుయేషన్ + B.Ed + GOT,EOT పరీక్షలు పాస్ కావాలి.SA లకు తమ 12సం!! స్కేలు కోసం GO,EO పరీక్షలు ఉత్తీర్ణత పొందివుండాలి. అయితే Direct Recruitment SA లకు మాత్రం 45సం!! వయస్సు దాటిన వారికి పై Dept.Test పరీక్షల నుండి మినహాయింపు కలదు.పై మినహాయింపులు అప్రయత్న పదోన్నతి పధకం(AAS) కు వర్తించవు.* 
               
*****

175.ప్రశ్న:
ఒక ఉపాధ్యాయుడు ప్రమోషన్ ఎన్నిసార్లు తిరస్కరించడానికి అవకాశం ఉంది?

*🌼జవాబు:*
*వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా రాత పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు. అయితే ప్రభుత్వ  cir.Memo.No.10445/ ser-D/2011,GAD తేది:1-6-2011 ప్రకారం ఒక్కసారి మాత్రం ప్రమోషన్ ఆర్డర్ తీసుకుని (లేదా)తీసుకోకుండా ప్రమోషన్ పొస్ట్ లో చేరకుండా చేయవచ్చును. అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తరువాత ఇక చేర్చరు.*
*(G.O.Ms.No.145 GAD,Dt:15-6-2004)*
                     
*****

176.ప్రశ్న:
దాదాపు 6సం!! కాలం SGT గా పనిచేసి ప్రభుత్వంలోని వేరే శాఖకు ఎంపికై అక్కడ కూడా 2సం!! పనిచేసి తిరిగి పాత పోస్టులో చేరిన ఉపాధ్యాయుని 2సం!! సర్వీసును ఏ విధంగా లెక్కిస్తారు? ఇంక్రిమెంట్ ను AAS కి లెక్కిస్తారా?

*🌼జవాబు:*
*FR-26(i) ప్రకారం ప్రస్తుత పోస్టుపై 'Lien' కలిగియున్న ఉపాధ్యాయుడు,ప్రస్తుత పోస్టుకంటే తక్కువగాగాని పోస్టులో పనిచేసిన సర్వీసును ఇంక్రిమెంట్ కు లేక్కిన్చవచును. G.O.Ms.No.117,F&P, Dt:20-5-1981 ప్రకారం ఇంక్రిమెంట్ కు పరిగణింపబడే సర్వీసు అంతా AAS కు కూడా లెక్కించబడుతుంది. కాబట్టి సదరు 2సం!! ఇతర పోస్టు సర్వీసు AAS నకు కూడా లెక్కించబడుతుంది.*

*****   
 
177.ప్రశ్న:
ఒక ఉపాధ్యాయుడు డిసెంబర్ 15 నుండి 19 వరకు వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు వినియోగించుకుంటున్నాడు. అయితే 13,14వ తేదీలు రెండవ శనివారం,ఆదివారం ఉన్నాయి. అవి కూడా కమ్యూటెడ్  సెలవుగా పరిగణించాలా?

*🌼జవాబు:*
*ఆర్ధిక శాఖ Memo.No.86595/1210/FR-1/7 తేది:29-5-1981 మరియు FR-68 ప్రకారం ఏ రకమైన ఆకస్మికేతర సేలవుకైనా ముందు లేదా వెనుక వున్న ప్రభుత్వ సెలవు దినాలు ప్రీఫిక్స్/సఫిక్స్ చేసి వినియోగించుకోవడానికి అనుమతించబడతాయి. అయితే G.O.Ms.No.319 F&P తేది:18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై వినియోగించుకున్న సెలవుకు ముందు,వెనుక ఉన్నప్రభుత్వ  సెలవులను మినహాయించి పనిదినాల కాలానికి మాత్రమే వైద్య ధ్రువపత్రాలు A,B లు వుండాలి.*
______________________________

178.ప్రశ్న:
మెడికల్ సెలవుకోసం డాక్టరు సర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సర్టిఫికెట్ వేరేవేరే డాక్టర్ల నుండి సమర్పించవచ్చునా?వైద్య కారణాలపై తీసుకున్న EOL ఇంక్రిమెంట్ కోసం లెక్కించబడుతుందా?

*🍁జవాబు:*
*రెండు సర్టిఫికెట్లు ఒకే డాక్టర్ ఇవ్వాలని ఏ ఉత్తర్వులోనూ లేదు.ఇద్దరూ క్వాలిఫైడ్ వైద్యులైనంత వరకు ఎట్టి అభ్యంతరము ఉండదు.  సాధారణంగా EOL వాడుకుంటే ఇంక్రిమెంట్ అన్ని రోజులు వాయిదా పడుతుంది.అయితే ప్రభుత్వం G.O.Ms.No.43 తేది:5-2-1976 ద్వారా వైద్య కారణాలపై 6 నెలల కాలం వరకు EOL ను ఇంక్రిమెంటుకు పరిగణించే అధికారం శాఖాధిపతులకు (ఉపాధ్యాయుల విషయంలో పాఠశాల విద్యా సంచాలకులకు) ఇవ్వడం జరిగింది.*                     
_____

179.ప్రశ్న:
ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా?

*🍁జవాబు:*
*అవును G.O.Ms.No.802 M&H Dated:21-4-1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి.*                     
_____

180.ప్రశ్న:
ఒక ఉపాధ్యాయుడు SA క్యాడర్ లో 12 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసాడు. అయితే Departmental Test E.O.T/G.O T పరీక్షలు పాస్ కాలేదు.తదుపరి పాస్ అయితే 12 సంవత్సరాల స్కేల్ ఎప్పటినుండి ఇస్తారు??

*🍁జవాబు:*
*F.R-26(a) క్రింద గల రూలింగ్ 2 ప్రకారం చివరి పరీక్ష మరుసటి తేది నుండి 12 సంవత్సరాల స్కేలు మరియు ఆర్ధిక లాభం ఇవ్వాలి.*                     
_____

181.ప్రశ్న:
పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలలో Spl.Language Tests Telugu,Hindi,Urdu ఎవరు రాయాలి?

*🍁జవాబు:*
*ఇంటర్మీడియేట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవనివారు Spl.language Test in Telugu(P.code-37) రాయాల్సి ఉంటుంది.*
*10వ తరగతి ఆ పై స్థాయిలో హింది/ఉర్దూ ఒక భాషగా చదవని వారు Spl.language Test in Hindi/Urdu రాయాల్సి ఉంటుంది.*                     
_____

182.ప్రశ్న:
సరెండర్ లీవ్ ను నెలలో ఎన్ని రోజులకు లెక్కగడతారు? 11 రోజుల సంపాదిత  సెలవులున్నను లీవ్  సరెండర్ చేసుకోవచ్చునా?

*🍁జవాబు:*
*G.O.Ms.No.306 Fin Dept Dt:8-11-1974ప్రకారం సదరు నెలలో 28/29/30/31 ఎన్ని* *రోజులున్నను,రోజులతో నిమిత్తం లేకుండా 30 రోజులకు మాత్రమే లీవ్ సరెండర్ లెక్కగట్టి నగదు చెల్లిస్తారు.*
*G.O.Ms.No.334 F&P,Dt:28-9-1977 లో ఇలా వుంది Leave may be surrendered at any time not exceeding 15/30 days...అని వున్నది.అందుచేత 11రోజులు సరెండర్ చేసుకుని నగదు పొందవచ్చు.*                     
_____

183.ప్రశ్న:
నేను ప్రస్తుతం SGT గా పనిచేస్తున్నాను.రాబోయే DSC లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే,DEO గారి అనుమతి తీసుకోవాలా?

*🍁జవాబు:*
*అవును తప్పనిసరిగా నియామకాధికారి అనుమతి తీసుకోవాలి.*


184. చైల్డ్ కేర్ లీవ్ మంజూరు విషయంలో  ఉపాధ్యాయినిల వేతనంలో కోత విధిస్తారా ?

*✅G.O.Ms.No.209 Fin తేది:21-11-2016 ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ సెలవును ముందుగా డి.డి.వో తో మంజూరు చేయించుకున్న తరువాత వాడుకోవాలి.మంజూరు ఉత్తర్వులిచ్చి,ఎస్.ఆర్ నందు నమోదుచేసి ఆ నెల పూర్తి వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాల్సిన బాధ్యత డి.డి.ఓ లకే ఉంటుంది.*

185. స్కూల్ ఇంచార్జ్ బాధ్యతలు హెచ్.ఏం ఎవ్వరికైనా ఇవ్వవచ్చునా ? లేక సీనియారిటీ ప్రకారమే ఇవ్వాలా ?

*✅డి.ఎస్.సి ఉత్తర్వుల సంఖ్య Rc.2409/C3-1/2004 తేది :27.01.2005 ప్రకారం ప్రధానోపాధ్యాయుని అర్హతలు కలిగిన వారిలో సీనియరు ఉపాధ్యాయుడిని మాత్రమే ఇంచార్జ్ గా లేదా ఎఫ్.ఏ.సి.గా నియమించాలి.*

186. ఎస్.జి.టి ఉపాధ్యాయుడు 24 సం॥ స్కేలు పొందుటకు డిపార్ట్మెంటల్ పరీక్షల ఉత్తీర్ణత సాధించాలా ?

*✅G.O.Ms.No.38 Fin తేది:15.04.2015 ప్రకారం 24 సం॥ స్కేలు పొందుటకు ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ పరీక్షలు (GOT&EOT) ఉత్తీర్ణత సాధించాలి*

187. వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటే ఎంత సర్వీస్ పూర్తిచేసి ఉండాలి? పూర్తి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయా?

 *✅ఏ.పి.రివైజ్డ్ పెన్షన్ రూల్స్-1980 లోని రూల్ 43 ప్రకారంగా 20 సం॥ సర్వీసు (అసాధారణ సెలవు కాకుండా) పూర్తిచేసిన వారికి వాలంటరి రిటైర్మెంట్ అర్హత లభిస్తుంది.రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ వర్తిస్తాయి.*

188. ముగ్గురు సంతానం ఉన్న ఉపాధ్యాయిని హిస్టరక్టమి ఆపరేషన్ చేయించుకుంటే 45 రోజుల సెలవుకు అర్హత ఉన్నదా ?

*✅G.O.Ms.No.52 Fin తేది:1.4.2011 లో సంతానం ఇంతే మంది ఉండాలన్న షరతు ఏమీలేదు.అందుచేత సంతానం సంఖ్యతో నిమిత్తం లేకుండా 45 రోజుల సెలవు పొందవచ్చును.*

*189. electronic file*

*_భారత దేశంలోని ప్రజలు నెల వారిగా సంపాదించిన (సామానత్వం కోసం : ప్రభుత్వ నిభందనల ప్రకారం ) ఆదాయం - ఖర్చులను ఎప్పటికప్పుడు మదింపు చేయడానికి కొరకు ఉద్దేశించిన file_*

          *💧"e-filing"*

*_💧e-filing ను Pan No తో Register చేసుకోవాలి._*


*_ప్రభుత్వ ఉద్యోగులు, ప్రవేటు సంస్ధలు, వ్యక్తులు  e-filing   ద్వారా తమ ఆదాయ వ్యయాలను ఆదాయపన్ను శాఖ (Income Tax Dept.) కు సులభంగా తెలుపుటకు ఉపాయోగపడే ఒక సాదనం._*

*_💧ఉపాయోగాలు_*

*_తమ వ్యక్తిగత ఖాతా లలో జమ అయ్యె ప్రతి మొత్తానికి Tax చెల్లించనవసరం ఉండదు._*
*_ఉద్యోగులు నెలవారి చెల్లించే Advance Income Tax వలన Quarter లో చెల్లించవలసిని Tax కంటె ఎక్కువ / తక్కువ చెల్లించినవారికి IT Dept. నుండి Notice లు రావు._*
*_Tax ఎక్కువ చెల్లించవసినా రాబోవు తదుపరి Quarters లో చెల్లించవచ్చు._*
*_Tax ఆదనంగా చెల్లించిన వారికి నేరుగా తమ ఖాతాలోకి తిరిగి జమ అవుతుంది._*

*DDO లు తమ ఉద్యోగులు నెలవారిగా* *చెల్లించిన Advance Tax ను ప్రతి Quarter లో TDS update* *చేయించుండాలి.*
*అలా చేయని DDO లకు రోజుకు Rs.200/- అపరాద రుసుము చెల్లించవలసి ఉంటుంది.*

*_💧ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఇ-ఫైలింగ్ చేయడం:_*


*_పన్ను వర్తించే ఆదాయం ఉన్న_* *_వారు జులై 31 లోగా_*
*_ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయవలసి ఉంటుంది_*.


*_ఫిబ్రవరి మాసంలో సమర్పించిన ఫారం 16 ఆధారంగా రిటర్న్ దాఖలు చేయాలి_*.

*_💧దాఖలు చేయవలసిన విధానం:_*

*_వేతనం లేదా పింఛను ద్వారా ఆదాయం పొందుచున్న వారు, పెట్టుబడులపై వడ్డీ ఆదాయం పోన్స్య్ వారూ, ఒకే గృహం ద్వారా ఆదాయం ఉన్న వారు ITR-1(సహజ్) ఫారం ద్వారా రిటర్న్ దాఖలు చేయాలి_.*

*_ఆన్ లైన్ ద్వారా "ఇ- రిటర్న్" ను సులభంగా దాఖలు చేయ వచ్చు. దాఖలు చేసే విధానాన్ని పరిశీలిద్దాం._*

*_💧పేరు రిజిస్టర్ చేసుకొనుట:_*

*_incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి Register your self అను ఆప్సన్ ను_* *_ఎంచుకొనవలెను. దానిలో పాస్ వర్డ్ తదితర వివరములను పూర్తిచేసిన తదుపరి మెయిల్ కు వచ్చిన లింక్ కాపీ చేసి బ్రౌజర్ లో పేస్ట్ చేసిన తర్వాత మొబైల్ కి వచ్చిన పిన్ నంబర్ ను నమోదు చేస్తే రెజిస్ట్రేషన్ పూర్తి అయినట్లే. మీ పాస్ వర్డ్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి_*.

*_💧ఫారం 26 AS:_*

*_ఇ- ఫైలింగ్ చేసేందుకు ఫారం 26 AS ను పరిశీలించుకోవాలి. పైన తెలిపిన వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తదుపరి 'VIEW FORM 26 AS' ను ఎంచు కోవాలి. దానిలో యూజర్ ID అంటే పాన్ నంబర్, రిజిస్ట్రేషన్ లో మనం ఎంచుకొన్న పాస్ వర్డ్ తదితర అంశాలను నమోదు చేసిన తదుపరి ఫారం 26 AS ను క్లిక్ చేసి ఎసెస్మెంట్ సంవత్సరం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఫారం 26 AS ఓపెన్ అవుతుంది. దానిలో ఆ సంవత్సరం మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు అయినదీ లేనిదీ పరిశీలించుకోవచ్చు. ఫారం లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నప్పుడే ఇ- రిటర్న్ చేయాలి._*

*_💧ఫారం 26 AS లో నమోదుల పరిశీలన:_*

*_ఫారం 26 AS లో మనం పరిశీలన చేసినప్పుడు మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు కానట్లయితే DDO కు తెలియజేయాలి. సక్రమంగా నమోదు కాక పోవడానికి కారణాలు DDO త్రై మాసిక రిటర్న్(Q1, Q2, Q3, Q4) లను సమర్పించక పోవడం లేదా సమర్పించిన వానిలో పొరబాటు జరగడం అయివుండ వచ్చు. త్రైమాసిక రిటర్న్ దాఖలు చేయవలసిన బాధ్యత DDO లదే కాబట్టి వారే దాఖలు చేయడం లేదా తప్పులను సవరించడం చేయవలసి ఉంటుంది_*.

*_💧ఇ- ఫైలింగ్ చేయడం:_*

*_ఫారం 26 AS లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నట్లు సంతృప్తి చెందిన తరువాత ఇ- ఫైలింగ్ చేయడం ప్రారంభించాలి. ముందు చెప్పిన వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తరువాత 'Quick e file ITR- 4S' ఎంపిక చేసుకోవాలి._*

*_PAN నంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీతడితర వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి._* _లాగిన్ అయిన వెంటనే ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇష్టం అయితే నమోదు చేయవచ్చు లేదా తదుపరి అని పేర్కొన వచ్చు._


*_అనంతరం పాన్ నంబర్, ITR పేరు(ITR-1) అసెస్ మెంట్ సంవత్సరం సెలెక్ట్ చేసు కోవాలి. తరువాత_* *_ఇవ్వబడిన 3 ఆప్షన్ లు 1) పాన్ ఆధారంగా 2) గతంలో దాఖలు చేసిన రిటర్న్ ఆధారంగా 3) నూతన చిరునామా లలో ఒకటి ఎంపిక చేసుకొని లాగిన్ అవ్వాలి._*
*_తదుపరి వచ్చే ఫారం లో వ్యక్తిగత వివరాలు, ఆదాయం వివరాలు, పన్ను వివరాలు, పన్ను చెల్లింపు వివరాలు, 80 G వివరాలు నమోదు చేయాలి. నమోదులు ఎప్పటి కప్పుడు సేవ్ చేసుకొంటే మంచిది. అన్ని నమోదులు పూర్తి అయిన తరువాత సబ్ మిట్ చేయాలి. 26 AS లో నమోదు అయిన పన్ను, ఇ- ఫైలింగ్ లో పన్ను ఒకే విధంగా ఉండాలి. లేనట్లయితే నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది._*


*💧ఎకనాలెడ్జ్మెంట్:*

*_ITR- 1 సబ్ మిట్ చేసిన తరువాత ఎకనాలెడ్జ్మెంట్ ఆప్షన్స్ వస్తాయి.  ఎకనాలెడ్జ్మెంట్ సీపిసి బెంగుళూరుకు పంప వలసినదీ, లేనిదీ ఎకనాలెడ్జ్మెంట్ క్రింది భాగంలో పేర్కొన బడుతుంది. పంప వలసి వస్తే సంతకం చేసి 3 నెలల లోపు పంపాలి._*
[18/02 12:05 pm] బి.మధు: *⁉PVRao PRTU TIRUVURU⁉*                                                            *❄సందేహాలు -- సమాధానాలు❄*
___________________________________

190. ప్రశ్న:
OD తర్వాత CL పెట్టవచ్చా??

*💧జవాబు:*
*మీరు వాడిన OD కి TA&DA ఇస్తే మాత్రం CL పెట్టకూడదు.*
____

191.ప్రశ్న:
మున్సిపల్ టీచర్ల కి కూడా పిల్లల ఫీజు రీ- అ0బర్సుమెంట్ అవకాశం ఉందా??

*💧జవాబు:*
*RC.14311,తేదీ:15.7.13 ప్రకారం అవకాశం ఉంది.*
____

192.ప్రశ్న:
చైల్డ్ కేర్ లీవ్ మూడు సార్లు మాత్రమే వాడుకోవాలా??

*💧జవాబు:*
*బిడ్డల వయస్సు 18 ఇయర్స్ లోపు ఎన్ని పర్యాయాలు ఐనా వాడుకోవచ్చు. ఐతే మొత్తం 60 మాత్రమే వాడుకోవాలి.*
____

193.ప్రశ్న:
GIS పెంచినపుడు SR లో నమోదు చేయించుకోవాలా??

*💧జవాబు:*
*ఏ ఏ పీరియడ్ లో ఎంత మినహాయింపు జరిగిందో తెలియాలి అంటే SR మాత్రమే కీలకం. కాబట్టి SR లో నమోదు చేయించుకోవాలి.*


194.ప్రశ్న:
ఒక మహిళా టీచర్ ప్రసూతి సెలవులో ఉన్నారు.పెరిగిన DA ఆమెకు ఎప్పటినుంచి ఇవ్వాలి??

*🌻జవాబు:*
*మెమో.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ప్రసూతి సెలవు సహా ఏ సెలవు కైనా సెలవుకి ముందు రోజు వేతనం మాత్రమే చెల్లించబడుతుంది.*
_____

195. ప్రశ్న:
ఒక టీచర్ అనారోగ్యంతో 6 నెలల పాటు హాఫ్ పే లీవ్ పెట్టాడు.ఆ కాలానికి ELs ఎలా ఇవ్వాలి.

*🌻జవాబు:*
*Aplr 1933 లోని రూల్ 4 ప్రకారం ELs ను డ్యూటీ పీరియడ్ పై మాత్రమే లెక్కించాలి.ఏ విధమైన ఆకస్మికేతర సెలవు కూడా డ్యూటీ గా పరిగణించబడదు.కనుక 3 ELs జమ చేయకూడదు.*
_____

196.ప్రశ్న:
ఎవరెవరిని బదిలీల కి spouse కేటగిరీ గా పరిగణిస్తారు.

*🌻జవాబు:*
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు,గ్రాంట్ ఇన్ ఎయిడ్,ప్రభుత్వ రంగ సంస్థ ల ఉద్యోగుల ను మాత్రమే spouse కేటగిరీ గా పరిగణిస్తున్నారు.*
_____

197.ప్రశ్న:
ఫిబ్రవరి 29న విధులలో చేరిన టీచర్ కి 6 ఇయర్స్ స్కేల్ ఏ తేదీ నుంచి ఇవ్వాలి?

*🌻జవాబు:*
*మార్చి1 నుండి ఇవ్వాలి.AAS నిబంధనలు ప్రకారం 6 ఇయర్స్ సర్వీసు పూర్తి ఐన మరుసటిరోజు నుంచి స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేయాలి.*
_____





___________________________________

198. ❄ప్రశ్న:
OD తర్వాత CL పెట్టవచ్చా??

*💧జవాబు:*
*మీరు వాడిన OD కి TA&DA ఇస్తే మాత్రం CL పెట్టకూడదు.*
____

199. ప్రశ్న:
మున్సిపల్ టీచర్ల కి కూడా పిల్లల ఫీజు రీ- అ0బర్సుమెంట్ అవకాశం ఉందా??

*💧జవాబు:*
*RC.14311,తేదీ:15.7.13 ప్రకారం అవకాశం ఉంది.*
____

200. ప్రశ్న:
చైల్డ్ కేర్ లీవ్ మూడు సార్లు మాత్రమే వాడుకోవాలా??

*💧జవాబు:*
*బిడ్డల వయస్సు 18 ఇయర్స్ లోపు ఎన్ని పర్యాయాలు ఐనా వాడుకోవచ్చు. ఐతే మొత్తం 60 మాత్రమే వాడుకోవాలి.*
____

201.ప్రశ్న:
GIS పెంచినపుడు SR లో నమోదు చేయించుకోవాలా??

*💧జవాబు:*
*ఏ ఏ పీరియడ్ లో ఎంత మినహాయింపు జరిగిందో తెలియాలి అంటే SR మాత్రమే కీలకం. కాబట్టి SR లో నమోదు చేయించుకోవాలి.*


202.ప్రశ్న:
ఒక మహిళా టీచర్ ప్రసూతి సెలవులో ఉన్నారు.పెరిగిన DA ఆమెకు ఎప్పటినుంచి ఇవ్వాలి??

*🌻జవాబు:*
*మెమో.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ప్రసూతి సెలవు సహా ఏ సెలవు కైనా సెలవుకి ముందు రోజు వేతనం మాత్రమే చెల్లించబడుతుంది.*
_____

203. ప్రశ్న:
ఒక టీచర్ అనారోగ్యంతో 6 నెలల పాటు హాఫ్ పే లీవ్ పెట్టాడు.ఆ కాలానికి ELs ఎలా ఇవ్వాలి.

*🌻జవాబు:*
*Aplr 1933 లోని రూల్ 4 ప్రకారం ELs ను డ్యూటీ పీరియడ్ పై మాత్రమే లెక్కించాలి.ఏ విధమైన ఆకస్మికేతర సెలవు కూడా డ్యూటీ గా పరిగణించబడదు.కనుక 3 ELs జమ చేయకూడదు.*
_____

204.ప్రశ్న:
ఎవరెవరిని బదిలీల కి spouse కేటగిరీ గా పరిగణిస్తారు.

*🌻జవాబు:*
*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు,గ్రాంట్ ఇన్ ఎయిడ్,ప్రభుత్వ రంగ సంస్థ ల ఉద్యోగుల ను మాత్రమే spouse కేటగిరీ గా పరిగణిస్తున్నారు.*
_____

205. ప్రశ్న:
ఫిబ్రవరి 29న విధులలో చేరిన టీచర్ కి 6 ఇయర్స్ స్కేల్ ఏ తేదీ నుంచి ఇవ్వాలి?

*🌻జవాబు:*
*మార్చి1 నుండి ఇవ్వాలి.AAS నిబంధనలు ప్రకారం 6 ఇయర్స్ సర్వీసు పూర్తి ఐన మరుసటిరోజు నుంచి స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేయాలి.*
_____



206.ప్రశ్న:
నేను జులై 14 న ఉద్యోగం లో చేరాను.ఇంక్రిమెంట్ నెల జులై.నేను జూన్ 30 న రిటైర్ అవుతున్నాను.పెన్షన్ ప్రతిపాదనలు ఎలా పంపాలి??

*🌼జవాబు:*
*జీఓ.133 తేదీ:3.5.74 మరియు మెమో.49643 తేదీ:6.10.74 ప్రకారం ఇంక్రిమెంట్ అనేది నెల మొదటి తేదీ అవుతుంది. ఉద్యోగం లో చేరిన తేదీ కాదు.కావున మీకు రిటైర్మెంట్ మరుసటి రోజు ఇంక్రిమెంట్ నోషనల్ గా మంజూరు చేసి పెన్షన్ ప్రతిపాదనలు పంపుకోవాలి.*
____

207.ప్రశ్న:
నేను ఉన్నత చదువుల కోసం 78 రోజులు జీత నష్టపు సెలవు పెట్టాను.ఆ కాలానికి ఇంక్రిమెంట్ వాయిదా వేశారు.వాయిదా పడకుండా ఉండేందుకు ఏమి చెయ్యాలి??

*🌼జవాబు:*
*FR-26 ప్రకారం 6 నెలల వరకు ఇంక్రిమెంట్ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికార0 CSE గారికి మాత్రమే ఉన్నది.కాబట్టి మీరు CSE గారికి దరఖాస్తు చేసుకోగలరు.*
____

208.ప్రశ్న:
డైస్ నాన్ కాలం అంటే ఏమిటి??

*🌼జవాబు:*
*FR.18 మరియు APLR-1933 లోని రూల్ 5 ప్రకారం 5ఇయర్స్ కి మించి గైర్హాజరు అయిన ఉద్యోగి, తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు గా భావించాలి.తిరిగి ఉద్యోగం లో చేరాలి అంటే ప్రభుత్వం యొక్క అనుమతి కంపల్సరీ.*
*FR.18 ప్రకారం డైస్ నాన్ కాలం ఇంక్రిమెంట్లు, సెలవులు, పెన్షన్ తదితర సందర్భాలకు సర్వీసు గా పరిగణించబడదు.కనుక ఈ కాలానికి సెలవు మంజూరు చేయటo,వేతనం చెల్లించటం అనే ప్రశ్నలు ఉత్పన్నం కావు.*
____

209.ప్రశ్న:
అనారోగ్యం కారణాలతో ఉద్యోగం చేయలేకపోతున్నాను.నా తమ్ముడు డిగ్రీ, బీ. ఈ. డి చదివాడు.నా ఉద్యోగం తమ్ముడు కి ఇప్పించవచ్చునా?

*🌼జవాబు:*
*టీచర్ ఉద్యోగం వేరే వారికి నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు.*
*కానీ జీఓ.66 తేదీ:23.10.2008 ప్రకారం నిబంధనలకు లోబడి మీరు అనారోగ్యం కారణంగా శాశ్వతంగా విధులు నిర్వహి0సలేరని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేసన్ కింద రిటైర్మెంట్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ స్థాయి కి మించకుండా కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది.*
____

210.ప్రశ్న:
నేను,నా భార్య ఇద్దరం టీచర్ల0.హెల్త్ కార్డుకి ప్రీమియం నా జీతం ద్వారా చెల్లించుచున్నాను.నా భార్య హెల్త్ కార్డులో వారి  తల్లిదండ్రులు పేర్లు చేర్చుకోవచ్చా??

*🌼జవాబు:*
*చేర్చుకోవచ్చు. మహిళా టీచర్లు కూడా ఆధారిత తల్లిదండ్రులు పేర్లు హెల్త్ కార్డులో చేర్చుకోవచ్చు.*
____

211.ప్రశ్న:
EOL కాలాన్ని వాలoటరీ రిటైర్మెంట్ కి పరిగణనలోకి తీసుకుంటారా??

*🌼జవాబు:*
*EOL కాలాన్ని అర్హత గల సెలవు గా లెక్కించరు.*
*కానీ వ్యక్తిగత కారణాల తో eol ఐతే 36 నెలల వరకు, అనారోగ్య కారణాలతో ఐతే ఎంతకాలం ఐనా eol కాలాన్ని పెన్షన్ లెక్కింపు కి అర్హత సెలవుగానే పరిగణిస్తారు.*
____

212.ప్రశ్న:
నేను HM గా పనిచేస్తున్నాను.అనారోగ్య కారణాల చేత SA గా రివర్సన్ తీసుకోవాలని అనుకుంటున్నాను.పరిస్థితి ఏమిటి??

*🌼జవాబు:*
*FR14 ప్రకారం HM పోస్టులో లీన్ స్థిరీకరణ జరిగే వరకు SA పోస్టులో మీ లీన్ కొనసాగుతుంది.కనుక మీరు రివర్శన్ తీసుకోవచ్చు.ఐతే పదోన్నతి ద్వారా వచ్చిన 2 ఇంక్రిమెంట్లు రద్దు అవుతాయి.SA క్యాడర్ లో తదుపరి AAS కి అర్హత ఉండదు.*
____

213. ప్రశ్న:
నాకు వినికిడి లోపం 70 శాతం ఉన్నట్లు మెడికల్ సర్టిఫికేట్ కలదు. కాని ఎలవెన్స్ పొందటానికి సరైన వివరములు లేవు. నేను అలవెన్స్ పొందటానికి అర్హుడునా..???

*🌼జవాబు:*
*మీరు కన్వీయన్స్ ఎలవెన్స్ కు అర్హులు. సంబంధిత ఉత్తర్వులు DDO ఇస్తే సరిపోతుంది.GO MS:197, Dt:6-7-2006. సివిల్ సర్జన్ ర్యాంక్ తగ్గని తత్సంబంధిత వైద్యుడు ఈ ధృవపత్రం జారీ చేయాలి. ఈ సర్టిఫికేట్ జారీ చేసిన తేదీ నుండి వర్తించును. CL తప్పించి మరి ఏ సెలవులలోనూ ఈ ఎలవెన్స్ ఇవ్వబడదు. సస్పెన్సన్ కాలంలో కూడా ఇవ్వబడదు.*
*GO MS No:262, Dt:25-8-1980*


214. ప్రశ్న:
ఏ నెలలో ఆర్జిత సెలవు ను నగదుగా మార్చుకోవాలి??

*🌷జవాబు:*
*మెమో.1478 ; ఆర్ధిక ; తేదీ:22.6.11 ప్రకారం 12 నెలల వ్యవధిలో 15 రోజులు,24 నెలల కాల వ్యవధి లో 30 రోజులు ఏ నెలలో నైనా ఆర్జిత సెలవు ను నగదుగా మార్చుకోవచ్చు.*
____

215. ప్రశ్న:
వేసవి సెలవుల్లో ముందు రోజు బడికి వెళ్ళాను. సెలవులు అనంతరం ప్రారంభం రోజు బడికి వెళ్లలేకపోతే ఏ విధమైన సెలవు పెట్టుకోవచ్చు??

*🌷జవాబు:*
*Ldis. no.1933 , తేదీ:30.3.84 ప్రకారం అర్ధజీతపు,కమ్యూటెడ్,సంపాధిత, జీతనష్టం సెలవులను మాత్రమే వాడుకోవాలి.*
____

216.ప్రశ్న:
ఒక టీచర్ సర్వీసు మొత్తం మీద ఎన్ని రోజులు కమ్యూటెడ్ సెలవు వాడుకోవాలి??

*🌷జవాబు:*
*జీఓ.186 ; ఆర్ధిక ; తేదీ:23.7.75 ప్రకారం సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవు గా వాడుకోవచ్చు.*
____

217.ప్రశ్న:
ఒక టీచర్ ఏదైనా పరీక్ష రాయాలంటే పై అధికారి అనుమతి తీసుకోవాలా??

*🌷జవాబు:*
*సర్వీసు లో ఉండి ఏ పరీక్ష రాయాలన్నా పై అధికారి అనుమతి తప్పకుండా తీసుకోవాలి.*
____

218.ప్రశ్న:
ఒక sgt వేరే dsc లో sa గా ఎంపిక ఐతే వేతన రక్షణ ఉంటుందా?అదే ఇంక్రిమెంట్ తేదీ కొనసాగుతుందా??

*🌷జవాబు:*
*మీరు పై అధికారి అనుమతి తో relieve ఐతే FR.22(a) ప్రకారం రక్షణ ఉంటుంది. ఇంక్రిమెంట్ కి మాత్రం రక్షణ ఉండదు.sa గా చేరిన సంవత్సరం నకు మాత్రమే ఇంక్రిమెంట్ ఇస్తారు.*

219.ప్రశ్న:
నేను త్వరలో రిటైర్మెంట్ కాబోతున్నాను.పెన్షన్ బెనిఫిట్ లు ఐటీ లో చూపాలా??

*🍁జవాబు:*
*పెన్షన్ ను ఆదాయం గా చూపాలి.గ్రాట్యుటీ, కమ్యుటేషన్,సంపాధిత సెలవు నగదుగా మార్చుకోనుట ఆదాయం పరిధిలోకి రావు.*
____

220.ప్రశ్న:
నేను బదిలీ అయ్యాను.పాత మండలం లో చాలా ఎంట్రీ లు వేయలేదు.ఇంతలో పాత MEO రిటైర్మెంట్ అయ్యాడు.ఆ ఎంట్రీ ల కోసం నేను ఇప్పుడు ఏమి చేయాలి??

*🍁జవాబు:*
*సంబంధిత ఆధారాలతో ప్రస్తుత MEO సరిచేయవచ్చు.*
_____

221.ప్రశ్న:
నేను DEO గారి అనుమతి తో లీన్ పై ఇతర రాష్ట్రంలో ఉద్యోగం నకు ఎంపిక అయ్యాను.నేను ఆ ఉద్యోగం లో ఇమడ లేకపోతే తిరిగి నా సొంత పోస్టుకి రావచ్చునా??

*🍁జవాబు:*
*జీఓ.127 తేదీ:8.5.12 ప్రకారం కొత్త పోస్టులో ప్రొబేసన్ డిక్లరేషన్ ఐన తేదీ, లేదా పోబేషన్ డిక్లరేషన్ అయినట్లు భావించబడే తేదీ లేదా నూతన పోస్టు లో చేరిన తేదీ నుంచి 3 ఇయర్స్ లో ఏది ముందు ఐతే ఆ తేదీ వరకు పాత పోస్టుపై లీన్ కొనసాగుతుంది.అప్పటిలోగా మీరు పాత పోస్టుకి వచ్చే అవకాశం ఉంటుంది.*
____

222.ప్రశ్న:
బోన్ టీబీ కి ప్రత్యేక సెలవు ఉన్నదా??

*🍁జవాబు:*
*6 నెలల వరకు పూర్తి జీతంపై అర్ధ జీతపు సెలవు మంజూరు చేస్తారు.*
____

223.ప్రశ్న:
నేను జీత నష్టపు సెలవు పెట్టి M. ed చేయాలని అనుకుంటున్నాను.నేను ఏమి నష్ట పోతాను??

*🍁జవాబు:*
*జీత నష్టపు సెలవు పెట్టినంతకాలం ఇంక్రిమెంట్,AAS స్కేల్స్ వాయిదా పడతాయి.3 ఇయర్స్ పైన జీత నష్టపు సెలవు కాలం పెన్షన్ కి అర్హ దాయక సర్వీస్ గా పరిగణింపబడదు.*


224.ప్రశ్న:
నేను జూన్ 30 న రిటైర్మెంట్ అవుతున్నాను.నేను ఎన్ని సెలవులు వాడుకోవచ్చు??

*🌸జవాబు:*
*మొత్తం 22 CLs వాడుకోవచ్చు.*
____

225.ప్రశ్న:
నేను ,నా భర్త టీచర్ల0.నా భర్త మరణించిన పిదప నాకు కుటుంబ పెన్షన్ ఇస్తున్నారు.దీనికి DA ఇవ్వరా??

*🌸జవాబు:*
*జీఓ.51, తేదీ:30.4.15 ప్రకారం కారుణ్య నియామకం పొందిన వారికి మాత్రమే DA ఇవ్వరు.మీకు కుటుంబ పెన్షన్ పై DA చెల్లిస్తారు.*
____

226.ప్రశ్న:
నేను డ్రాయింగ్ టీచర్ ని.PAT పాస్ అయ్యాను.B. Com పాస్ అయ్యాను.B. ed లేదు.నాకు 24 ఇయర్స్ స్కేల్ ఇవ్వరా??

*🌸జవాబు:*
*24 ఇయర్స్ స్కేల్ పొందాలి అంటే డిగ్రీ&బీ.ఎడ్ ఉండాలి.*
____

227.ప్రశ్న:
నేను రెండు నెలలు FAC HM గా పనిచేశాను.అలవెన్సు ఇచ్చారు.పెరిగిన DA తేడా ఇవ్వరా??

*🌸జవాబు:*
*FAC కాలానికి,సరెండర్ లీవు కాలానికి DA తేడా పొందవచ్చు.*
____

228.ప్రశ్న:
ఒక టీచర్ సస్పెండ్ అయ్యాడు.ఇంక్రిమెంట్ ఆపారు.అతనికి 12 ఇయర్స్ స్కేల్ ఇచ్చేటప్పుడు  ఈ కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చా??

*🌸జవాబు:*
*మెమో.41082, తేదీ:30.12.96 ప్రకారం ఇంక్రిమెంట్ నిలుపుదల కాలాన్ని కూడా AAS కి పరిగణలోకి తీసుకోవాలి.*


229.ప్రశ్న:
నేను శనివారం, సోమవారం సెలవు పెట్టాలి.రెండు CL లెటర్లు ఇవ్వాలా??

*🌻జవాబు:*
*అవసరం లేదు. ఒక లెటర్ పై రాసి ఆదివారం అనుమతి అని రాయండి సరిపోతుంది.*
____

230.ప్రశ్న:
APGLI నుండి పొందిన ఋణానికి వడ్డీ చెల్లించాలా??

*🌻జవాబు:*
*ఋణం మంజూరు చేసే సమయంలోనే వడ్డీ కూడా అంచనా వేసి సమాన నెలసరి వాయిదాలు నిర్ణయిస్తారు.*
____

231.ప్రశ్న:
నేను 13.6.16 న విధులలో చేరాను.ట్రైనింగ్ లేదు.కానీ జీతం 1.6.16 నుండి ఇచ్చారు.ఇపుడు జాయినింగ్ తేదీ గా ఏది SR లో రాయాలి??

*🌻జవాబు:*
*జీతం 1.6.16 నుండి ఇచ్చారు కాబట్టి మీ date of జాయినింగ్ కూడా 1.6.16 రే అవుతుంది.*
____

232.ప్రశ్న:
నేను cps ఉద్యోగిని.సేవింగ్స్ 1,20,000/- ఉన్నాయి. Cps మినహాయింపు 53,000/- ఉన్నాయి. వీటిని ఐటీ ఫారం లో ఎలా చూపాలి??

*🌻జవాబు:*
*30,000/- వరకు 80ccd(1) కింద, మిగిలిన 23,000/- ను 80ccd(1బి)కింద చూయించి పన్ను మినహాయింపు పొందవచ్చు.*
____

233.ప్రశ్న:
ఈ సంవత్సరం రెండు da లు కలపటం వల్ల నా ఆదాయం 5 లక్షలు దాటింది.20% పన్ను పరిధిలోకి వెళ్ళాను. ఆ రెండు da లు గత సంవత్సరం ఆదాయంలో చూయించుకోవచ్చా??

*🌻జవాబు:*
*చూపించుకోవచ్చు.గత సంవత్సరం నకు చెందిన బకాయిలను ఆయా సంవత్సరం లలో చూపి పన్ను మినహాయింపు పొందవచ్చు. అందుకోసం ఫారం 10-E సమర్పించాలి.*
__________________________

234.ప్రశ్న:
నేను ఎయిడెడ్ స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ గా ఉన్నాను.నేను HM అకౌంట్ టెస్ట్ పాస్ కాలేదు.నేను 6,12,18 ఇయర్స్ స్కేల్స్ పొందాను.నాకు 24 ఇయర్స్ స్కేల్ కి అర్హత ఉన్నదా??

*🌼జవాబు:*
*ఉన్నది. నేరుగా స్కూల్ అసిస్టెంట్ గా నియమించబడినందున మీరు 24 ఇయర్స్ స్కేల్ పొందాలంటే రెండవ ప్రమోషన్ పోస్ట్ లేనందువలన మీకు అర్హత లతో సంబంధం లేకుండా 24 ఇయర్స్ పూర్తి కాగానే స్కేల్ మంజూరు చేయబడుతుంది.*
____

235.ప్రశ్న:
నేను LFL HM గా పనిచేయుచున్నాను.6 ఇయర్స్ స్కేల్ తీసుకున్నాను.12 ఇయర్స్ స్కేల్ పొందటానికి ఏ ఏ అర్హతలు కావాలి.నాకు ప్రస్తుతం 50 ఇయర్స్ నిండినవి.

*🌼జవాబు:*
*మీరు 12 ఇయర్స్ స్కేల్ తీసుకోవాలి అంటే డిగ్రీ,బి.ఎడ్ లతో పాటు డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయి ఉండాలి.మెమో.34408 తేదీ:4.2.12 ప్రకారం 50 ఇయర్స్ మినహాయింపు వర్తించదు.*
____

236.ప్రశ్న:
నేను హైస్కూల్ లో పనిచేస్తున్నాను.పరీక్షల నిమిత్తం దాదాపు 35 రోజులు వేసవి సెలవుల్లో బడికి వచ్చాను.నాకు ఎన్ని ELs ఇస్తారు??

*🌼జవాబు:*
*మీరు 15 రోజుల కన్నా తక్కువ గా వేసవి సెలవులు వినియోగించుకున్నందున FR.82(డి) ప్రకారం 24 రోజులు సంపాదిత సెలవులు ఇవ్వాలి.*
____

237.ప్రశ్న:
నేను రక్త దానం చేశాను. spl. CL ఎవరు ఇస్తారు??

*🌼జవాబు:*
*జీఓ.137 తేదీ:23.2.84 ప్రకారం రక్త దానం చేస్తే CL మంజూరు చేసే అధికారే spl. Cl కూడా మంజూరు చేస్తారు.*
__________________________

238.ప్రశ్న:
నేను పేరు మార్చుకోవాలని అనుకుంటున్నాను.ఐతే ఏమి చెయ్యాలి??

*🌺జవాబు:*
*జీఓ.102 తేదీ:24.4.1985 ప్రకారం 5రూ స్టాంపు పేపర్ మీద అఫిడవిట్ చేఇ0చి,DDO, తెలిసిన ఇద్దరితో సాక్షి సంతకాలు చేఇ0చాలి.స్థానిక వార్తా పత్రికలలో మరియు గెజిట్ లో ప్రచురణ చేఇ0చాలి.*
____

239.ప్రశ్న:
నేను PF నుండి ఋణం పొందియున్నాను.
వాయిదాలు పూర్తి కాలేదు.మరలా ఋణం కావాలి.ఇస్తారా??

*🌺జవాబు:*
*ZPPF నిబంధనలు 14 ప్రకారం మరల ఋణం పొందవచ్చు. మిగిలి ఉన్న బకాయి,కొత్త ఋణం మొత్తం కలిపి వాయిదాలు నిర్ణయిస్తారు.*
____

240.ప్రశ్న:
ఒక డీజేబుల్డ్ ఉపాధ్యాయునికి వృత్తి పన్ను మినహాయించాలి అంటే ఎంత శాతం అంగవైకల్యం ఉండాలి??

*🌺జవాబు:*
*జీఓ.1063 తేదీ:2.8.2007 ప్రకారం 40% డీజేబుల్డ్ ఉంటే వృత్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది.*
____

241.ప్రశ్న:
ఒక టీచర్ ఫిబ్రవరి 29న జాబ్ లో చేరాడు.అతనికి వార్షిక ఇంక్రిమెంట్ ఏ నెలలో ఇవ్వాలి??

*🌺జవాబు:*
*ఆర్.సి.2071 తేదీ:21.7.2010 ప్రకారం లీపు సంవత్సరం ఫిబ్రవరి 29న విధుల్లో చేరిన ఉపాధ్యాయుల వార్షిక ఇంక్రిమెంట్ ఫిబ్రవరి నెల లోనే ఇవ్వాలి.*
____

242.ప్రశ్న:
బిడ్డ పుట్టి వెంటనే మరణించిన, వారికి మెటర్నిటీ లీవు కి అర్హత ఉందా??

*🌺జవాబు:*
*Lds.1941 తేదీ:11.6.90 ప్రకారం మరణించిన బిడ్డను ప్రసవించినా,ప్రసూతి సెలవు వాడుకోవచ్చు.*
_______________________________

243.ప్రశ్న:
ఒక టీచర్ వైద్య కారణం లపై 3 సార్లు జీత నష్టపు సెలవు పెట్టాడు.అతని వార్షిక ఇంక్రిమెంట్ వాయిదా పడుతుందా??

*🌼జవాబు:*
*పడుతుంది. ఐతే CSE గారు అనుమతి మంజూరు చేస్తే,నార్మల్ ఇంక్రిమెంట్ కొనసాగే అవకాశం ఉంది.*


244 .ప్రశ్న : వేసవి సెలవుల్లో పాఠశాల విధులు నిర్వహి0చటానికి జూనియర్ అసిస్టెంట్ లేకపోతే ఎవరిని నియమించాలి??

*🌹జవాబు:*
*ఆ స్కూల్లో సీనియర్ ఉపాధ్యాయునికి ముందు అవకాశం ఇవ్వాలి.*
____

245.ప్రశ్న:
ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే,కారుణ్య నియామకం కింద వారుసునికి ఉద్యోగం ఇస్తారా??

*🌼జవాబు:*
*మెమో.41758 , తేదీ:19.7.2007 ప్రకారం ఉద్యోగం ఇస్తారు.*
____

246.ప్రశ్న:
CPS ఉద్యోగులు తమ ఖాతాలోని జమలు ఎన్ని సార్లు విత్ డ్రాల్ చేసుకోవచ్చు??

*🌼జవాబు:*
*మూడు సందర్భం లలో విత్ డ్రాయల్ చేసుకోవచ్చు. ఉద్యోగి పదవీ విరమణ సందర్భంలో,మరణించిన సందర్భంలో,పదవీ విరమణ కి ముందే పథకం నుంచి నిష్క్రమించే సందర్భంలో*
 ____

247.ప్రశ్న:
ఒక టీచర్ 2015 లో 7 నెలల పాటు సస్పెండ్ అయ్యాడు.పోస్టింగ్ ఆర్డర్ లో రెండు ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తున్నట్లు ఇచ్చారు.అతనికి ఎప్పుడు ఇంక్రిమెంట్లు ఇస్తారు??

*🌼జవాబు:*
*అతనికి 2015,2016 లలో రావాల్సిన ఇంక్రిమెంట్లు నిలుపుదల చేసి,2017 లో ముందు రెండు ఇంక్రిమెంట్లు కూడా కలిపి మంజూరు చేస్తారు.*
___________________________


248.ప్రశ్న:
సీనియర్ స్టెప్ అప్ తీసుకున్న తర్వాత జూనియర్ SPP-1A స్కేల్ తీసుకోవటం వల్ల సీనియర్ కంటే ఎక్కువ వేతనం పొందుతున్నాడు.ఇపుడు సీనియర్ మరల స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నదా??

*🌹జవాబు:*
*వీలు లేదు. స్టెప్ అప్ నిబంధనలు ప్రకారం సీనియర్ ఒకసారి మాత్రమే స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నది.*
____

249.ప్రశ్న:
నేను ZPHS లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.స్కూల్ అసిస్టెంట్ కి ఉండవలసిన అర్హతలు అన్నీ కలిగి ఉన్నాను.నాకు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి ఇస్తారా??

*🌹జవాబు:*
*అవకాశం లేదు.*
____

250.ప్రశ్న:
నా భార్య CPS ఉద్యోగి.ఆమె మరణించారు.ఇపుడు నేను ఏమి చేయాలి??

*🌹జవాబు:*
*CPS లో ఉన్న డబ్బులు కోసం 103--జీడీ ఫారం పూర్తి చేయాలి.సంబంధిత పత్రాలు జతపరచి DDO ద్వారా ట్రెజరీకి పంపాలి.వీరు వాటిని PRA ముంబై కి పంపాలి.వారు పరిశీలించి,మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.*
____