సంక్రాంతి సెలవులలో PREFIX మరియు SUFFIX గూర్చిన వివరణ:
ఈ సారి సంక్రాంతి సెలవులు 10-01-2020 నుండి 20-01-2020 వరకు అనగా 11 రోజులు.
పాఠశాల చివరి పనిదినం PREFIX (09-01-2020) మరియు రీఓపెనింగ్ దినం
SUFFIX (21-01-2020) రెండు రోజులు బడికి హాజరవ్వాలా లేక ఒకరోజు హాజరైతే సరిపోతుందా ?
Rc.No.10324/E4-2/69
తేది:07-11-1969 ప్రకారం
టర్మ్ హాలిడేస్ 10 రోజులకు పైబడి 15 రోజులకు మించకుండా ఉన్న సందర్భంలో ప్రిఫిక్స్, సఫిక్స్ (PREFIX SUFFIX) చేసుకునుటకు అవకాశం లేదు.
కాబట్టి చివరి పనిదినం (09-01-2020) నాడు మరియు రీఓపెనింగ్ డే (21-01-2020) రెండు రోజులు పాఠశాలకు తప్పక హాజరవ్వాలి.
ఒకరోజు హాజరుకాకున్నా సంక్రాంతి సెలవులు అన్నీ Other Than CL అనగా EL/HPL/EOL పరిగణించబడతాయి.
దసరా సెలవులలో PREFIX మరియు SUFFIX గూర్చిన వివరణ:
దసరా సెలవులు 9 రోజులు ప్రకటించిన సందర్భంలో అనగా 10 రోజుల లోపల చివరి రోజు గానీ లేక రీ-ఓపెనింగ్ రోజు గానీ ఏదో ఒక రోజు సాధారణ సెలవు (CL)పెట్టుకోవచ్చు.
దసరా సెలవులు 10 లేక 11 లేక 12 లేక 13 లేక 14 రోజులు ప్రకటించిన సందర్భంలో చివరి రోజు మరియు రీ-ఓపెనింగ్ రోజు తప్పకుండా హాజరు కావాలి. ఎటువంటి మినహాయింపులు లేవు
దసరా సెలవులు 14 రోజుల కంటే ఎక్కువగా ప్రకటించిన సందర్భంలో చివరి రోజు గానీ లేదా రీ-ఓపెనింగ్ రోజు గానీ ఏదో ఒక రోజు సెలవు పెట్టుకోవచ్చు. దీనికి అర్హత గల సెలవు మంజూరు చేస్తారు. అనగా CL/CCL కాకుండా EL/HPL ఏదో ఒకటి మంజూరు చేస్తారు. ఇవి కూడా లేని సందర్భంలో Extra Ordinary Leave మంజూరు చేస్తారు.
వేసవి సెలవుల్లో PREFIX మరియు SUFFIX ను గూర్చిన వివరణ:
సెలవులు 14 రోజులకు మించి ఉంటే అవి Long Term Holidays గా పరిగణించబడి Prefix, Suffix వర్తిస్తాయి.
15 రోజులు మించిన సెలవు కాలాన్ని వెకేషన్ అంటారు. వేసవి సెలవుల విషయంలో పాఠశాల చివరి పనిదినం నాడు కాని లేదా రీఓపెన్ రోజు కానీ ఏదో ఒకరోజు హాజరైతే సరిపోతుంది.
చివరి రోజు గానీ లేదా రీ-ఓపెనింగ్ రోజు గానీ ఏదో ఒక రోజు సెలవు పెట్టుకోవచ్చు. ఈ ఒక్క రోజుకు అర్హత గల సెలవు మంజూరు చేస్తారు. అనగా CL/CCL కాకుండా EL/HPL/EOL లలో ఏదో ఒకటి మినహాయిస్తారు .
ఒక వేల చివరి రోజు గానీ లేదా రీ-ఓపెనింగ్ రోజు నాడు కానీ హాజరు కాని సందర్భంలో మొత్తం వేసవి సెలవు దినాలు EL/HPL/EOL లలో ఏదో ఒకటిగా పరిగణనలోకి తీసుకుంటారు.
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●