ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సర్వీసు రిజిస్టర్ (S.R)ఉంటుంది. ఆ రిజిస్టర్ (వుస్తకం)లో ఉద్యోగికి సంబంధించిన పూర్తి సమాచారం నమోదు చేసుకోవాలి. దాని ఆధారంగా సర్వీసు సాగుతుంది. రిజిస్టర్‌లో ఉంచాల్సిన వివరాలు :
1. నియామకపు ఉత్తర్వు.
2. చేరిన తేది.
3. స్వస్థలం
4. విద్య.
5. పుట్టమచ్చలు.
6. సర్వీసు పుస్తకం 8వ కాలమ్‌లో ఉద్యోగి సంతకం, తేదీ.
7. ప్రతి నంవత్సరం ఉద్యోగి తన సర్వీసు రిజిస్టర్‌ను పరిశీలించుకుని సంతకం చేయాలి.
8. నెల మొదటి తేదీన ఉద్యోగంలో చేరిన వారు ఆ ముందు నెల ఆఖరు తేదీన రిటైర్ అయినా ఇంక్రిమెంట్ కలుస్తుంది.
9. డూప్లికేట్ సర్వీసు పుస్తకం అధికారికంగా ఉంచుకోవచ్చు. దీనివల్ల ఎంట్రీలు సక్రమంగా ఉన్నదీ, లేవిదీ పరిచూమకోవచ్చు.
10. ప్రతి 1- 4 నుండి 31-3 వరకు సర్వీను వెరిఫికేషన్ నమోదు చేయాలి.
11. ఇంక్రిమెంట్ ప్రోసీడింగ్స్.
12. సరెండర్ ప్రోసీడింగ్స్.
13. గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం తేది : 1/11/84 నుండి
14. ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ 1977 నుండి అమల్లోకి వచ్చింది. బేసిక్ పేలో వృద్ధి వచ్చినప్పుడు ఉద్యోగి ఎఫ్.బి.ఎఫ్.
గ్రూప్‌ను మార్చి నమోదు చేయాలి.
15. ఎర్నడ్ లీవ్, హాఫ్-పే లీవ్, ఎక్స్‌ట్రా అర్జినరి లీవ్‌లు ప్రొపిడింగ్స్.
16. ఎర్నడ్ లీవ్, హాఫ్-పే లీవ్, ఎక్స్‌ట్రా ఆర్జినరీ లీవ్‌లకు వెరిఫికేషన్.
17. ఏ కారణంగా చేతనైనా దీర్హకాలం సెలవులు పెట్టి డ్యూటీలో చేరిన తర్వాత లీవ్ మంజూరు చేసినప్పుడు నిల్వ ఉన్నంతవరకు ముందుగా ఇయల్ తదువరి హెట్.పి.ఎల్, మిగిలినదానికి ఇ.ఓ.ఎల్. మంజూరు చేస్తారు. ఇ.ఓ.యల్. పీరియడ్‌ను తప్పనిసరిగా నర్వీను
వెరిఫికేషన్ ఎంట్రీ వేయాలి.
18. LTC ఆదర్ ద్యాన్ హోం టౌన్, హోం టౌన్‌ఎంట్రీ,
19. LTC డిక్లరేషన్.
20. లీవ్ ఎకౌంట్.
21. హాఫ్ పే లీవ్ ఎకౌంట్.
22. పే పిక్సేషన్ ఎంట్రీలు.
23. నామినీ సహ కుటుంబ సభ్యుల వివరాలు.
24. స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ 8-16-24 శాంక్షన్ ఆర్డర్ ఎంట్రీలు.
25. స్పెషల్ గ్రేడ్ ఎంట్రీ.
26. ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ శాంక్షన్ ఆర్డర్ ఎంట్రే.
27. బదిలీ సమయంలో రిలీవ్ ఎంట్రీ.
28. సర్వీసు వెరిఫికేషన్ ఎంట్రి.
29. గ్రూపు ఇన్చూరెన్స్ ఎంట్రీ, నర్వీసు పుస్తకంలో వ్రాయాలి.
30. ట్రాన్స్‌ఫర్ పై వచ్చి జాయిన్ అయిన ఎంట్రీ.
31. జర్నీ పీరియడ్ ఎనైల్ చేసుకున్న ఎంట్రీ.
32. ఏ కారణంతో ట్రాన్స్‌నర్ ఎంట్రీ (ఈ ఎంట్రీలు వేయించుకుంటే సీనియారిటీ లిస్టలో న్యాయం జరుగుతుంది)
33. సంతకాలు కాని ఎంట్రీలు ఉంటే జాగ్రత్తగా చూనుకొని సంతకాలు చేయించుకోవాలి.
34. ఏదైనా సందర్భంలో నంబంధిత రికార్డులు అందుబాటులో లేనప్పుడు సంబంధిత ఉద్యోగి ఆఫిడవిట్ ఇస్తూ ఆ కాలంలో తనతో కలిసి పనిచేసిన మరొక తోటి ఉద్యోగి అఫిడవిట్ దాఖలు చేసి ఎంట్రీ వేయించుకోవచ్చు.
35. ప్రత్యేక ప్రోత్సాహక, ప్రోత్సాహక ఇంక్రిమెంట్, సర్టిఫికేట్లు మోడల్స్, పొందినట్లు ఐతే అలాంటివి కూడా నర్వీసు వుస్తకంలో నమోదు చేస్తారు,
36. GPF account No
37. APGLI No
38. కుల ధృవీకరణ నమోదు.
39. Employee ID No
40. GO 610 ప్రకారం లోకల్ స్టేటస్ నమోదు.
41. F. R. 26 డి 2 సర్టిఫికేట్ కూడా లీవ్ మంజూరు ప్రోపడింగ్సతో పాటుగా సర్వీసు రిజిస్టరులో నమోదు చేయాలి.
42. సర్వీసు క్రమబద్దీ ప్రాహిబిషను ఎంట్రి.
ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఉద్యోగ జీవితంలో కీలకపాత్ర పోషించే సర్వీసు రిజిస్టర్ ను ఎలా నిర్వహించాలి అందులో ఏయే అంశాలను పొందుపరచాలి అను విషయంలో కొంత సమాచారం.
1. ఫండమెంటల్ రూల్ 74కు అనుబంధం-2 లో నిర్దేశించిన ఫారం-10 లో తెలియజేసిన పద్దతిలో సర్వీసు రిజిస్టరు నిర్వహించాలి.
(G.O.Ms.No.200 తేది:10-12-1999).
2. మొదటిపేజీ నందు ఉద్యోగి యొక్క పూర్తి పేరు తండ్రి పేరు, నివాస స్థలం, జాతీయత, పాస్ పోర్ట్ ఫోటో అంటించి సంబంధిత అధికారిచే
అటేస్టేషన్ చేయించాలి.
3. భవిష్యత్లో ఒకసారి సర్వీసు రిజిస్టర్ లో నమోదు చేసిన పుట్టినతేది మార్చుటకు వీలులేదు.
(G.O.Ms.No.165 F&P
తేది:21-4-1984).
4. మొదటపేజీ నందు ఉద్యోగి ట్రెజరీ ID నెంబర్ నమోదుచేయాలి.
(G.O.Ms.No.80 తేది:19-3-2008).
5. మొదటిసారి ఉద్యోగంలో నియమించబడు సందర్భంలో డాక్టరుచే జారీచేయబడిన Physical Fitness Certificate వివరాలు సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి.
(G.O.Ms.No.03 Fin తేది:08-01-1969).
6. ఉద్యోగి వైవాహిక వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు నమోదుచేయాలి.
7. సర్వీసు 2,3 పేజీలలో ఉద్యోగి యొక్క వివరాలతో పాటు ఎత్తు, విద్యార్హతలు, సర్వీసులో చేరిన తర్వాత సంపాదించినవిద్యార్హతలు
నమోదుచేయాలి.
8. పదోన్నతి, ప్రమోషన్, ఆటోమేటిక్ అడ్వాన్మెంట్ స్కీం, పే ఫిక్సేషన్ తదితర వివరాలు నమోదుచేయాలి.
9. ప్రతి ఉద్యోగి తన Home Town (LTC కొరకు) డిక్లరేషన్ ఇవ్వాలి. అలాంటి వివరాలను కార్యాలయాధిపతి సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయాలి.(APLTC Rule.No.8 of clause (b)(i).
10. ఉద్యోగి CCA Rules-1991 ప్రకారం ఏ విధమైన శిక్షలకు గురైన పక్షమున అట్టి పూర్తి వివరములను సర్వీసు రిజిస్టర్ లో
నమోదుచేయాలి.(Govt.Memo.No.51073 తేది:19-12-2002).
11. ఉద్యోగి గుణగణాలు, శీలము (character) గురించి సర్వీసు రిజిస్టర్ లో నమోదుచేయకూడదు.
12. ఉద్యోగికి సంబంధించిన అతని సర్వీసు రిజిస్టరు ప్రతి సం. పరిశీలించి నమోదుకాబడిన వివరాలు సరియైనవే అని ఉద్యోగి ధృవపరుచుకొనుటకు అతనికి కార్యాలయాధిపతి ఇవ్వాలి.
13. (G.O.Ms.No.152 Fin తేది:20-5-1969).
14. NGO అయిన ఉద్యోగి బదిలీ అయిన సందర్భంలో సంబంధిత ఉద్యోగి సర్వీసు రిజిస్టరు బదిలీ అయిన కార్యాలయ అధికారికి పొస్ట్ ద్వారా పంపించాలి. బదిలీ అయిన ఉద్యోగికి సర్వీసు రిజిస్టరు ఇచ్చి పంపకూడదు.(G.O.Ms.No.722 తేది:30-07-1966)
(G.O.Ms.No.391 తేది:07-11-1978) .
15. సర్వీసు రిజిస్టర్ లో విషయాలు పెన్సిల్ తో నమోదు చేయరాదు.(Govt.Memo.No.72246 తేది:30-07-1966).
సర్వీసు రిజిష్టరు పోయిన/జాడ తెలియని
సందర్భాలలో పునర్నిమాణం ఎలా చేయాలి?
1. సర్వీసు రిజిష్టరు ఉద్యోగికి ఆయువు పట్టులాంటిది. దానిలో నమోదు చేసిన విషయాల ఆధారంగానే ఉద్యోగి పదవీ విరమణ చేసిన తరువాత రావలసిన అన్ని రకాల ఆర్థిక సౌలభ్యాలు పొందు అవకాశం ఉంది.
2. అట్టి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సర్వీసు రిజిష్టరు ఏ కారణం చేతనైనా పోయినా, కనిపించకపోయినా లేక అగ్ని ప్రమాదాల వల్ల కాలిపోయినా,అట్టి సర్వీసు రిజిష్టరు మరల ఎలా పునర్నిర్మాణం అను విషయమై ప్రభుత్వం G.O.Ms.No.202 F&P తేది :11.06.1980" ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.
3. ఉద్యోగి నిర్వహించుచున్న నకలు సర్వీసు రిజిష్టరులో నమోదు చేయబడి అటెస్టు చేసిన విషయాలు ఎంతవరకు నిజం అను విషయాలు సంబంధిత రికార్డ్స్ తోనూ, పేబిల్స్, వేతన స్థిరీకరణ పత్రములు,GIS ,GPF, APGLI పదోన్నతికి సంబంధించిన సూచికలు, ఉద్యోగితో పాటు సహచర ఉద్యోగుల విషయంలో జారీచేసిన సామూహిక ఉత్తర్వులు, శాఖాధిపతి జారీచేసిన ఉత్తర్వులు తదితర అంశాలపై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సర్వీసు రిజిష్టరు పునర్నిర్మాణం చేయవచ్చు.
4. ఈ విషయంలో నకలు(Duplicate S.R) రిజిష్టరు చట్టబద్ధమైనది గపరిగణించబడదు.
5. అదే విధంగా ఉద్యోగి తన సర్వీసు విషయాలను గురించి ప్రమాణ పూర్వకంగా సంతకం చేసి వ్రాసిచ్చిన వాంగ్మూలము (Affidavit asassested) పరిశీలించి,అట్టి
విషయములను సమాంతర ఉద్యోగుల సాక్ష్యాదారాలు ఉన్న పక్షమున
అంగీకరించి పునర్నిర్మాణం చేయుచున్న సర్వీసు రిజిష్టు లో నమోదుచేయాలి
G.O.Ms.No.224 F తేది :28.8.1982.
6. పుట్టినతేది,ఉద్యోగ నియామకం,తదితర అంశాలకు సంబంధించిన ఉద్యోగి
చెంతనున్న వివరాల ఆధారంగా నమోదు చేయవచ్చు. అదే విధంగా కార్యాలయంలోనూ, పై అధికారుల కార్యాలయంలోనూ అందుకు సంబంధించిన కాపీల ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు.
7. ఇంక్రిమెంటు రిజిష్టరు కార్యాలయంలో నిర్వహిస్తున్న యెడల,అట్టి రిజిష్టరు ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు.
8. పుట్టినతేది,విద్యార్హ్థతలు, ఉద్యోగి ఇతరత్రా వివరాలు విద్యాశాఖవారు జారీచేసిన సర్టిఫికెట్స్
ఆధారంగా సరిచూచి సర్వీసు రిజిష్టరులో నమోదు చేయవచ్చు. అదేవిధంగా ఉద్యోగం కోసం సర్వీసు కమీషను వారికి అభర్ధి పెట్టుకొన్న దరఖాస్తు ఆధారంగా. కూడా సరిచూసుకోవచ్చును.
9. ఉద్యోగికి సంబంధించిన సర్వీసు వివరములు కొంతకాలం మేరకు తెలుసుకొనుటకు అవకాశం లేని పక్షమున,శాఖాధిపతి ఉద్యోగి అట్టి కాలములో సర్వీసులో ఉన్నాడని, సస్పెన్షన్ లో లేడని, అదేవిధంగా Extra Ordinary Leave లో లేడని ఒక సర్టిఫికేట్ జారీచేయవచ్చు. కానీ అట్టి సర్టిఫికెట్ సాక్ష్యాధారములతో కూడిన వాటి మూలంశాల ఆధారితంగా ఉండవలెను.
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●