Sunday, August 4, 2019

INDIAN NATIONAL ANTHEM


INDIAN NATIONAL ANTHEM


  Rabindranath Tagore


జాతీయ గీతంలోని పదాలకు అర్థాలు


జన = జనం

గణ = సమూహం

మన = మనసు

అధినాయక = నాయకుడు

జయహే = విజయం

భారత = మన భారతదేశానికి

భాగ్య విధాత = పథాన్ని నిర్ణయించేవాడ

పంజాబ = పంజాబ్ రాష్ట్రం

సింధు = సింధు రాష్ట్రం

గుజరాత = గుజరాత్

మరాఠా = మహారాష్ట్ర

ద్రావిడ = తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా ప్రాంతాలు

ఉత్కల = ఒడిస్సా

వంగ = బెంగాల్

వింధ్య = వింధ్య పర్వతాలు

హిమాచల = హిమాలయాలు

యమునా = యమునా నది

గంగ = గంగా నది

ఉచ్చల = కదిలే

జలధితరంగా = సముద్ర జలాలు

తవ = నీ

శుభ = శుభప్రదమైన

నామే = పేరును 

జాగే = మేల్కొలుపు గాక

తవ = నీ

శుభ = శుభప్రదమైన 

ఆశిష = దీవెనలు

మాకే = అడుగుతున్నాము

గాహే = పాడుతున్నాము 

 తవ = నీ

జయగాథా = విజయగాథ ను

జన = ప్రజలు

గణ = సమూహాలు

మంగళ = శుభాన్ని 

దాయక = ఇచ్చే

జయ హే = విజయాన్ని

భారత = ఈ దేశానికి

భాగ్యవిధాత = పథాన్ని నిర్దేశించే వాడా



భారతదేశ ప్రజల మనసులను పాలించే ఓ భారత భాగ్యవిధాత, నీకు జయమగుగాక.

 మీ పేరు పంజాబ్, సింధు, గుజరాత్, మహారాష్ట్ర, ద్రావిడ, ఉత్కళ, బెంగాల్ ప్రజల హృదయాల్ని మేల్కొలుపుతుంది.

 వింధ్య , హిమాలయాల్లో మార్మోగుతుంది. యమునా గంగ ల్లో ప్రతిధ్వనిస్తుంది.

 భారతదేశాన్ని ఆనుకొని ఉన్న సముద్ర తరంగాలు కూడా మీ పేరును ఉచ్చరిస్తాయి.

 ఇవన్నీ మీ ఆశీర్వచనాలను అడుగుతాయి.

 వీరగాథలను ఆలపిస్తాయి. 

 ఈ దేశ ప్రజల క్షేమం మీ చేతుల్లోనే ఉంది.

 ఓ భారత భాగ్య విధాత నీకు జయమగు గాక! జయమగు గాక! జయమగు గాక!