Wednesday, October 9, 2019

YSR KANTI VELUGU

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం డా. వై.యస్.ఆర్‌ కంటి వెలుగు

ఆరోగ్య సిబ్బంది - ప్రాథమిక కంటి పరీక్షలకు సూచనలు

 1. బాగా వెలుతురుగా ఉన్న గదిని కంటి పరీక్షల కొరకు ఎంపిక చేసుకోవాలి.

2. విజన్‌ కిట్‌ లోని E చార్జ్‌ ను గదిలో / వరండాలో వెలుతురు ఉన్న వైపు ఉంచాలి.

3. E చార్జుకు ఎదురుగా 3 మీటర్ల దూరమును విజన్‌ కిట్‌ లోని టేప్‌ సహాయముతో కొలిచి అక్కడ ఒక గుర్తును ఉంచాలి.

4. E. చార్జ్‌ నుంచి ఎదురుగా 3 మీటర్ల దూరములో గుర్తు దగ్గర పాఠశాల
విద్యార్థిని ఉంచి చూపు పరీక్షను నిర్వహించాలి

5. విద్యార్థి కంటి అద్దములు వాడుచునట్లు 
ఐతే అద్దములు ఉంచి చూపు పరీక్ష నిర్వహించాలి. 

6. మొదట కుడి కంటిని, తరువాత  ఎడమ కంటిని వేరువేరుగా చూపు పరీక్ష
నిర్వహించాలి. 

7. కుడి కన్ను పరీక్ష చేసినపుడు, ఎడమ కన్ను మీద ఎటువంటి వత్తిడి కలుకుండా
మూసి ఉంచాలి.

8. అలాగే ఎడమకన్ను పరీక్షచేయునప్పుడు, కుడి కన్నుమీద ఎటువంటి వత్తిడి
కలుకుండా మూసి ఉంచాలి.

9. కుడి కన్ను, ఎడమ కన్ను వేరువేరుగా చూపు పరీక్ష కొరకు ఎదురుగా ఉన్న చార్ట్‌
లోని ముందువైపు ఉన్న పెద్ద “E” 4 అక్షరాలలో 3 అక్షరాలు, వెనుకవైపు
ఉన్న చిన్న E 4 అక్షరాలలో 3 అక్షరాలు సక్రముగా చెప్పినచో చూపు బాగా
ఉన్నట్టు, చెప్పకపోతే దృష్టిలోపము ఉన్నట్టుగా గుర్తించాలి.

10. సక్రమంగా ఉంటే ప్రాథమిక కంటి పరీక్షపుస్తకంలో N - అని, చెప్పకపోతే AB అని నమోదు చేయవలెను.

11. తదుపరి ప్రతి విద్యార్థి కుడి, ఎడమ కన్నులను టార్చిలైట్‌ సహాయముతో ఏమైనా లోపాలు (ఎరుపు, మెల్ల, కంటిపూత మొదలగునవి) కొరకు పరీక్షించాలి.

12. చూపు పరీక్షను, టార్బ్చిలైట్‌ పరీక్షా వివరాలను మొదటి దశ - విద్యార్థి మెడికల్‌
రికార్డు - I  (కార్డు) మీద నమోదు చేసి సంతకము చేసి పాఠశాల విద్యార్థి చేతికి
ఇవ్వవలెను. సక్రమంగా ఉంటే ప్రాథమిక కంటి పరీక్షపుస్తకంలో N - అని, చెప్పకపోతే
 AB అని నమోదు చేయవలెను.

13. పాఠశాల విద్యార్థి ని తదుపరి కంటి పరీక్షల కొరకు రిఫరల్‌ చేయబడినచో ఆ
విషయాన్ని విద్యార్థికి తెలియచేయాలి.

14. ప్రాథమిక కంటి పరీక్షల వివరాలను స్కూల్‌ స్కీనింగ్‌ రికార్డు - I(పుస్తకము) లో
కూడా నమోదు చేయవలెను. 

15. ఆశా స్కూలు పుస్తకము లోని వివరాలను, “వై యస్‌ ఆర్‌ కంటి వెలుగు” ప్రత్యేక వెబ్‌ సైట్‌. 

    http://drysrkv.ap.gov.in

లో ప్రాథమిక / పట్టణ  ఆరోగ్య కేంద్రంల లోని కంప్యూటర్ల ద్వారా USIR ID, PASSWORD   ల
సహాయముతో సంబంధిత ANM  జాగ్రత్తగా తప్పులు లేకుండా
నమోదు  చేయాలి. 



ఉపాధ్యయులకు సూచనలు

ప్రతి పాటశాల కు ఒక ఉపాధ్యాయులు ఈ కార్యక్రమ నిర్వహణ కు బాధ్యులుగా వుండాలి.

ఆశా కార్యకర్త సంబంధిత ఉపాధ్యాయుని సమక్షం లో విద్యార్థులకు  కంటి తనిఖీ లను నిర్వహిస్తారు.

దీనికి సంబంధించి ఒక విజన్ చార్ట్,ఒక టార్చ్ లైట్,ఒక టేపు,సరఫరా చేయడం అయినది.

వీటి వినియోగం ఇలా....

మంచి వెలుతురు వున్న ప్రదేశం లో కంటి తనిఖీ లు జరగాలి.

విద్యార్థి నిలుచున్న దగ్గర నుంచి మూడు మీటర్ల దూరం ను టేపు సహాయం తో కొలిచి విద్యార్థి తలకు సమాంతరంగా విజన్ చార్ట్ ను గోడకు పేస్ట్ చేయాలి.

విద్యార్థి నిలుచునే ప్రదేశాన్ని శుద్ధ ముక్క తో మార్క్ చేసి విద్యార్థిని అక్కడ నిలబెట్టాలి.

విద్యార్థులు కంటి పరీక్షలు జరుగుతున్న ప్రదేశం లో ఎక్కువ మంది లేకుండా చూడాలి.

ఇది వరకే కంటి అద్దాలు వాడుతున్న విద్యార్థులకు కంటి అద్దాలు తోనే తనిఖీ నిర్వహించాలి.

ప్రదర్శన

పరీక్షా ప్రక్రియ చేపట్టే ముందు E అక్షరం యొక్క కొసలు ఏ వైపు కు వున్నయిననే విషయం చేతితో ఊపి ఏ విధంగా చెప్పాలో సూచించండి.

పరీక్షా చేయించుకునే విద్యార్థి పరీక్షలో ఎలా చెప్పాలో,చూపించాలి, అనే విషయం అర్ధం అయ్యింది అని నిర్ధారించుకున్న తరువాత ప్రక్రియ మొదలు పెట్టండి.

పరీక్షించే విధానం.

● మొదటి లైన్ పెద్ద E

పాస్.....
🕳 కనీసం రెండు అక్షరాలు చెప్పగలిగితే లేదా చుపించంగలిగితే తరువాత స్టెప్ కు వెళ్ళాలి.

 ఫెయిల్......
🕳ఒక్క అక్షరం లేదా ఏ అక్షరం సరిగ్గా చెప్పడం లేదా చుపించనప్పుడు కంటి పరీక్షలు సూచించాలి.

●రెండవ లైన్.. చిన్న E

పాస్......
🕳కనీసం 4 అక్షరాలు చెప్పగలిగే లేదా చూపించ గలగాలి.

 ఫెయిల్......
🕳మూడు లేదా అంతకు తక్కువ అక్షరాలు చెప్పడం లేదా చూపించక పోతే కంటి పరీక్ష సూచించాలి..

ముందు కుడి కన్ను తరువాత యెడమ కన్ను ను ఇదే విధంగా పరీక్షించాలి..



విద్యార్థికి కంటి పరీక్ష చేసేటప్పుడు తన రెండవ కంటిని మృదువుగా ముసుకోమని చెప్పాలి.

● సంపూర్ణ కంటి పరీక్షా

☆కళ్ళు రెండింటి లో ఏ ఒక్క దానిలో నైనా దృష్టి పరీక్షలో ఫెయిల్ అయినట్లాయిన

☆టార్చ్ లైట్ పరీక్షలో ఏదైనా అసాధారణ పరిస్తితి గమనించినా

☆ఇతర కంటి సంబంధిత సమస్యలు వున్నవారు.

వీరిని పూర్తి కంటి పరీక్షకు పంపించాలి....

☆ఈ కార్యక్రమం పూర్తి అయ్యే లోగా దృష్టి లోపం వున్న వారు,లేనివారు ఈ ప్రాథమిక దశ లో నిర్ధారణ జరగాలి.


●●●●●●●●●●●●●●●●●●●●●●●